సెప్టెంబరు 2 వతేదీ ఉదయం 9.35 తర్వాత, వై.యస్. ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కి భూతల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి అన్న విషయం తెలియగానే, [ఈ విషయం 9.36 గంటలకి ముఖ్యలకీ, ఉన్నతాధికారులకి తెలియజేసారని ’వార్త’ పత్రిక భోగట్టా] అధికారికంగా గాలింపు చర్యలు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ప్రారంభం అయ్యాయి.

ఈ మూడుగంటల జాప్యం లోపల, నకిలీ కణికవ్యవస్థ నెం.10 వర్గం, పంపిన పరిశోధకులు సంఘటనా స్థలం ఆచూకీ తెలుసుకోగలరు. చేరనూ గలరు. పరిశోధించనూ గలరు. కేంద్రప్రభుత్వం తమదే అయినందునా, ఎంతగా రాజశేఖర్ రెడ్డి ’సందట్లో సడేమియా’ చేసినప్పటికీ రాష్ట్రప్రభుత్వం మీడా తమకి గ్రిప్పు ఉన్నందునా, సదరు పరిశోధన నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావుకీ, అసాధ్యం కాదు, కాలేదు. [నల్లకాల్వ దగ్గర పశువుల కాపరులు ఉదయం 11 గంటలకు హెలికాప్టర్ వెళ్ళటం చూసామని చెప్పటం ఇక్కడ గమనార్హం.]

‘హెలికాప్టర్ ప్రమాదం యాదృచ్చికమా? విద్రోహ చర్యా? గూఢచర్యంలో భాగమై పధకం ప్రకారం జరిపించబడిందా?’ ఏ సంభ్యావతో తేలే వరకూ అసలు వార్తనే బయటికి పొక్కనివ్వలేదు. సదరు పరిశీలనలో నెం.10 వర్గానికీ, రామోజీరావుకీ, స్పష్టంగా తేలింది ఏమంటే – హెలికాప్టర్ ప్రమాదం విద్రోహ చర్యకాదు. ఏ విస్పోటనాలూ, విస్పోటన పదార్ధాలూ దొరకలేదు. క్రిందనుండి ఏ నక్సల్సో, టెర్రరిస్టులో పేల్చరు. తాము Assignment ఇవ్వకుండా ఏ నక్సల్స్ గానీ, పాక్ లేదా మరొక గ్రూప్ టెర్రరిస్టులు గానీ ఏ విద్రోహచర్యా జరపరు కదా? గూఢచర్యంలో ఉండి, యాదృచ్చికాలని తాము నమ్మరు. అందునా, ప్రస్తుతం ’వై.యస్.’ అన్న ఏజంటు నుండి రాబట్టవలసిన సమాచారం, తెలుసుకోవలసిన నిజాలూ చాలా ఉన్న సందర్భంలో, ఎప్పుడు ఈ పావు తప్పించబడితే తమకు అత్యధిక నష్టమో సరిగ్గా ఆ సందర్భంలో, ’యాదృచ్చిక’ ప్రమాదం ఎలా జరుగుతుంది?

అసలుకే….ఏ పేరుతో పిలిచినా, ఏమతం అనుసరిస్తున్నామని పైకి చెప్పుకున్నా, తమకి దేవుడి మీద భయమూ, భక్తి లేవయ్యె! అలాంటి చోట ’యాదృచ్చిక’ సంభవ్యతని అసలు అంగీకరించలేరు. కాబట్టే ’క్యుములో నింబస్ మేఘం’ కారణంగా కనబడింది. గూఢచర్యం మీద ఎవరికి పట్టుంటే వారికి, ఆధునిక సాంకేతిక మీద కూడా పట్టు ఉంటుంది. ఆధునిక సాంకేతికతతో వాతావరణ పరిస్థితుల్నీ, ప్రాకృతిక పరిస్థితులనీ నియంత్రించవచ్చు అన్న విషయం ఇప్పటికి చాలా సార్లే నిరూపితమయ్యింది. ఇంతకు ముందు టపాలో చెప్పినట్లు 08/08/08 బీజింగ్ ఒలెంపిక్స్ ప్రారంభ ఉత్సవాలకి, వర్షం ఆటంకం కలిగించకుండా, ఆధునిక సాంకేతికతని ఉపయోగించి, చైనా, బీజింగ్ నగరం మీదకి రాకుండా మేఘాలని చెదరగొట్టింది. కృత్రిమంగా వర్షాలు కురిపించేందుకు కొన్ని వ్యాపారసంస్థలుండటం ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా బయటికి, అందరికీ తెలిసేంత బాహాటానికి, వ్యాపార సంస్థల అందుబాటులోకి, రాని ఆధునిక సాంకేతికత ఉంటే, దాని గురించి సామాన్యులకి తెలిసే అవకాశం లేదు గాని, ఆ విషయం గూఢచార సంస్థలకి కొంత అంచనాలోనూ, మరికొంత అందుబాటులోనూ ఉంటుంది.

ఆ విధంగా, ఆధునిక సాంకేతికత సహాయంతో వర్షాలూ, వర్షాభావ పరిస్థితులూ, వరదలూ, కరువులూ, కార్చిచ్చులూ, భూకంపాలూ కూడా సృష్టించవచ్చన్న విషయం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రెండువర్గాలుగా చీలి గూఢచర్యయుద్ధంలో మునిగి ఉన్న, మెదళ్ళతో యుద్ధం చేసుకుంటున్న రెండువర్గాలకూ[నెం.10 & నెం.5] తెలిసిన విషయమే!

ఈ నేపధ్యంలో నెం.10 వర్గం, అందులోని కీలక వ్యక్తి రామోజీరావులకి వై.యస్. కథ ’ముగింపు’ దిగ్ర్భాంతి కలిగించింది. తమ ’పని’ ఇంకా సగంలోనే ఉండగా ఇది జరగటం, మరింత అనుమానాల్ని, ఆందోళనని కలిగించింది. నెం.5 ని నమ్మించమని తాము ఇచ్చిన Assignment నీ, నెం.5 ని నమ్మించవలసిన తమ అవసరాన్నీ, ఆసరాగా తీసుకుని, వై.యస్. చాలా ’ఆటలు’ ఆడాడని అర్ధమయ్యింది. అందుచేత అతడి అంత్యక్రియలు పూర్తి అయిన రెండు రోజులకే అతడి మిత్రుడు కెవిపి ఢిల్లీ రప్పించబడ్డాడు.

ఇటు కెవిపి కూడా స్తబ్ధతలో ఏమీలేడు. తానూ, తన స్నేహితుడూ కలిసి రెండువర్గాల మధ్య, తాము బలపడేటట్లూ, తమకి తెలిసిన గారెల వంట వంటి గూఢచర్యం నడిపారు. మిడతం బొట్లు కథలాగా తమకి పరిస్థితులూ కలిసి వచ్చాయి. అలా పరిస్థితులు కలిసి వచ్చే పరిస్థితిని నెం.5 కల్పించిందని గానీ, పరిస్థితుల్ని allow చేసిందని గానీ వీరికి తెలియదు. ఈ స్థితిలో స్నేహితుడు ప్రమాదంలో మరణించాడు. నెం.10 కి ఉన్న అవసరం రీత్యా, అప్పటి వరకూ ఉన్న పరిస్థితి రీత్యా, ప్రమాదం ఎలా జరిగిందన్న ప్రాధమిక విచారణ రీత్యా నెం.10 గానీ, నెం.5 వర్గం గానీ తన స్నేహితుడి కథ ముగించలేదని అనుకున్న కేవిపి, పరిస్థితులు చెయ్యిదాటిపోకుండా ఉండేందుకు వేగంగానే కదిలాడు. వై.యస్. కొడుకు జగన్ దీ అదేపరిస్థితి. గారెల వంట వంటి గూఢచర్యంలో భాగంగా ఓ పత్రికనీ, టీవీని కూడా పెట్టి ఉన్నారయ్యె! వై.యస్., కెవిపి కలిసే అన్నీ ఆలోచించరయ్యె. [గూఢచర్య స్ట్రాటజీ ఆలోచించాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కరి వల్ల కాదు. ఒకటికి రెండు బుర్రలూ కావాల్సిందే. ఇంకొంచెం ఎక్కువ బుర్రలున్నా ఫర్వాలేదు గానీ, ఒక్క బుర్ర మాత్రం చాలదు]

ఒకసారి నదిలో దూకాక ప్రవాహమే లాక్కుపోతుంది. నదీప్రవాహమూ, గూఢచర్యమూ ఒకలాంటివే. ఒకసారి involve అయ్యామా వదిలిపోవాలన్నా అది వదిలి పెట్టదు. అంతేకాదు, నెం.10, నెం.5 ల మధ్య గూఢచర్యపు ‘చర్లాట’ మొదలుపెట్టి, అర్ధాంతరంగా అసువులు బాసిన వై.యస్.రాజశేఖర్ రెడ్డికి కుమారుడు జగన్, స్నేహితుడు కెవిపి… ఇద్దరికీ ఈ ’చర్లాట’లో వాటా ఉంది. ఇక ఈ స్థితిలో స్థిమితంగా ఎలా ఉండగలరు? కెరీయర్ పరంగానూ, భౌతికంగా కూడా మెడమీద కత్తి ఉన్నట్లే!

ఈ పరిస్థితుల ఫలితంగా శవం ఇంకా హైదరాబాదు వదలక ముందే రాజకీయాలు వేగం అందుకున్నాయి. ఎటూ ’మైండ్ సెట్’ ని గ్రహించి కదిలే రఘవీరారెడ్డి, రాయపాటి సాంబశివరావుల వంటి ఇతర రాజకీయనాయకులు సిద్దంగానే ఉంటారయ్యె! ఇంకేముంది? సంతకాలూ, ర్యాలీలూ, మీటింగులూ, ఫ్యాక్స్ లూ, ప్రకటనలూ, పెద్దతలకాయలని కలవటాలూ…. ఫుల్లు లాబీయింగ్. ’ప్రత్యేక విమానం’లో ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చిన సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీలని చూసి, వారుపయోగించిన ’దార్శనికుడు వై.యస్’ వంటి పద ప్రయోగాలని చూసి, రాజకీయాల వేగం మరింత పెరిగింది. ఎవరి పరుగు వారిదయ్యె! నెం.5 Vs నెం.10 మెదళ్ళ యుద్ధంగానీ, నెం.10 కి నెం.5 ని నమ్మించాల్సిన అవసరం ఉండిన నేపధ్యంలో వై.యస్. కు ’సీన్’ నడిచిన విషయంగానే, తెలియని చాలామంది రాజకీయనాయకులు, [సీనియర్లు కానివ్వండి, జూనియర్లు కానివ్వండి] అనుకున్నదేమిటంటే –

1]. సోనియాగాంధీ క్రిస్టియన్ అయినందున, రాజశేఖర్ రెడ్డి క్రిస్టియన్ అయినందున అతడికి సీన్ నడుస్తోంది.

2]. సెజ్ ల బేరాల దగ్గర నుండి, సిమెంటు లాబీయింగ్ ల దాకా, ఖనిజాల గనుల దగ్గర నుండి బ్లాక్ మార్కెటింగ్ దాకా, ఎంత వీలైతే అంతగా సొమ్ము పోగేసి పైకి పంపుతున్నాడు గనుక వై.యస్. కి ఢిల్లీ నుండి దీవెనలు అందుతున్నాయి, దన్ను వస్తోంది. దాంతో ’సీన్’ వస్తోంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి ఆంధ్రప్రదేశ్ ’అన్ని రాష్ట్రలతో ఆంధ్రప్రదేశ్ ని పోల్చలేం’ అనేంత ప్రత్యేకమైంది. అలాగే వై.యస్. అంత బలమైన వాడూ, అధిష్టానానికి ఇష్టమైన వాడూ అయ్యాడు.

ఇలాంటి పై కారణాలనే [Over leaf reasons] వారూ చూశారు. ఓ విధంగా చెప్పాలంటే మీడియా ప్రచారించిన దానిని నమ్మారు. అంతేగాక ఎంతటి సీనియర్లయినా ఎం.ఎస్.సత్యనారాయణ, జి.వెంకటస్వామి, వీహెచ్ వంటివారు, తెలంగాణా వంటి అంశాలతోనూ, వై.యస్.తో విభేదించిన సందర్భాల్లోనూ, ఢిల్లీలో పడిగాపులు పడినా AICC అధిష్టాన దేవత సోనియాగాంధీ 10, జనపధ్ లోకి అడుగుపెట్టేందుకు అనుమతి [Appointment] నిరాకరించటం వంటి ఎన్నో అవమానాలు పొంది ఉన్నారు. తమ పిల్లలకీ, తమకీ కూడా సీన్ కట్ అయిపోయింది. కెరియర్ మాసిపోయింది. ఇక డబ్బు సంగతి చెప్పేదేముంది? ఒకరిద్దరి సంతానాలకి ఏదో బుల్లిబుల్లి మంత్రిత్వ శాఖలున్నా ఆశ ’ఏనుగులు తినే వాడికున్నంత’ ఉంటే, వాస్తవంలో ఆదాయం ’పీనుగుల పిండాకూడు’ అంత ఉంది. దాంతో అభివృద్ధి సూత్రం ‘వై.యస్. భజనే’ అనుకొని తలా ఓమాట ’జగన్ జిందాబాద్’ అనేసారు. ఇందులో కాకా Vs వి.హెచ్.ల వ్యాఖ్యానాలు వారి అనవగాహననే సూచించాయి.

ఈ గందరగోళం రెండురోజులుగా నడుస్తుండగా [సెప్టెంబరు 4 నుండి 6 దాకా], ఈలోపునే ముఖ్యమంత్రిగా రోశయ్య 3 వ తేదీ ప్రమాణస్వీకారం చేశాడు. అప్పటికి అధిష్టానం ఉద్దేశం ఏమిటో ఎవరికీ తెలియనందున అది కేవలం తాత్కాలికం అని అందరూ అనుకున్నారు. వాస్తవానికి అప్పటికి అధిష్టానానికీ అంతకంటే స్పష్టత లేదు. వాళ్ళ ధ్యాసంతా ఏం జరిగిందో తెల్సుకోవటం మీదే ఉంది. కాబట్టే పరిస్థితి రకరకాలుగా మారింది. 6 న మంత్రులంతా ప్రమాణస్వీకారం చేశారు. దాని మీద పెద్ద ఎత్తున నాటకీయత నడిచింది. దీని గురించీ చివరిలో విశ్లేషిస్తాను.

ఇక సెప్టెంబరు 7 వ తేదీ సోమవారం రాత్రి కేవిపి ఢిల్లీ వెళ్ళాడు. ’మేం ఎవరినీ రమ్మని పిలవలేదు. అతడే వచ్చాడు’ అన్న ప్రకటన, ఢిల్లీలో మొయిలీ వంటి పెద్దతలకాయలు ముందస్తు జాగ్రత్తగా చెప్పారు. ఇక చూస్కోండి ఎడతెరపి లేకుండా కేవిపి…. ఢిల్లీలో ఆంటోనీ, అహ్మద్ పటేల్, ప్రధాని, మొయిలీ, ప్రణబ్ ముఖర్జీ, సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్ గట్రాగట్రాలతో గంటల కొద్దీ, రాత్రిపొద్దుపోయాక, ఒకటి కంటే ఎక్కువసార్లు కలిసి చర్చలు జరిపాడు. వై.యస్. కుటుంబీకుల ఆరోగ్యం గురించి ఎంక్వయిరీ చేయటం, తాజా రాజకీయ పరిస్థితుల గురించి అడగటంతో కేవిపి తన దగ్గరున్న సమాచారం ఇవ్వటం, జగన్ కోసం లాబీయింగ్ చేయటం…. ఇత్యాది పైకారణాలతో నడుపబడ్డ ఆ సుదీర్ఘ సమావేశాల్లో అసలు జరిగింది. కేవిపి ని Interrogate చేయటం. ఆ Interrogation తో నెం.10 వర్గానికీ, అందులోని కీలక వ్యక్తి రామోజీరావు, అతడి సోదరీతుల్య సోనియాగాంధీలకి నూరుశాతం తెలిందేమిటంటే – నెం.5 తనని నమ్మిందంటూ తమని నమ్మించి వై.యస్.రాజశేఖర్ రెడ్డి తమకి నమ్మకద్రోహం చేశాడని, ’సందట్లో సడేమియా’ గా తనూ, తన ముఠా బలపడే ప్రయత్నం చేశాడని, తమకి ‘బుస్సు’ కొట్టాడని, తమని బాగా బోల్తా కొట్టించాడని.

దాదాపు నాలుగేళ్ళకు పైగా నడిచిన ఈ వ్యూహంలో, తము నెం.5 చేతిలో ’చిత్తు’గా చిక్కుకుపోయామన్నది అర్ధమయ్యింది. దెబ్బకి కేవిపి నీ, జగన్ నీ ఎత్తికొట్టారు. ఇప్పటికి అంటే సెప్టెంబరు 23 వ తేదీ వరకూ ఇదే స్థితి. మీదు మిక్కిలి ఒక ప్రచ్ఛన్న వైషమ్యానికి, పోరాటానికి పరిస్థితులూ శరవేగంగా కదులుతున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారితే…. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే!

నేను వ్రాస్తోంది సస్పెన్స్ థ్రిల్లర్ నవల కాదు గనుకా, మిమ్మల్ని ఉత్కంఠలో ముంచటం నా లక్ష్యం కాదు గనుకా విషయాన్ని క్లుప్తంగా చెప్పాను. క్లుప్తంగా చెప్పడానికీ నాలుగు టపాలు పట్టిందంటే విషయం ఎంత సంక్లిష్టమైనదో అర్ధం చేసుకోగలరు. ఇప్పుడు Logical గా, Sequence లో, Circumstantial తో వివరిస్తాను. ఇందులో నడిచిన సువర్ణముఖి గురించి కూడా వివరిస్తాను.

నకిలీ కణికవ్యవస్థ ఉనికి, ప్రపంచవ్యాప్తంగా పరుచుకొని ఉన్న గూఢచార వలయపు అస్థిత్వం నెం.5 వర్గానికి తెలిసి 17 ఏళ్ళకు పైనే అయ్యింది. నకిలీ కణిక వ్యవస్థ తాలూకూ గూఢచర్య కార్యకలాపాల తీరుతెన్నులూ అర్ధమయ్యాయి. సవాళ్ళు, ప్రతిసవాళ్ళ మధ్య [ఈ విషయమై గత టపాలలో వివరించాను] అనువంశిక నకిలీ కణికులనీ, వారి ఏజంట్లనీ, వారు ఉపయోగిస్తున్న పైకారణాలు [Over leaf reasons] తో సహా బహిరంగ పరుస్తూనూ, చేసిన ’కర్మ’ అనుభవించటం అనే సువర్ణముఖిని అనువర్తింపచేస్తూనూ, నెం.5 వర్గం, నెం.10 వర్గానికి అసలైన గూఢచర్యం ఎలా ఉంటుందో అనుభవింపచేస్తోంది.

అయితే ఈ పరిస్థితిలో, నకిలీ కణిక వ్యవస్థా, నెం.10 వర్గంతో, మరేదైనా గూఢచార సంస్థ యుద్ధానికి సిద్దపడితే, యుద్దపు తీరు ఇలా ఉండదు. ముందుగా ఏ ఏజంటు ఉనికి అయినా తెలిసిపోతే, వీలైతే నిర్వీర్యం చేస్తారు, వీలుగాకపోతే ప్రాణాలు తీస్తారు. ఏది చేసినా గూఢచర్యం అంతర్గత కారణమైతే, పైకారణంగా [Over leaf reasons] పలు అంశాలు ఉంటాయి. సదరు ఏజంటు వ్యక్తిగత ఆరోగ్యం లేదా బలహీనతలు, లేదా అనూహ్య సంఘటనలు…. ఇలాగన్నమాట. ఒకవేళ ప్రాణాలు తీయటమే అయితే కూడా అనారోగ్యం, ప్రమాదం లేదా బంధుమిత్రులో మరొకరో హత్య చేయటం లేదా ప్రత్యర్ధుల దాడి, లేదా గుర్తు తెలియని హంతకులు…. ఇలాగన్న మాట.

ఇవే నెం.10 కూడా తన ప్రత్యర్ధి గూఢచార సంస్థల మీదా, వారి ఏజంట్ల మీదా ప్రయోగించే తంత్రాలు కూడా. అయితే ఈ 17 ఏళ్ళుగా నెం.5 వర్గం అనుసరిస్తున్న యుద్దరీతి ఇందుకు భిన్నంగా ఉంది. ఉనికి బయల్పడిన నకిలీ కణిక వ్యవస్థలోని కీలక వ్యక్తుల్నీ, ఏజంట్లనీ నెం.5 వర్గం నిర్వీర్యమూ చెయ్యలేదు, ప్రాణాలూ తీయలేదు. బహిరంగ పరుస్తునూ [Expose చేస్తూనూ], చేసిన ’కర్మ’ అనుభవింపజేస్తూనూ పోయింది.

అందుచేత నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గము కూడా తామే ప్రచారించిన కుహనా భావవాదాన్ని నెం.5 వర్గం అనుసరిస్తోందని అనుకున్నారు. కుహనా భావవాదమంటే ఏమిటంటే –

ఉదాహరణకు లౌకిక వాదాన్నే తీసుకొండి. రాజ్యాంగపరంగా అన్నిమతాలూ సమానం అన్నది లౌకికవాదం. ’హిందూ మతం, హిందువులు తక్కువ సమానం, ముస్లిం, క్రైస్తవ మతాలు, ముస్లింలూ, క్రైస్తవులూ ఎక్కువ సమానం’ అన్నది కుహనా లౌకిక వాదం.

అలాగే దుష్టుణ్ణి చంపటం కాదు, దౌష్ట్యాన్ని చంపాలి అన్నది కూడా కుహనా భావవాదమే! ఖచ్చితంగా చెప్పాలంటే కుహనా మంచితనం లేదా కుహనా క్షమాగుణం. దీని మూలకర్తలు అనువంశిక నకిలీ కణికులే. దీన్ని అనుసరించే భారతీయ శిక్షాస్పృతి – ’ వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు, ఒక్క నిర్ధోషికి శిక్షపడకూడదు’ అంటుంది. ఇందులో ప్రధానంగా రెండు లొసుగులు ఉన్నాయి. ఒక్క నిర్దోషికి, మహా పడితే జైలు శిక్షపడుతుంది. లేదంటే ఉరిశిక్షపడుతుంది. ఉరిశిక్షపడటం అన్నది అత్యల్పశాతం. అధవా పడినా క్షమాభిక్షలుంటాయి. యావజ్జీవ శిక్షగా మార్చబడుతుంటుంది. ఇవేవీ గాక ఉరిశిక్ష ఖరారు అయినా, అమలుకు ఏళ్ళుపూళ్ళు పడుతుంది. ఈ లోపున ఏమైనా జరగవచ్చు. అయితే ఈ ఒక్క నిర్ధోషిని తప్పించటానికి 100 మంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదను కుంటే, తప్పించుకున్న ఒక్కొక్క దోషీ, తప్పించుకోవటం ఎంత సులువో అర్ధమయ్యాక, మరింత పేట్రేగి, తలా వంద మందిని అంటే 10,000 మంది అమాయకుల్ని, బలహీనుల్ని, మరో మాటలో చెప్పాలంటే నిర్దోషుల్ని బాధిస్తున్నారే? అంటే ఒక్కనిర్దోషిని రక్షించటానికి 100 మంది దోషుల్ని వదిలిపెట్టి సమాజంలో 10,000 మందిని శిక్షిస్తున్నారే! ఇలాగా శిక్షాస్పృతి ఉండవలసింది? ఇది పూర్తిగా దోషుల్ని కాపాడటానికి ఉన్న చట్టం లాగా లేదూ? అందుకేనేమో జైళ్ళలో ఖైదీలకే ఎక్కువ హక్కులూ, సౌకర్యాలూ ఉన్నాయి. కాబట్టే కసబ్ లకి రంజాన్ సంబరాలు, సంభారాలు [మాంసం, బిర్యానీ గట్రాలు] అందుతున్నాయి. నళినిలని వదలపెట్టాల్సిందిగా తోటి ఖైదులు నిరాహార దీక్షలూ, నిరసన ఉద్యమాలు చేపడుతున్నారు.

ఇక రెండో లొసుగు ఏమిటంటే – అక్కడికి జైలుకు పంపటం ఏదో మహాకౄరమైన శిక్ష అయినట్లు, నిర్దోషికి శిక్షపడకూడదనటం. జైల్లో కరెంటు ఉంటుంది, ఫ్యాన్లుంటాయి, ఆదివారం టీవీలు చూడవచ్చు, వినోద వికాస కార్యక్రమాలుంటాయి, ప్రతీరోజు పక్కామెనూ ఉంటుంది, అందులో ఆదివారం మాంసం, గుడ్లూ కూడా ఉంటాయి. ఇన్ని సౌకర్యాలు మురికి కుపాల్లాంటి పేదలబస్తీల్లో మచ్చుకైనా లేవు. ప్రతీ ఆదివారం మాంసం తినగల, మురుగునీరు చుట్టు లేకుండా నివసించగల, ఏ పూటా తిండికి ఢోకా లేకుండా బ్రతకగల స్థితి, ఈ పేదలకి ఎంతో కష్టపడితేగానీ దక్కదు, దక్కటం లేదు.

ఇలాంటి నేపధ్యంలో ఒక్కనిర్దోషిని కాపాడం అన్న వంకతో వందమంది దోషుల్ని విడిచిపెట్టటం ఎంత వరకూ సబబు? ఇది కుహనా శిక్షాస్పృతి. భారతంలోని ’నారదనీతి’ [ఇంతకు ముందు టపాల్లో వివరించాను] స్పష్టంగా “దోషిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. వాడిమీద ఏమాత్రం కనికరం చూపినా సామాన్యులలో దోషప్రవృత్తి విపరీతంగా రేగుతుంది. అందుచేత నేరం చేసిన వాడిని సకాలంలో శిక్షపడవలసిందే!” అని చెబుతుంది. [భారత న్యాయవ్యవస్థపై నకిలీ కణికుల కుట్రగురించి విపులంగా ఆంగ్లంలో నా బ్లాగు Coups on World లోని Coups on Law & Justice లో వ్రాసాను.]

ఇంతకు ముందే చెప్పినట్లు నారదనీతికి విపర్యయమే నకిలీ కణిక నీతి! ’సకాలంలో శిక్షపడటం’ అన్నది సుప్రీం కోర్టు నుండి స్థానిక మున్సిఫ్ కోర్టు దాకా ఎంత విపర్యయంగా ఉపయోగింపబడుతుందో, ఎంత జాగు జాప్యాలతో కోర్టు తీర్పులు వెలువడతాయో, ఎందుకలా న్యాయవ్యవస్థ పని చేస్తుందో ఇప్పుడర్ధం చేసుకోవచ్చు. ఇతోధికంగా ఇందుకు కృషి చేసే కర్ణాటక, హైకోర్టు న్యాయమూర్తి దినకరన్ ల వంటి వారి గురించిన వ్యవహారాలు ఇప్పుడంటే బయటికొస్తున్నాయి గానీ 1992 కు ముందైతే ’న్యాయమూర్తులు’ అందరూ ఎన్టీఆర్ జస్టిస్ చౌదరిలే! ఈ విషయమై భారతీయతపై సినిమారంగం ద్వారా కుట్రలో కూడా వివరించాను. ఆంగ్లంలో Coups on India through Cinema Field లో వ్రాసాను. ఇక ఇక్కడితో ఈ చర్చ ఆపి, మళ్ళీ నెం.5 వర్గం దగ్గరికి వద్దాం.

ఆ విధంగా నకిలీ కణిక వ్యవస్థ, నెం.10 వర్గమూ తామే ప్రచారించిన కుహనా న్యాయస్పృతి, శిక్షాస్పృతి, మంచితనం గట్రా తంత్రాల మాయలో తామే పడ్డట్లు, నెం.5 వర్గం కూడా అవే నిర్వచనాలు పాటిస్తుంది అనుకున్నారు. కాబట్టే ఉనికి బయల్పడిన ఏజంట్లని నిర్వీర్యం చేయటమో, ప్రాణాలు దీయటమో గాకుండా వారిలోని దుష్టత్వాన్ని రూపుమాపే ప్రయత్నమూ, పరివర్తన తెచ్చే ప్రయత్నమూ చేస్తుందేమో ననుకున్నారు. ఎందుకంటే ‘మొత్తం తమ ఏజంట్లే ఉన్నప్పుడు, ఇప్పటికి ఇప్పుడు మొత్తంగా మంచివాళ్ళను ఎక్కడిని నుండి తెచ్చి ఇన్ స్టాల్ చేయగలరు?’ అన్నది వాళ్ళ ధీమా! ఆ భ్రమలో పడి తాము Expose అవుతున్నతీరు గానీ, సువర్ణముఖి అనుభవిస్తున్న తీరుగానీ గుర్తించుకోలేదు. ఆయా సంఘటనలనీ, స్ట్రాటజీని తము ప్రచారించిన ’కుహనా’ దృష్టి [Pseudo Vision] తోనే చూసారు.

నిజానికి గీత ’యుక్తాహర విహారాస్య’ అని చెప్పినట్లు దేనికైనా ఒక అవధి [Limit] ఉంటుంది. కాబట్టి శిక్షించటంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. దీన్నే భగవద్గీత విభూతి యోగంలో

శ్లోకం:
దండో దమయతానుస్మి నీతిరస్మి జిగీషతాం
మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్

భావం:
దండించే వారి దండనీతినీ, జయించే వారి రాజనీతినీ, గోప్యములలో మౌనాన్నీ, జ్ఞానులలో జ్ఞానాన్నీ నేనే.

అని స్పష్టంగా చెబుతుంది. ఇది తెలియని, ఇది అర్ధం కాని నెం.10 వర్గం, ఎప్పటికప్పుడు వత్తిడిలోనూ, అప్పటికి మెదళ్ళతో యుద్ధంలోని అంకాన్ని ఎదుర్కోవడంలోనూ తలమునకలై ఉంది.

ఈ స్థితిలో, అనుకోని ఆశనిపాతమే వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణం. ప్రతికూల వాతావరణం హెలికాప్టర్ ప్రమాదానికి కారణం. దీన్ని ఎవరూ ఏమన లేరు. కాదు నెం.5 వర్గం జరిపించింది అని నకిలీ కణిక వర్గమూ, నెం.10 అనలేదు. అందులోని కీలకవ్యక్తి అయిన రామోజీరావు అంతకంటే అనలేడు. అసలే వ్యవహారం అటూ ఇటూ అయితే తన మెడకి చుట్టుకునే స్థితి. ఈ పైకారణం [over leaf reason] తో తన ఆస్థులు అగ్నికి ఆహుతి అయినా, తమకు భౌతిక నష్టం కలిగినా చేయగలిగింది ఏమీ లేదు. ఇక ఇతడి సోదరితుల్య సోనియాగాంధీ అంతకంటే ఏమీ చేయలేదు. ఒకప్పుడు దేశమ్మీద కుట్రజరుగుతుందని తెలిసినా ఇందిరాగాంధీ ఏ విధంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయస్థితిలో ఉండిందో అదే ఇప్పుడు తమపరిస్థితి కూడా! ఆనాడు ఇందిరాగాంధీ విదేశీ హస్తాన్ని ఎలా నిరూపించలేకపోయిందో, ఈనాడు నెం.10 వర్గమూ, నకిలీ కణిక వ్యవస్థా కూడా నెం.5 ని నిరూపించలేదు. ఇది ఒక సువర్ణముఖి.

అంతేకాదు! తమ కుట్రలకి వ్యతిరేకంగా పోరాడిన ఎందరో యోధుల్ని, మానవతావాదుల్ని, దేశభక్తుల్ని ప్రాణభీతికి గురిచేసినందుకూ, ప్రాణాలు హరించినందుకూ ఇప్పుడు తామూ ’ప్రాణభీతి’ని అనుభవించవలసి రావటం మరో సువర్ణముఖి. ఈ ప్రాణభీతే ప్రత్యేక విమానాలని వదిలి ఏకానమీ క్లాసులో ప్రయాణింప చేస్తుంది. దీని గురించి తర్వాత వివరిస్తాను.

ఇక దీనికి మరోపార్శ్యం ఏమిటంటే….
మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

"అలాగే దుష్టుణ్ణి చంపటం కాదు, దౌష్ట్యాన్ని చంపాలి అన్నది కూడా కుహనా భావవాదమే!.."

న్యాయవ్యవస్థలో ఉన్న మౌలికమైన లొసుగు గురించి చక్కగా చెప్పారు. "వంద మంది నిర్దోషులు.." ఈ కాన్సెప్టు, భారతదేశంలో బ్రిటిష్ వారి రాకకు పూర్వం లేనట్లు నాకనిపిస్తుంది. ఒకవేళ ఉన్నా, అది ఇలాంటి పనికిరాని మాటలలో కాక, చేతలలో ఉండి ఉండాలి. వ్యవస్థను చాలా కట్టుదిట్టం చేసి, బలైన గూట్లో ఇరికించాలనే తపనతో చివరికి, ఆ గూట్లో తనే ఇరుక్కున్నట్లుంది ఈ న్యాయవ్యవస్థ.

ఇప్పుడు ఈ " వందమంది నిర్దోషులు.." కాన్సెప్టు, చదువుకున్న, చదువుకోని అందరు జనాల తలలలో ఎంతగా కూరుకుపోయిందంటే, దానికి విరుద్ధంగా ఆలోచించటమే తప్పేమో అన్నంతగా.

This country needs a revolution in fundamental - i repeat - fundamental levels. Any amount of patchwork does not solve anything.

మీరు వ్రాస్తోంది సస్పెన్స్ థ్రిల్లర్ నవల అనే అనుకు౦టున్నాను. ఏ మధుబాబు నవలో చదువుతున్నట్లు౦ది. కాకపోతే మధుబాబు కల్పిత పాత్రలతో వ్రాస్తాడు. మీరు మరో మెట్టు పైకెక్కి అసలు పాత్రలతో రక్తి కట్టిస్తున్నారు. ఇది నిజ౦గా కొత్త ట్రె౦డ్.

ఈ కమె౦ట్ చూసి నన్నూ నకిలీ కణిక వ్యవస్థ ఏజె౦ట్ అని అనుకు౦టారేమో... :)

ఊఁ. మన దేశంలో ఇన్ని విషయాలు నడుస్తున్నాయాండీ!? ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి నేన బహుశా ఏ రాజనీతి గ్రంథమో చదవాలేమో!

తరువాతి టపాకై ఎదురుచూస్తూ,
భవదీయుడు

రాఘవ గారు,

దీనికై ఏ రాజనీతి గ్రంధాన్నీ చదవాల్సిన అవసరం లేదండి. నడుస్తున్న రాజకీయాలని జాగ్రత్తగా పరిశీలిస్తూ, ప్రతి విషయం గుర్తుపెట్టుకుంటూ వాటి మధ్య కార్యకారణ సంబంధాలని అన్వేషిస్తూ, విశ్లేషిస్తూ వెళ్ళండి. కొంతకాలానికి మీ కళ్ళముందే అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu