ఇక రోశయ్య…….
ఈయన, వ్యాపారం చేయడంలో నేర్పరులుగా ప్రాచీన కాలం నుండి పేరుపడ్డ ’వైశ్య’వర్గం నుండి వచ్చాడు. వేల సంవత్సరాలుగా, ఈ సామాజిక వర్గం వణిక్ శ్రేష్ఠులుగా పిలువబడతారు. వాళ్ళ ’జీన్స్’ కూడా అలాంటివే! వాళ్ళు ‘మినిమం గ్యారంటీ బిజినెస్’ తాలూకూ శృతిని అవలీలగా పట్టుకోగలరు. అది చింతపండు వ్యాపారమైనా, రాజకీయ వ్యాపారమైనా! కాబట్టే, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండనీయండి గాక, ఈయన ఆర్ధికమంత్రి . నెం.2 స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైనా ఒకటో స్థానం, అంటే ముఖ్యమంత్రి సీటు, పైకెగసి క్రిందికి పోతుంటుంది. రెండవ స్థానం మాత్రం సురక్షితమైనది, సుస్థిరమైనది. ఈ కిటుకు తెలిసిన రాజకీయ వ్యాపారవేత్త ఈ ముఖ్యమంత్రి. ఇతడెంత ముందు జాగ్రత్త పరుడంటే, 2009 ఎన్నికలకు ముందు, [అప్పటికి ఇంకా EVM ల మతలబు తెలియదు] ముందు జాగ్రత్తగా ఎం.ఎల్.సి. కి ఎన్నికై పోయాడు. అప్పటికి కాంగ్రెస్ మళ్ళీ గెలుస్తుందో లేదో తెలియని సంక్లిష్టత తమకి ఉండింది. ఎన్నికల ప్రచారసమయంలో కూడా అతని ప్రకటనలు దానినే సూచించాయి. కాబట్టే ముందస్తుగా సుస్థిరమైన స్థానం చూసుకున్నాడు.

ఇలాంటి ‘సురక్షిత వ్యాపార’ జీన్స్ గల ఈ ముఖ్యమంత్రి,, వై.యస్.కు కూడా కుడిభుజం లాగా పనిచేసాడు. వై.యస్. ఆడిన ’సందట్లో సడేమియా’ మొత్తంగా తెలియకపోయినా, తనకి తెలిసినంత వరకూ సలహాలూ, సహకారాలూ అందించాడు. అంతేకాదు, వై.యస్. నెం.5 వర్గాన్ని నమ్మించటానికి, నెం.5 వర్గాన్ని నమ్మించానంటూ నెం.10 వర్గాన్ని నమ్మిస్తూనూ, ఆడిన నాటకాలలో తనవంతు పాత్ర తాను నిర్వహించిన వాడు. కాబట్టే అసాంఘిక కార్యకలాపాలు చేస్తూ, దొరికి పోయిన అల్లుడి గురించి ’అతడికెన్ని సార్లు చెప్పినా బుద్దిరావటం లేదు. ఓసారి శిక్ష అనుభవిస్తే నన్నా బుద్దివస్తుందేమో’ అంటూ బోలెడు ’స్థితప్రజ్ఞత’ చూపించాడు.

ఉండవల్లి అరుణ్ కుమార్, 2006 లో నిర్వహించిన ’రామోజీ రావు – మార్గదర్శి వివాదాలు’ డ్రామాలో ’రామోజీ రావు అనే ఓ చిన్నవ్యాపారి, ఓ చిన్నపత్రిక పెట్టుకుని, అమ్మకపు పన్ను శాఖ వారు, ప్రభుత్వంలోని అధికారులు తనని విచారించకూడదు అంటే, అదెలా కుదురుతుంది?’ అంటూ తన పాత్ర తాను సమర్ధంగా పోషించాడు.

కాబట్టే వై.యస్. ఆకస్మికమృతి తర్వాత ముఖ్యమంత్రి సీటు తనకు వస్తే మొదట బెంబేలు పడ్డాడు. ’నేను వై.యస్.లా కాదు. వయస్సులో పెద్దవాణ్ణి. అతడంత సమర్ధంగా పనిచేయలేను’. ’నాకూ వై.యస్.కూ పోలికే లేదు. నేను లేచి ప్రయాణం ప్రారంభించే సరికే అతడు గమ్యం చేరి ఉంటాడు’. ’అతడిలా నేను పనిచెయ్యలేక పోతున్నాను, చెయ్యడానికి ప్రయత్నిస్తాను’ – ఇత్యాది ప్రకటనలిచ్చాడు. [ఇతడే 1992 ముందు వై.యస్. గురించి ’ఇతడు ఒక చీడపురుగు. ఇతడిని పార్టీ నుండీ బహిష్కరించండి’ అంటూ అధిష్టానానికి లేఖలు వ్రాసాడు.]

’నాకు ప్రత్యేకంగా ’టీం’ అంటు లేదు. ఒంటరిగా ఏ నిర్ణయాలూ తీసుకోను. మంత్రివర్గ సభ్యులందరితో చర్చించి, సమిష్టి నిర్ణయం తీసుకుంటాను’. ’ఉన్నన్ని రోజులు అందరితో మంచిగా ఉంటాను’. ఈ విధమైన ప్రకటనలతో ’ఏదో నేను వై.యస్. వెనక, అతడి బాసిజంలో, అతడు చెప్పినట్లు చేసానే గానీ, నేను స్వంతంగా ’చర్లాట’లు ఆడగలిగేంత వాణ్ణి కాదు. నన్ను క్షమించెయ్యండి’ అన్న సంకేతాలని నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గం అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, సోనియాగాంధీకి పంపుకున్నాడు. ఆ విధంగా ’ఇది నా వల్ల కాదు. నన్ను వదిలెయ్యండి’ అన్న urge పెట్టుకున్నాడు. ఆ సంభాషణే ముఖ్యమంత్రి కార్యాలయం ’సి’బ్లాకులోకి మారటం అన్న ప్రక్రియ పేరుతో నెలపాటు నడిచింది. వివరంగా చెబుతాను.

వై.యస్. [అతి భయంకర] మరణం తర్వాత….. రోశయ్యకి వై.యస్. ఆడిన ’చర్లాట’ ఎంత ప్రమాదకరమైందో అర్ధమైంది. పొట్టేళ్ళ పోరాటం మధ్య, నలిగి చచ్చిన నక్క కథ జ్ఞాపకం వచ్చింది. దాంతో ఇటు నెం.5 వర్గానికీ, అటు నెం.10 వర్గానికీ కూడా క్షమాపణలు చెప్పుకుని తప్పుకుపోవాలన్నది ఇతడి తాపత్రయం. నెం.5 వర్గం ఎక్కడుంటుందో తెలియదు. ఎలా పనిచేస్తుందో తెలియదు. కాబట్టి ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. అదీగాక, ఇప్పటి వరకూ తెలిసిన దాన్ని బట్టి చూసినా, నెం.5 వర్గం తమని క్షమించి వదిలిపెట్టదు. ప్రజలని దోచుకున్నందుకూ వదలదు. సెజ్ ల పేరుతో దేశాన్ని అమ్ముకుని సొమ్ము దాచుకున్నందుకూ వదలదు. ఇక నెం.10 వర్గం! చెడ్డవాళ్ళ ముఠాల్లో, వీలుకుదిరితే ఒకడినొకడు మించాలనుకోవటం, ముంచాలనుకోవటం, అందుకు ప్రయత్నాలు చేయటం, పట్టుబడ్డప్పుడు ’తోబా తోబా’ అనుకోవటం, కొంత పరిమితి వరకూ నడుస్తుంది. కాబట్టి నెం.10 వర్గమే దిక్కు!

కాబట్టే ’తప్పులుంటే చెప్పండి. సరిదిద్దుకుంటాం’ అనిపైకీ, ’తప్పయిపోయింది. క్షమించండి’ అని లోపలా చెప్పుకున్నాడు. Excuse వస్తుందో రాదోనన్న ఆందోళనా, ఎదురు చూపు తర్వాత Excuse వచ్చింది. నిజానికి అలా రోశయ్యని, అలాంటి మరికొందరు వై.యస్. మంత్రివర్గ సహచరులనీ, అధిష్టానం [ఆ ముసుగు వేసుకున్న నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థా అందులోని కీలక వ్యక్తి రామోజీరావులు] Excuse చేయటం వెనుక బలమైన కారణం ఉంది. ఇప్పటికిప్పుడు తమకి ఆకాశం నుండి ఊడిపడ్డట్లు కొత్త వ్యక్తులూ, కొత్త సభ్యులూ, కొత్త ఏజంట్లూ దొరకరు. దొరికినా, అర్జంటుగా వాళ్ళంతా ఎం.ఎల్.ఏ.లుగా అవతరించరు. ఎంత ’చర్లాట’లు [డబుల్ గేమ్స్] ఆడినా, ఒకవేళ Double Cross అయిపోయినా, ప్రస్తుతం ఉన్న వీళ్ళనే ఉపయోగించుకోక తప్పదు. కాబట్టి తాత్కాలికంగా వీళ్ళనే కంటిన్యూ చేసి, అంతా సమసిపోయి సాధారణ స్థితులు నెలకొన్నాక, మెల్లిగా Fade out చేసి, ఆ తర్వాత తీరిగ్గా ఉతికి పారెయ్యెచ్చు. అంతే తప్ప, ఇప్పటికిప్పుడు కొత్త బృందాన్ని తెచ్చుకోలేరు. అలా కాదంటే మొత్తంగా అసెంబ్లీనే సుప్తావస్థలో పెట్టేయాలి. ఆ చర్య మరింతగా తమనే Expose చేస్తుంది. అంచేత రోశయ్య మరియు మంత్రివర్గం బృందాన్ని తాత్కాలికంగా క్షమించేసి ’నువ్వే పర్మినెంటు సీ.ఎం.వి!’ అన్నారు.

సెప్టెంబరు ౩ వ తేదీన రోశయ్య సి.ఎం.గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, వీరప్ప మొయిలీ ‘ఇది రాజ్యాంగ అవసరం దృష్ట్యా మాత్రమే! తర్వాత సి.ఎల్.పి. సమావేశం ఉంటుంది’ అన్నాడు. క్రమంగా రకరకాల వార్తల, Back ground తర్వాత, ‘రోశయ్యే పక్కా ముఖ్యమంత్రి’ అన్న సంకేతాలూ, వార్తలూ వచ్చాయి.

ఇప్పుడు రోశయ్యది ’మింగమంటే కప్పకు కోపం. వద్దంటే పాముకు కోపం’ వంటి పరిస్థితి. అతడు కోరుకున్నది నెం.2 స్థానం. సి.ఎం. స్థానం కాదు. అది రిస్కుతో కూడుకున్నది. ఇప్పుడు ’సి’ బ్లాకులోకి వెళ్ళాడా వై.యస్. వారసుడిగా అంటే Next to YS గా తన స్థానాన్ని అంగీకరించినట్లే. అప్పుడు నెం.5 వర్గం ’ఆఁ. ఇక కానీయ్ ఆట’ అంటుంది. అలాగని ’సి’ బ్లాకులోకి వెళ్ళలేదా, అప్పుడు అధిష్టానం, నెం.10 వర్గం ’ మాకే ధిక్కారం చూపుతున్నావా? కానీయ్’ అంటోంది. ’ఇంతకీ రోశయ్య ’సి’ బ్లాకులోకి మారాడా?’ అంటూ ఢిల్లీలోని పెద్దతలకాయలు, మొయిలీలు ఎంక్వయిరీ చేయటంలోని అంతర్లీన భాష, సంకేత భాష ఇదే!

ఎట్టకేలకు మొన్న అంటే అక్టోబరు 5 వ తేదీన ముఖ్యమంత్రి రోశయ్య ’సి’బ్లాకులోకి మారాడు. దాదాపు నెలరోజుల తర్వాత…….అదీ రాష్ట్రం వరదల్లో మునిగి అల్లాడుతున్నప్పుడు! ఇప్పటికి నెం.10 వర్గం నీడలోకి పూర్తిగా చేరినట్లన్నమాట. ఇందులో మరో కోణం ఏమిటంటే, ముఖ్యమంత్రి సీటు కోరుతూ, ఎడతెగని మంత్రాంగం నడుపుతున్న, అందుకోసం ఇప్పటికే తాము స్థాపించుకున్న సాక్షి పత్రికా, టీవీల ద్వారా ముమ్మర ప్రయత్నం చేస్తున్న, వై.యస్. పుత్రుడు జగన్, మిత్రుడు కేవీపీలకు చెక్ చెప్పటం! వరదల సమయంలో సమతా బ్లాకులోకి చేరిన సి.ఎం.రోశయ్య పై రాజకీయం నడపటం కొంచెం ఇరుకుగా ఉంటుంది కదా! ఈ విధంగా మరో అంతర్లీన, సంకేత భాష, అధిష్టానానికి, జగన్ శిబిరానికీ మధ్య జరగటం ఇక్కడ గమనార్హం.

సి.ఎం.సీటు అనిశ్చితి నేపధ్యంలో – రోశయ్య, మంత్రివర్గ బృందం మల్లగుల్లాలు పడుతున్నప్పుడే ’రాష్ట్రంలో ముఖ్యమంత్రి,, మంత్రుల టెలిఫోన్లు టాప్ అయ్యాయి’ అన్న అలజడి రేగింది. ఎవరు రేపారో, ఎలా గగ్గోలు అయ్యిందో, ఎలా మీడియాలో చేరిందో గానీ, నిఘా అధిపతి అరవిందరావు మాత్రం “ మాకు రాష్ట్రముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ఫోన్లు టాప్ చేయటం తప్ప వేరే పనేం లేదా? అదీగాక టెలిఫోన్ టాప్ చెయ్యాలంటే అత్యాధునిక పరికరాలు కావాలి. మా దగ్గర అలాంటి పరికరాలు లేవు” అని గట్టిగానే విసుక్కున్నాడు కూడాను.

నిజానికి, కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు రెండూ కాంగ్రెస్ పార్టీకి చెందినవీ కదా? రాష్ట్రమంత్రుల, ముఖ్యమంత్రుల ఫోన్ల టాప్ చెయ్యాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరో ఆదేశించకుండా పోలీసులు తమంతట తాము టాపింగులు చెయ్యరు కదా?

ముఖ్యమంత్రిగా రోశయ్య కొనసాగింపు విషయంలో అధిష్టానపు సంకేతాలు బలపడే కొద్దీ, అర్ధమయ్యే కొద్దీ అతడికి మద్దతు పెరుగుతోంది. అది సహజం. అంతేకాదు అది కాంగ్రెస్ కు దశాబ్ధాల నుండి ఉన్న బానిస సాంప్రదాయం కూడాను.

ఇక వై.యస్. అనూహ్య మరణం వెనుక నున్న మతలబులో మరో అంశం ’ప్రాణభీతి’! వై.యస్. నల్లమల అరణ్యాలలోని రుద్రకోడూరు పరిధిలో, అతి దారుణ మరణాన్ని పొందిన తర్వాత, కారణాలు ఏవైనా గానీ, తునా తునకలై, శరీర భాగాలు చెదిరి నలువైపులా వెదజల్లబడిన దేహం, నట్టడివిలో, వర్షంలో, అలాగే 24 గంటలపాటు ఉండిపోవటం, ఉంచవలసి రావటం, ఢిల్లీ కాంగ్రెస్ అధినాయకత్వంలో ’ప్రాణభీతి’ని రేపింది.

గూఢచార వ్యవస్థ బలమైనదైనప్పుడు, దాని ముందు ’వ్యక్తి’ ఎప్పుడూ బలహీనుడే! అది ప్రధానమంత్రి అయినా సరే! దీన్నే ఇందిరాగాంధీ విషయంలో, అప్పుడు బలంగా విస్తరించి ఉన్న నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అందరికీ Establish చేసుకుని మరీ, చూపించుకున్నారు. రాజీవ్ గాంధీ హత్య వంటి సంఘటనలలో దాన్ని మరింతగా పునః ప్రతిష్టించుకున్నారు. ఇప్పుడు అదే స్థితి తమ ఎదురుగా నిలబడింది. ఇప్పుడు బలంగా ఉన్న నెం.5 వర్గం ముందు, వ్యక్తులుగా తాము ఒక్కొక్కరూ బలహీనులే!

దాంతో, హఠాత్తుగా, ప్రజాధనం తాము దుర్వినియోగం చేయకూడదనీ, పొదుపు పాటించాలనీ గుర్తుకొచ్చింది. ప్రాణభీతికి వేసుకున్న పైకారణం [over leaf reason] ఇది. మొదటగా కరువు సందర్భంగా విరాళాలు సేకరించటం గురించి సోనియా గాంధీ ఆగస్టు 19 వ తేదీన ప్రకటించింది. అందులో కూడా ’వేతనంలో 20% శాతం కరువు నిధికి కాంగ్రెస్ ఎం.పీ.లు, ఎం.ఎల్.ఏ.లూ, ఎం.ఎల్.సీ.లూ, చైర్మన్లూ కూడా ఏడాది పాటు తమ వేతనం నుండి సాయం చేయవలసిందిగా, పార్టీతరుపున సోనియా గాంధీ విజ్ఞప్తి చేసింది. అప్పటికి శశిధరూర్, ఎస్.ఎం.కృష్ణాలు స్టార్ హోటళ్ళలోనే ఉంటున్నారు. ఆగస్టు 20 వ తేదీన రాష్ట్రప్రభుత్వం మాత్రమే ‘కరువు పరిస్థితుల రీత్యా ఖర్చులు తగ్గించండి’ అంటూ మంత్రులకు విమానాల్లో ఎకానమీ తరగతిలో ప్రయాణించమని చెప్పింది. అంతేగానీ కేంద్రప్రభుత్వం అప్పుడెప్పుడు చెప్పిన వార్తలు లేవు.

గమనించి చూడండి. ఆ హోరు సెప్టెంబరు 6 వ తేదీన ప్రారంభమై, ఆ తర్వాత జోరందుకుంది. సెప్టెంబరు 2 కు ముందర, ఎప్పుడూ ప్రత్యేక విమానాల్లోనూ, ప్రత్యేక హెలికాప్టర్లలోనూ ప్రయాణించటమే గానీ, ఎకానమీ తరగతుల్లో ప్రయాణపు ప్రయత్నాలూ లేవు, అసలా ప్రసక్తి లేదు. అడ్మిని స్ట్రేషన్ గా మాట్లాడితే ‘పొదుపు నిర్ణయం ఎప్పుడో, ఫలానా నెలలో, ఫలానా సంవత్సరంలో, సి.డబ్ల్యూ.సి. సమావేశంలో తీసుకున్న నిర్ణయం’ అనో, లేదా ’ఎప్పుడో గతంలోనే మంత్రివర్గం సమావేశంలో తీసుకున్న నిర్ణయం’ అనో అంటారు. ఇంకా మాట్లాడితే ’పీవీ హయం నుండీ నేను ఎకానమీ క్లాసులోనే ప్రయాణిస్తున్నాను’ అంటూ ప్రణబ్ లు చెబుతారు. అవునో కాదో ఏ సామాన్యులకీ తెలియదు కదా! ’ఆచరణ ఎప్పుటి నుండీ చేస్తున్నారు, దాని గురించిన ప్రచారం ఎప్పుడు వచ్చింది’ అన్నది ఇక్కడ ప్రధానం.

ఈ విధంగా, హఠాత్తుగా ఎకానమీ క్లాసుల ప్రయాణం రూపంలోని ప్రాణభీతి, ఉవ్వెత్తున లేచి క్రమంగా నిశ్శబ్ధమైపోయింది. కాకపోతే ’అతి నాజూకులు, అతిశయించిన భాగ్యం’ చూపిస్తే ఏప్రమాదం ముంచుకొస్తుందో నన్న భయం మాత్రం వేసింది. అందుకే, కాంగ్రెస్ అధిష్టానం, ప్రణబ్ ముఖర్జీలు, రోజుకు లక్ష, అరలక్షా అద్దెగా చెల్లిస్తూ బహుళ నక్షత్రాల హోటళ్ళలో అతిధులుగా ఆనందిస్తున్న విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణనీ, మరో సహాయమంత్రి శశిధరూర్ నీ, ఆ విలాస వైభోగాలని వదిలి, హోటళ్ళు ఖాళీ చేసి, వాళ్ళకి కేటాయించిన వసతి భవనాల్లోకి చేరేదాకా వెంటపడ్డారు.

ఇక ఇక్కడ మరో వార్తాంశం పరిశీలిద్దాం. వై.యస్. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత సెప్టెంబరు 5 వ తేదీన లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్ లు, వాతావరణం బాగాలేదని హెలికాప్టర్ లో ప్రయాణించేందుకు నిరాకరించారు. సరే, ఇది సహజం! ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎవరైనా ఆ మాత్రం జాగ్రత్త పడతారు అనుకుందాం. కానీ సెప్టెంబరు 14 వ తేదీన, సమాజ వాద్ పార్టీ ఎం.పీ. జయప్రద, తన నియోజకవర్గం రాంపూర్ లో, వరద పరిస్థితులు చూడటానికి వెళ్ళి, ఎద్దుల బండిలో ప్రయాణిస్తూ, బండి కాస్త అటు ఇటు ఊగగానే ప్రాణభయంతో రక్షించమంటూ కేకలు వేసి బిగ్గరంగా ఏడ్చింది. ఈ వార్త సెప్టెంబరు 15 న పత్రికల్లో వచ్చింది. సినీనటి, ఎం.పీ. జయప్రదతో పాటు, ముందు వెనకలుగా అంగరక్షకులు, పార్టీ కార్యకర్తలు, మీడియా సిబ్బంది ఉన్నారు. జలమయమైన రోడ్డుమీద, గతుకుల కారణంగా బండి ఒరిగినందుకే, విపరీతమైన భయానికి లోనైంది. నిజానికి బండి బోల్తా పడినా, రోడ్డుమీదే ఉన్నారు, చుట్టూ జనాలున్నారు. ఒకవేళ పడిపోయినా కాపాడేందుకు సిబ్బంది ఉన్నారు. అయినా భయంతో ఏడ్చిందీ అంటే – తాను పడిపోయినా, వరదలో కొట్టుకుపోయినా, చివరకు తన వ్యక్తిగత సిబ్బంది సైతం, అలా చూస్తూ ఊరుకుంటారేమో నన్నంత భయపడిందన్న మాట. ఎందుకంత భయమూ అంటే….అసలే ఈమె ములాయం సింగ్ కీ, అమర్ సింగ్ కీ అత్యంత అనుంగు అనుచరురాలు మరి! లోతట్టు రహస్యాలు తొందరగా ఇలాంటి వారికి చేరతాయి.

ఈ సందర్భంలో ఒక విషయం గమనించాలి. ఎప్పుడైనా, ఇప్పుడైనా, రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా నటులు కానివ్వండి, బడా వ్యాపారులు కానివ్వండి, పరిస్థితులు అర్ధమైన వారి స్థితి అర్ధమైన వారిది. అర్ధం కాని వారి స్థితి అర్ధం కానివారిది. ఎవరి కెంతగా పరిస్థితులు అర్ధమౌతయన్నది వారి వారి అవగాహనల మీద, పరపతి మీద ఆధారపడి ఉంటుంది. పరపతి ఎక్కువ ఉన్నవారికి సమాచారం ఎక్కువగా చేరవేయబడుతుందన్నమాట. ఆదాయం పెరిగితే పరపతి పెరగటం, పరపతి పెరిగితే ఆదాయం పెరగటంలో అంతర్లీన సూత్రం ‘గాడ్ ఫాదర్ ల గురించీ, ఇతర విషయాల గురించి’ ముఖ్యసమాచారం తెలియటమే!

ఇక ఇక్కడ ప్రస్తావించవలసిన ముఖ్యవిషయం, ఈ టపాల మాలిక శీర్షిక అయిన వై.యస్. మరణం. తనకున్న ఫ్యాక్షన్ నైజంతో, కొత్త ముఠా పెట్టేసి, తనకి తెలిసిన కొద్దిపాటి గూఢచర్యంలో రెండు వర్గాలమధ్య తెలివిగా ’సందట్లో సడేమియా’ చేయగలుగు తున్నాననుకున్న ఈ ’గారెల వంటవాడు’ తెలుగు వారు చెప్పే ’కొత్తబిచ్చగాడు పొద్దెరగడు’ లాంటివాడు. కాబట్టే అతి వేగంగా చర్యలు జరుపుకుంటూ వెళ్ళాడు. అంతే వేగంగా కథ ముగింపు పలికించుకున్నాడు.

ఇతణ్ణి గురించి కీర్తిస్తూ ఇతడి భక్తులూ, తాత్కాలికమైన తమ అవసరాల కొద్దీ మీడియా….. ఇతడి గురించి చేసిన స్తోత్రపాఠాల్లో కొన్ని…… నమ్మినవాళ్ళకు సాయం చేయటంలో ఓటమి ఎరుగని, మడమ తిప్పని యోధుడు, ఎదురు తిరిగిన వాళ్ళని అణచేయటంలో అపర చాణిక్యుడు….ఎన్ని పాజిటివ్ కాప్షన్స్!

హిందూపురాణాల్లో మహిషాసురుడు, నరకాసురుడు, హిరణ్య కశిపుడు…..వంటి రాక్షసులు, తమకి మొక్కని వాళ్ళని, తమని దేవుడిగా కీర్తించని వాళ్ళని నానా బాధలూ పెట్టారు. తమని కాదని నారాయణ మంత్రం జపించిన సాధువుల్ని చిత్రహింసల పాల్జేసారు. తమకి మొక్కిన వాళ్ళకి ’అన్నీ’ ఇచ్చారు. అలాంటి వాళ్ళని ’రాక్షసులు’ అన్నాం. అలాంటప్పుడు వై.యస్.ని మాత్రం రాక్షసుడని ఎందుకు అనకూడదు? మహిషాసురుడు, నరకాసురుడు చచ్చినరోజులని దసరా, దీపావళి పండుగలుగా జరుపుకుంటున్నప్పుడు, ఇలాంటి రాక్షసులు చనిపోయినప్పుడు అవీ మంచిరోజులే కదా!

నిజానికి హిరణ్యకశిపుడు వంటి రాక్షసులు విష్ణుద్వేషులు. నేనే దేవుణ్ణి అంటారు. అలాగే ఈ వై.యస్. కూడా ’నా మనసే మహాశివుడు’ అన్నాడు. అందుకేనేమో పాపం రుద్రకోడూరు దగ్గర, రుద్రకోటేశ్వరస్వామి ఆలయ సమీపంలోని, రుద్రకొండ దగ్గర, పావురాల గుట్ట మీద, ప్రకృతి రుద్రతాండవం చేయగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక హిరణ్య కశ్వపాది రాక్షసులు బ్రహ్మ, శివులకు భక్తులు. ఆ భక్తీ ఎందుకంటే వాళ్ళిచ్చే వరాల తాలూకూ శక్తి మీద ఆశతో! అలాగే ఈ వై.యస్. కూడా యేసుక్రీస్తు భక్తుణ్ణంటాడు. ఆ భక్తీ ఎందుకంటే అంతర్జాతీయ ఫండింగ్ వస్తుందేమోనన్న ఆశతో! హిరణ్యకశిపుడు తనకు జైకొట్టిన వాళ్ళకు ’అన్నీ’ ఇచ్చాడు. అలాగే వై.యస్. తనకి అనుకూలంగా ఉన్నవాళ్ళకు అన్నీ ఇచ్చాడు. మాజీమంత్రి మూలింటి మారెప్పల వంటి వారి చేత ’వై.యస్సే నా యేసు/దేవుడు’ వంటి బాకాలు ఊదించుకున్నాడు. కాబట్టే చివరకు వై.యస్. ’ఆకర్ష, ఆకర్ష’ అంటే అందరు ’వచ్చేస్తాం, వచ్చేస్తాం’ అని కాంగ్రెస్ వైపుకు పరుగులు పెట్టారు. కాదన్న వాళ్ళని వై.యస్., హిరణ్యకశిపుడులా వేధించాడు.

నిజానికి విష్ణువుని కాదన్నా, శివుణ్నైనా దేవుడంటూ ఉగ్రతపాలు ఆచరించిన మహిషాసురు, నరకాసురుడి వంటి రాక్షసులు, వై.యస్. లాగా ’ నా మనసే మహాశివుడు’ అనేంత దుస్సాహసం చేయలేదు లెండి. అందుచేత ఈ నరుణ్ణి ఆ రాక్షసులతో కూడా పోల్చకూడదు. కానీ అతడి దురహఃకారం మాత్రం అంతటిదే!

దురహఃకారమే కాదు, అతడి దురాశ కూడా చాలా పెద్దది. అతి తక్కువ సమయం[5ఏళ్ళలో] లోనే, అతి ఎక్కువ సంపద [దాదాపు 73+ వేల కోట్ల రూపాయలని వినికిడి] పోగెయ్యాలని మహా పరుగులు పెట్టాడు.

ఈ సందర్భంలో టాల్ స్టాయ్ కథ ఒకటి గుర్తుకు తెచ్చుకోవచ్చు. అందరికీ తెలిసినదే అయినా మళ్ళీ చెబుతాను.

అనగా అనగా

ఓ రాజు గారి దగ్గరికి ఓ పేదరైతు వచ్చాట్ట.

"అయ్యా! నేను కడుపేదవాడిని. కొంచెం భూమి ఇప్పిస్తే, వ్యవసాయం చేసుకుని పిల్లాపాపతో సుఖంగా బ్రతుకుతాను” అని అడిగాడు.

వాణ్ణి చూసి రాజుకు జాలి కలిగింది. అందునా అంతకు క్రితమే ’మనిషి సుఖంగా బ్రతకడానికి ఎంత భూమి కావాలి’ అన్న అంశంపై, రాజసభలో ఆసక్తికరమైన చర్చ నడిచింది. అందులో చాలామంది రకరకాల అభిప్రాయాలను చెప్పారు. దానితో రాజుకు కుతుహలం కలిగి, వచ్చిన రైతుతో,

"అబ్బాయ్! నిన్ను చూసి నాకు జాలి కలిగింది. నగరం వెలుపల, సూరాస్తమయం లోపల, నువ్వు ఎంత భూమి చుట్టి వస్తే, అదంతా నీకు దానంగా ఇచ్చేస్తాను” అన్నాడు.

మర్నాటి ఉదయం, రాజాజ్ఞతో మంత్రి ఏర్పాట్లన్నీ చేశాడు. రైతు పరుగు ప్రారంభించాడు. వింత చూడటానికి ప్రజలంతా గుమికూడారు. సూర్యాస్తమయం దగ్గర పడుతుండగా రాజు కూడా వచ్చాడు. పరుగు ప్రారంభించిన రైతు, మధ్యాహ్నం అయ్యేసరికి చాలా దూరమే వెళ్ళాడు. ఇక వెనక్కి తిరిగి చుట్టిరాకపోతే బయలుదేరిన చోటుకి చేరలేనని వెనుదిరగాలనుకున్నాడు. ’కానీ, జీవితంలో మళ్ళీ ఈ అవకాశం రాదు. తాను చుట్టివచ్చినంత భూమి రాజు తనకిచ్చేస్తానన్నాడు. ఇప్పుడు తను అతిక్రమించిన భూమి తన కొడుకులకి సరిపోతుంది. మరి మనవలకో? ఇంకొంచెం సేపు ముందుకురికి తర్వాత వెనుదిరుదాం’ అనుకుని మరికొంచెం దూరం పరుగెట్టాడు. మరికొంత సేపటికి వెనుదిరగబోయి, మళ్ళీ మరికొంచెం దూరం పోయాడు.

మెల్లిగా సాయంత్రం అవుతోంది. సూర్యడస్తమిస్తాడేమో ననే అందోళనతో వెనుదిరిగాడు. సమయం తక్కువుంది. సూర్యాస్తమయం లోపల బయలుదేరిన చోటు చేరాలి. ఆపకుండా పరుగెత్తాడు. ఆయాసంతో పరుగెత్తాడు. ఆశతో పరుగెత్తాడు. ఆతృత…. ఆశ…. ఆయాసం…. ఇంకేముంది? ముప్పరిగొన్న చెమటతో కుప్పకూలాడు. ఊపిరి ఆగిపోయింది. అప్పటికి కనుచూపు మేరలోకి వచ్చిన రైతుని రాజు, మంత్రి, ప్రజలూ చూస్తునే ఉన్నారు. రాజు ఆజ్ఞతో భటులు వెళ్ళి రైతుని పరీక్షించారు. మరణించిన అతడి శవాన్ని మోసుకొచ్చారు.

రాజాజ్ఞతో, రైతు శవాన్ని, ఆరడుగుల గొయ్యితీసి పూడ్చి పెట్టారు. అప్పటికి రాజుకి, క్రితం రోజు తము చేసిన చర్చ గుర్తుకు వచ్చింది. మంత్రితో “మంత్రి వర్యా! ఇప్పుడు చెప్పండి. నిజంగా మనిషికి ఎంత చోటు కావాలి?" అని అడిగాడు.

మంత్రి, గుబురు మీసాల మాటున గుంభనగా నవ్వుతూ “ఆరడుగులు మహారాజా” అన్నాడు. అందులోని తత్త్వం అర్ధమైన సభికులు కూడా, మౌనంగా మంత్రి మాటకి అంగీకరించారు.

ఈ కథలోని రైతులాగే, వై.యస్. కూడా తరతరాలకి తరగని ఆస్థికోసం ఆగకుండా పరుగులు తీసాడు. చంద్రబాబు హయంలో తన అల్లుడి మీద కేసులు పెట్టబడ్డాయని, ఆసెంబ్లీలో “ఇక రేపో ఎల్లుండో నా మనవడి మీద కూడా, ఏ పిడకలో దొంగిలించాడని కేసులు పెట్టండి” అని అక్రోశించాడు. సీ.ఎం. సీటులోకి రాకముందు, అప్పుకోసం బ్యాంకుల చుట్టు తిరిగాడని అతడి ప్రత్యర్ధులు విమర్శించారు. అయితే సీఎం సీటులోకి వచ్చిన 5 ఏళ్ళలో పవర్ ప్రాజెక్టుల వంటి భారీ పరిశ్రమలూ, మీడియా సంస్థలూ….. కొదవలేనన్ని సమకూర్చుకున్నాడు. అతడి అవసరం, ఆశ, ఎంతగా ఉండిందంటే పప్పు, బియ్యాన్ని కూడా బ్లాకు మార్కెటు దారులకి, అందినంత పుచ్చుకుని మరీ ధారాదత్తం చేసేంత.[ఇంతా చేసి, అతడు మరణించిన 25 రోజులకే ’ఖజానా ఖాళీగా ఉంది’ అంటూ మరో లొల్లికి మెల్లిగా తెరలేస్తోంది. మరి ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్యేగా అప్పుడు ఆర్ధికమంత్రి? ఇతడికి తెలియని ఖజానా స్థితి ఏమిటో?]

సరే! ఇంతగా పరుగులెత్తి సంపద కూర్చిన వై.యస్. ఏం పట్టుకుపోగలిగాడు తన వెంట? చివరికి ఆరడుగుల నేల కూడా అవసరం లేనంతగా, ముక్కలూ చెక్కలుగా చిద్రమైన శరీరాన్ని జాగ్రత్తగా ఏరి, అరడుగు గోనే సంచీలో మూట కట్టాల్సి వచ్చింది. ఘటనా స్థలిలోనే కొన్ని మాంసపు ముక్కలు మిగిలిపోగా, మిగిలిన శరీర భాగాలన్నిటినీ ఏరి కలిపి కూట్టారు డాక్టర్లు. అలా పరచబడితే సమాధిలో ఆరడుగులు పట్టాల్సిందే గానీ! లేకపోతే అందులో సగం కూడా లేదు!

పరుగులెత్తీ, తాపత్రయ పడీ, తను సమకూర్చిన సంపద, ఇప్పుడు తన సంతానాన్ని, వారి సంతానాన్ని ఎంతగా సుఖపెట్టగలదో, లేదా ఎంతగా బాధపెట్టగలదో చూడటానికి అతడు లేడు.

‘చివరి చూపు కోసం అభిమానుల ఆరాటం’ అంటూ మీడియా ఎంత ఊదరపెట్టినా, అక్కడ చివరి చూపు చూసేందుకు శరీరాకృతే లేదు.

ఇంత భయంకరమైన చేదు అనుభవం….. ఎవరికైనా చెప్పే నిజం ఇదే! ’సుఖంగా జీవించడానికి డబ్బు కావాలి, కాని డబ్బే జీవితం కాదు. మనిషిలాగా బ్రతకటం ముఖ్యం! మానవత్వంతో బ్రతకటం ముఖ్యం!’
‘ప్రజల కోసం పరితపిస్తున్నానని’ ఎంతగా ప్రచారించుకున్నా….. నిజం దేవుడికి తెలుసు, నీటికి పల్లం తెలుసు!

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

15 comments:

మీరు ఈ నెం.1 నుంచి 10 వరకు దేనిన్ని సూచిస్తాయొ తెలిపితె బాగుంటుంది. వాటి వివరణలు ఒక వైపు శాశ్వతం గా కనబడె విధం గా మీ బ్లగులో ఉంచండి.

Jayaho

ముగింపుతో సహా ఈ టపా చాలా చక్కగా వ్రాసారండీ.

ఎంతటి మనిషైనా సరే చివరికి తాను అయ్యేది గుప్పెడు బూడిదగానే అని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత త్వరగా సుఖపడతాడు. :)

ఒక విషయ౦లో దేవుడు నాకు నచ్చడు.
తప్పులకు శిక్ష తగిన సమయ౦లో తగిన విధ౦గా ఉ౦డాలి. కానీ మన కోర్టుల్లాగా నేర౦ చేసిన పదేళ్ళకో/ఇరవై ఏళ్ళకో శిక్ష విధి౦చట౦ అన్యాయ౦. ఆ శిక్ష తనకు తెలియని భావి తరాలకు వర్తి౦ప చేయట౦ కూడా సరికాదు. తన చర్యల యొక్క పరిణామాలను తను/తన తరాలవారు అనుభవి౦చ గలిగిన నాడే మానవుడు తప్పు చేయడ౦ మానుతాడు.

వైయస్ లా౦టి వారు చేసిన తప్పులకు ఆ భయ౦కర మరణ౦ చాలా చిన్న శిక్ష.
ఇప్పుడు (కాస్త కష్ట౦గానైనా) చచ్చి సుఖ౦గా తప్పి౦చుకున్నాడు.
అచేతన౦గా పడి ఉ౦డి, తన చర్యలకు తగిన ఫలితాలను చూసే భాగ్య౦ ఆ దేవుడు కల్పి౦చలేదు.

అద్యక్షా, దేవుడు తన పద్దతిని మార్చుకోవాలని సభా(ప్రజా)ముఖ౦గా మనవి చేసుకు౦టున్నాను.

జయహో గారు,

మీరు చెప్పిన సాంకేతిక విషయం నాకు అర్ధం కాలేదండి! అసలే మేం టెక్నికల్ లో పూరు! ఎలా చేయాలో చెబితే ప్రయత్నిస్తాం.

****
రాఘవ గారు,

వ్యాఖ్య వ్రాసినందుకు నెనర్లు.

****
అజ్ఞాత గారు,

దేవుడి తత్త్వం గురించి విశ్లేషించటానికి మన జ్ఞానం అసంపూర్ణమండీ!

"జలమయమైన రోడ్డుమీద, గతుకుల కారణంగా బండి ఒరిగినందుకే, విపరీతమైన భయానికి లోనైంది. నిజానికి బండి బోల్తా పడినా, రోడ్డుమీదే ఉన్నారు, చుట్టూ జనాలున్నారు. ఒకవేళ పడిపోయినా కాపాడేందుకు సిబ్బంది ఉన్నారు."
జయప్రద రొడ్డు మీదా వెళ్తూ ప్రమాదానికి గురి కాలేదు అనుకుంట అండి,పడవ ప్రయాణంలో అనుకుంట అండి.ఒక్కసారి సాక్షి లో వచ్చిన వార్త పరిశీలించండి

http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?CatId=317921&Categoryid=1&subCatId=32

YSR became CM and dead
KADAPA --> YSR district

in future if

Jagan becomes CM and dies
AndhraPradesh -->Jagan state/Jagan Pradesh

Sonia becomes PM/anything and dies
India --> Sonia Country/Sonia

Rahul becomes PM and dies
Bharath --> Rahul desham

why do we need to change the name of places.
Why people are not protesting the change.
YSR is not a great person

jayahoo mee article jayahoo

చైతన్య గారు,

అయితే ఈ వార్తను మూడు పేపర్లు మూడు రకాలుగా వ్రాసాయన్న మాట. ఈనాడు సెప్టెంబరు 15, పేజీ నెం.3: ’జయపద్ర ఏడ్చింది’ అన్న శీర్షిక క్రింద ఎడ్లబండి అని వ్రాసారు. అదే ఆంధ్రజ్యోతిలో ట్రాక్టర్ మీద అని వ్రాసి ఉంది. అయితే సాక్షి పడవ అని వ్రాసిందన్న మాట.

అవును నాది కూడా జయహో గారి మాటే.... మీరు పక్కన ఒక పట్టిక లా ఇస్తే ఈ no 5 వర్గం definition అలానే no 10 అంటే ఏమిటి, ఈ కణిక వర్గాలలో ఎవరెవరు ఎలా ఎలా అని పక్కన శాశ్వత సూచిక పెడితే కొత్త వాళ్ళకు తేలిక గా వుంటుంది చదువుకోవటానికి, ఏదైనా సమస్య అవుతుంది అనుకుంటే వద్దు లెండి...
"కానీ సెప్టెంబరు 14 వ తేదీన, సమాజ వాద్ పార్టీ ఎం.పీ. జయప్రద, తన నియోజకవర్గం రాంపూర్ లో, వరద పరిస్థితులు చూడటానికి వెళ్ళి, ఎద్దుల బండిలో ప్రయాణిస్తూ, బండి కాస్త అటు ఇటు ఊగగానే ప్రాణభయంతో రక్షించమంటూ కేకలు వేసి బిగ్గరంగా ఏడ్చింది."
:-) :-) :-) పాపం గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్ళు వచ్చాయా .....

హమ్మయ్య, నిన్నటి నుంచి చదువుతుంటే ఇప్పటికి పూర్తి అయింది.. అంతా చదివాక ఒక ప్రశ్న పురుగులాగా తొలిచేస్తుంది సోదరీ. ఇంత విశ్లేషణా విద్య కలిగి ఏ ఛానల్ లో నైనా రాజకీయ విశ్లేషకురాలిగా చేరి ఒక వెలుగు వెలగవచ్చేమో కదా... గుఢాచారులు అడ్డుకుంటారంటే చెప్పలేము కానీ , కనీసం "ఇదీ సత్యం" అని కనిపించకుండా నైనా సేవలు అందించవచ్చుకదా? ఏంటోలే నిజజీవితంలో ఇవి జరిగేవి కాదులే !

మీరు ఎంత మంది కలిసి ఈ టపాలు రాస్తున్నారు?

భావన గారు,

మీరు, చెప్పిన సూచన గురించి ఆలోచిస్తున్నామండీ. గూఢచర్య స్ట్రాటజీ చాలా సంక్లిష్టమైనది. దీన్ని వివరంగా చెప్పాలంటే, సుదీర్ఘమైన అనేక టపాలు తప్పనిసరి అయ్యాయి. అయితే కొత్తగా నా బ్లాగులోకి వచ్చేవారి సౌలభ్యం కోసం ఏదైనా చేయాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాము.

********
భాస్కర రామిరెడ్డి,

సాక్షాత్తూ మీడియా నవాబు ఈనాడు రామోజీరావు, ప్రధానకుట్రదారుడై ఉండగా, మీడియా మొత్తం వాళ్ళ మద్దతుదారులై ఉండగా, ’ఇదీ సత్యం’ అంటూ మేము వాళ్ళ బండారం బయటపెడతామంటే ఎవరు అవకాశం ఇస్తారు చెప్పు? ఇంత సత్యం కాదు గదా, ఎంసెట్, ఇంటర్ విద్య వ్యవహారాల్లోని అవినీతి, విద్యారంగం మీది కుట్రని బయటపెట్టమంటేనే టీవీ 9 రవి ప్రకాష్ దగ్గర నుండీ ఎవరూ Respond [కనీసం అసలు కథ ఏమిటీ అని కూడా అడగలేదు] కాలేదు. ఇక రామోజీరావు వ్యవహారం గురించైతే ’ఆంధ్రజ్యోతి’, ’వార్త’ల స్పందనల గురించి గతటపాలలో వ్రాసాను. చదివే ఉంటావు. అదీ మన మీడియా మేడిపండు!

******
తమిళన్ గారు,

నేను, మా వారు. అంటే ఆదిలక్ష్మి, లెనిన్ అన్న మాట.

" నేను, మా వారు. అంటే ఆదిలక్ష్మి, లెనిన్ అన్న మాట. "

పాపం కొత్తలో మీ టపాలు ప్రూఫ్ రీడింగ్ చేసిన మీ పాప పేరు మెన్షన్ చెయ్యలేదు .
ప్రియదర్శిని పేరుని కూడా చేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను.

మనోహర్ గారు,

మా పాప ఆంగ్ల టపాలకు ఫ్రూఫ్ రీడింగ్ చేసిందండి. తెలుగు టపాల జోలికి రాలేదు.

అమ్మ గారు ..
మీ బ్లాగ్ మొదత నుందీ ఫాలో అవుతున్నాను.. మీరు చెప్పెది ముంది అంతా నమ్మబుద్ధి కాలెదు కానీ .. చూస్తున్న విషయాలని చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తొంది .. ప్రత్యెకించి రష్యా గూఢచర్యం ఈ విషయం పై కనబరుస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే ..మీ మాటలని నమ్మాలని వుంది ..
ఇంకా విశదీకృతమైన కామెంట్ త్వరలో రాస్తాను

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu