ఓసారి ఈ క్రింది వార్త చూడండి. 16 Aug.,2009న ఈనాడు చివరిపేజీ వార్తగా ప్రచురించింది.

ఇస్లాం మతం స్వయంగా తమతోటివారిని, తమలో సగమైన భార్యల్ని, ఎంత కౄరదృష్టితో చూస్తుందో, చట్టాలు చేసి మరీ నిరూపించిందని పైవార్త తెలియ చేస్తుంది. దాన్ని గురించి వ్రాస్తూ, ఈనాడు, సదరు చట్టాన్ని ఏయే దేశాలు వ్యతిరేకించాయో వ్రాసిందే తప్ప, దాన్ని నిరసిస్తూ వ్యాఖ్యానాలేవీ చేయలేదు.

ఇక ఈ వార్త చూడండి. అదే రోజు షారూఖ్ ఖాన్ ని అమెరికా విమానాశ్రయంలో అవమానించారన్న వార్త నేపధ్యంలో మూడవ పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించింది.


అందులో ఇస్లాంపై పాశ్చాత్య భావాలు, పాశ్చాత్య దేశాల్లో ముస్లింలపై అభిప్రాయాలు ఎంత ‘దారుణంగా’ ఉన్నాయో సవివరంగా, ఉపమానాలతో మరీ వ్రాసింది. ఈ మధ్యకాలంలో చాలామంది ముస్లింలు సాప్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తూ, బాంబుపేలుళ్ళ కేసులో దొరికారు. అలాంటప్పుడు ముస్లింలను అనుమానించటం సహజం. అనుమానించేవాళ్ళని కాదు నిందించవలసింది. అలాంటి పరిస్థితులు వస్తే, తమ మతస్థులలో అమాయకులు కష్టాల పాలవుతారన్న స్పృహ, ఆ మతస్థులలో తీవ్రవాదానికి పాల్పడుతున్న వాళ్ళకి ఉండాలి. అలాగే మతపెద్దలు అలాంటి దాడులకు పాల్పడవద్దని, అలాంటివారికి సహాయం చేయవద్దని చెప్పాలి. లేకపోతే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి.

మనలో మాట. శ్రీమాన్ షారుక్ ఖాన్ వంటి హిందీ నటులు ముంబైదాడుల నేపధ్యంలో సైతం, దాడులను ఖండించలేదు సరికదా, ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం ఒక్క దీపమైనా వెలిగించలేదు. కేరీర్ కోసం చిత్రసీమ గాడ్ ఫాదర్లయిన దావుద్ ఇబ్రహీంల పట్ల అంత విధేయత మరి! ఇలాంటి ఈ నటులని ఎందుకు అనుమానించకూడదు? ఈ నటులేమన్నా మన మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాంలా?

అయినా నాకు తెలియక అడుగుతానూ, తమ స్వంత భార్యల్నే శృంగారానికి, అంటే తమ కోరిక తీర్చడానికి ఒప్పుకోకపోతే, తిండికి మాడ్చటం తమ హక్కు అనే ఇస్లాం మతాన్ని దారుణమనక ఏమనాలి? తమ ఇంట్లోని వారి పట్లే అంత కౄరత్వం చూపగల ముస్లిం దేశాల ముస్లింలకి, ఇతర మనుషుల పట్లా, ప్రాణుల పట్లా దయ ఉంటుందని ఎలా అనుకోవటం? అదృష్టవశాత్తూ భారతీయ ముస్లింలు, ఇంకా, ఇంత బాహాటంగా, ఇలాంటి షరియత్ చట్టాలని సమర్ధించటం లేదుగానీ, లోలోపల, తెర వెనుకా, ముస్లిం ఛాందస వాదానికి సహాయం చేస్తున్న వాళ్ళు మన హైదరాబాద్ పాతబస్తీ ల్లాంటి ప్రదేశాల్లో చాలామందే ఉన్నారు. లేనిదే ఇన్ని టెర్రరిస్టు దాడులకి, పాకిస్తాన్ ఏజంట్లకి సహాయ సహకారాలు ఎలా అందుతున్నాయి? అందిస్తూ హైదరాబాద్ ముస్లింలే ఎలా బయటికొస్తున్నారు?

ఇలాంటి ముస్లింలని అవమానిస్తున్నారంటూ, ఇస్లాంపై పాశ్చాత్య భావాలు, పాశ్చాత్య దేశాల్లో ముస్లింలపై అభిప్రాయాలు ఎంత ‘దారుణంగా’ ఉన్నాయో సవివరంగా, ఉపమానాలతో మరీ వార్తలు రాస్తున్న ఈనాడు, ఈనాడు అధిపతులు, మీడియా ముసుగేసుకున్న ఇస్లాం మద్దతుదారులని ఇక్కడ తెలియటం లేదూ?

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!





7 comments:

"అదృష్టవశాత్తూ భారతీయ ముస్లింలు, ఇంకా, ఇంత బాహాటంగా, ఇలాంటి షరియత్ చట్టాలని సమర్ధించటం లేదుగానీ"

సంస్కృతి పేరుతో "ఇలాంటి చట్టాలు కావాల"ని అప్పుడుమాత్రమే ఋజువర్తన సాధ్యమని కొంతమంది నమ్మడం చూశాను. ముస్లింలలో విద్యాధికుల మాట చెల్లుబాటయ్యే రోజు రావాలి అప్పటివరకూ వారిని చాందసవాదులనుంచి "రక్షించాలి". May Allah save the muslims.

చక్కని వ్యాఖ్య వ్రాసారు. నెనర్లండి.

ఇస్లాం మతం యొక్క అసలు రంగు చూడండి http://sahityaavalokanam.net/?p=250

ఆఫ్ఘనిస్తాన్ లో అలాంటి చట్టం ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో నేనర్థం చేసుకోలేకపోతున్నాను. రమ్మంటే కాదనే పెళ్ళాలు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. రానంటే ఏం జఱుగుతుందో ఆడవాళ్ళకి తెలియదనుకోను. పిలిస్తే రావడంలేదంటే అ భార్యాభర్తల సంబంధం ఏదో చాలా దెబ్బదిన్న స్థితిలోనే ఉండిఉండాలి. దానికి విడాకులే పరిష్కారం.

దాని సంగతెలా ఉన్నా మన దేశంలో కూడా Domestic Violence Act పేరుతో మగవాళ్ళకి వ్యతిరేకంగా ఇలాంటి ఆటవిక అధికరణమే ఒకటుంది. భర్త తన "దగ్గఱికి" రాకపోతే అతను తనని హింసిస్తున్నాడని చెప్పి భార్య అతని మీద చట్టపరమైన చర్యలు (జైలు, ఆస్తిస్వాధీనం) తీసుకోమని న్యాయస్థానాన్ని కోరవచ్చు.

అందరు ముస్లిములూ తీవ్రవాదులు కారు గానీ, అందరూ తీవ్రవాదులూ, ముస్లిములే అనే నమ్మకం ప్రజల్లో పాతుకుపోయింది.

షాహ్ రుఖ్ ఖాన్ తనని తానో పెద్ద ఐకన్ అనుకోవడం బానే వుంది. ఈ జరిగినదాన్ని తన రాబోయే సినిమాకి ప్రచారాంశంగా వాడుకోవడం లో కూడా ఆయన సఫలం అయ్యాడు. అమ్రీకా వోళ్ళు (ఆర్నాల్డు స్వాజ్ నెగర్ గారు) ఈయన్ని ఇంకో బీరు సమిట్ కి పిల్చారంట గా !

ముంబయి దాడుల గురించి ఇంకా ఇందుకండి ? అపుడు ఆ దుర్ఘటన జరిగిన సమయం లో, లక్షలాది మంది జనం వీధుల్లోకి వచ్చి మీరన్నట్టు కొవ్వొత్తులు వెలిగించారు. మేము పన్నులు కట్టం అంటూ చిందులేశారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం దేశం లో అన్ని ప్రాంతాల కన్నా కనాకష్టమయిన ప్రజాస్వామిక స్పూర్థి ని వీళ్ళే ప్రదర్శించారు. షాహ్ రుఖ్ ఖాన్ ఓటు వేసినట్టు పేపర్లో ఫోటో చూసిన జ్ఞాపకం అయితే లేదు గానీ.. కొవ్వొత్తులు వెలిగించడం కాదు. ప్రజల బాధ్యత, ఓటు వేయడం.

అయినా, ఇది ముస్లిముల మీద మన ప్రేమ, లేదా ద్వేషం గురించిన టపా కాబట్టి - ఇదో చైన్ రియాక్షన్ లాంటిది. ఇస్లాము పురాతనమయిన మతం అనీ, రాతి యుగాలనాటిదనీ - సమాజం నమ్మిక ప్రబలం అవుతూంది. ఈ విషయం లో - ఒక చైన్ రియాక్షన్ ఎక్కడో మొదలయింది. వీళ్ళు వాళ్ళని హేట్ చేయడం, వాళ్ళు వీళ్ళని హేట్ చేయడం.. అలా ! ఇది అంతు లేని కధ !

ఏమో - టపా చూసి చాలా ఆవేశం కలిగించేసారు. మీకే నెనర్లండీ !

గత 20 సంవత్సరాలలొ అమెరికా మీద ప్రత్యక్షంగా (అమెరికా లొను , బయట ) దాడి జరిపిన టెర్రరిస్ట్ లు అందరూ ముస్లిం పేర్లు కలిగి వున్నప్పుడు , ముస్లిం పేర్లు వున్నవారితొ వారు కొద్ది జాగ్రత్త గా వుండటం లొ ఎదయినా తప్పు వుందంటారా ? మనలా వాళ్ళకి ఓటుబ్యాంకు రాజకీయాలు లేవుగా..

@ ప్రవీణ్ గారు,
మీరిచ్చిన లింకు ఎందుకో గానీ ప్రచురితం కాలేదండి.
********

@ తాడేపల్లిగారు!
అలాంటి ఏహ్యమైన చట్టం ఉన్నట్లు నేనూ ఒకసారి చదివానండి. భార్య ఇష్టపడకుండా, భర్త శృంగారం కోసం బలవంతం పెడితే దాన్ని అత్యాచారంగా కేసుపెట్టవచ్చని కూడా చదివాను. నిజంగా ఏమనాలో అర్ధం కాని స్థితే! చట్టాలతో చెలగాటం ఆడుకోవచ్చు కాబోలు. భావోద్వేగాలతో నిండిన సున్నిత విషయాల్లో స్వయం నిబద్ధత, సర్ధుబాటు ధోరణి తప్పితే, చట్టాలు ఒనగూర్చగల ప్రయోజనం ఏపాటి చెప్పండి? ‘ఆఫ్గాన్ లో అలాంటి చట్టం అవసరమైందంటే, అక్కడి భార్యభర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండి ఉండాలి’ అన్న మీ ప్రశ్న ఆలోచించవలసినదే.
*********

సుజాత గారు,
మీ ఆవేశం నాకు అర్ధమైందండి. పెద్ద వ్యాఖ్యతో మీ ఆవేశాన్ని మాకూ పంచినందుకు మీకు కూడా నెనర్లు.
*********

మంచుపల్లకీ గారు,
మీ అభిప్రాయాన్ని నేనూ సమర్ధిస్తానండి.
*********

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu