వీలు కుదిరినప్పుడల్లా మీడియా, ఇస్కాన్ గురించీ, దాని వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాదుడి గురించీ వ్రాస్తుంటుంది. మచ్చుకి ఆగస్టు9, 2009 ఈనాడు ఆదివారపు సంచిక పతాక కథనం చూడండి. [ఇలాంటివి, ఇప్పటికి వివిధ పత్రికలలో చాలానే ప్రచురింపబడ్డాయి]


ఈ మధ్య మీడియా ప్రచురించే కథనాలలో, కాలానికి సంబంధించిన సమాచారం సమగ్రంగా ఉండటం లేదు, గమనించండి. 350 సంవత్సరాలకు పైబడిన కుట్ర స్వరూప స్వభావాలు, ఎక్కడ అంచనాకి, అవగాహనలోకి వస్తాయోనన్న భయం, రానీయకూడదన్న జాగ్రత్త అది! ఈ శ్రీల ప్రభుపాదుడు 1966 లో అమెరికాలో ఇస్కాన్ ని స్ధాపించాడు. 69 ఏళ్ళ వయస్సులో తొలిసారి అమెరికా వెళ్ళాడు, అదీ ఒక చేతి సంచి, గొడుగుతో! [అచ్చం స్వామి వివేకానంద లాగా అన్నమాట! ఇక్కడా అనుకరణే! అనుకరణ ద్వారా స్వామీ వివేకానందుడితో, శ్రీల ప్రభుపాదుడిని సామ్యం చెప్పటం!] అంటే ఇతడు 1896–97 ప్రాంతాల్లో జన్మించి ఉండాలి. తదుపరి 1966 లకు ఉపయోగకారి అయ్యాడు.

మీడియా కథనం:
>>>ఓ సారి ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదుడు తన గదిలో కూర్చుని భాగవతం చదువుకుంటున్నారు. అంతలోనే బయట ఏదో అలికిడైంది. కిటికీలోంచి చూస్తే గుండెల్ని పిండేసే దృశ్యం. ఎంగిలి విస్తళ్ళ కోసం పిల్లలు వీధి కుక్కలతో పోటీపడుతున్నారు. స్వామీజీ కళ్ళు చెమర్చాయి. ’ఇస్కాన్ చుట్టుప్రక్కల ఎవరూ ఆకలితో అలమటించడానికి వీల్లేదు. కడుపునిండా అన్నం పెట్టండి’ కచ్చితంగా చెప్పేశారు ప్రభుపాదులు. అప్పటి నుండి ఇప్పటిదాకా…. ఇస్కాన్ ఆ మార్గంలోనే నడుస్తోంది. ’అది మామూలు భోజనం కాదు. భగవానునికి సమర్పించిన ప్రసాదం. దాతలు భక్తితో ఇస్తారు. వండేవారు భక్తితో వండుతారు. కృష్ణుడికి నివేదించేవారు భక్తితో నివేదిస్తారు. వడ్డించేవారు భక్తితో వడ్డిస్తారు. ఆ భోజనంలోని ఆధ్యాత్మిక శక్తి మనసు మీదా ప్రభావం చూపిస్తుంది. కృష్ణ తత్వాన్ని ఆలోచనల్లో భాగం చేస్తుంది’ అంటారు, ఇస్కాన్ సభ్యుడు వాసుదేవ.

>>>పదేళ్ళ క్రితం [అంటే 1999 లో] బెంగుళూరులో పదిహేను వందల మందితో ప్రారంభమైన ’అక్షయ పాత్ర’ రోజూ పదిలక్షల మంది బడిపిల్లల కడుపునింపుతోంది. కడుపునింపడం అన్నది చాలా చిన్నమాట! ఆ భోజనం జీవితం మీద పసిపిల్లలకున్న దృక్పధాన్నే మార్చేసింది. బతుకంటే భయాన్ని పోగొట్టింది. ఆకలితో పాటూ ఆక్రమించే నిస్సత్తువనూ, నిర్లిప్తతనూ దూరం చేసింది. ఎవరూ ప్రార్ధన సమావేశంలో నీరసంతో కళ్లు తిరిగిపడిపోవటం లేదు. శ్రద్ధగా పాఠం వింటున్నప్పుడు కడుపులో ఎలుకలు గోలపెట్టడం లేదు. పోషక విలువల్లేక కళ్లచుట్టూ నల్లచారలు రావడం లేదు. గైరుహాజరీ తగ్గిపోయింది. అవసరమైతే, పోషకవిలువల లోపాలున్న పిల్లలకు మల్టీ విటమిన్ మాత్రలిస్తున్నారు. ’విద్యా అక్షయ పాత్ర’ మెరికల్లాంటి విద్యార్ధులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పైచదువులకు పంపిస్తోంది. ఫలితాల్లో వెనకబడ్డ పాఠశాలల ఉపాధ్యాయులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తోంది.

>>>’పుడ్ ఫర్ లైఫ్’ కార్యక్రమంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ శాఖలన్నీ నిర్భాగ్యుల ఆకలి తీరుస్తున్నాయి. హైదరాబాద్ ఇస్కాన్ ప్రతినిధులు ప్రతి ఆదివారం వృద్ధాశ్రమాలకూ, అనాధ శరణాలయాలకూ, ఆసుపత్రులకూ వెళ్ళి…. కడుపునిండా కమ్మని భోజనం వడ్డిస్తున్నారు. పాకిస్తాన్ లో భూకంపం వచ్చినప్పుడు, చెచెన్యాలో, గాజాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నప్పుడు, ఆగ్నేయ ఆసియాను సునామీ చుట్టుముట్టినప్పుడు... ఇస్కాన్ ఆకలి కడుపులకు అండగా నిలిచింది. ఇంత చేస్తున్నా, ’అన్ని నిధులు సమకూరుస్తున్నవాడూ అంతమంది ఆకలి తీరుస్తున్నవాడూ కృష్ణుడే! మేం నిమిత్తమాత్రులం’ అంటుంది ఇస్కాన్ వినమ్రంగా.

ఈ అన్నదానాలు, వృద్ధాశ్రమ సేవా కార్యక్రమాలు 1992 తర్వాతే ఇస్కాన్ ఇంతగా విస్తరించింది. అంతకు ముందు [అంటే 1992 ముందు] అలాంటి కార్యక్రమాలు ఏవీ ఇస్కాన్ ప్రధాన కేంద్రం [మాయాపూర్, ప.బెంగాల్]లో నేను చూడలేదు. ఆ ఊరి అభివృద్ధికి ఇస్కాన్ ఎలాంటి చర్యలు తీసుకున్నదీ లేదు. ఎందుకంటే 1992 లో పీవీజీ ప్రారంభించిన మెదళ్ళతో యుద్ధపు పరిణామాల్లో ఇదీ ఒకటి గనుక! నెం.5 Vs నెం.10 గూఢచార పోరాటంలో ఇస్కాన్ పైముసుగు జారిపోయి, ఎక్కడ అసలు రూపం బహిష్కత మౌతుందో, అంచేత ప్రజల్ని అర్జంటుగా నమ్మించటం అవసరం గనుక!

మీడియా కథనం :
>>> మనం ఏం తింటున్నామో చెబితే… మన గుణమేమిటో చెప్పవచ్చు. మనం ఏం చదువుతున్నామో చెబితే… మన ఆలోచనలేమిటో చెప్పవచ్చు. మంచి భోజనం, మంచి పుస్తకం… సమాజంలో రెండూ కరువైపోతున్నాయి.

>>>బయట కాలుపెడితే చాలు, రజోగుణాన్నీ, తమో గుణాన్నీ పెంచే ఆహారం తప్ప మరొకటి దొరకడం లేదు. ఆ వడ్డనలోనూ ప్రేమ ఉండదు. పక్కా వ్యాపారం, భోజనాన్ని ఓ ప్రసాదంలా భక్తితో వండి, ప్రేమతో వడ్డించే సంస్థలుంటే ఎంత బావుంటుంది! హోటళ్ళు కూడా దేవాలయమంత పవిత్రంగా మారిపోతాయి. ఆ ఉద్దేశంతోనే ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా ’గోవిందాస్ రెస్టారెంట్స్’ను ప్రారంభించింది. రసాయన ఎరువులూ, క్రిమిసంహారకాల జాడలేని కాయగూరలతో వండిపెడతారక్కడ. అల్లం, వెల్లుల్లి నిషిద్ధం. దినుసుల నాణ్యతలో రాజీ ఉండదు. చుట్టూ కృష్ణలీలల్ని వివరించే వర్ణచిత్రాలు, వినిపించీ వినిపించనట్లు భక్తి సంగీతం… ఆ ఆధ్యాత్మిక వాతావరణంలో భోజనం ఎక్కళ్ళేని సంతృప్తినిస్తుంది. ’ఏ హోటల్ కు వెళ్ళినా భుక్తాయాసంతో బయల్ధేరతాం. గోవిందాస్ నుంచి మాత్రం, బోలెడంత చైతన్యంతో బయటికొస్తాం’ అంటారు. బెంగుళూరులో ఉంటున్న సాఫ్ట్ వేర్ నిపుణుడు సుధీంద్ర. పుస్తకాలు మన ఆలోచనల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. అందుకే, కృష్ణ చైతన్య సాహిత్యం ప్రపంచానికంతా అందాలన్నది ప్రభుపాదుల ఆదేశం. ఇస్కాన్ శాఖల్లో ఏటా పుస్తకోత్సవాలు జరుగుతాయి. వేలాది గ్రంధాలు ఉచితంగా పంచుతారు.

>>>విశ్వ చైతన్యం:
>>>ప్రభుపాదుల ఆశయం నెరవేరుతోంది. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తమైంది. ’హరేకృష్ణ’ విశ్వమంత్రమైనది. ఏ ఇస్కాన్ శాఖ కెళ్ళినా వసుధైక కుటుంబంలాగానే అనిపిస్తుంది. భిన్నదేశాల ప్రజలు దర్శనమిస్తారు. మనకే తెలియని మన భగవద్గీతను తాత్పర్య సహితంగా చెబుతారు. భాగవతాన్ని పరవశంగా వినిపిస్తారు. కులం లేదు. మతం లేదు. జాతి లేదు. కృష్ణ చైతన్యమే అర్హత. ఆశ్చర్యం! అక్కడ యువతీ యువకులే ఎక్కువ కనిపిస్తున్నారు. ’నా వయసు కుర్రాళ్ళంతా ఏ సినిమాకో షికార్లకో వెళ్తున్న సమయంలో నేను ఇస్కాన్ లో ఉంటాను. వాళ్ళు కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేస్తున్నప్పుడు… నేను ఏ భాగవతమో భగవద్గీతో చదువుకుంటాను. వాళ్లంతా నిద్రమత్తులో జోగుతున్నప్పుడు నేను ఏశాస్త్రపాఠాలో వింటుంటాను. వాళ్లకూ నాకూ తేడా ఒక్కటే. నాకు నేనేమిటో తెలుసు. నా జీవిత లక్ష్యమేమిటో తెలుసు. వాళ్లకది తెలుయదు….’ పట్టుమని పాతికేళ్ళు కూడాలేని లోక్ పాలక్ లో ఎంత స్పష్టత ఉంది! అలా అని అతనేం చదువుల్ని నిర్లక్ష్యం చేయడం లేదు. ఈ మధ్యే మంచి మార్కులతో ఎంబీయే పాసయ్యాడు. ఉద్యోగం ఓ సమస్యే కాదు. ఆ యువకుడి మొహంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కృష్ణ చైతన్యం… ఎంతమందిలో అయినా ప్రత్యేకంగా నిలబెడుతుంది. శ్రీల ప్రభుపాదులు ’ఇస్కాన్’ను స్ధాపించింది ఇలాంటి వ్యక్తులతో నిండిన సమాజాన్ని నిర్మించడానికే.

మన భగద్గీతని మనకే విశదీకరిస్తారు. నిజమే! ఢిల్లీ ఇస్కాన్ శాఖలో గీతా మందిరపు [షో] ప్రదర్శనలో [తలకు 50/- రూపాయలతో అదనపు టిక్కెట్టు కొనడాన్ని భక్తులెవరూ వ్యాపార దృష్టితో చూడరాదు సుమా!] ఇస్కాన్ ప్రదర్శించిన భగద్గీత నిజంగా ’అపురూపమే!’ సిమెంటు శ్రీకృష్ణార్జున శిల్పాల నడుమ లైట్ అండ్ సౌండ్ షో చూసి తీరాల్సిందే. ఆ షో చివరిలో ’మాయ’ని డిమోన్ స్ట్రేషన్ చేయటం ఎలా ఉంటుందంటే మన ఎదురుగా వందల టీవీలు ఒకదాని ప్రక్కనొకటి, ఒకదానిపైన మరొకటి పెద్దగోడలా అమర్చబడిఉంటాయి. ఒక్కో టీవీలో ఒకో దృశ్యం... బాలభారతంలో బాలభీముడు, ఐరావతాన్ని భూమికి తీసుకురావడానికి, బాల అర్జునుడు నిర్మించిన బాణాల వంతెన మీద పైకెక్కుతూ ఉండగా, ఘంటసాల తన అద్భుతగళంతో ‘మానవుడే మహానీయుడు’ అని గానం చేస్తుండగా కమాలాకర కామేశ్వరరావు గారు తెరకెక్కించిన ’అంతరిక్ష దృశ్యాలు’ వంటివి వస్తుంటాయి. అదిట ’మాయ’ అంటే… ఆ తరువాత అద్దాల గదిలో పంపిస్తారు. అక్కడ క్రింద, పైన, ప్రక్కలా, మొత్తం అద్ధాలు బిగించి ఉంటాయి. అది కూడా ’మాయ’ అట. వీటి గురించి చెప్పేవాళ్ళు గానీ, మన అనుమానాలు తీర్చేవాళ్ళు గానీ ఎవ్వరు ఉండరు. ఈ ప్రదర్శనని 2005 లో ఢిల్లీకి వెళ్ళినప్పుడు లోకల్ ట్రిప్ లో భాగంగా తిలకించాను. [టూరిస్టులను తీసుకువచ్చినందుకు బస్సువాళ్ళకి డబ్బులు ముట్టజెప్తారు.] తిరిగి హోటల్ రూం చేరుకున్నాక పగలబడి నవ్వుకున్నాం. అతిశయోక్తి కాదు, మీరు మాస్థానంలో ఉంటే మీరైనా నవ్వుకుంటారని నేను ఘంటాపధంగా చెప్పగలను.

ఇక ఈ మీడియా అంతా కలిసికట్టుగా, ఏకగళంతో కీర్తించే ఈ ‘శ్రీల ప్రభుపాదుడు’ లేదా ‘భక్తి వేదాంత ప్రభుపాదుడి’ రెండో ముఖాన్ని, ఇస్కాన్ ముసుగు వెనక ఉన్న గూఢచర్య తంత్రాన్ని, మీకిప్పుడు విశదీకరిస్తాను. ఇది నాకెలా తెలుసో, ఇందులోని సత్యాసత్యాలు మీరెలా నిర్ధారించుకోవచ్చో కూడా వివరిస్తాను.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

నాకు బాగా గుర్తు, 2004 లో కళాశాల యాత్రలో భాగంగా బెంగుళూరు వెళ్ళినప్పుడు ఇస్కాన్ "టెంపుల్ " కి వెళ్ళాను. ఎక్కడా ఆధ్యాత్మికత అన్నది భూతద్దంతో వెతికినా కనిపించలేదు. కనిపించే ప్రతీ ఆహార పదార్ధాన్ని గుడిలో ప్రసాదంగా పెట్టొచ్చనీ దాన్ని అమ్ముకోవచ్చు అనీ నాకు తెలియదు అప్పటివరకు. (ఏదైనా ప్రసాదంగా పెట్టడంలో ఆక్షేపణ లేదు. కానీ ప్రసాదం దగ్గర, అదీ గుడిలో ప్రతీ వస్తువూ ప్రసాదమంటూ అమ్మడమే :( )
అయితే మెచ్చుకోదగ్గ విషయమంటూ ఉంటే వారు వాడే చిత్రపటాలు చాలా బాగుంటాయి. ఎవరు వేసారో తెలియదు మరి.

నిజమా అస్సలు నమ్మకశ్యం గా లేదు, భరించలేనంత దిగులు వేస్తుంది ఇలాంటివి వింటే కాని అంతలోనే సర్దుకోవటం పోనిలే వాళ్ళు మనుష్యులే కదా మానవ సంభందమైన గుణాలకు అతీతం గా ఎలా వుంటారు అని. అందరి మీద ఇలానే వుంటూనే వుంటాయి కదా లక్ష్మి గారు ఇలాంటీవి. అందునుంచే పోని లే మరీ దుర్మార్గుడూ కాదు అని సరి పుచ్చుకుంటు వెళ్ళాలేమో జనాలు :( పలాయన వాదం అంటారా, కాని చరిత్ర ను చూసే దృక్పధం ఎప్పుడు ఇంతేనేమో అప్పటి ప్రముఖుల చేతిలో పడి వంకర టింకరలు తిరుగుతుంటుందేమో. ..

పేదల కడుపుకొట్టి వాళ్ళు పొట్టలు నింపుకోవడం లేదుగా.ఎక్కడ లేవు మోసాలు,కుట్రలు?నాలుగు ముద్దలు పెడుతున్న వాళ్ళ మంచి ని మంచి అని చెప్పండి.చెడు వుంటే అది అదొక్కటే టపాగా రాయండి.మంచి పనులతో ముడి పెడుతూ దాని విలువ తగ్గిస్తూ కాదు. అర్ధం చేసుకోగలరనుకుంటాను.

ప్రదీప్,

నీ పరిశీలన సత్యమే. ఇంకా మాయాపూర్ లో త్రి-డి కుడ్యచిత్రాలుంటాయి. అవి ఇంకా అద్భుతంగా ఉంటాయి.

****
భావన గారు,

బెంగ పడవలసిన అవసరం ఏమీ లేదు. మంచికే విజయం లభిస్తుంది.

****
రాధిక గారు,

ఇస్కాన్ మీద టపాల మాలిక పూర్తిగా చదివిన తరువాత మరోసారి మీ అభిప్రాయం చెప్పగలరు.

****

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu