నకిలీ కణిక అనువంశీయుల నిగూఢ గూఢచర్య వలయమే ప్రపంచ ప్రస్తుత పరిస్థితుల వెనుకనున్న బలీయ శక్తి అనేందుకు ఎన్నో తార్కాణాలు [Facts] ఉన్నాయి.

1]. పైన చెప్పిన ముస్లింల ప్రాధాన్యత ఒకటి. ప్రపంచవ్యాప్తంగా, ఏదేశమైనా, ముస్లింలకి గారాబం నడుస్తుంది. అది ఇప్పటికే బాగా వెల్లడి అయిన విషయం.

2]. ఇక పాకిస్తాన్ కీ, ఇస్లామాబాద్ కీ ఉన్నబలం ఏపాటిదో, అమెరికా పాకిస్తాన్ తరుపున లాబీయింగ్ చేసి, దానికి ఆర్ధికసాయం సమకూర్చటమే గాక, అన్నీ దేశాలనీ పాక్ కి అన్ని విధాల సాయం చెయ్యమని [చైనాతో సహా] చెప్పటమే దీనికి ప్రబల నిదర్శనం. అమెరికాలో రిపబ్లికన్లు అధికారంలో ఉన్నా, డెమోక్రాట్లు అధికారంలో ఉన్నా ఈ విషయంలో తేడా లేదు.

3]. ఇక మరో విషయం టెర్రరిజం. ఏదేశంలోనైనా, ఏకారణంగా టెర్రరిజమ్ ప్రబలినా, చివరికి సంతరించుకునేది హింసోన్మాదమే. ఉదా: మావోయిస్టులు ప్రజావిప్లవం అంటారు. ఏ ప్రజల కోసం తము పోరాడుతున్నామంటారో ఆ ప్రజలనే, కోవర్టులనీ, పోలీసు ఇన్ ఫార్మర్ లనీ చెబుతూ చావగొట్టి చెవులు మూస్తారు. ప్రజల సొమ్ము అయిన బస్సులూ, రైళ్ళు, రైల్వే స్టేషన్లు, టెలిఫోన్ ఎక్చేంజ్ లు, గవర్నమెంట్ బిల్డింగ్ లు తగలబెడతారు. 1992 కు ముందరైతే, ఓ దశలో, ఒకరోజునే పదుల కొద్దీ ఆర్.టి.సి. బస్సుల్ని తగలబెట్టారు. ఆ నష్టాన్నే చూపిస్తూ తర్వాత ఆర్.టి.సి. వాళ్ళు ప్రయాణ ఛార్జీలు పెంచారు. ఆవిధంగ మావోయిస్టులు ప్రజలకి మేలు చేసినట్లా, కీడు చేసినట్లా? 1992 తర్వాత ఆర్.టి.సి. వారు, తమ తగలబెట్టబడిన బస్సులన్నిటినీ కలిపికట్టి, ‘మేమేం పాపం చేశాం? మమ్మల్నేందుకు తగల బెడుతున్నారు?’ అన్న ప్లకార్డులతో ప్రదర్శనల వంటి చర్యలు చేపట్టారు. ఇప్పడీ ఉధృతి కొంత తగ్గింది గానీ, గతంలో అయితే ఏచిన్నకారణం దొరికినా ముందుగా తగలవేసేది ఆర్.టి.సి. బస్సుల్నే! ఈ విషయంలో నక్సల్సే కాదు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రకాల సంఘాలు ఉన్నాయి.

అలాగే LTTE, తమిళజాతి మనుగడ కోసం పోరాటం అన్నది. భాషా, సంస్కృతులను కాపాడుకోవటానికి స్వతంత్రదేశం కావాలి కాబట్టి ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాడుతున్నాం అన్నది. సిద్దాంతం సంగతి దేముడెరుగు, ఏ తమిళ ప్రజల కోసం పోరాటం అన్నదో, ఆ తమిళ ప్రజలనే చంపారు. ఆ ప్రజల మధ్యే ఆత్మాహుతి దాడులు జరిపారు. అవసరమైన వేళ ఆ తమిళ ప్రజలనే సైన్యం నుండి తమకి రక్షణ కవచంగా వాడుకున్నారు. ఇదంతా గమనిస్తే స్పష్టంగా తేలేది ఏమిటంటే – ఏ దేశమైనా, పైకి చెప్పేది ఏ కారణమైనా, [చివరికి తాలిబాన్ల జిహాద్ తో సహా], హింసాత్మక చర్యలకి పాల్పడే సంస్థల లక్ష్యం విధ్వంసం మాత్రమే. తద్వారా ఆయాదేశాలని ఇబ్బంది పరచటమే. ఆర్దికంగా దెబ్బతీయటమే. కాబట్టే LTTE కి, లెబనాన్ ఏ సిద్దాంతసారూప్యత లేకపోయినా శిక్షణ ఇచ్చింది. అంతిమంగా, అంతర్గతంగా అన్ని సంస్థలనీ నిర్వహిస్తోంది [Organaize చేస్తోంది] నకిలీ కణిక వ్యవస్థే అన్నది ఈ కోణంలో కూడా సుస్పష్టంగానే కన్పిస్తుంది.

అంతేకాదు, ఒక్క LTTE లకే గాక ప్రపంచంలోని అన్ని తీవ్రవాద సంస్థలకీ అత్యాధునిక ఆయుధాలు అందుతున్నాయి? ఎవరు సమకూర్చి పెడుతున్నారు? ఒక సామాన్యుడు ఉద్యోగం పొందాలంటే వంద ధృవపత్రాలు చూపాలి. ఒక చిన్న వ్యాపారం పెట్టాలంటే వంద లైసెన్సులు తీస్కోవాలి. రక్షణ కారణంగా ఆయుధం పొందాలంటే లైసెన్సు ఉండాలి. నల్లబజారులో మాత్రం యాధేచ్ఛగా, ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ ఉమ్మడిగా వైఫల్యం చెంది, ఆయుధాలు ఇబ్బడిముబ్బడిగా దొరుకుతున్నాయి. చివరికి సబ్ మెరెయిన్లు, హెలికాప్టర్లతో సహా! ఏ ప్రపంచ సంస్థా, ఐరాస తో సహా, దాన్ని నివారించలేకపోయాయి. కనీసం మాటమాత్రంగా కూడా నియంత్రించలేకపోయాయి. అంత పెద్ద అధునాతన వస్తువుల్ని [హెలికాప్టర్లు, జలాంతర్గాములు], ఎవరో అనామకుడు కిళ్ళీ బడ్డీలోనో, మారుమూల దుకాణంలోనో రహస్యంగా AK 47 లు అమ్మినట్లుగా అమ్మలేడు కదా? ఆయా ఆధునాతన వాహనాల్ని, ఆయుధాలని పెద్ద తయారీ సంస్థలే అమ్మాలి కదా? మరి అక్కడి ప్రభుత్వాలు, ఇలాంటి విషయమై ఆరా తీయకుండా ఎలా ఉంటున్నాయి? తమ దేశంలోని హెలికాప్టర్ల తయారీ సంస్థ, పరాయి దేశంలోని టెర్రరిస్టు సంస్థలకి తమ ఉత్పత్తులని అమ్మితే, అదేప్రకారం పరాయి దేశాల్లోని తయారీదారులు తమదేశంలోని ఉగ్రవాద సంస్థలకి [తమకి వ్యతిరేకంగా పనిచేసేందుకు] అదే విధమైన ఉత్పత్తులను అంటే హెలికాప్టర్లు గట్రాలని సమకూర్చవచ్చుగా? అది తమదేశానికి ప్రమాదహేతువే కదా? అందువల్లనైనా అలాంటి కుట్రలకి తమ భూభాగం, తమ దేశం తావివ్వకూడదను కోవాలి కదా? తమ దేశం పట్ల నిబద్దతా, భక్తీ కలిగిన వారెవరైనా అలాగే చెయ్యాలి. కాని విభజించి పాలించే కణిక నీతి తెలియనందున కొందరూ, తెలిసీ స్వార్ధప్రయోజనాల కోసం మరికొందరూ, ఈ తంత్రాలలో ఇతోధికంగా తమ పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఐరాస చాలా సమర్ధంగా వైఫల్యం చెందింది.

4]. తొలితరం నకిలీ కణికుడు జన్మతః వేశ్యాపుత్రుడు గనుక, బాల్యంలో అణిచివేతకు గురయ్యాడు గనుకా, తనలో చెలరేగిన మనోవికారాలని, కసీ ద్వేషాలనీ, గూఢచర్యంతో కలగలపి సంక్లిష్ట స్థితికి తీసుకుపోయాడు. షావేన్ హూవర్ నిరాశావాదాన్ని తాత్త్విక చింతన స్థాయికి తీసుకుపోయినట్లు, నకిలీ కణిక-1, తన మనోవికారాలని, కసి విద్వేషాలని కూడా, తరతరాలకి అందచేయబడేటట్లుగా, సంక్లిష్టస్థితికీ, సిద్దాంత స్థాయికీ తీసుకుపోయాడు. ఇప్పుడు నకిలీ కణికుడి ఏజంట్లు, లేదా ఆ విషం తలకెక్కించుకున్న వాళ్ళు చెప్పేవి ఈ పనికి మాలిన సిద్దాంతాలే. వార్తాపత్రికలు వ్రాసి, ప్రచారించేవి కూడా ఈ పనికి మాలిన సిద్దాంతాలే. కాబట్టే ఏ శీర్షిక పెట్టి వ్రాయనివ్వండి, పాజిటివ్ గా వ్రాయనివ్వండి లేదా నెగిటివ్ గా వ్రాయనివ్వండి, పదేపదే అదే విషయాన్ని వ్రాస్తూ వాళ్ళు ప్రచారించేది – ‘ఈ రోజుల్లో అవినీతి, అనైతికతే నడుస్తుంది. నీతి నియమం, ధర్మం, సత్యం అంటూ మడికట్టుకు కూర్చుంటే మట్టిగొట్టుకుపోతాం’. దీనికి తగ్గట్టే అనైతికతలో మునిగితేలే వారికీ, అనైతికతలోంచే జన్మించిన వారికి మీడియా సీన్ ఇస్తుంది. ఇందుకు ఎన్ని ఉదాహరణలైనా ఇవ్వవచ్చు. ఏ రంగమూ ఇందుకు మినహాయింపు కాదు. కేవలం డబ్బు లంచంగా ఇస్తే ‘పనులు’కావటం అన్నది తగ్గిపోయింది. లంచంతో పాటు ’మంచం’కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. కాబట్టే ’ప్రక్క లేసే వాడే పై కొస్తున్నాడు’ అన్నమాట తరచూ వినబడుతోంది. గమనించి చూడండి. ఆదినారాయణ రావు భార్య, అలనాటి నటి అంజలీ దేవికి అవార్డులు రావు. జీవన సాఫల్య అవార్డు అసలు రాదు. అదే యస్.యం. కృష్ణతో అనుబంధాలున్న [ఆనాటి మధుర స్మృతులని ఈ కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, నేటి కేంద్ర విదేశాంగ మంత్రి ఇటీవలే ఈనాడు పత్రికాముఖంగా నెమరు వేసుకున్నాడు] ఒకనాటి అందాల నటి బి.సరోజా దేవికి జీవన సాఫల్య అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేయబడింది.

ఇటీవల విడుదలైన హాలీవుడ్ సినిమాలో సైతం ’Bastard’ గా చెప్పబడ్డ అలెగ్జాండర్, “దిగ్రేట్” నకిలీ కణికుల దృష్టిలో. అలెగ్జాండర్ విషయంలో పూర్వాపరాలన్నీ నా గత టపాలలో ఉటంకించాను. ఇక ఎవరైనా అక్రమ సంతానం అయితే వారికి ఇతరుల కంటే ఎక్కువగా ‘సీన్’ ఇస్తారు ఈ నకిలీ కణికులు. ఇటీవల తాజా ఉదాహరణ జూనియర్ ఎన్టీఆర్. హరికృష్ణ రెండవ భార్య[?] [మా చిన్నప్పుడు ఇలాంటి వాళ్ళని ఉంపుడుగత్తెలనే అనేవారు. ఈ మధ్య వీరిని రెండవ భార్య అని పాజిటివ్ కాప్షన్ తో పిలుస్తున్నారు. బహు భార్యత్వం నశించాలని కేకలు పెట్టిన నోళ్ళతోనే, వ్రాసిన కలాలతోనే, ఫలితంగా ఏర్పడిన చట్టాన్ని విస్మరించి మరీ, ఎంతో చక్కని గౌరవవాచకాలని ఈ అక్రమ సంబంధాలకి వాడుతున్నారు. ఇక ఒకో వ్యక్తికి 3వ భార్య [కరుణానిధికే కాదు, ఇటీవల దక్షిణాఫ్రికా అధ్యక్షుడైన జాన్ లకి కూడా ముగ్గురున్నార్లెండి. ఈ కోవలో ఫ్రాన్స్ అధ్యక్షుడు సర్కోజీని వేయవచ్చు. కరుణానిధిని ‘మీకెంత మంది పిల్లలు, వారి పేర్లేమి, ఏ పిల్లలు, ఏ భార్యకు పుట్టారో వేగంగా చెప్పవలెను’ అని అడిగితే కరుణానిధికి, పిల్లల పేర్లు కూడా గుర్తురావేమో!] 4వ భార్య, nవ భార్య, [n+1]వ భార్య ఉంటారు కాబోలు. ఇలా పరిశీలించి చూస్తే, ఏ దేశంలోనైనా, ఏ రంగంలోనైనా ‘వ్యక్తులు ఎంతగా అభివృద్ధి లోకి వస్తే, అంతగా అనైతికత పాటించేవాళ్ళన్న మాట’ అన్న నానుడి పుట్టేటంతగా ఈ వ్యవహారం నడుస్తోంది. నడిపించేది నకిలీ కణికుల గూఢచార వలయమే, దాన్ని ప్రచారించేదీ నకిలీ కణికుల గూఢచార వలయమే! ఈ అంశం కూడా స్థానిక ప్రాంతాల నుండి, అంతర్జాతీయ స్థాయి దాకా ఇలాగే ఉంది. ఒకే స్ట్రాటజీ క్రింది నుండి పైదాకా, లేదా అంతర్జాతీయ స్థాయి నుండి మన వీధి దాకా విస్తరించి ఉండటమే ఇక్కడ గమనించవచ్చు. విస్మయపరిచేదే అయినా, పచ్చినిజం ఇది.

ఇవేవీ, నిలబడి తీరిగ్గా ఆలోచించనివ్వకుండా, తమ ప్రచారాన్ని నమ్మేలాగా, మనుష్యుల్ని పరుగులో ముంచేస్తారు. బుడుగు భాషలో చెప్పాలంటే దమ్మిడీల పరుగులో అందరూ అలిసిపోయేదాకా నిమగ్నమై ఉన్నారు. కాకపోతే ఇండియాలో ఆ దమ్మిడీలని రూపాయలంటే, అమెరికాలో డాలర్లంటారు, బ్రిటన్ లో పౌండ్లంటారు. అంతే తేడా! దమ్మీడీల కోసం పరుగైతే ఎక్కడైనా ఒకటే!

5]. ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీలు కూడా ఫక్తు నకిలీ కణికుల బ్రాండువి ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటం! ఇప్పటి స్వైన్ ఫ్లూ మొదలు కొని, నిన్నటి చికెన్ గునియా, మొన్నటి ఆంత్రాక్స్. అప్పుడెప్పుడో స్కైలాబ్. 1992 కు ముందర తమకు తోచినప్పుడల్లా, పీరియాడికల్ గా ఫ్లయింగ్ సాసర్ల గురించీ, గ్రహాంతర వాసుల గురించీ వార్తలు! ఏ వార్త అయినా, అంతర్లీనంగా ప్రజల్ని భయభ్రాంతుల్ని చెయ్యటమే అక్కడ లక్ష్యం. చివరికి నవంబరు 26, 2008 లో ముంబై ముట్టడి నాడు కూడా మీడియా కవరేజ్, టెర్రరిస్టుల శక్తి యుక్తుల్ని అన్యాపదేశంగా ఆకాశానికెత్తుతూ, భయం, ఆందోళనల్ని ప్రజల నరనరాల్లో నింపాలన్నంత లక్ష్యంతోనే వ్రాసారు.

మా చిన్నప్పుడు స్కైలాబ్ [అంతరిక్ష ప్రయోగ శాల] ఆయువు తీరి భూమ్మీద పతనం చెందుతుందంటూ పత్రికలు హోరెత్తించిన తీరుకి కొందరు గుండెపోటుతో మరణించారు. కొందరు ’ఎటూ ఛస్తాం. చచ్చాక ఇంకేం అనుభవిస్తాం’ అనుకుని ఆస్థులు అమ్ముకుని జల్సాలు చేసుకున్నారు, కొందరు గోతులు తవ్వుకుని దాక్కున్నారు. మళ్ళీ ఈ వార్తల్ని కూడా పత్రికలే వ్రాసుకుని సొమ్ము చేసుకున్నాయి. ఏ సంచలనాలూ లేనప్పుడు సంచలనాలు సృష్టించి సొమ్ము చేసుకోవటం గాక, ఇవి అదనం అన్నమాట. ఇలాంటి ఊదరే ఫ్లయింగ్ సాసర్లూ, గ్రహంతర వాసులూ గురించి! వీటి మీద సినిమాలు తీయటం నకిలీ కణిక వ్యవస్థకి మరో ఆదాయమార్గం. ఇక ఇటీవల స్వైన్ ఫ్లూ జబ్బు విషయంలోనూ “మహమ్మారి, ఇందర్ని బలితీసుకుంది. ఇందరు దాని బారిన పడ్డారు. ఫలానాదేశంలో వీధులన్నీ నిర్మానుష్యమయ్యాయి. ఇన్ని లక్షల కోట్ల దమ్మిడీల వ్యాపారం నష్టం జరిగింది. ఇంకా ‘X’, ‘Y’ అంటూ భయోత్పతం కలిగించేలా వ్రాసినంతగా… అసలా జబ్బు ఎందుకు వస్తుంది, ఎలా వ్యాపిస్తుంది, నియంత్రణకు ఏంచెయ్యాలి, నివారణకు ఏం చెయ్యాలి అన్న విషయాలు వ్రాయలేదు. పత్రికలతో పోలిస్తే, డి.డి. వాళ్ళు, ఇంకా జబ్బు కారణాలు, నివారణ, నియంత్రణల గురించి చెప్పారనాలి.

ప్రజల్ని భయభ్రాంతుల్ని చెయ్యడం కోసం పుకార్లు పుట్టించటంలో కూడా మీడియా దిట్ట. ’ఓ స్త్రీ రేపురా!’ గట్రాలన్న మాట. మన రాష్ట్రంలో ఇలాంటివైతే, పరరాష్ట్రాల్లో, పరాయి దేశాల్లో ఇలాంటివే పేరు మార్పుతో, భాషమార్పుతో కొకొల్లలు. [ఉదా: ఆ మధ్య ఢిల్లీలో ఏదో వింత ఆకారం మేడ మీద నిద్రపోతున్న వాళ్ళమీద దాడి చేస్తున్నదని విపరీత ప్రచారం చేసారు. గాయపడ్డవాళ్ళు కూడా ఉన్నారు. దానిని పట్టుకున్నది లేదు బెదరగొట్టింది లేదు. తరువాత ఆకస్మాత్తుగా ఆ వార్తలు ఆగిపోయాయి.]

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

3 comments:

Good one

డబ్బు సంపాదించడానికి తక్కువ మార్గాలు చూపి , ఖర్చు పెట్టడానికి మాత్రం ఎక్కువ మార్గాలు చూపడం కూడా ఇలాంటిదేనేమో అని నా అభిప్రాయం. మీరేమంటారు?

మనోహర్ గారు,
మీరన్నది నిజమే! దీని మీద వివరంగా, మరోసారి ఒక టపా వ్రాస్తాను.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu