ఇక నకిలీ కణికుల అనువంశీయులకి ఔరంగజేబు అంటే కొంత ప్రీతి. బహుశః ‘తొలినాళ్ళల్లో తమ ప్రాభవం పెరిగేందుకు అతడు తమని ఆదరించటమే కారణం’ అన్న భావన కావచ్చు. అందుకే అతడి గురించి చాలా పాజిటివ్ ప్రచారం ప్రజా బాహుళ్యంలో ప్రవేశపెట్టారు. ఔరంగజేబుతో పోలిస్తే నకిలీ కణికులకి మరెవ్వరి మీద, అంత ప్రీతి ఉన్నట్లు కన్పించదు. బ్రిటన్, రష్యా, జపాన్, అమెరికా ఎవరి మీదా అంత ప్రీతి లేనట్లే కన్పిస్తుంది. పాక్ మాత్రం పంచప్రాణాలనుకోండి. అంటే తమకంటూ ఓ అడ్డా కావాలి గదా! ఇప్పటికైతే పాక్ నకిలీ కణికులకి బహిఃప్రాణమే! అలాగే ఈ నకిలీ కణికులకి హైదరాబాదు పంచప్రాణాలు గానీ, హైదరాబాద్ నిజాములు, ఔరంగజేబు అంత అభిమానపాత్రులు కారు. నిజాములన్నా, వారి సేనాని, ముఖ్యాధికారి అయిన ఖాసీం రజ్వీ అన్నా, రజాకార్లన్నా ప్రేమే! ఖాసీం రజ్వీ నుండి అధికార పగ్గాలు స్వీకరించిన MIM నేత [ఈ మధ్యే పోయినాడు లెండి] సలాఉద్దీన్ ఒవైసీ అంటే ఇంకా ప్రేమే. అయితే నిజాంల మీది అభిమానం, ఔరంగజేబు మీద ఉన్నంత కాదు. బహుశః నిజాములు తమని ఔరంగజేబు ఆదిరించినంతగా ఆదరించలేదేమో!

పాకిస్తాన్ తప్పితే ఇతర దేశాలు, అంటే బ్రిటన్, రష్యా, జపాన్, అమెరికాలను నకిలీ కణికులు ఉపయోగించుకున్నంత కాలం పైకి ఎత్తి తర్వాత ఎత్తికుదేసారు. బ్రిటన్ విషయంలో ఇది మరింత ప్రస్పుటం. ఎందుకోగాని నకిలీ కణికులకి బ్రిటన్ రాజవంశీయుల మీద కొంత కోపద్వేషాలు ఎక్కువే! బహుశః ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలోనూ, ఆ తర్వాత కంపెనీ వారి నుండి భారతదేశ పాలానా పగ్గాలు బ్రిటిషు రాచకుటుంబానికి కాక తమ చేతికి వస్తాయని అనుకున్నారు కాబోలు. అది కుదరక పోయింది. ఏమయినా బ్రిటన్ రాజవంశాన్ని అప్రదిష్ట పాలు చేయటంలో మాత్రం నకిలీ కణికులు అత్యుత్సాహం చూపారు. ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన అందగత్తె, డయానా సుందరి, యువరాజు భార్య అవ్వడం, వారి ప్రణయపు గొడవలూ, సంసారపు వివాదాలూ అన్నీ, ప్రపంచమీడియాకు కాసులు పండించాయి. ఒక్క దెబ్బకి రెండుపిట్టలన్నట్లు బంకింగ్ హోం పాలెస్ ను దుర్గంధం పాలు చేసాయి. ఆ తీరుతెన్నులు, నాడు డయానా సుందరి భర్తకి విడాకులిచ్చి, మరో ప్రియుడితో షికారు వెళ్తూ మీడియా కంటబడి, మీడియా చేత వేటాడబడి, మరణించటంలోనూ ప్రతిఫలించాయి. నేడు ప్రిన్స్ ఛార్లెస్ పుత్రులు చిన్న ’యువరాజుల’ ప్రణయోదంతాల ప్రచారంలోనూ ప్రతిఫలిస్తున్నాయి.

రష్యా, USSR గా ఉన్నరోజుల్లో వారి జిమ్నాస్టిక్ ప్రతిభ దగ్గర నుండి అంతరిక్ష ప్రయోగాల వరకూ ఒకటే ప్రచారం, ఒకటే ఊదర! అంతర్జాతీయ ఆటల్లో ఉత్ర్పేరకాల[డోపింగ్] వాడకం గురించిన రహస్యం 1992 తర్వాతే బాగా వెలుగులోకి వచ్చింది. అంతకు ముందు ప్రపంచ ప్రజలందరూ, నాటి USSR ఆటగాళ్ళని, కళ్ళింతచేసుకుని అబ్బురాన చూసిందే! ఇక జపాన్ సంగతి సరేసరి! ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిలో జపాన్ ని కొట్టేవారెవరూ లేరు. ఇప్పుడు? ఇప్పుడు రష్యా, జపాన్ ల సంగతి తెలిసిందే! ఏ దేశాల్నైనా ఎత్తి కుదేయటమే ఇక్కడి స్ట్రాటజీ!

‘ఎవరైనా ఈ స్ట్రాటజీని గుర్తిస్తున్నారు, తమ రచనల్లోనో, కళారూపాల్లోనొ ప్రకటిస్తున్నారు, ప్రజలకి దీన్ని తేటతెల్లం చేస్తారు’ అనుకుంటే చాలు – ఇక నకిలీ కణికు వ్యవస్థ తన ప్రతాపాన్ని ఆయా వ్యక్తుల మీద చూపిస్తుంది. వాళ్ళ గురించి రకరకాల కథలు ప్రచారం అవుతాయి. ఆ వ్యక్తుల చుట్టు నానా వివాదాలు సృష్టింపబడతాయి. ఎన్నో ఒత్తిళ్ళు పుడతాయి. మొత్తంగా వ్యక్తుల మీద వ్యవస్థ పనిచేస్తుంది. చివరికి ఆ ఒత్తిళ్ళు భరించలేక ఆయా వ్యక్తులు అనారోగ్యం పాలై [ఒకోసారి రోగం పుట్టించబడుతుంది కూడా] నాశనమౌతారు, లేదా వ్యసనపరులై నాశన మవుతారు. వ్యక్తిగతంగా ఓటమి పాలౌతారు. ఏ భాషలో, ఏ రాష్ట్రంలో , ఏ దేశంలో చూసినా, ఇందుకు ఎందరో ఉదాహరణలై కన్పిస్తారు.

నిజానికి నకిలీ కణిక-6, ఐరాస ముసుగులో, తమకు ముందు నుండీ ఉన్న గూఢచార వలయాన్ని, వ్యవస్థనీ, మరింత పటిష్ఠపరచి నకిలీ కణిక-7 చేతికి ఇచ్చాడు. కింగ్ మేకర్ గా ఉన్న తము, ఎప్పటికైనా ‘కింగ్’ కావాలి… ఇదీ లక్ష్యం. కింగ్ అంటే ఒకదేశానికి కాదు, ఏకంగా ప్రపంచానికి ‘జగజ్జేత’ అవ్వటమే లక్ష్యం. భక్త ప్రహ్లాద సినిమాలో హిరణ్య కశికుడు, నారద మహర్షి “హిరణ్య కశ్వపా! ఎటూ నీకునూ అష్టదిక్కులనూ పాలించటానికి దిక్పాలకులు కావాలి. వీరికి అనుభవం ఉన్నది. కావున వీరిని నీ ఆజ్ఞానబద్దులై మెలగవలసిందిగా ఆజ్ఞాపించి, ఆయా పదవులలో కొనసాగించవచ్చు గదా?" అంటాడు.

అలాగే ఈ నకిలీ కణికులకి, తమ ఆజ్ఞానుబద్దులై మెలగుతూ, ఆయాదేశాల్లో, ఐరాసలో కీలక స్థానాల్లో తమ ఏజంట్లు ఉండాలి. వ్యక్తుల దగ్గరి నుండి ఏజంట్ల వరకూ, ప్రజల దగ్గర నుండి గూఢచార ఏజన్సీల వరకూ… ‘విభజించు – పాలించు’ అన్న కణిక నీతే అమలు చేయబడుతుంది. అదీ ఎవరూ అర్ధం చేసుకోలేనంత నేర్పుగా! అందుకోసం కూడా, జనజీవితంలో ఒక అనవసరపు హడావుడీ, అనివార్య పరుగూ సృష్టింపబడుతోంది. తీరిక ఉంటే ఆలోచించే ఓపిక ఉంటుందేమో! అందుకే, తీరిక లేకుండా చేస్తే…? ఒత్తిళ్ళకే సగం ఛస్తారు. కాబట్టి జీవచ్ఛవాల్లా బ్రతుకు ఈడుస్తూ, నకిలీ కణికుల చేతిలో, వారి ఏజంట్ల చేతిలో, ఆదాయవనరుల్లా, ప్రాణం ఉన్న యంత్రాల్లా తయారవుతారు.

ఈవిధంగా నకిలీ కణిక-6 వరకూ, రమారమి ఆరుతరాలు వారు నిర్మించి, పటిష్ఠపరచి ఇచ్చిన గూఢచార వలయం నకిలీ కణిక-7 చేతికి వచ్చింది. వారి అంచనా, ప్రణాళికా ప్రకారం, ఇతడి హయాంలోనే తమ నిగూఢ ఉనికి బహిరంగ పరచుకుంటూ, ‘జగజ్జేత’గా అవతరించాలి. అందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు దశల వారీగా, తమ పధకం ప్రకారమే జరుగుతున్నాయి. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాలు చేతికి వచ్చినా, ఇండియా మాత్రం కొఱకు రాని కొయ్యగా ఉన్నది.

అందులో భాగంగానే నకిలీ కణిక వ్యవస్థలోని వారసుడు లేదా ప్రధాన ఏజంట్, స్థానిక పత్రికాధిపతి అవతారం ఎత్తడం జరిగింది. తమ గూఢచర్య వ్యవస్థ ఊపిరి పోసుకున్నదే కంచర్ల గోపన్న కాలం నుండీ కాబట్టి, తానీషా కల నాటకంలో తము సృష్టించిన దేవుడి పాత్రపేరు[రామోజీ] పెట్టుకోవటమూ జరిగింది. [సాధారణంగా ఒక ఏజంట్ ఉనికి బహిర్గతమైతే, సదరు ఏజన్సీ ఆ ఏజంట్ ని నిర్వీర్యం చేసేస్తుంది. రామోజీరావు విషయంలో నెం.10 వర్గం ఒడ్డిపోరాడుతోంది గాని, అతడిని ఒదులుకోవటం లేదు. దీన్ని బట్టి చూస్తే ఇతడు నకిలీ కణికుల ప్రధాన ఏజంట్ కాదు, ఇతడే నకిలీ కణికుల అనువంశీయుడు అయి ఉండాలి.] పైకి స్థానిక పత్రికాధిపతే గాని, ఆయా రంగాల్లోని వ్యక్తులకీ, అందునా కీలక వ్యక్తులకి, తమ రంగంలో అతడే ‘గాడ్ ఫాదర్’ అని తెలుసు, లేదా అతడి ఏజంట్లే అతడి ప్రతినిధులుగా గాడ్ ఫాదర్ పాత్ర నిర్వహిస్తారని తెలుసు. దానాదీనా, అతడి అశీర్వాదం ఉంటే ఆయారంగాల్లో తమకి ’సీన్’ వస్తుంది, లేకుంటే ‘మటాష్’ అని తెలుసు. ఇందుకు రాజకీయ రంగం, సినిమారంగం, వాణిజ్యరంగం, విద్యారంగం… గట్రాగట్రాలలో ఏదీ అతీతం కాదు.

ఇక్కడ మీకు ఓ ఉదాహరణ ఇస్తాను. ఎవరికీ తెలియని, నిగూఢమైన, అత్యంత బలమైన గూఢచార వలయం, వ్యవస్థ, ‘డీవిడీ ప్లేయర్’ వంటిదనుకొండి. అది ఒక్కరోజులో నిర్మించింది [Assemble]చేసింది కాదు. దాదాపు 350 సంవత్సరాల పైబడ్డది. ఒక వ్యక్తి నిర్మిచిందీ కాదు. దాదాపు ఆరేడు లేదా ఏడెనిమిది తరాలు నిర్మించింది. ఇది ఎవ్వరూ తెలుసుకోకుండా, గుర్తించకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. హిందూ పురాణాలు, ఇతిహాసాలే కాదు, గూఢచర్య జ్ఞానం పుష్కలంగా ఉన్నఎన్నో సంస్కృత గ్రంధాలు నాశనం చెయ్యబడ్దాయి, ‘నిరాదరణకు గురవుతున్నాయన్న’ ప్రచారపు ముసుగులో అదృశ్యం చెయ్యబడ్డాయి. ఇక ప్రజల్లో తార్కిక జ్ఞాన వినాశనం తెలిసిందే! ఈ విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని, అత్యంత బలంగా, సమర్ధంగా, తయారు చేసిన నకిలీ కణికుల గూఢచార వలయమూ, వ్యవస్థా, ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోని గూఢచార సంస్థల్లో, రాజకీయ ఆర్ధిక వాణిజ్య వ్యవస్థల్లో, తమ ఏజంట్లని, చడీ చప్పుడు గాకుండా ఏర్పాటు చేసుకుంది. అచ్చంగా ’సందట్లో సడేమియా’ అన్న సామెత మాదిరే! పైకి చూడటానికి ఆయాదేశాల సంస్థలకి చెందిన వ్యక్తుల్లా కనిపించినా, అంతర్గతంగా వారు పనిచేసేది నకిలీ కణికుల కోసమే. ఆవిషయం వారికీ తెలియనంత పచ్చిస్వార్ధం వారిది – ‘ఎవడి కోసమైతేనేమిటి, తమ కార్యకలాపాల మూలంగా ఎవరికి లేదా ఏదేశానికి నష్టం, కష్టం కలిగితే నేమిటి, తమ ప్రయోజనాలు తమకి నెరవేరుతున్నాయి, తమకు భారీ ఆదాయం వస్తూంది. అంతే!’ అనుకునే పచ్చిస్వార్ధం వారిది.

ఇలాంటి ఈ ప్రచ్ఛన్న గూఢచార అంతర్లీన వలయం నకిలీ కణికులు తరతరాలుగా కష్టపడి నెలకొల్పినట్టిది. దీన్ని డీవీడీ ప్లేయర్ అనుకుందాం. నిర్మాణ దశపూర్తయ్యింది గనుక నకిలీ కణిక-7 చేతికి ఆ డీవీడీ ప్లేయర్ యొక్క రిమోట్ కంట్రోలు వచ్చింది.

ఉదాహరణకి మనకి డీవీడీ ప్లేయర్ ని [Assemble చెయ్యటం] నిర్మించటం రాదు. ఎక్కడ ఏ డయాడ్ అమర్చాలో, ఏ ట్రయోడ్ అమర్చాలో, పిసిబి ని ఎలా కనెక్ట్ చెయ్యాలో MCB కి ఎలా అనుసంధానించాలో…. ఏవీ తెలియదు. కానీ రిమోట్ కంట్రోలుతో డీవిడీని ఉపయోగించటం తెలుసు. ఏ బటన్ నొక్కితే Fast Farward అవుతుందో, ఏ బటన్ నొక్కితే ఇంకా వేగంగా Fast Farward అవుతుందో, అలాగే ఏ బటన్ నొక్కితే Backward అవుతుందో, ఏ బటన్లు నొక్కి వాల్యూమ్ పెంచాలో తగ్గించాలో తెలుసు. Pause చెయ్యడం తెలుసు. ఇంకా డీవిడీ మీద Remote Control తో రకరకాల విన్యాసాలు చెయ్యటం వచ్చు.

సరిగ్గా నకిలీ కణిక-7 పరిస్థితి ఇదే! ఇతడికి రిమోట్ తో అపరేట్ చెయ్యటం వచ్చు. మహా వస్తే డీవిడీ ని రిపేర్ చెయ్యటం కొద్దిగా వచ్చు. డీవిడీని Assemble చెయ్యటం మాత్రం ఖచ్చితంగా రాదు. ఎందుకంటే – తరతరాలుగా, ఆయా కాలమాన పరిస్థితులలో తగిన రీతులలో ప్రతిస్పందించి, తయారు చేసిన డీవిడీ అది, వ్యవస్థ అది. అందునా ప్రపంచవ్యాప్తంగా, సమాజంలో, ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా చిక్కుముడులు, పీట ముడులు వేసి, ద్వంద్వపూరితంగా, మొత్తం సమాజాన్ని గందరగోళంగా తయారు చేసారు. ఒకవేళ ఎవరయినా దీనిని కనిపెట్టినా, పరిష్కారంగా ఏమీ చెయ్యలేని పరిస్థితిని కల్పించారు. అందునా విజయపు తీరానికి చేరుతున్నామనుకున్నప్పుడు కొంత అతిశయమూ, అతిశయించిన ఆత్మవిశ్వాసమూ, పర్యవసానంగా మరికొంత అహంకారమూ కలగటం సహజం. ఫలితంగా, కొంత ’ఫర్వాలేదులే’ అనుకునే నిర్లక్ష్యమూ లేదా సాచాటూ వస్తాయి. మరికొంత బద్దకము వస్తుంది.

అందునా నకిలీ కణిక-6 మరియు నకిలీ కణిక-7ల చేతిలో ఎన్నో దేశాలు పైకి ఎత్తబడ్డాయి, ప్రయోజనం నెరవేరాక, ఎత్తి కుదేయబడ్డాయి. అలాగే ఎన్నో ’ఇజాలు’ ఉవ్వెత్తున ఆదరింపబడ్డాయి, ఆపైన కుప్పకూలిపోయాయి. ఇజాలలో నిజాలు లేవని ప్రజలు తెలుసుకోవాల్సి వచ్చింది. ఎందుకుంటాయి చెప్పండి? నిజమైన ఇజాలలో సిద్దాంతాలు ఉంటాయి. అందులో ఏలోపాలు ఉండవు. అయితే ఆ ఇజాల అమలుతీరులో మొత్తం నకిలీ కణికుల స్ట్రాటజీనే ఉంటుంది. ఇక సదరు ’ఇజమే’ విఫలం చెందక, కుప్పకూలకా ఏంచేస్తుంది? అదే ఇప్పుడు భారత్ లోని ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న స్థితి. 1992 వరకూ మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొన్న స్థితి. USSR లోని సామ్యవాదం 1990 కు ముందు ఎదుర్కొన్న స్థితి. నేడు అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం ఎదుర్కొంటున్న స్థితి ఇదే!

ఈ విధంగా ప్రపంచ సంఘటనలకి, ప్రపంచ ప్రజలందరూ తాము మీడియా ముసుగులో చూపిస్తున్న పైకారణాలని [over leaf reasons] ని నమ్ముతుండగా, అసలు కారణం, కార్యకారణ సంబంధం, తమకి మాత్రమే తెలిసి ఉండటం ఎంత గొప్ప, ఎంత మజా! దీనికి ఉదాహరణ చెప్పాలంటే నిన్నటి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు! మీడియా, కొన్నిసార్లు ముస్లింల ఓట్ల మూలంగా కాంగ్రెస్ గెలిచిందనీ, కొన్నిసార్లు 108,ఆరోగ్యశ్రీ సేవల వంటి పధకాల మూలంగా గెలిచిందనీ, [దేశమంతా ఈ పథకాలు అమలు చేయలేదన్నది ఇక్కడి గమనార్హం] కొన్నిసార్లు ప్రజలు ఇతర ప్రతిపక్షాలను వేటినీ నమ్మలేక, కేవలం కాంగ్రెస్స్, సోనియా గాంధీ మాత్రమే దేశాన్ని సుస్థిరంగా, భద్రంగా కాపాడగలరని భావించి ఓట్లేసి గెలిపించారనీ ప్రచారించింది. నిత్యావసరాల ధరలు ఆకాశానికెక్కడాన్ని ప్రజలు పట్టించుకోలేదంది. 1984 లో ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీ అల్లర్లకి బాధ్యుడన్న నిందనుండి, నేరం నుండి, విచారణ నుండి, జగదీష్ టైటర్లకి సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చారని మండిపడ్డ సిక్కులు, కేంద్రహోంమంత్రి చిదంబరం మీదకి బూటు విసరడాన్ని కూడా విస్మరించి, కాంగ్రెస్ పట్ల ద్వేషాన్ని విస్మరించి మరీ పంజాబీలు, కాంగ్రెస్ ని పంజాబ్, ఢిల్లీ, హర్యానాలలో గెలిపించారని ప్రచారించింది. ఈ కారణాలని, ఇలాంటి కారణాలని, అందరూ పెద్దగా పట్టించుకోకుండానే ’అవును కామోసు’ అనుకుంటున్నారు. అసలు కారణం మాత్రం [EVM ల Tamparing దగ్గర నుండి, అందుకు దారితీసిన పరిస్థితుల దాకా] తనకి, తన అంతరంగికులకీ మాత్రమే తెలిసి ఉండటం నకిలీ కణిక-7 కి గర్వకారణమే కదా! అయితే ఈ గర్వకారణం ఇప్పుడు మహాబాధా కారణంగా పరిణమించినట్లుంది. అదే ఒకప్పుడైతే కేవలం గర్వకారణమే కాదు, తిరుగులేని ధీమాతో కూడుకున్నది. సరే! ఇదంతా 1992 తర్వాతి పరిస్థితి. అంతకు ముందరైతే నకిలీ కణిక-7 కి తిరుగులేదు. ఇప్పుడంటే ఇతడి వర్గం అంటే నెం.10 వర్గానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న నెం.5 వర్గం ఉంది గానీ, అప్పట్లో నకిలీ కణిక వ్యవస్థ అన్నదే ఒకటి ఉందనీ గానీ, దాని తీరుతెన్నుల గురించి గానీ, పూర్తి అనుమానాలూ, అవగాహనా ఎక్కడివి? ఎవరికి వారు, తమ దేశం మీద ఫలానా ఫలానా శతృదేశాలు కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాయనే అనుకున్నారు. Divide and Rule Policy అని పిలవబడే కణిక నీతి ప్రభావం ఇది.

దీనిని అతిక్రమించి చూడగలిగిన వారిలో ప్రధముడు పీవీనరసింహారావు. ఆ తెలుగుమేధావి, ప్రపంచవ్యాప్తంగా, ఆయాదేశాలలో, తమదేశం పట్ల నిబద్దతా, నిజాయితీ, దేశభక్తీ గల వారికి, ఈ నకిలీ కణిక వ్యవస్థ గురించి తెలియజేసి, పరిశీలనలు, పరిశోధనలతో నిర్ధారణ చేసి, అందరిలో నుండి కొందరినైనా, కొంత వరకైనా, సమైక్య పరచిన, సంఘటిత పరచిన కారణంగానే, నకిలీ కణిక వర్గం[నెం.10]కి ఇంతగా ఎదురుదెబ్బలు తగలటం మొదలైంది. అలా సంఘటితమైన వ్యక్తులు, శక్తులూ నెం.5 వర్గమైంది. ఇప్పటికి 17 ఏళ్ళుగా పరిణతి చెంది, బలపడింది. మొదట్లో నెం.5 వర్గపు బలం ఎవరికీ బహిర్గతం కాలేదు. లోలోపల గూఢచర్యంలో మాత్రం తెలిసింది. అందుచేతే నకిలీ కణిక వ్యవస్థ లోని ఏజంట్ లేదా నకిలీ కణిక-7 అయిన రామోజీరావుకీ, అతడి సోదరీతుల్యమైన అంటే అంతగా అంతరంగిక ఏజంట్ అయిన సోనియా గాంధీకి పీవీజీ అంటే అంతకోపం! ఆయన మరణించాక సైతం, భౌతికకాయాన్ని అవమానించేంత కోపం! 2004 లో, క్రిస్మస్ మరు నాడు, అప్పటికి ముందు రోజు అంత్యక్రియలు జరపబడిన పీవీజీ భౌతిక కాయం సరిగా కాలలేదంటూ, ఆపాటి శ్రద్ధా భక్తులు కూడా ఎవరూ చూపలేదంటూ, ఈనాడు [మహాదానందంగా?] తొలిపేజీలో, పావుభాగానికి సరిపడా సైజులో శీర్షీక, మరోపావు భాగానికి సరిపడా ఆయన కంకాళంతో ఫోటో ప్రచురించి మరీ, అర్ధపేజీ వార్త వ్రాసింది. ఆయన భౌతికకాయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడే రామోజీరావు కళ్ళల్లో ’ఇక చూస్కో నా తడఖా’ అన్న భావం, క్రౌర్యం ఉన్నాయి. [ఆరోజు ఈనాడులో ప్రచురింపబడ్డ ఫోటోలో స్పష్టంగా చూడవచ్చు]. అయితే క్రిస్మస్ మరురోజు, ఈ వార్తా, ఫోటోలతో ఈనాడు పేపరు, ప్రజల చేతుల్లో కొచ్చేసరికే, తమిళనాడులోని కడలూరు దగ్గర సునామీ ఉధృతి వేలప్రాణాలని బలిగొంది. ఆ తాజా, సంచలన, విషాద పూరిత వార్త కారణంగా, ఎలక్ట్రానిక్ మీడియా వరదలో ప్రింట్ మీడియా కొట్టుకుపోయింది. అలాంటి బాధాకర స్థితిలో శవరాజకీయాలు చేస్తే మరింత స్పష్టంగా తాను Expose అవుతాడు గనుక, పాపం రామోజీరావు, ఇక తప్పనిసరై, మర్నాటికి తానూ సునామీ రాగం అందుకుని, తదనుగుణంగా వార్తలు వ్రాసాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

0 comments:

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu