ఇక దర్యాప్తుల విషయంలో:
సెప్టెంబరు7, పేజీ నెం.2: ’ఆ రెండు నివేదికలే కీలకం’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>హెలీకాప్టర్ ప్రమాదం, కర్నూలు జిల్లా పరిసరాల్లో జరిగినా, దీనికి గల కారణాలు సరిగా లేవు. ముసుర్లు పట్టి మేఘావృతమై ఉంది. ఇలాంటి నేపధ్యంలో ప్రయాణానికి ఎలా అనుమతి ఇచ్చారు? ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వెళ్తున్న హెలీకాప్టర్ సిగ్నల్ లేక రాడార్ తరంగాల నుంచి తప్పిపోయినా సకాలంలో ఎందుకు గుర్తించలేదు?... రాజధానిలో ఉన్న నియంత్రణ విభాగం ఏమైనట్లు?... అత్యవసర సమయాల్లో హెలీకాప్టర్ నుండి సందేశాలు పంపే సమాచార వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు?.... ఇవన్నీ సీఐడీని వేధిస్తున్న ప్రశ్నలు.

సెప్టెంబరు17, పేజీ నెం.13: ’ముమ్మరమైన సీబీఐ దర్యాప్తు’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ [ఏటీసీ], వాతావరణశాఖ అధికారులతోనూ, సీబీఐ అధికారులుసమావేశమైనట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ పర్యటనలో ఈ రెండు సంస్థల పాత్రే కీలకం. వాతావరణం బాగాలేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో అసలు వాతావరణ శాఖ పాత్ర ఏమిటి? అలానే ఏటీసీ ఎలా అనుమతి ఇచ్చింది? అన్న విషయాలు తెలుసుకునేందుకు సీబీఐ అధికారులు వీరితోనూ సమావేశమయ్యారు.

పై వార్తల వలన, సీఐడీ, సీబీఐ కోణంలోనూ మనకు అర్ధమవుతున్న విషయం ఏమిటంటే – ఏటీసీ, వాతావరణశాఖ, ఈ రెండు సంస్థల పాత్రే కీలకం అన్న విషయం.

ఈ క్రింది వార్తలను పరిశీలిద్దాం.

సెప్టెంబరు 4, పేజీ నెం.11: ’విఫలం’ అన్న శీర్షిక క్రింద, ముందస్తు తనిఖీలు జరిగాయా’ అన్న ఉప శీర్షిక క్రింద వార్త.
>>>విమానం, హెలికాప్టర్ బయలుదేరే ముందు, సాధారణ పరిస్థితులను పరిశీలించాకే టేకాఫ్ కు అనుమతించాలి. ఎలా వెళ్ళాలో వివరిస్తూ స్పెసిఫిక్ మైల్స్ రూట్ మ్యాప్ ను ఏటీసీ ఇస్తుంది. వాతావరణ, గాలికి సంబంధించి హెచ్చరికలు, ప్రమాద పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి అన్నింటిని ఏటీసీ తెలియజేస్తుంది. వీఐపీ హెలికాప్టర్ అయితే దానికి వాడిని ఇంధనాన్ని కూడా, పరీక్షకు పంపి, లాగ్ బుక్ లో నమోదు చేస్తారు. ముందస్తు జాగ్రత్తలకు సంబంధించిన పరికరాలన్నీ పనిచేస్తున్నాయా? లోపాలు ఉంటే సరిచేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇవన్నీ సక్రమంగా పనిచేసి ఉంటే ప్రమాదాన్ని కచ్చితంగా అరికట్టవచ్చు.


అదేరోజు, అదే పేజీ: ’ప్రయాణంపై పైలట్ దే అంతిమ నిర్ణయం’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>హెలికాప్టర్ దుర్ఘటన నేపధ్యంలో, స్క్వాడ్రన్ లీడర్ మాధవపెద్ది కాళిదాసు ఏటీసీ, పైలట్ ల పనితీరును విడమరిచి చెప్పారు. “వాతావరణ శాఖ, తన నివేదికలో ఎంత ఎత్తులో మేఘాలున్నాయి? వెలుగు శాతం ఎంత? కొద్దిగంటల్లో సంభవించే మార్పులు ఎలా ఉండొచ్చు? తదితరాలపై నివేదిక ఇస్తుంది. ఇక ఏటీసీ విధుల విషయానికొస్తే…. విమానం లేదా హెలికాప్టర్ గాలిలోకి ఎగరడానికి కావల్సిన ఫ్లైట్ ప్లాన్ ఇస్తుంది. ఎంత ఎత్తులో ఏమి వస్తుందో, ఏ రూట్ లో ఉందో, ప్రయాణం తీరు తదితరాలను కూడా సమన్వయం చేస్తుంది. వీటిని నిర్వహించే సమాచార వ్యవస్థే ఏటీసీ. ప్రతి ఏటీసీకి కొంత పరిధి ఉంటుంది. రాడార్ కెపాసిటీ మేరకు తన పరిధిలో వివరాలను గుర్తిస్తూ అది మార్గనిర్ధేశనం చేస్తుంటుంది. హెలికాప్టర్ బయలుదేరినప్పటి నుండి గమ్యం చేరేదాకా, పైలట్ తో సంప్రదిస్తుంటుంది. సాధారణంగా విమానాలతో సంకేతాలు తెగిపోయినపుడు, వెంటనే రక్షణ విభాగాన్ని రంగంలోకి దించుతారు. ముఖ్యమంత్రి వై.యస్. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ విషయంలో, రక్షణకు ఎవరితో సంప్రదించారన్నది తెలియాల్సి ఉంది. ఏటీసీ ఇక్కడి విమానాశ్రయ ఆపరేషన్స్ అధికారికి సమాచారం ఇచ్చారా? మరెవరికైనా ఇచ్చారా? తక్షణ రక్షణకు చేసిన ఏర్పాట్లేమిటనేది విచారణలోకి, వెలుగులోకి రావాల్సి ఉంది” అని ఏటీసీ, పైలట్ విధులను కాళిదాసు వివరించారు.

ఇలాగే వాతావరణ శాఖ వివరణ చూద్దాం.

అదేరోజు, పేజీ నెం.4: ’ప్రతికూల వాతావరణంలో వెళ్ళడంతోనే దుర్ఘటన!’ అన్న శీర్షిక క్రింద వార్త.
నల్లమలలో భారీవర్షంపై ఐఎండీ నివేదిక:
>>> హెలికాప్టర్ గాలిలోకి లేవాలంటే, భారత వాతావరణ శాఖ[ఐ.ఎం.డీ.] ఇచ్చే నివేదిక తప్పనిసరి. నివేదికలోని అంశం అనుకూలమైనా, ప్రతికూలమైనా పైలెట్ దే తుది నిర్ణయం. హెలికాప్టర్, విమానం ప్రయాణించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా? లేదా….. అన్న విషయాన్ని ఒక గంట ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కు సమాచారం ఇస్తామని ఐఎండీ అధికారులు ధ్రువీకరించారు. బుధవారం ఉదయం, సీఎం హెలికాప్టర్ వెళ్ళడానికి ఇచ్చిన వాతావరణ నివేదికలో, నల్లమలలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నట్లు వారు తెలిపారు.
>>>హైదరాబాదులోని భారత వాతావరణ విభాగం అధికారులను సంప్రదించగా….. “వాతావరణ పరిస్థితుల గురించి సమాచారం ఇవ్వడం మావంతు. వెళ్ళాలా! వద్దా అన్నది వారే నిర్ణయించుకుంటారు” అని చెప్పారు.

ఇలా ఎవరికి వారు తమకి సంబంధించి నివేదిక ఇవ్వటం మాత్రమే తమ బాధ్యత అని చెప్తున్నారు. వాతావరణ శాఖ నివేదిక ఇస్తే, దాని మీద నిర్ణయం ఏటీసీ వారు తీసుకోవాలని చెప్తున్నారు. ఏటీసీ వారు నివేదికను పైలట్ కి అందజేస్తామని, నిర్ణయం పైలట్ దే అని చెప్తున్నారు. వెరసి పైలట్ భాటియా బాధ్యుడన్న మాట! అతడు ఇంకెవరి మీదకో తోయటానికి ఈ లోకంలో లేడు కదా! కాబట్టి, ఈ ప్రమాదానికి ఎవరి మీద చర్యతీసుకోవటానికి అవకాశం లేదు.

ఈ క్రింది వార్తను ఒకసారి పరిశీలిద్దాం:

సెప్టెంబరు 18: ’వాతావరణ సమాచారంపై సీబీఐ దృష్టి’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>మేఘాలున్నట్లు వాతావరణ శాఖ నివేదిక ఇచ్చినా, వాటిని తప్పించుకుని వెళ్ళే అవకాశం ఉందని….. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితుల్లో వెనుదిరిగి రావచ్చని సీబీఐ అంచనా. వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దీనికి క్యుములోనింబస్ మేఘాలే కారణమా? ఒకవేళ రాడార్ కేంద్రాన్ని సంప్రదించి ఉంటే, వీటి సమాచారం ముందస్తుగా గుర్తించి, ప్రమాదాన్ని ఆపే అవకాశాలున్నాయా? అన్న అంశాలపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఇందులో భాగంగా, వాతావరణశాఖ నివేదికను సేకరించిన అధికారులు, ఆ సమాచారాన్ని ఎవరెవరికి అందించారన్న విషయాలను సేకరిస్తున్నారు. హెలీకాప్టర్ ప్రయాణించే ప్రాంతాలకు సంబంధించి ‘కర్నూలు కలెక్టర్’ కు ఎందుకు సమాచారం అందించలేదన్నది కూడా వారి ప్రశ్నగా తెలుస్తోంది. సీఎం పర్యటనపై చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సమాచారం అందించిన వాతావరణ శాఖ ‘కర్నూలు’ను ఎందుకు విస్మరించిందన్న విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.
>>>రాయలసీమ జిల్లాల్లో వాతావరణ పరిస్థితులన అధ్యయనం, కృత్రిమ వర్షం కోసం, అనంతపురంలో రాడార్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడున్న అత్యాధునిక సదుపాయాల వల్ల, వాతావరణ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని రాజధానిలోని వాతావరణ శాఖ సద్వినియోగం చేసుకోలేకపోవటం ‘లోపంగా’ భావిస్తున్నారు.

క్యుములో నింబస్ మేఘాల గురించి:

సెప్టెంబరు 16, పేజీ నెం.11: ’ఆ మేఘాలపై నివేదిక తెప్పిస్తున్న డీజీసీఏ’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>ప్రమాదం జరిగిన రోజు, పావురాలగుట్ట దగ్గర ఉదయం 8.30 గంటల నుండి 10.10 గంటల వరకు క్యుములోనింబస్ మేఘాలు ఆవరించి ఉన్నట్లు, మేఘమధన సంస్థ ఇచ్చిన నివేదికను పరిశీలించాలని డీజీసీఏ అధికారులు నిర్ణయించారు. ఈ నివేదికను తెప్పించి, తమకు అందజేయాలని, ఢిల్లీ వాతావరణశాఖ అధికారులను కోరారు.

మొదటఅందరూ ప్రమాదం ఎలా జరిగింది అని గొడవపడుతున్నప్పుడు, క్యుములోనింబస్ మేఘాల వల్లే ప్రమాదం జరిగిందన్న విషయం ఏ శాఖ చెప్పలేదు. దాదాపు 10 రోజుల తరువాత, ఆ విషయాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఈ క్యుములోనింబస్ గురించి, మొదటగా సెప్టెంబరు 14 వ తేదీన ప్రచారంలోకి తెచ్చారు. అప్పుడు కూడా ఆ మేఘాలు ఎంతసేపు పావురాల గుట్టమీద ఉన్నాయో తెలపలేదు. ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అక్కడ ఉన్నట్లు ప్రచారించారు. తరువాత సెప్టెంబరు 16 వ తేదీ నాడు, ఆ మేఘాలు ఎంతసేపటి నుండి [ఉదయం 8.30 గంటల నుండి 10.10 గంటల వరకు] అక్కడ ఉన్నాయో ప్రచారించారు.

దర్యాప్తులలో లొసుగులు:

సెప్టెంబరు7, పేజీ నెం.6: ’దర్యాప్తు బృందంలో ఆ అధికారా?’ అన్న ఉపశీర్షిక క్రింద వార్త.
>>>ముఖ్యమంత్రి హెలికాప్టర్ ప్రమాదంపై, దర్యాప్తు జరిపేందుకు నియమించిన సీఐడీ బృందంలో, గతంలో అనేక ఆరోపణలు ఉన్న అధికారిని నియమించడం చర్చనీయాంశం అయింది. పీసీసీ మాజీ అధ్యక్షుడు, కేకే కుమారుడు వెంకట్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ప్రశాంత రెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించాడు. అంతకు ముందు కూడా, అనేక ఆరోపణలు ఉన్న ఇదే అధికారికి సత్యం కంప్యూటర్స్ కుంభకోణం దర్యాప్తు బాధ్యతను అప్పగించడంపై విమర్శలు వినిపించాయి. తాజాగా హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు ఏర్పాటు చేసిన బృందంలోనూ, మళ్ళీ ఈ అధికారి నియామకంపై ఉన్నతాధికారులే ఆశ్చర్యపడుతున్నారు.

ఇంతకీ ఆ అధికారి పేరేమిటో పత్రిక వాళ్ళకు మాత్రమే తెలుసు! ఎక్కడా వ్రాయలేదు. సదరు అధికారి అంత వివాదస్పదుడంటే అంతగా అవినీతిపరుడై ఉండాలి. నీతిపరుడైతే కేకే కుమారుడి కేసు వీగిపోదుకదా!

ఇంకో వార్త.
సెప్టెంబరు11, పేజీ నెం.13: ’హడావుడి!’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>ప్రమాదస్థలంలో ఆధారాలు చెరిగిపోకుండా కాపాడగలిగితే, అనేక చిక్కుముడులను విప్పవచ్చని నేరపరిశోధనా నిపుణులు చెబుతుంటారు. సాక్షాత్తు ముఖ్యమంత్రిని బలికొన్న హెలికాప్టర్ దుర్ఘటనలో, పోలీసులు ప్రాధమిక విధిని విస్మరించారు. సెప్టెంబరు 2 న నల్లమలలో పసురుట్ల బీట్ పరిధిలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. మూడో తేదీన దీన్ని గుర్తించారు. అదేరోజు చుట్టుప్రక్కల గ్రామాల నుండి జనం వందల సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకోవటంతో, ఆధారాలు చెరిగిపోయాయి. తమకు దొరికిన వస్తువులను పట్టుకెళ్ళారు. పోలీసులు వారిని నియంత్రించలేదు. కేసు దర్యాప్తును ఉన్నతస్థాయి బృందాలకు అప్పగించిన తర్వాత, సీను మొత్తం మారింది.

ఇక్కడ ఉద్దేశపూర్వకంగా పోలీసులు సంఘటనా స్థలంలో ఆధారాలు చేరిపేసే ప్రయత్నం చేశారు. దీనిని బట్టి తెలియటం లేదూ, నెం.10 వర్గం మొదటే ఆ ప్రాంతాన్ని తాము పరిశీలించుకుని, తమకి కావాలసిన ఆధారాలను తీసుకుని వెళ్ళిపోయిందని? తరువాత ప్రజలందర్ని ఆ స్థలంలో చేర్చటం ద్వారా, ఆధారాలను చెరిగిపోయానన్న వాదనని నిర్మించింది. అందుకే ప్రజలు తండోపతండాలుగా పావురాలగుట్టకు క్యూలు కడుతున్నారని ప్రతీరోజు ఫోటోలు వేసి మరీ ప్రచారించింది.

సెప్టెంబరు16, పేజీ నెం.11: ’డీజీసీఏ అధికారులతో సిబిఐ భేటి’ అన్న ఉపశీర్షిక క్రింద వార్త .
>>>మరోవైపు హెలీకాప్టర్ ప్రమాదంపై పత్రికల్లో వచ్చిన కథనాలు, విశ్లేషణలకు సంబంధించిన ప్రతులను కూడా సీబీఐ, డీజీసీఏ లు సేకరించాయి.
పబ్లిక్ హియరింగ్ కు నోటిసు ఇస్తామనీ, ఎవరయినా దానికి సంబంధించిన సమాచారం, ప్రత్యక్ష సాక్షులు ఉంటే తమని సంప్రదించమని చెప్తామని సిబిఐ తెలిపింది.

ప్రత్యక్షసాక్షులు అంటే కూలిపోయినప్పుడు ఎవరు చూడలేదు, గానీ…
సెప్టెంబరు 3, పేజీ నెం.3: ‘శబ్ధం వినిపించింది…..’ అన్న శీర్షిక క్రింద వార్త లో, శివనాగయ్య అనే అతను, కొందరు నల్లకాల్వ పశువుల కాపరులు, 11 గంటల సమయంలో హెలికాప్టర్ వెళ్ళటం చూసామని చెప్పారు. తరువాత పెద్ద శబ్ధం వచ్చిందని, బహుశ అది రిజర్వాయర్ లో బాంబు పేల్చిఉంటారని భావించామని చెప్పారు. ఇలాంటి వన్నీ సిబిఐ పబ్లిక్ హియరింగ్ లో వాళ్ళు నోట్ చేసుకుంటారా? సామాన్య పశుకాపరులు, ప్రభుత్వాధికారులతో, ప్రమాదం జరిగిన రోజే, అబద్ధాలు చెప్పరు కదా! అది గాక నల్లకాల్వ సమీపంలో వై.యస్. చనిపోయింది కూడా నిజమే కదా!

ఇక ఈ పబ్లిక్ హియరింగ్ నిజంగా చేస్తారో, లేక ప్రభుత్వం చెప్పే అనేక అబద్ధాలలో ఇది ఒకటో వేచిచూడాల్సిందే!

మరోవార్త:
సెప్టెంబరు 12, పేజీ నెం.11: ’ఏటీసీ టేపులు స్వాధీనం’ అన్న శీర్షిక క్రింద వార్త.
>>>బేగంపేట ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ తో, త్యాగి [డీజీసీఏ] వివిధ విషయాలను చర్చించారు. త్యాగితో పాటు బృందం సభ్యులు….. వాతావరణ శాఖ, శంషాబాద్ విమానాశ్రయం ఏటీసీ అధికారులను కలిసి, వివరాలు సేకరించారు. హెలికాప్టర్ కూలిపోక ముందు పైలట్ భాటియా, ఏటీసీ ల మధ్య జరిగిన ’టేప్ ట్రాన్స్ స్క్రిప్షన్స్’ ను తీసుకుని సీల్ చేసి, తమ వెంట తీసుకెళ్ళారు. బేగంపేట విమానాశ్రయం ఏటీసీ, చెన్నై ఏటీసీల మధ్య జరిగిన సంభాషణలు ఆ టేపుల్లో ఉన్నాయి. సంభాషణలు హెలికాప్టర్ కోడ్ వీటీఏపీజీ ద్వారా జరిగాయి. తారుమారు చేసేందుకు అవకాశాల్లేని విధంగా ఉంటాయి. పైలట్లు, ఏటీసీల మధ్య జరిగే సంభాషణలు 24 గంటలూ రికార్డవుతాయి. ప్రమాదస్థలిలో దొరికిన ఆధారాలు, అధికారులు వెల్లడించిన సమాచారం, విశ్లేషించాక, ఆ టేపులు వింటామని త్యాగి బృందం అధికారులతో చెప్పింది. అయితే…. అక్కడ[బేగంపేట విమానాశ్రయంలో] మాత్రమే వినేందుకు అవకాశం ఉందని ఏటీసీ అధికారులు వెల్లడించటంతో, వారంరోజుల తర్వాత మళ్ళీ వస్తామని త్యాగి బృందం చెప్పినట్లు తెలిసింది.

ఆ టేపులు వినటానికి త్యాగి బృందం, వారంరోజుల తర్వాత, వచ్చిందో లేదో ఇంతవరకూ సమాచారం లేదు.

ఇలా హెలికాప్టర్ ప్రమాదం విషయంలో, తర్వాత దర్యాప్తు విషయంలోనూ, ప్రమాదంలోని సాంకేతిక అంశాల విషయంలోనూ, మీడియా, ఈనాడు, అధికారులు, రాజకీయనాయకులు ఇంతగా పరస్పర విరుద్ద వార్తలనీ, ‘ఒకరు చెప్పారు’, ‘మరొకరు చెప్పారు’ అంటూ అసందిగ్ధ వార్తల్నీ ఎందుకు ప్రచారించినట్లు? ప్రజల పట్ల తమకు ఎంతో బాధ్యత ఉందనీ, ప్రజాప్రయోజనాలే తమ ఊపిరనీ, పాత్రికేయ విలువలకి తము నిలువెత్తు రూపాలమనీ చాటుకునే ఈ మీడియాకీ, ఈనాడుకీ, ప్రజలకి నిజాలని పారదర్శకంగా అందించాల్సిన బాధ్యత లేదా?

మరెందుకు…. ఇంతగా…. ఈరోజుకి రేపటికీ కూడా, ఏమాత్రం పొంతనలేని సమాచారాన్ని ప్రచారించింది? రాజకీయ పరిస్థితులో, రాజకీయ నాయకుల ప్రవర్తనల గురించో అయితే రోజు రోజుకీ మారిపోయాయని చెప్పవచ్చేమో? జరిగిపోయిన ప్రమాదమైతే రోజురోజుకీ మారిపోదు కదా? ఆత్మరక్షణ కోసమే ఇలాంటి విరుద్దకథనాలు ప్రచారించారు. తమ ప్రత్యర్ధి వర్గం నెం.5 యొక్క ఎత్తుగడలనీ, వ్యూహాలనీ బట్టి, తమ ఎత్తుగడలనీ, వ్యూహాలనీ ఎప్పటికప్పుడు మార్చుకోవలసి రావటం కూడా ఇందుకు మరో కారణం!

మరో విషయం పరిశీలించండి!
పోలీసు స్టేషన్లలో ఉండే FIR[First Information Report] గురించి అందరికీ తెలిసిందే. ఏదైనా వివాదం లేదా ఘర్షణ లేదా సంఘటన జరిగినప్పుడు, ప్రాధమికంగా FIR వ్రాస్తారు. FIR ని, కేసు విచారణలో కీలకమైనదిగా భావిస్తారు. ఎందుకంటే, సంఘటన జరిగిన తొలిదశలో వ్రాయబడే FIR లో, పెద్దగా….. ’విషయాలు దాచి, పెంచి లేదా తగ్గించి లేదా వక్రీకరించి లేదా కల్పించి’ వ్రాయలేరు. సమయం గడిచాక, కేసులని తారుమారు చేయాలన్నా, ప్రభావపరచాలన్నా, సంఘటన గురించిన సమాచారంలో మార్పుచేర్పులతో కథనాలు చెప్పవచ్చుగాక. FIR ని మార్చకూడదు. అందుకే FIR లో మొదటగా వ్రాయబడిన సమాచారాన్ని కీలకంగా పరిగణిస్తారు.

ఒక సంచలన సంఘటన జరిగినప్పుడు మీడియా వ్రాసే వార్తలూ ఇలాంటివే! పోలీసు స్టేషన్ లో ఫిర్యాదుదారు చెప్పగా, రైటర్ అనబడే పోలీసు కానిస్టేబుల్ వ్రాస్తాడు. FIR కీ, తదుపరి కేసు సమాచారానికి, ఉన్న వ్యత్యాసాలని బట్టి పోలీసు అధికారులు నిజనిర్ధారణ చేస్తారు. మీడియా అయితే…. జరిగిన సంఘటనకు సంబంధించిన వారినీ, సంఘటనతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్న వారినీ, ప్రత్యక్షసాక్షుల్నీ….. ఇలా అందులో involvement ఉన్న వారందరినీ ప్రశ్నించి, సమాచార సేకరణ చేసి, వార్తలు వ్రాస్తుంది. పోలీసు స్టేషన్ లో, FIR విషయంలో, కేవలం ఫిర్యాదుదారు, రైటర్ ల ప్రమేయం మాత్రమే ఉండగా, మీడియా విషయంలో చాలామంది విలేఖరులు, ఇంకా చాలామందిని ఇంటర్యూ చేసి సమాచార సేకరణ చేస్తారు. కాబట్టి మీడియా విషయంలో రకరకాల కథనాలు వస్తాయి అనుకోవటానికి వీల్లేదు.

ఎందుకంటే – హఠాత్తుగా ఒక సంచలన సంఘటన జరిగినప్పుడు, అందులో ప్రత్యక్ష సాక్షులూ, సంబంధికులూ, అధికారులు….. ఇలా ఎక్కువ మంది involvement ఉన్నప్పటికీ మహా అయితే, సేకరించిన సమాచార అంశాలలో నూటికి 10 శాతం పరస్పర విరుద్దంగా ఉండొచ్చేమో. అరకొర సమాచారం, లేదా సమాచార మార్పిడిలో దొర్లే పొరపాట్లు…. ఇలాంటి కారణాలతో 10 శాతం పరస్పర విరుద్ద సమాచారం వచ్చిందంటే, సరే…. ఆపాటి సంభావ్యత సహజం అనుకోవచ్చు. నూటికి 90 శాతం లేదా అంతకంటే ఎక్కువగానూ పరస్పర విరుద్ద సమాచారం ఉంటే, దానిని ఏమనాలి?

ఎంత పెద్ద సంఘటన అయినా, ఎంత సంచలన సంఘటన అయినా, ఎంత ఎక్కువమంది ప్రమేయం ఉందన్నా…. ’రకరకాల సత్యం’ ఉండదు కదా! ఎక్కువమందిని కనుక్కొని వ్రాసినంత మాత్రాన ’సత్యం’ వ్యక్తివ్యక్తికీ మారదు కదా? 2006 లో డిసెంబరు 26 న కడలూరులో సునామీ వచ్చినప్పుడు, 2001 జనవరి 26 న మహారాష్ట్రలోని లాతూర్ లో భూకంపం సంభవించినప్పుడూ ఇంత పరస్పర విరుద్దకథనాలు రాలేదే?

అప్పుడే కాదు. రాజీవ్ హత్య, ఇందిరాగాంధీల హత్యలప్పుడు కూడా, ఘటనా సమయాల గురించి గానీ, ఇతర విషయాల గురించి గానీ, ఇంత పరస్పర విరుద్ద కథనాలేవీ అప్పటి మీడియాలో రాలేదు. అవీ సంచలన సంఘటనలే, ఆకస్మిక అనూహ్య సంఘటనలే. ప్రత్యక్ష సాక్షులూ, అధికారులు….. ఇలా చాలామంది involvement ఉన్నటువంటి సంఘటనలే! అప్పడింతగా పరస్పర విరుద్ద వార్తల్ని మీడియా ప్రచారించలేదు. పక్కా ప్రణాళిక ప్రకారం అన్నట్లుగా ఎల్.టి.టి.ఇ. నేర్పు, నాయకత్వ పటిమ గురించి, సిక్కుల ఊచకోత గురించీ వ్రాసింది. ఏ పత్రిక వ్రాసినా, ఎవరు చెప్పినా, ఎప్పుడు చెప్పినా….. ఒకే విధంగా, సంఘటనలన్నీ సరిపోలాయి [tally అయ్యాయి]. పరస్పర విరుద్దత ఏమాత్రం లేదు. కాబట్టే అప్పుడు మీడియా విశ్వసనీయత ఇంకా పెరిగింది.

హుస్సేన్ సాగర్ లో బుద్దుడి విగ్రహం ప్రతిష్టప్పుడు, ఈనాడు కార్టూన్, బుద్దుడు నీళ్ళల్లో పడుతున్నట్లు వచ్చింది. జనం అది చదువుతున్న సమయంలో, నిజంగానే హుస్సేన్ సాగర్ లో, బుద్దుడి విగ్రహం నీళ్ళలోకి జారిపోయింది. అప్పుడు అందరు అనుకున్న మాటే ’ఈనాడు ఏంజరుగుతుందో ముందుగానే ఊహిస్తుంది’ అని. ఆ విధంగా ఈనాడుపట్ల విశ్వసనీయత బాగా పెరిగింది.

అదే మీడియా, మరి ఇప్పుడెందుకు ఇంతగా పరస్పర విరుద్ద కథనాలు వ్రాసింది? ఎందుకంటే అప్పుడు మీడియా ముసుగు వేసుకున్న నకిలీ కణిక వ్యవస్థకీ, నెం.10 వర్గానికి, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ ’ఎదురు’లేదు. తాము ముందుగా సిద్దపరుచుకున్న ప్రణాళిక ప్రకారమే అన్నీ జరిగిపోయాయి. అంతే ప్రణాళికా బద్దంగా మీడియా న్యూస్ కవరేజ్ కూడా జరిగిపోయింది.

ఇప్పుడు పరిస్థితి అది కాదయ్యె! మెదళ్ళే ఆయుధాలుగా తమతో గూఢచార యుద్దాన్ని కొనసాగిస్తున్న నెం.5 వర్గం తాలుకూ ఎత్తుగడలని, వ్యూహాలనీ బట్టి, తమ ఎత్తుగడలూ, వ్యూహాలు మార్చుకోవాలయ్యె! దానికంటే ముందు జరుగుతున్న వాటిని అర్ధం చేసుకోవాలయ్యె! అందుచేత…. తము ముందు వేసిన ‘వై.యస్.తో శతృత్వపు’ నాటకాల ఫలితంగా ఇప్పుడు తమ మీద, తమ ఆస్థుల మీదా భౌతిక దాడులు జరగకుండా, తము ఎదురు వ్యూహాలు రచించుకోవటానికి Time gain చేసుకున్నారు. అలాగే ఆత్మరక్షణ కోసం, ఈ విధంగా అనేక రకాలుగా పరస్పర విరుద్ద వార్తాంశాల్ని ప్రచారించారు.

23. ఇక ఇందులో రాజకీయనాయకుల ప్రవర్తన, రోజు రోజుకీ మారిపోయిన, పోతున్న రాజకీయ పరిణామాల దృష్టాంతాలు మరింత ఆసక్తికరమైనవి. వై.ఎస్., ఏవిధంగా తను దోచిన సొమ్ములో నుండి భారీగా ఖర్చుపెట్టి భక్త గణాన్ని తయారు చేసుకున్నాడో, ఈ టపాల మాలికలోని ముందు టపాలలో వివరించాను. ఆ విధంగా ఏర్పడిన భక్తుల్లో మంత్రులు మరింత ముఖ్యులు. తనకు బలమైన ’టీం’ని తయారు చేసుకునే క్రమంలో అతడు చేసిన పనులనే, అతడి మరణానంతరం మీడియా + అతడి భక్తగణం, ’నమ్మిన వారి కోసం ప్రాణమిస్తాడు’ అని పెద్దగొంతులో అరిచారు. అదే విధంగా ఎదురు తిరిగిన వాళ్ళని అణగ దోక్కేస్తాడన్న విషయాన్ని గమ్మున పక్కన పెట్టారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే, వై.యస్.కి, అతడి కెరీర్ ప్రారంభం నుండీ తెలిసిన ఫ్యాక్షన్ నైజమే!

ఇక్కడ ప్రస్తావించదగ్గ మరో అంశం ఏమిటంటే – వై.యస్. మృతికి స్యయంగా సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ప్రత్యేక విమానం’లో వచ్చి మరీ ’దార్శినికుడు, మార్గదర్శి, అతడి సేవలు చారిత్రాత్మకం’ అంటూ లిఖితపూర్వకంగా నివాళులు అర్పించారు. తమ పార్టీ సహచరుడి మరణానికి కదిలి కన్నీటి పర్యంతమయ్యారు. మరి అతడి మృతి, ప్రమాదం, దర్యాప్తు విషయంలో మీడియా ఇన్ని కథనాలు ప్రచారిస్తుంటే, చూస్తూ ఊరుకున్నారేం? అసలా విషయాన్ని విస్మరించారేం?

వీటన్నిటికీ కొసమెరుపు ఏమిటంటే – సెప్టెంబరు 3 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోశయ్య, సెప్టెంబరు 11 వ తేదీన, ’తప్పులుంటే చెప్పండి సరిదిద్దుకుంటాం!’ అంటూ మీడియా ప్రతినిధులని పిలిచి చెప్పుకోవటం!

12 వ తేదీన ప్రచురితమైన ఈ వార్తలో, ఈనాడు ఎం.డి. కిరణ్ తో సహా, మరికొందరు పత్రికాప్రతినిధులు ఠీవిగా కూర్చొని ఉండగా, రోశయ్య ’మీడియా మద్దతుని అర్ధిస్తూ కాబోలు ’తప్పులుంటే చెప్పమనీ సరిదిద్దుకుంటామనీ’ చెప్పుకున్నాడు. [వై.ఎస్. పార్టీకీ చేసిన సేవలు చేసాడని, పార్టీకి పునఃప్రతిష్ఠ తెచ్చాడని కీర్తిస్తూ, అతడి మంత్రివర్గంలో నెం.2 స్థానంలో ఉన్న రోశయ్యను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టింది కదా సోనియా గాంధీ! మరీ వై.యస్. తప్పులు చేసాడని రోశయ్య అభిప్రాయమా?] తాను సీట్ లోకి వచ్చిన వారంరోజుల్లో ఏం తప్పులుంటాయి? అంటే… గతంలో చేసిన వాటి గురించి కదా క్షమాపణలు చెప్పుకుంటున్నాడు? మీడియా మద్దతునే కోరుకున్నా, లేక రామోజీరావు మద్దతునే కోరుకున్నా, ఈ ఆర్ధింపుని రోశయ్య తెరవెనుక కూడా చేసుకోగలడు. పత్రికాముఖంగానే ఇది జరగనక్కరలేదు. అయినా అలా జరిగిందంటే కారణం, రోశయ్య ‘తనని క్షమించి వదిలెయ్యమన్న’ అర్ధింపు నెం.5 వర్గానికీ, నెం.10 వర్గానికీ కూడా పెట్టుకుంటున్నాడన్న మాట.
ఇక ముఖ్యమంత్రి రోశయ్య…….

మరిన్ని విషయాలతో తదుపరి టపా.
అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.
సర్వేజనా సుఖినో భవంతు!

2 comments:

Hey u are wrong madam.The real reason for crash is

When it was raining heavily YSR felt its too cold inside and said to sardarji pilot "Thand lag raha, fan band kar re" and our
dear sardarji switched off the helicopter fan :)

అజ్ఞాత గారు,

జోకు బాగుందండి. కానీ పంజాబీలు, సర్ధార్జీలు శ్రమజీవులు, దేశభక్తులు. అంచేత సర్ధార్జీ పైలట్ బదులు పైలట్ అని వ్రాస్తే ఇంకా మజా వచ్చేది.
రెండు నెలల తర్వాత దర్యాప్తు సంస్థలు, హెలికాప్టర్ ప్రమాదం గురించి ఇదే రిపోర్టు ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu