ప్రజల్ని భయభ్రాంతుల్ని చెయ్యడం కోసం పుకార్లు పుట్టించటంలో కూడా మీడియా దిట్ట. ’ఓ స్త్రీ రేపురా!’ గట్రాలన్న మాట. మన రాష్ట్రంలో ఇలాంటివైతే, పరరాష్ట్రాల్లో, పరాయి దేశాల్లో ఇలాంటివే పేరు మార్పుతో, భాషమార్పుతో కోకొల్లలు. [ఉదా: ఆ మధ్య ఢిల్లీలో ఏదో వింత ఆకారం మేడ మీద నిద్రపోతున్న వాళ్ళమీద దాడి చేస్తున్నదని విపరీత ప్రచారం చేసారు. గాయపడ్డవాళ్ళు కూడా ఉన్నారు. దానిని పట్టుకున్నది లేదు నిరూపించిందీ లేదు. తరువాత ఆకస్మాత్తుగా ఆ వార్తలు ఆగిపోయాయి.] ‘ఎందుకయ్యా భయభ్రాంతుల్ని చెయ్యడం?’ అంటే… పిరికివాడు చచ్చినట్లు పడుంటాడు, ఎదురు తిరగడు. ధైర్యవంతుడు తిరగబడతాడు. అందుకే వీలయినంతగా ప్రజల్లో భయాందోళనల్ని ప్రేరేపించడం, నకిలీ కణిక వ్యవస్థలోని నేటి 7వ తరం అమలుచేస్తున్న స్ట్రాటజీ! సినిమాల్లో డబ్బున్నవాణ్ణి చూసి భయపడమని ఇంజెక్ట్ చేస్తుంటారు. చెడ్డవాడికి, డబ్బున్నవారికి, డబ్బున్న చెడ్డవాడికీ తెగ భయపడి చావమనే చెబుతారు. చివరికి ఎదిరించే హీరో సైతం, ఆ ‘డబ్బున్న చెడ్డవాణ్ణి’ ఎదిరించిన పాపానికి నానావెతలూ పడి, చావుతప్పి కన్నులొట్టపోయినట్లుగా సినిమా చివర్లో గెలుస్తాడు. ఇక రోగాల పేరుతో భయపెట్టడం అయితే అవధులు లేనట్టిది. ఫలానా జంతువు లేదా కీటకం అంటే జుగుప్స, భయం ఉంటే, అది ఫలానా ఫోబియో, నలుగురితో మాట్లాడాలంటే బెరుకుంటే ఫలానా సిండ్రోమ్…. ఇలా మనిషి యొక్క ప్రతీ భావనకీ ఏదో ఒక జబ్బు పేరు, XYZ mental disorder లేదా ABC సిండ్రోమ్ చెబుతారు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్ట్రాటజీలో మార్పులేదు. ’స్థానికం’ నుండి అంతర్జాతీయంగా, దేశాలకి, భాషలకి, అతీతంగా జరిగే, జరుగుతున్న అనేక స్ట్రాటజీలలో ఇదీ ఒకటి. భగవద్గీత ఇలాంటి లక్షణాలు మానవులలో సహజంగానే ఉంటాయి కాబట్టి, వాటినన్నింటిని దాటి పరిపూర్ణమైన వ్యక్తిగా మారాలని చెబుతుంది. అంతేగాని ‘ఇవన్నీ రోగాలు’ అని ఎప్పుడూ చెప్పదు. ఒకసారి ఆలోచించి చూడండి. హాలీవుడ్ సినిమాలలో, పెద్ద ఇంటిలోకి హంతకులు వచ్చి నానా భీభత్సం చేసి, ఇంటి వారిని క్రూరంగా హింసించి, అఘాయిత్యాలు చేయటం లాంటివి చూపుతారు. అలాంటి సినిమాలు చూసిన పిల్లలు భయందోళనలు చెందరా? అవి రుగ్మతలుగా పరిణామం చెందవా? అలాగే ఇలాంటి సీన్లలో దయ్యాలని చూపి, భయాందోళనలు రేపటం! ఇవీ అంతే. రుగ్మతలనే కలగజేస్తాయి. ఈ జాడ్యం ఈమధ్య ఇండియాలో కూడా పెరుగుతుంది.

ఇలాంటిదే ప్రజల్లో తార్కిక జ్ఞానాన్ని నశింప చేయటం కూడా! ఇందుకు బాగా పనికి వచ్చేది సినిమా, టీవీ, గట్రా మీడియానే. అనగా అనగా ఒకరాజు, రాజుకు ఏడుగురు కొడుకులు…. ఏడుగురు వేటకెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండలో పెట్టారు… కథ, అమ్మ మనకి చెప్పే తొలికథ. తరతరాలుగా ఇది పిల్లల్ని, బాల్యం నుండీ చేప ఎండక పోవడానికి ఎన్ని కారణాలుండవచ్చు, ఎంతగా కార్యకారణ సంబంధం ఉంటుందో, చివరికి ‘నా బంగారు పుట్టలో వేలుపెడితే నేను కుట్టనా మరి కుట్టనా’ అన్న చీమ చివరి డైలాగ్ తో పూర్తయ్యే కథ, పిల్లల్ని ఎంతో ఉత్తేజపరుస్తూ మరీ బోధిస్తుంది. అదే సినిమాల్లో అయితే, హీరో అమాంతం వందమందిని కొట్టేస్తాడు. ఎన్ని ఇనపరాడ్లతో కొట్టినా, హీరోకి ఏంకాదు. అధవా డొక్కలోనో, గుండెల్లోనో కత్తో, బుల్లెటో గుచ్చుకున్నా కూడా, హీరో ఎర్రటి కళ్ళు, నెత్తుటి ఒళ్ళు వేసుకుని క్లైమాక్స్ దాకా ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. నేలమీద నుండి అమాంతం భవనాల రెండో అంతస్థుకో, నాలుగో అంతస్థులోకో గెంతేయగలడు. న్యూటన్ గురుత్వాకర్షణ సిద్దాంతం ఏమవుతుందోమరి? అంతేకాదు, హీరో ఒక్క రౌడీగాణ్ణి కొట్టాడంటే, వాడు పది గజాల దూరమో, వంద గజాల దూరమో గాలిలో గిరికీలు కొట్టుకుంటూ పోయిపడతాడు. ఏ భౌతిక సూత్రాల ఆధారంగా ఇదంతా జరుగుతుందో చచ్చినా అర్ధంకాదు. అదే అంటే – “అది జస్ట్ సినిమా! ఇక్కడ లాజిక్కులు అడగకూడదు. అది కేవలం వినోదం కోసం” అంటారు. [ఈ వాదన 1975 to 1990ల్లో చాలా ఎక్కువగా ఉండేది] మరి అదే హిందూ పురాణాల్లో, ఇతిహాసాల్లో భగవంతుడి మహిమలూ, లీలలూ ఇత్యాది విషయాల్లో మాత్రం యమ తర్కాలు, లాజిక్కులూ తీస్తారు. మతం, మత గ్రంధాలు, పురాణ ఇతిహాసాలు మనుష్యుల్లో మంచిచెడ్డలూ, పాప పుణ్యాల పట్ల, కొన్ని నమ్మకాల్ని, కట్టుబాట్లని నిర్మిస్తాయి. మరి వాటి విషయంలో “అవి పురాణాలు, ఇతిహాసాలు. నీతిని పెంచేందుకు, మంచిచెడ్డలు అర్ధం చేసుకునేందుకు చెప్పబడ్డాయి. వాటిల్లో లాజిక్కులు అడగకూడదు” అని అనుకోలేదేం? ముఖ్యంగా రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం లాంటి గ్రంధాలు విరజిమ్మిన విషాలలో ఇలాంటివి ప్రముఖమైనవి. రామాయణ విషవృక్షపు కుటిలత గురించి Coups On World లోని Coup on Indian Epics లో వివరంగా వ్రాసాను. నీతిని, మంచిని బోధించే ఇతీహాసాల విషయంలో తార్కిక లోపం ఉంది! చెడుని, విశృంఖలతనీ వ్యాపింపచేసే సినిమాల విషయంలో తర్కం అడక్కూడదు. ఎంత వితర్కం ఇది?

ఈ స్ట్రాటజీ రూపకర్తలు నకిలీ కణిక అనువంశీయులే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశ పరిస్థితులైనా ప్రజల దృక్పధాన్ని అనుసరించే ఉంటాయి. రూసో, ఓల్టేర్ ల భావాలు ఫ్రెంచి వారిని ఉత్తేజపరిచినా, హెగెల్ ల భావాలు జర్మనీయుల్ని ప్రేరేపించినా, గాంధీజీ అహింసా వాదం భారతీయుల్ని ఉర్రూతలూగించినా, పర్యవసానం ఆయాదేశ చరిత్రల్లో కొత్త అధ్యాయాల్ని సృష్టింపబడటమే. ఇక్కడ ఆయుధాలూ, సాధన సంపత్తి విలువలేనివి. కేవలం మనుషుల భావాలు, దృక్పధమే తిరుగులేని ఆయుధం. దీన్ని బాగా అర్ధం చేసుకున్నారు గనుకనే నకిలీ కణికుల అనువంశీయులు Public Attitude [ప్రజల దృక్పదం] మీద ’పదే పదే అదే ప్రచారంతో’, తమ ముద్ర వేసారు. ఇప్పటికీ అదే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ప్రజల్లో భయందోళనలు నింపటం, పిరికితనం నూరిపోయటం, తార్కిక జ్ఞానాన్ని నాశనం చేయటం వంటి స్ట్రాటజీలు అందులోని భాగాలే. ఇక విభజించి ప్రచారించు అన్నది అన్నిట్లోనూ అంతర్లీనంగా ఉన్నదేనయ్యె!

ఇక్కడ మీకు ఒక తాజా ఉదాహరణ, దృష్టాంతం చెబుతాను. ఇటీవల ఆస్ట్రేలియాలోనూ, అమెరికా లోనూ భారతీయుల మీద దాడులు జరుగుతున్నాయి. క్రికెట్ వరుస విజయాల కారణంగా ఉత్పన్నమైన ఈర్ష్యాసూయలు ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులకు కారణం అని ఒక వాదన ఒకపత్రికలో వచ్చింది. భారతీయులు పొదుపరులు, శ్రమజీవులు. ఈ అసూయాద్వేషాలతో ఆస్ట్రేలియన్లు భారతీయులపై దాడికి దిగుతున్నారని మరో వాదన మరో పత్రికలో చదివాను. ఇవిగాక విదేశాల్లో నల్లవారు, మాదకద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారని, వారు మన మార్గానికి అడ్డం వచ్చి డబ్బు అడిగితే, మారు మాట్లాడకుండా వాలెట్ వాడి చేతికిచ్చేయాలని, అందుకోసం ప్రత్యేకంగా కొన్ని చిల్లర దమ్మిడీలు[డాలర్లు] పెట్టుకోవాలనీ, అంతేగాని చిల్లరడబ్బులు కోసం ఎదురు తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం పరమ తెలివి తక్కువతనం అనీ కొన్ని ‘తెలివైన’ వాదనలు, సిద్దాంతాలు వినబడుతున్నాయి. బహుశః ‘ఎదుర్కోవటం కంటే ప్రక్కకు తప్పుకుని పోవటం తెలివైన పని’ అన్న సిద్దాంతానికి ఇది ఉప సిద్దాంతం కావచ్చు.

నిజమే. ఏవ్యక్తీ సినిమా హీరోలాగా రౌడీలని ఎదురించలేడు. మరి అక్కడి ప్రభుత్వాలు ఏమి చేస్తున్నట్లు? అలాంటి వారిని ఎందుకు కంట్రోలు చేయటం లేదు? ఎదురు వచ్చినవాడు డబ్బే డిమాండ్ చేస్తే, సరే పోనీ అనుకుని డబ్బిచ్చి వదిలించుకోవచ్చు. ఈరోజు మాదక ద్రవ్యాలకు బానిసై, విచక్షణ కోల్పోయిన వాడు ఎదురొచ్చి ఆడిగితే వాలెట్ ఇవ్వటం తెలివైన[?] పని కావచ్చు. ఈ రోజుకి ఇది తెలివైన పనిగా మనల్ని ఒప్పించటమే నకిలీ కణిక వ్యవస్థ, వారి ప్రచారం, మనపై సాధించిన విజయం. రేపు ఇలాగే సుఖభోగాలకీ, విచ్చలవిడి శృంగారానికి బానిసై, విచక్షణ కోల్పోయిన వాడు, మీప్రక్కనున్న స్నేహితురాలినో, భార్యనో, లేక కుమార్తెనో ఇవ్వమని అడిగితే…? అప్పుడూ ప్రక్కకు తప్పుకుని పోగలరా? అప్పుడూ, అదే తెలివైన పని అనగలమా? ప్రజాదృక్పధంలో ’ఎదురుతిరగటం’ అనే లక్షణాన్ని నాశనం చెయ్యటానికి చేయబడుతున్న ప్రచారం ఇది, ప్రచారించబడుతున్న ’తెలివి’ సిద్దాంతం ఇది. ఇక్కడ ఇలాంటి పోలికగల స్ట్రాటజీ ఇంకొటి చెబుతాను.

ఇండియాలో మొదట రౌడీయిజాన్ని పరిచయం చేసేటప్పుడు ఇలాగే మొదలయ్యింది. రౌడీలు మొదట చిన్నచిన్నవ్యాపారుల మీదకే వెళ్ళేవాళ్ళు. సంఘంలో పెద్దవాళ్ళజోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఆర్ధికంగా ఒకస్థాయికి వచ్చిన తరువాత, ఈ రౌడీలు రాజకీయ అండదండలు తీసుకుని ప్రతిపక్షపు వాళ్ళని చంపటం మొదలుపెట్టారు. ఆ తరువాత వాళ్ళే రాజకీయనాయకులుగా అవతారం ఎత్తారు. అలాంటి వాళ్ళే దేవినేని నెహ్రూ, వంగవీటి రంగా, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు. కోస్తా ప్రాంతాలలో ఇలా ఉంటే, ఇక రాయల సీమ గురించి చెప్పనవసరం లేదనుకుంటా. ఈ పరిణామక్రమంలో రెండాకులు ఎక్కువ చదివిన వాళ్ళు ముంబై మాఫియా. వాళ్ళు ఏకంగా ప్రక్క దేశపు గూఢచార సంస్థలతోటే సంబంధాలు పెట్టుకున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ప్రభుత్వ ఉద్యోగులను సైతం లెక్కచెయ్యని రకాలుగా అవతరించారు. ఒకడు ఏకంగా ఐ.ఏ.యస్. భార్యనే నచ్చిందని, కిడ్నాప్ చేసాడు. ఆ ఐ.ఏ.యస్. ఏమీ చెయ్యలేకపోయాడు. ఎక్కడయినా ఒకటే స్ట్రాటజీ! జనాన్ని భయపెట్టటం, దోచుకోవటం. ఎదురు తిరిగితే చంపటం! ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యం బ్రతికి ఉన్న దేశాలలో, ప్రజాస్వామ్యబద్దంగా నడుస్తాయన్నమాట.

అన్నిరకాలుగా, అన్నిదేశాలలో ’దోపిడికి ఎదురుతిరగకు. సర్దుకుపో! అన్యాయానికి ఎదురుతిరగకు. సర్ధుకు పో!’ – ఇదే ఉద్బోధ. దాని ఫలితమే – ఏది జరిగినా, ప్రతీవారూ, తాము తప్ప మిగిలిన అందరూ ప్రతిస్పందించాలను కోవటం! తము మాత్రం ’ఎదురుతిరగరు, సర్ధుకుపోతారు’. ఈ స్థితి 1947 కు ముందు లేదు కాబట్టే, నాటి స్వాతంత్ర సమరయోధులకి కోట్లాది మంది భారతీయులు ప్రతిస్పందించారు. బాపుజీ వెనుక సత్యాగ్రహులై గర్జించారు. ఆయుధాలు లేకుండా, ఆర్ధిక బలం లేకుండా, అపూర్వమైన రీతిలో సాగిన సమరం అది. కేవలం ప్రజల దృక్పధం, ఐక్యతగా ప్రతిఫలించి, సాగించిన పోరు అది. అందుకే నకిలీ కణికుల అనువంశీయులు, తమ తదుపరి స్ట్రాటజీని ‘ప్రజాదృక్పధాన్ని[Public Attitude] ధ్వంసం చేయటం, తమకి అనుకూలంగా ప్రభావపరుచుకోవటం’ అన్న లక్ష్యంతో రచించుకున్నారు.

కాబట్టే, ఏ అవినీతి గురించిగానీ, కుంభకోణం గురించి గానీ ఫిర్యాదు చేసిన వారి బ్రతుకు బస్టాండు అవ్వటం, ఫిర్యాదుదారు వేధింపులకు గురవ్వటం జరుగుతోంది. ఈ విషయం నా ఒక్కదాని కేసులోనే కాదు, ఎవరు, ఏ విషయమై ఫిర్యాదు చేసినా, ఇలాగే ఉంటోంది. కాకపోతే కేసుని బట్టి వేధింపు పరిమాణం ఉంటుంది. అంతే! అందుకే ‘ఇది నా కథే కాదు, మీ కథ, మన కథ, సామాన్యుడి కథ’ అని వ్రాసాను, నా కేసు గురించి వివరించేటప్పుడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

7 comments:

Good info keep it up! (i)attacks are always wrong ,
(ii)Ranganayakamma's book is a critic on 'writer' and 'writing style' not on religion.

good one.

Exactly..!!

బాగా చెప్పారు.

ఒక విషయం. చాలా రోజులనుంచి చెబ్దామనుకుంటున్నాను. ఈ దట్టమైన ఆకుపచ్చ బ్యాక్ గ్రౌండ్ మీద పాఠ్యాన్ని చదవడం అస్సలు సుఖంగా లేదు. ఏదైనా పల్చటి రంగు గానీ తెల్లరంగు గానీ బ్యాక్ గ్రౌండ్ గా పెడితే బావుంటుంది.

తాడేపల్లిగారు,
మీకు మా సంగతి తెలుసు కదా! టెక్నికల్ గా ఏమీ రాదు. దానిని ఎలా మార్చాలో చెప్తే మార్చగలను. లేదా మొత్తంగా మూసనే మార్చాలి! లేదా అక్షరాల రంగును మార్చాలి! సలహా ఇవ్వగలరు. సలహా ఇచ్చినందుకు కృతజ్ఞతలు.

Go to layout > fonts and colors and change the colors in template in different sections like header, background,date etc and save.. its simple ..try it

జ్యోతి గారు,

సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ ఈ మూసలో Background Color మారటం లేదండి! అదే అసలు బాధ!

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu