1992 లో మారిన గూఢచార నేపధ్యంలో, పీవీజీ, నెం.5 ఇచ్చిన అల్టిమేటంతో నకిలీ కణికుడికి ‘ఎన్టీఆర్ ని తెరమీద ఉంచి తెరవెనుక చిన్నలుడి మంత్రాంగం’ చాలని స్థితి ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ ని అడ్డుతొలిగించుకోవటం అప్పటికి అవసరం అయ్యింది. ఇక స్ట్రాటజీ రచింపబడింది, అమలు జరపబడింది. అదే లక్ష్మీపార్వతిగా రూపం దిద్దుకుంది.

నిజానికి లక్ష్మీపార్వతి, ఎన్టీఆర్ జీవితంలో 1992 నాటికి కొత్త పాత్రకాదు. 1985 లో ఈవిడ, ఈవిడ భర్త వీరగంధం సుబ్బారావుతో సహా, జీవిత చరిత్ర వ్రాస్తామంటూ ఎన్టీఆర్ వెంటపడ్డారు. 1987 లో అనుమతి సంపాదించారు. ఆ రీత్యా అతడి జీవిత సంఘటనలు, విశేషాలు, అనుభవాలు, అనుభూతులు, అభిప్రాయాలు, ఇతర భావాలు తెలుసుకునే క్రమంలో అతడితో సమావేశం కాగల, సంభాషించగల వ్యక్తి లక్ష్మీపార్వతి. 1992 వరకూ కూడా, ఆమె పాత్ర రచయిత్రి పాత్రే! అయితే 1992, జూన్ తర్వాత నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావు కీ ఎన్టీఆర్ కన్నా చంద్రబాబు నాయుడి అవసరం ఎక్కువగా ఉంది. అప్పటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. నేదురుమల్లి జనార్ధన రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కానీ కేంద్రంలోని పీవీజీ కి, రామోజీరావు తాలూకూ గూఢచర్యం తెలిసిపోయాక, అతడికి విశ్వాసపాత్రుడు, అతడి చేతిలో బొమ్మ అయిన నేదురుమల్లి పాత్ర కూడా బాగా అర్ధమైపోయాయి గనుక నేదురుమల్లి కూడా డ్రాప్ చెయ్యవలసిన కార్దువంటివాడే! ఆ ఆటలోనే హఠాత్తుగా ఇంజనీరింగ్ కాలేజీలలో కాపిటేషన్ ఫీజుల రచ్చ మొదలైంది. సెప్టెంబరు, 1992 లో మొదలైన గల్లంతు అక్టోబరు 09, 1992 న నేదురుమల్లి నుండి ముఖ్యమంత్రి పదవి బాధ్యతలని కోట్ల విజయభాస్కర రెడ్డి స్వీకరించటంతో చల్లారింది. 1992, మార్చిలో, తిరుపతిలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో అద్భుతమైన ఇమేజ్ తో వెలిగిపోయిన నేదురుమల్లి ప్రాభవం, ‘ఇది పీవీజీకి, నేదురుమల్లికీ సమ్మతమైన జాబితా’ అంటూ ఆఫీసు బేరర్ల నియామకాల దగ్గర నుండీ C.W.C. సభ్యుల జాబితా వరకూ ప్రస్తావించబడిన నేదురుమల్లి వైభవం, 1992, జూన్ తర్వాత మూడు నెలలకే ముగిసిపోవటం, ముఖ్యమంత్రి పదవి ఊడిపోవటం వెనుక, పైకి కనబడిన కారణం ఇంజనీరింగ్ కాలేజీలలో కాపిటేషన్ ఫీజుల వివాదం. లోపలి కారణం ’కన్నా? కలా?’ అన్న స్ట్రాటజీనే. నిజానికి నేదురుమల్లి [ఇతడికీ రామోజీరావుకీ ఉన్న అనుబంధం గురించి భారత దేశ రాజకీయ రంగంపై నకిలీకణికుడి సుదీర్ఘకుట్ర అన్న టపాలలో సవివరంగా చెప్పాను] 1989 లో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రైలు పెట్టెల్ని ప్రయాణికులతో సహా తగలేసిన సంఘటనలూ, ఇతర హింసాత్మక సంఘటనల కారణంగా చెలరేగిన అలజడిరీత్యా, మర్రి చెన్నారెడ్డి స్థానే నేదురుమల్లి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటి నుండి రమారమి 20 నెలలు పాటు ఎదురులేని నేదురమల్లి, అసమ్మతి తననేమీ చెయ్యలేని స్థితిలో ఉన్న నేదురమల్లి, ఆ విధంగా పదవీచ్యుతుడయ్యాడు. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపిఏ, 2004 లో అధికారంలోకి వస్తుందన గానీ నేదురుమల్లి భార్యా, అతడూ హడావుడీ పడిపోయిందీ, తమకిక మళ్ళీ ’సీన్’ రావడం ఖాయం అనుకొని అలకలు పోయిందీ – రామోజీ రావు, సోనియాగాంధీల మీదా ఉన్న నమ్మకంతోనే! అంతేకాదు వారి గూఢచర్య సంబంధ బాంధవ్యాలు గురించి తెలిసి ఉన్నందునే, ఆ నమ్మకం వాళ్ళకి! అయితే తమకి ’సీన్’ రాదు అన్న విషయం వాళ్ళకి ఇంకడానికి దాదాపు 1 ½ దశాబ్ధం పైనే పట్టింది. ఖచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే జీర్ణమౌతోంది.

అదే నకిలీ కణిక వ్యవస్థకీ, రామోజీరావుకీ అయితే… పరిస్థితి వేరు. దశాబ్ధాల ముందే పరిస్థితుల్ని అంచనా వేసుకుని, తదనుగుణంగా స్ట్రాటజీ నడుపుకోవడానికి ముందుగా పునాదులు వేసుకోవడం గూఢచర్యంలో తప్పని సరి. ఆ కారణంగానే 1992 తర్వాత రాష్ట్రంలో జరగవలసి ఉన్న అసెంబ్లీ ఎన్నికలలో[1995] ఈసారి కాంగ్రెస్ ని అధికారంలోకి రానివ్వకూడదన్నది నకిలీ కణిక వ్యవస్థ, రామోజీరావు పధకం. అందుకోసమే కోట్ల విజయభాస్కర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, అతడు రాష్ట్ర అధికారాన్ని ‘పళ్ళెం’లో పెట్టి ప్రతిపక్షానికి అందిస్తాడనీ, గతంలో అలాగే జరిగిందనీ ఓ ’సెంట్ మెంట్’ ని మీడియా ప్రచారంలోకి తెచ్చింది. తర్వాత అదే జరిగింది కూడా! అయితే, అందుకు ఈనాడు పత్రిక, నెల్లూరు జిల్లా దూబగుంట్ల గ్రామాన్ని అందులో నుండే సారా ఉద్యమాన్ని వెల్లువెత్తించింది. అపురూపమైన ప్రజా ఉద్యమంగా, మహిళా శక్తిగా ’ఈనాడు’ తన సంపాదకీయాలతో హోరెత్తించింది. నిజంగానే పల్లెల్లో కుటుంబాలకు కుటుంబాలు ’సారా’కి ఆహుతైపోతున్నాయి గనుకా, పత్రికల మాయ అప్పుడింతగా ప్రజలకి తెలియనందునా, ఆనాటి సారా వ్యతిరేక ఉద్యమంకి బాగా స్పందన వచ్చింది. ‘ఈనాడు’ పూర్తిగాపేజీలు కేటాయించి మరీ, దానికి బాగా ఊపునిచ్చింది. ’అదంతా తన ప్రత్యర్ధి పేపరుని దెబ్బకొట్టడానికీ, వ్యాపార పోటీదారు ఆర్ధిక మూలాలని నలిపివేయడానికి ‘ఈనాడు’ ఆనాడు ఆ స్ట్రాటజీ చేపట్టిందని దృష్టాంతపూరితంగా మరీ, ఇప్పుడు తేలిపోయింది. అయితే ఈనాడు, రామోజీరావుల స్ట్రాటజీకి అదొక్కటే కారణం కాదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ని, రెండేళ్ళ తర్వాత జరిగే ఎన్నికలలో ప్రక్కకు తోసి, తెదేపా ని పైకి లేపాలంటే కూడా ఓ ’మంచి బలమైన కారణం’ కావాలి. దానికి తగిన ఊపు ఉండాలి. అందుకోసం కూడా దూబగుంట్ల సారా వ్యతిరేక ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. అది ప్రజాఉద్యమమే అయితే, అందుకు ఈనాడు మీడియాకూ నిబద్దతే ఉంటే, ఇప్పుడు సారా ఏరులై ప్రవహిస్తూ ఉండేది కాదు కదా!

ఆవిధంగా తమ రాజకీయపు ఆటలో, గూఢచర్యపు తంత్రాల్లో భాగంగా లేవనెత్తబడిన సారా ఉద్యమాన్ని ఎన్టీఆర్ అందిపుచ్చుకున్నాడు. తను అధికారంలోకి వస్తే తొలి సంతకం సారా నిషేధం మీదే చేస్తానన్నాడు. ఎన్టీఆర్ కున్న ఇమేజ్ కి ఇది మరింత నప్పింది. ఎంత ఇమేజ్ ఉన్నా 1989 ఎన్నికల్లో ’వొట్టి విస్తరి మంచినీళ్ళు’ వంటి ఉపన్యాసత్మక రాజకీయాలు చెల్లక పోవటం చేత, ఓడిపోయిన ఎన్టీఆర్ కి, సారా ఉద్యమపు ఊపుని ఊతగా ఇచ్చి గద్దెనెక్కించి, ఆ తర్వాత అతణ్ణి తప్పించి అతడి అల్లుడు నారా చంద్రబాబు నాయుడిని సీట్ ఎక్కించుకుంటే తనకి కావలసిన చాలా పనులు చేయించుకోవచ్చు. – ఇదీ నకిలీ కణికుడు వ్యవస్థ, రామోజీరావుల పధకం! అందుకు ముందస్తు ప్రాతిపదికగా 1992 ద్వితీయార్ధంలో, ఎన్టీఆర్, ఇంటిలో నిరాదరణకి గురయ్యాడు. అదీ అనారోగ్యంతో బాధపడుతుండగా! సేద తీర్చేవారు, అత్మీయంగా సేవ చేసే వారు కరువయ్యారు. ఆ స్థితిలో లక్ష్మీపార్వతి అతడికి సేవలు చేసింది. ఒంటరితనంలో వ్యధ పంచుకునేతోడు అయ్యింది. కుటుంబ సభ్యులందరికీ రామారావు పట్ల అంత deviation రావటం అన్నది – గూఢచర్యం కుటుంబ సంబంధాలలోకి రావటంతో తేలికగానే సాధ్యపడుతుంది.

తదుపరి పర్యవసానాల్లో ఏప్రిల్ 15, 1993 న లక్ష్మీపార్వతి భర్త వీరగంధం సుబ్బారావు నుండి విడాకులు తీసుకుంది. ఆమెని తాను వివాహం చేసుకోబోతున్నట్లు ఎన్టీఆర్ సెప్టెంబరు 10 న బహిరంగ సభలో ప్రకటించాడు. సెప్టెంబరు 11 న సాంప్రదాయబద్దంగా తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. అతడి కుటుంబసభ్యుల స్పందనలు, అప్పడందరికీ – సంచలనాత్మక, ఆసక్తికర కథనాలు అయ్యాయి. ఎవరేమన్నా, ఎవరెలా స్పందించినా 71 ఏళ్ళ వయస్సులో, ఎన్టీఆర్ రెండోసారి ఒకింటి వాడయ్యాడు. అతడి ద్వితీయ సతీమణి లక్ష్మీపార్వతిది కూడా అదే స్థితనుకొండి.

ఇక్కడో తమషా ఏమిటంటే 71 ఏళ్ళ వయస్సులో ఎన్టీఆర్ పెళ్ళి చేసుకున్నాడు. అదీ అప్పటికి చాలా ఏళ్ళక్రితమే భార్యా వియోగుడైనందున, ఒంటరితనం రీత్యా వివాహమాడాడట. ఒంటరి వృద్ధుడు మానసికంగా తోడు కోసమే వివాహం చేసుకున్నట్లయితే – సంతానం కోసమో, దాంపత్య సుఖం కోసమో ’స్టెరాయిడ్స్’ ఎందుకు వాడినట్లు? స్టెరాయిడ్స్ వాడారనీ, అందుచేతే ఎన్టీఆర్ త్వరగా మరణానికి చేరువయ్యాడనీ, ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ, తర్వాత రోజుల్లో చాలాసార్లే ఆరోపించాడు. దానాదీనా తేలేదేమిటంటే – 25 ఏళ్ళ వయస్సులో ఎన్టీఆర్, దేశస్వాతంత్రం కోసం పిల్లాపాపా మొదలు ముసలీ ముతకా వరకూ, స్త్రీపురుష బేధం లేకుండా అహింసా పోరు సాగించిన రోజుల్లోనూ, ‘తన స్వార్ధం తనది’ అన్నట్లు తనకెరీర్ కోసమే పాటుపడ్డాడు తప్ప, అంతటి స్ఫూర్తి పూరిత వాతావరణంలోనూ దేశం గురించి ఏదీ చెయ్యలేదు. అలాంటివాడు, తన సినిమా కేరీర్ ముగిసిన తరువాత, తన 58 ఏళ్ళ వయస్సులో, హఠాత్తుగా…. ‘దేశభక్తి, రాష్ట్రభక్తి’తో ఊగిపోయాడు.

అలాగే 71 ఏళ్ళ వయస్సులో, వృద్ధాప్యంలో ఒంటరితనం ఓర్వలేకో, ఎందరో హీరోయిన్లు తనకళ్ళ ఎదుటే యవ్వనంతో మెరిసి ఆపైన ముసలితనంతో తెరమరుగైపోయినా తానుమాత్రం నిత్వయవ్వనుడిలా హీరోగా కొనసాగానన్న స్వాతిశయంతో, యుగపురుషుడు, ఎదురులేని మనిషి గట్రా ఉపమానాలతో పొగడబడినందున కలిగిన అతిశయంతో, 71 ఏళ్ళ వయస్సులో సైతం యవ్వనం అనుభూతించో గాని, మొత్తానికి పెళ్ళికొడుకయ్యాడు. ఈ కోణంలో ’సువర్ణముఖి’ సుస్పష్టంగానే ఉంది.

సరిగ్గా 71 ఏళ్ళ వయస్సులోనే పీవీజీ 1991లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టేముందు, “నాకిప్పుడు 71 ఏళ్ళు. భగవంతుడు ఇప్పుడీ అవకాశం నాకెందుకు ఇచ్చాడో తెలియదు. నాకు చేతనైనంతగా దేశానికి, ప్రజలకి మంచి చెయ్యడానికి ప్రయత్నిస్తాను” అన్నారు. నిజానికి అప్పటికే ఆయన రాజకీయాల నుండి వైదొలగి విశ్రాంతి తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు కూడా. అదీ ఎన్టీఆర్ అనబడే ఈ యుగపురుషుడికీ, నిజమైన ప్రజాసేవకుడికీ ఉన్న వ్యత్యాసం!

సరే! ఏమైతేనేం 1993 సెప్టెంబర్ 11 న ఏన్టీఆర్, లక్ష్మీపార్వతిల వివాహమయ్యింది. సారా ఉద్యమపు ఊపుతో 1994 చివరిలో జరిగిన ఎన్నికల్లో తెదేపా గెలిచింది. 1995 జనవరిలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. తొలిసంతకం సారానిషేధపు ఫైలు మీదే చేసాడు. అక్కడి నుండి 8 నెలలు నిండే సరికీ ఎన్టీఆర్ ప్రభుత్వానికి నూరేళ్ళు నిండిపోయాయి. ఈసారి నాదెండ్ల భాస్కరరావు స్థానంలో ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబునాయుడే ఉన్నాడు. ఎం.ఎల్.ఏ.లలో అధికభాగం, చిన్నల్లుడు వెంట పోయి సామ్రాట్ హోటల్ లో మకాం వేసారు. పార్టీలో లక్ష్మీపార్వతి పెత్తనం పెరిగిపోయిందన్నది పైకారణం అయ్యింది. నా చెప్పులని నిలబెట్టినా ఎన్నికల్లో గెలుస్తాయన్న ఎన్టీఆర్ అతిశయం ఏమయ్యిందో, "నా తెలుగు తమ్ముళ్ళు! బయటికి రండి” అంటూ ఎన్టీఆర్, మైకు చేత్తో పట్టుకుని సామ్రాట్ హోటల్ చుట్టూ చైతన్యరధం మీద తిరగటాన్ని ప్రజలు ప్రత్యక్షంగానూ, టీవీ లోనూ వీక్షించారు. నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచినప్పుడూ, ఇలాగే ఎం.ఎల్.ఏ.లందర్నీ క్యాంపుల్లో ఉంచినప్పుడూ, ఎన్టీఆర్ ఆ క్యాంపు చుట్టూ తిరగలేదు. ‘తెలుగుతమ్ముళ్ళారా’ అంటూ మైకుపెట్టుకు ఆరవలేదు. సుడిగాలిలా రాష్ట్రంలో తిరిగాడు. ప్రజల మధ్యకు వచ్చాడు. అలా ప్రజల మధ్యకు రావటాన్ని మీడియా బాగా కవర్ చేసింది. అలా కవర్ చేసింది కాబట్టే ఎన్టీఆర్ అప్పుడు ప్రజల్లోకి వచ్చాడు. మీడియా కథలు కథలు వ్రాసింది. అభిమానుల అత్మాహుతుల్ని పెద్దక్షరాల్లో వ్రాసింది. గవర్నర్ రామ్ లాల్ కాదు రావణ్ లాల్ అంది. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిందన్నది. అయితే 1995 లో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్ళలేదు. వెళ్తే మీడియా సపోర్ట్ ఇవ్వదన్నది అర్ధమయ్యింది గనుకే ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎం.ఎల్.ఏ.లైన తెలుగు తమ్ముళ్ళన్నా తనమాట వినకపోతారా అని మైకు పట్టుకుని సామ్రాట్ హోటల్ చుట్టూ తిరిగాడు.

నాటి నాదెండ్ల డ్రామాలో తన పాత్ర తాను అద్భుతంగా పోషించి, తెలిసి కొంత, తెలియకుండా మరికొంత, ‘కుట్రలో తన వాటా తాను’ నిర్వహించినందుకు ప్రతిబహుమతిగా ’సువర్ణముఖి’ ప్రసాదించిన ఘట్టమే సామ్రాట్ హోటల్. దానికి దర్శకుడు రామోజీరావే. అందులో – రామోజీరావుకి, అప్పటికి ‘ఎన్టీఆర్ సువర్ణముఖి’ అర్ధం కాలేదు. అసలు ’సువర్ణముఖి’ అన్న concept కూడా రామోజీరావుకి తెలీదు, అర్ధం కాలేదు. అప్పటికి మామ[ఎన్టీఆర్]ని fade out చేసి, అల్లుణ్ణి [చంద్రబాబునాయుడిని] fade in చేసుకోవలసిన ‘తన అవసరమే’ తప్ప ఎన్టీఆర్ ’అతడు చేసిన ఖర్మని అతను అనుభవించే విధంగా’ స్ట్రాటజీ తామే రచిస్తున్నామనుకోలేదు. అల్లుడికి తామిచ్చిన Assignment, ఎన్టీఆర్ కి ’సువర్ణముఖి’ అవ్వడాన్ని అప్పటికి రామోజీరావు చూడలేకపోయాడు. అందునా అవి 1992 తర్వాతి తొలి సంవత్సరాలు కదా!

ఈ వ్యవహారంలో ఎన్టీఆర్ ఎంత ఆక్రోశానికీ, ఆవేశానికీ గురయ్యాడంటే – మొన్న 2009 ఎన్నికల ముందు ఎన్టీఆర్ పెద్దల్లుడు, బాలకృష్ణకి వ్రాసిన లేఖ [పత్రికల్లో ప్రచురితమైంది] లో చెప్పబడినట్లుగా, ఆనాడు ఎన్టీఆర్ బాలకృష్ణకి “నువ్వే గనుక నాకొడుకువి అయితే చంద్రబాబుని చంపి, ఆ కత్తిని నాకు చూపించు” అనేటంత! అతడు 74 ఏళ్ళ వయస్సులోనూ తన ముఖ్యమంత్రి పదవిని, పార్టీ అధ్యక్షపదవిని, అల్లుడు ఊడబీకాడన్న కోపం, కసి, ఆక్రోశం ఎంతటి వంటే, ఆ దుఃఖంతో కొడుకుని ‘నువ్వేగనుక నాకొడుకువి అయితే నీ అక్కభర్తని చంపిరా’ అనేటంత! తాను కోరుతుంది తన కూతురి వైధవ్యాన్నే! అదీ అతడి అరిషడ్వర్గాల స్థాయి. అందునా అంత వృద్ధాప్యంలో! అదీ అతడి వ్యక్తిత్వం! [ఇక్కడ చిన్నమాట. రామాయణంలో రాముడు ఒక సందర్భంలో లక్ష్మణుడితో అంటాడు “లక్ష్మణా! ఆవేశంలో కూడా అనరాని మాటలు అంటున్నావు” అని. అంటే ఆవేశంలో కూడా కొన్ని మాటలు అనకోడదని కదా! అలాంటిది రాముడి పాత్రలు పోషించి, కనీసం ఆ పాత్ర ప్రభావం ఏపాటి ఎన్టీఆర్ మీద ఉన్నట్లు? ఎన్టీఆర్ నటుడు మాత్రమే! అతడు దేవతా పాత్రల వేషధారి మాత్రమే! యుగపురుషుడో, దైవాంశసంభూతుడో కాదు!]

ఈవ్యధతో 1996, జనవరిలో ఎన్టీఆర్ మరణించాడు. స్టెరాయిడ్స్ వాడినందునే మరణించాడో, మానసిక వ్యధతో మరణించాడో గానీ, జీవితపు చరమదశలో అపజయాన్నీ, కీర్తిచంద్రుడిలో మచ్చలనీ మూటకట్టుకుని మరణించాడు. ‘లక్ష్మీపార్వతి’ అన్న అంకమే అతడి జీవితంలో లేకపోతే ఎన్టీఆర్ కధే వేరు. ఎన్టీఆర్ అనగానే అతడి నటనా వైదుష్యం, రూప విలాసం, కీర్తికిరిటం, రాజకీయ వైభవం మాత్రమే గుర్తుకొచ్చేవి. ఇప్పుడో! ఎన్టీఆర్ ని ఎవరు ఎంతగా పొగిడినా సామాన్యుడి దృష్టిలో, చరిత్రపేజీల్లో మాత్రం అతడి జీవితకథలో అపజయం, వ్యధాపూరిత మరణం కూడా గుర్తుంటాయి.

ఈ యుగపురుషుడి రెండోభార్య ఇతడి మరణానంతరం ఇతడి జీవిత చరిత్రని ’ఎదురులేని మనిషి’ పేరుతో విడుదల చేసిందట. జీవితపు చివరి రోజుల్లో గానీ ఎన్టీఆర్ కి రామోజీరావు బలమేమిటో అర్ధం కాలేదు. అప్పటి వరకూ అతడి దృష్టిలో రామోజీరావు పత్రికాధిపతి మాత్రమే. తనకి మీడియా సపోర్టు ఇచ్చిందని మాత్రమే తెలుసు. మీడియా అధిపతిగా రామోజీరావు బలమైన వాడు అనుకున్నాడు. అంతవరకే అతడి గూఢచర్య పరిజ్ఞానం. అంతకంటే ‘ఎక్కువ’ ఎన్టీఆర్ అర్ధం చేసుకోలేక పోయాడు. అదే చంద్రబాబు నాయుడికైతే అంతకంటే ఎక్కువ తెలుసు. ఎక్కువ అర్ధం చేసుకోగలిగాడు. గూఢచర్యంలో అవగాహన, అర్ధంచేసుకోగలిగే జ్ఞానం ఎన్టీఆర్ కి లేదు. అది చంద్రబాబు నాయుడిలో ఉంది. ఎంత అర్ధం చేసుకోగలడో, అంతగా దేశద్రోహానికి తలపడగలడు. స్వంత మామకే కాదు, ఎవరికయినా వెన్నుపోటు పొడవగలిగే అవకాశవాది. తనకోసం, తన అధికారం కోసం ఎవ్వరితోనయినా చేతులు కలపగలిగినవాడు, అధికారం వస్తుందంటే దేశానికి ద్రోహం చెయ్యటానికి వెనుకాడతాడా? ఎన్టీఆర్ కి అల్లుడయ్యేటప్పటికీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ లో మంత్రిగా ఉండవచ్చుగాక! కానీ కాంగ్రెసులో ముఖ్యమంత్రి స్థానానికి ఎదగటం అంత తేలిగ్గా జరగదు. తోటివాడు, సమవయస్కుడు వై.యస్.రాజశేఖర్ రెడ్డికి అతడి 55 ఏళ్ళ వయస్సులో, అదీ మారిన రాజకీయ, గూఢచార నేపధ్యంలో వచ్చింది ముఖ్యమంత్రిపదవి.[పంచె కట్టుకుని, పాదయాత్రలు చేయగానే ముఖ్యమంత్రిపదవులు వస్తాయా? వస్తాయంటే ఈపాటికి అందరూ అదేబాటలో ప్రయాణించేవారు. ఒక కథతో ఒక సినిమా హిట్ అయితే అదే మూసలో చాలా సినిమాలు వచ్చినట్లే!] లేకపోతే ఆ సీట్ జీవితకాలంలో అతడు ఎక్కగలిగేది కాదు. ఎక్కినా మూనాళ్ళ ముచ్చటే! అదే కేసు చంద్రబాబునాయుడిది కూడా! ఫీల్డులో పడి కొట్టుకులాడగా కొట్టుకులాడగా ఎప్పటికో ఎగబాకగలిగి ఉండేవాడు. అదే ఎన్టీఆర్ కి అల్లుడవ్వటం కారణంగానే తెదేపా ప్రభుత్వంలో నెం.2 గా చలామణి అయ్యాడు. వెన్నుపోట్లు పొడవటం చంద్రబాబునాయుడికి ఉన్న ఎగ్ స్ట్రా క్యాలిఫీకేషన్. ఆ కారణంగానే రామోజీరావుకి, అప్పటికి, చంద్రబాబు నాయుడు ’కన్ను’ లాగానూ, ఎన్టీఆర్ ‘కాలు’ గానూ అయ్యారు. ఎన్టీఆర్, దెబ్బకి మటాష్ అయిపోయాడు. చరమదశలో కథ కొంత, ఎన్టీఆర్ కి అర్ధం అయ్యింది. అందుకే రామోజీరావు గురించి, “అతడెవ్వరో కూడా నాకు తెలియదు. రాజకీయాల్లోకి వచ్చేముందు అతడితో నాకు పరిచయమయ్యింది. ఆ తర్వాత మా పార్టీకి అతడి పత్రిక ఎంతో ప్రచారాన్నిచ్చింది. అతడెందుకు, నా మీద, ఆమె [లక్ష్మీపార్వతి] మీద అంత పగబట్టేడో నాకు తెలీదు. మమ్మల్ని టార్గెట్ చేసుకున్నాడు” అంటూ వాపోయాడు. ఈ వ్యధనంత అతడు పుస్తక రూపంలో ప్రచురించాడని కూడా ఇటీవల వార్తల్లో ప్రచారంలోకి వచ్చింది.

ఆ విధంగా ఎన్టీఆర్ బొమ్మని చూపెట్టి, సారా వ్యతిరేక ఉద్యమాన్ని మాధ్యమంగా తీసుకుని, తెదేపాని అధికారంలోకి తెచ్చుకున్నాక….. ఎనిమిది నెలలు తిరక్కుండా ఎన్టీఆర్ ని ఇంటికి పంపించేసి, అల్లుణ్ని సీటు ఎక్కించుకున్నాడు రామోజీరావు. ఆ తర్వాత ఇక చూస్కో! నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించే నెపంతో విదేశాలు పట్టుకు తిరిగాడు. హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుపెట్టబడ్డాడు. [ఆ పేరు పెట్టింది ఎటూ మీడియానే లెండి. మీడియా అంటే ఎవరు? ఈనాడూ, రామోజీరావు గాక?] చంద్రబాబుకు ఇమేజ్ పెంచేందుకు ’ఒకే ఒక్కడు’ వంటి సినిమాలు, సాహిత్యం సృష్టింపబడింది. ఈనాడు వంటి పత్రికల్లో ప్రభుత్వ పనితీరు గణాంక వివరాలతో, నిష్పత్తి ఆధారాలతో ‘అభివృద్ధి’ వ్రాయబడింది. ఇంకుడు గుంతల లెక్కలతో సచివాలయం అలిసిపోయింది. ముఖ్యమంత్రి పేషి అవినీతిని సెంట్రలైజ్ చేసింది. చంద్రబాబు నాయుడి హడావుడికి అంతే ఉండేది కాదు. పెట్టుబడుల ఆకర్షణ నెపంతో ప్రపంచపు అంచులదాకా, భూగోళమంతా పరుగులు పెట్టాడు. ఎటూ ముఖ్యమైన మంత్రులూ అనుచరుల బృందం కూడా వెంట ఉండేది . రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల కంటే, రామోజీరావు, నకిలీ కణికుల కోసం చేసిపెట్టిన లాబీయింగ్ కోసమే ఈ శ్రమంతా చంద్రబాబు పడ్డాడు. ఈ విషయంలో చంద్రబాబు పాత్రనీ, అతడి సువర్ణముఖినీ తర్వాత పరిశీలిద్దాం. ఇప్పటికి ఎన్టీఆర్ ఎపిసోడ్ పూర్తి చేద్దాం.

ఎన్టీఆర్ సువర్ణముఖి ఇప్పటికి మీకు బాగా అర్ధమయ్యిందను కుంటాను. నిజానికి ‘చేసిన కర్మమూ చెడని పదార్ధం’ అంటారు పెద్దలు. మంచైనా, చెడైనా అది మనల్ని , మన తర్వాతి తరాలని సైతం వదలదు. ఈ భయమే ఒకప్పుడు భారతీయుల్ని చెడు చెయ్యకుండా నియంత్రించేది. అది ఏ చట్టమూ, ఎప్పటికీ చెయ్యలేని పని. కేవలం మత విశ్వాసాలూ, జీవన సరళి, దృక్పధం మాత్రమే చెయ్యగలిగిన పని. దాన్ని చెరపటమే లక్ష్యంగా నకిలీ కణిక వ్యవస్థ పనిచేసింది. అయితే 1992 తర్వాత ఇది తిరగబడింది. ఎవరు గుర్తించినా గుర్తించక పోయినా ఇది సత్యం. మొదట్లో అంతగా ప్రస్పుటంగా కనపడకపోయినా ఇప్పుడు బాగానే ఆవిష్కృతమౌతున్న దృశ్యం! ఎన్టీఆర్ నే ఉదాహరణగా తీసుకొండి. అతడి కర్మ అతడు అనుభవించాడు. అతడి సంతానం కూడా అనుభవిస్తోంది.

అప్పట్లో, అంటే ఎన్టీఆర్ అధికారంలో ఉన్న రోజుల్లోనే, ఎన్టీఆర్ ‘స్టడ్స్ హెల్మెట్ల కంపెనీ’ వంటి వాటికి వ్యాపారపు సావకాశాలు ఇస్తూ, వారి దోపిడికి తన బ్రహ్మముహుర్తపు అయిడియాలతో ఊతనిస్తున్న రోజుల్లోనే, ఎన్టీఆర్ ఒక్కో కొడుక్కీ 200 కోట్లరూపాయల ఆస్థి కూడబెట్టి ఇవ్వాలనుకుంటున్నాడని, అందుకే ఓవైపు రెండు రూపాయలకి కిలో బియ్యం అంటూ, మరోవైపు ఇలాంటి పనులు [హెల్మెట్స్ స్టంట్స్ వంటివి] చేస్తున్నాడనీ అనుకునేవారు. అలాగే ఆస్థులన్నీ సంతానానికిచ్చి “నాదగ్గరేముంది బూడిద? నేను సన్యాసిని” అనేవాడు అతడు కూడా! 1982-83 లో బాలకృష్ణకి ’పోటీదారు సుమా’ అన్నట్లుగా నటుడు సుమన్ రైజింగ్ స్ఠితిలో ఉన్నాడు. టి.కృష్ణ దర్శకత్వంలో నేటి భారతం సినిమా అతడికి బాగా పేరుతెచ్చిపెట్టింది. రెండర్ధాల డైలాగుల సినిమాలతో బాలకృష్ణ అప్పటికి హిట్ హీరోగా మలచబడ్డాడు. దాంతో సుమన్ బ్లూబాయ్ గా, ఆడపిల్లల బూతుబొమ్మల తీసాడనో, వ్యభిచారం చేయించాడనో కేసుపెట్టబడి సంవత్సరం జైలులో ఉంచబడ్డాడు. నేటి భారతంలో ’మానవత్వం పరిమళించే మంచిమనిషికి స్వాగతం’ అంటూ సుమన్ పాత్రని పొగుడుతూ ఇతర పాత్రలు పాడే పాట ఒకటి ఉంటుంది. అతడి అరెస్టు తర్వాత ఈనాడులో కార్టూన్ వేస్తూ ’మానవత్వం మంటగలిపిన ’మహా’మనిషికి స్వాగతం’ అంటూ జైలు అధికారులు సుమన్ ని స్వాగతిస్తున్నట్లుగా ప్రచురించారు. సరే! అతడి విషయంలో ’సత్యాసత్యాలు భగవానుడికి కెరుక! సుమన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చిన వ్యక్తి. “జైలులో యోగా సాధన చేసాను. మార్షల్ ఆర్ట్స్ లో భాగంగా యోగా నేర్చుకున్నాను. అదే నన్నప్పుడు నిరాశతో పిచ్చివాడవ్వకుండా కాపాడింది” అంటూ అతడు చెప్పడం తర్వాత రోజుల్లో చదివాను.

ఆ కర్మఫలమో కాదో గానీ, బాలకృష్ణ మాత్రం కెరీర్ లో అడ్డుతొలిగించుకునేందుకు, పోటీ దారుల్ని తప్పించటం సత్యం. అతడే కాదు, అతడి తండ్రి ఎన్టీఆర్ కీ హర్ నాధ్ అనే పాత తరం నటుడు పోటీదారు అవుతాడమోనని హరనాధ్ పైన ఒత్తిడి కలగజేసి, తాగుడుకు బానిస అయ్యేలా చేసారని ఓ వినికిడి ఉండేది. సినిమా రంగంలో ప్రత్యుర్ధుల వెనుక ఈ విధమైన గోతులూ, కుట్రలూ మామూలే!

ఆ విధమైన కర్మల తాలూకూ ’సువర్ణముఖి’ - బాలకృష్ణ, బెల్లకొండ సురేష్ మీద జరిపిన కాల్పుల ఉదంతం. జైలుకు వెళ్ళకుండా ఉండేందుకు బాలకృష్ణ, తండ్రి నుండి తనకు సంక్రమించిన ఆస్థిలోనూ, తానూ జీవితకాలం సంపాదించుకున్న ఆస్థిలోనూ ఖర్చుపెట్టుకుంటూ ఉన్నాడు. జైలుకి వెళ్తేనే శిక్షింపబడినట్లా? ఏవి తమకు ధైర్యమో, ఏవి తమకు ఆశా దీపాలో, అటువంటి ఆస్థులు కరిగిపోవడం అంటే జైలుకి పోవటం కంటే పెద్ద శిక్ష వంటివే. జైలు చాలా చిన్న శిక్ష! ఆస్థులు కరిగిపోవటం అంటే ప్రాణాలు మెల్లిగా పోవటం వంటిదే. అలాంటి శిక్ష ఒక్క బాలకృష్ణకే కాదు. చాలామందికీ పడింది. బాలకృష్ణ, హరికృష్ణలు మాత్రమే కాదు ఎన్టీఆర్ మనుమలూ, మనుమరాండ్ర్లూ కూడా వారసత్వంగా ఆస్థినే గాక కర్మఫలాన్ని కూడా పొందారు, పొందుతున్నారు. ఒళ్ళు కాల్చుకుని ఆత్మహత్మచేసుకున్న ఎన్టీఆర్ మనుమరాలు ’కుముదిని’ వంటి సంఘటనలు అటువంటి వాటిలో కొన్ని మాత్రమే.

ఎన్టీఅర్ కుటుంబం 1993 వరకూ రోడ్డున పడ్డది కాదు. లక్ష్మీపార్వతితో వివాహం తర్వాత కుటుంబ కలహాలూ రచ్చకెక్కాయి. ఇప్పుడైతే అతడి కుమారుల అక్రమ సంబంధాలూ, హత్యోదంతాలూ, కూడా బహిరంగమే! ఇక అక్క ఇంటిముందు తమ్ముడు మీసాలు మెలేసి తొడగొట్టటాలూ ఉన్నాయి. ఆ దెబ్బకీ గదా పెద్దల్లుడు అప్పటి ఉత్తరాలని పత్రికలకి విడుదల చేసాడు?

లక్ష్మీపార్వతి కారణంగా ఎన్టీఆర్ స్టెరాయిడ్స్ వాడినందునే మరణించాడన్నది హరికృష్ణ చేసిన ఆరోపణ. దగ్గుబాటి వెంకటేశ్వర రావు చెప్పిన ఉదంతం ఎన్టీఆర్ బాలకృష్ణని 1995 లో బావని చంపి రమ్మన్నాడన్నది. బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ పై కాల్పుల వ్యవహారం మరొకటి, ఆ ఇంట్లోనే మరొకరి హత్య కథ! వీటిలో దేని వెనుకా ఎవరూ కారణంగా కనబడరు. కుటుంబ సభ్యులే ఇంటిగుట్టు రచ్చచేసుకున్నారు. [ఒక్క కాల్పుల వ్యవహారం తప్ప] అదీ గూఢచర్యపు తంత్రబలం. నిందించేందుకు ఎవరూ ఉండరు. అంతా స్వయంకృతంగానే కనపడుతుంది. ‘ఎవరినైనా హత్య చేస్తే నేరం. అదే ఆవ్యక్తి తనంతట తానే ఆత్మహత్య చేసుకునేలా చేస్తే అది గూఢచర్యం.’ ఈ స్ట్రాటజీ అటువంటిదే. పీవీజీ, నెం.5 విసిరిన సవాల్ ని ఎదుర్కొనే ప్రయత్నంలో రామోజీరావు ప్రేరేపించిన ఆత్మహత్యలే ఇవన్నీ. Suicidal Assignments ……. ఈ స్ట్రాటజీలో భాగం వంటివే! ఈ విధంగా ఎన్టీఆర్ కథ ముగిసింది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

4 comments:

కోడి గుడ్డుకు ఈకలు బాగానే పీకుతున్నారు గానీ,
పీవీ తన ఆత్మ కథలో మీ మీ అత్యంత ముఖ్యమైన లేఖ గురించీ, కుట్ర గురించీ లేశమంతైనా హింట్ ఎందుకివ్వలేదంటారు?

చావాకిరణ్ గారు,
పీవీజీ తన ఆత్మకథని తాను ప్రధానమంత్రి అవ్వటం వరకే మొదటి భాగంగా వ్రాసారు.పైగా అది పూర్తిగా ఆత్మకథకూడా కాదు. రచయిత తన కల్పనాయదార్ధాల సమ్మిశ్రణ సమన్వయాలతో రూపొందించింది. దీన్ని బట్టి చూస్తే మీకు చదివింది, 'ఏదీ' అర్ధం కాదు కాబోలు! మరోసారి సరిచూసుకోగలరు.

meeru cheppina prakaram, ysr kooda raamoji ki sahayam cheyali like nedarumalli. kaani ysr hayaamlone ramooji baaga expose ayyadu (adi kortu gummalu ekki digetantha)...

kaastha vivaristhara?

తప్పకుండా. నా తదుపరి టపాలోనే వివరిస్తాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu