ఇంతగా ఈ న్యాయవ్యవస్థ, తమకి తెరవెనుక సహాయం చేస్తుంది కాబట్టే, నకిలీ నణికుడి వ్యవస్థలో ప్రధాన భాగమైన మీడియా వీరికి అంత ’ఇమేజి’ని, మద్దతునీ ఇస్తుంది. వార్తాపత్రికల్లో టీవీల్లో, న్యాయవ్యవస్థ మీద కథనాలు వ్రాసేటప్పుడు, చూపేటప్పుడు ఎంతో జాగ్రత్త తీసుకుంటుంది. పైకారణంగా న్యాయవ్వవస్థని గౌరవించాలి, విమర్శించకూడదు అన్న నియమం[రూల్], చట్టం ఉండనే ఉన్నాయి. ఇది చాలదన్నట్లు జస్టిస్ చౌదరి సినిమాల వంటి ప్రచారం మరోవైపు సాగిస్తారు. సినిమాల్లో నవలల్లో హీరోలు చచ్చిచెడి నేరగాళ్ళని లేదా అప్రూవర్లనీ, లేదా సాక్ష్యాధారాలని కోర్టుకి చేర్చి, అక్కడికి ఆ జడ్జి ఏదో దేవుడి తాలూకూ తీర్పే ఇవ్వబోతున్నట్లు, ఇస్తాడన్నట్లు, ఓ పెద్ద నిట్టూర్పు విడుస్తాడు. నిజానికి జడ్జీలే లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్న కేసులు ఈమధ్యనే వెలుగుచూస్తున్నాయి. కొన్నేళ్ళు న్యాయవాదిగా ప్రాక్టీసు అర్హతతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగానూ, కొన్నేళ్ళపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సర్వీసు అర్హతతో న్యాయమూర్తులు గానూ, నియామకం అవ్వవచ్చు. ఇక న్యాయవాదుల్లో న్యాయం ఎంతో [అందరూ కాకపోయినా ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు] అందరికీ తెలిసిందే. వ్రాతపరీక్షలతోనూ న్యాయమూర్తులుగా నియామకం జరగవచ్చన్నా అందులోనూ దొడ్డిదారులెన్నో ఊహించటం అసాధ్యం కాదు. లాయర్లకీ, జడ్జీలకీ బాదరాయణ సంబంధం, కరెన్సీ నోట్ల సాక్షిగా ఉండటం, గుంటూరులో నాకు ప్రత్యక్ష ఉదాహరణలతో తెలుసు. దీన్నే నిరూపిస్తుందా అన్నట్లు ఇటీవల ‘న్యాయమూర్తుల ఆస్థులు కూడా రాజకీయ నాయకుల ఆస్థుల మాదిరే వెల్లడించాలి’ అన్న నేపధ్యంలో అందుకు న్యాయమూర్తులు వ్యతిరేకించటంతో రాజ్యాంగ సంక్షోభం వంటి అలజడిరేగింది. చివరికి న్యాయమూర్తులు దిగిరావటంతో గొడవ సద్దుమణిగింది.

ఈ వ్యవహారాన్నంతా నిగూఢంగా ఉంచటానికి మీడియా జస్టిస్ చౌదరి వంటి సినిమాలనీ, సినిమాల్లో పాత్రలనీ చూపుతూ ఉంటుంది. పరిస్థితిని తేలిక పరచటానికి “ఓడిన వాడు కోర్టులోనే ఏడుస్తాడు. గెలిచిన వాడు ఇంటికెళ్ళి ఏడుస్తాడు” అంటుంది. నెపమంతా జాప్యానిదే అంటుంది. అసలు సత్వర న్యాయం జరగక పోవటమే పెద్ద కుట్ర అని, అది చాలా దుష్ర్పభావాలు చూపుతుందనీ భారతంలోని నారదనీతి చెబుతుంది. దీనికి విపర్యయమే కాదా నకిలీ నణికుడు చేసేది? అంతేకాదు, న్యాయవ్వవస్థలో న్యాయమూర్తుల సంఖ్య, ఇతర సిబ్బంది సంఖ్య, కేసుల పరిమాణంతో పోల్చితే తక్కువ కావటంతో లక్షల కొద్దీ కేసులు పెండింగులో ఉన్నాయని ప్రచారిస్తుంది. మొత్తం అందరు న్యాయమూర్తులూ, అన్నికేసుల్లో తీర్పులూ ఇలాగే ఉన్నాయని అనను గానీ అధికశాతం కేసుల్లో తీర్పులూ, సిబ్బందీ మాత్రం అవినీతి నీడలోనే ఉన్నారు. న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ప్రభావ, ప్రలోభ పరచటం తరచూ చాలామందికి అనుభవంలోకి వస్తున్నవే. ఏది ఏమైనా న్యాయవ్యవస్థలో న్యాయం పాక్షికం మాత్రమే, అతి తక్కువ నిష్పత్తి మాత్రమే అన్నది నిర్వివాదాంశం.

2007, మే నుండి ఫిర్యాదు, రిమైండరు పంపినా మానవహక్కుల సంఘం సైతం స్పందించలేదు. ఇక్కడ కొన్ని నిజాలు చెప్పాలి మీకు. ఈ మానవ హక్కుల సంఘం ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. ఇప్పటికే ఐరాస ఎంతగా ఎవరిచేతిలో బొమ్మో ప్రపంచానికి బాగానే స్పష్టపడింది. నానాజాతి సమితికి కొత్తప్యాకింగ్ ఐరాస. అంతే! ఐరాస లో చైనాకు వీటో పవరు ఉంది. కాని చైనాలోనే మానవహక్కులు ఉల్లంఘన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇదీ హాస్యాస్పదం. ఇదీ ఐరాస ప్రపంచానికి అందిస్తున్న న్యాయం. ఇక ఈ మానవహక్కుల సంఘానికి మన దేశంలో రాజ్యాంగపరంగా గానీ, ప్రభుత్వపరంగా గాని ఎలాంటి సాధికారతా లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా విధేయత చూపితే చూపాలి, లేదంటే లేదు. ఇంకో భయంకర నిజం ఏమిటంటే ఈ మానవహక్కుల సంఘం, ఎప్పుడైనా సరే, పోలీసులు ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని చంపినప్పుడు, నేరగాళ్ళని బంధించి జైలులో పెట్టినప్పుడు మాత్రమే గర్జిస్తుంది. ఉగ్రవాదుల్ని, తీవ్రవాదుల్ని, నక్సల్స్ నీ, మావోయిస్టులనీ ఎన్ కౌంటర్ పేరుతో చంపడం మానవహక్కుల్ని కాలరాయటమే అంటుంది. జైలులో ఖైదీలను కనీసం మానవుల్లా కూడా చూడటం లేదంటూ నిప్పులు చెరుగుతుంటుంది. అదే నక్సల్స్, మావోయిస్టులూ అమాయక గిరిజనుల్ని ఊచకోత కోసినప్పుడు [పోలీసు ఇన్ ఫార్మర్లనో మరో నెపంతోనో] కిమ్మనదు. మావోయిస్టులు మందు పాతర్లతో జీతంకోసం, పొట్టకూటి కోసం, పని చేయటానికి వచ్చిన పోలీసు కానిస్టేబుల్స్ ని చంపేసినప్పుడు అసలే మాత్రం పట్టించుకోదు. బహుశః వీళ్ళ దృష్టిలో మానవులంటే నేరగాళ్ళు, నక్సల్స్, మావోయిస్టు వంటి ఉగ్రవాదులు లేదా తీవ్రవాదులు మాత్రమే కాబోలు. ఇలాంటి ఈ మానవహక్కుల వారిని చూపెట్టి, మీడియా చాలాసార్లు ప్రభుత్వాన్ని, పోలీసుల్ని నియంత్రించే ప్రయత్నం 1992 కు ముందు మరింత ఎక్కువుగా చేసేది. కావాలంటే గమనించి చూడండి మానవహక్కుల సంఘం ఏకేసునీ పరిష్కరించినట్లుగా ఒక్క సారి వినలేదు. ఈ సంఘనికి ఫిర్యాదులు ఇస్తూన్న వార్తలే ప్రచారంలో ఉంటాయి.

జూన్ పోయి జూలై కూడా రావటంతో, ఇక శ్రీశైలంలో స్కూలు నడపగలమన్న ఆశకి నీళ్ళు వదులుకున్నాము. దాంతో నంద్యాలలో గానీ, వేరే ఊరులోగానీ ఉండాలని నిశ్చయించుకున్నాము. మావారి స్నేహితుడు హైదరాబాదు ఒరాకిల్ లో జాబ్ చేస్తున్నాడు. అతడిని ఆన్ లైన్ లో టీచింగ్ జాబ్స్ గురించి తెలుసుకొని చెప్పమన్నాము. అతడు , అంతకు ముందు ఏదయినా ఇంటర్ నెట్ లో క్షణాల్లో కనుక్కోవచ్చు అని చెప్పిన వ్యక్తి, జాబ్ గురించి కనుక్కోవటానికి చాలా కష్టపడ్డాడు. హైదరాబాదులోని ఒక అడ్రసు ఇచ్చాడు. ఆ అడ్రసులోని వాళ్ళు అసలు లైన్ లోకే రాలేదు. ఇక అనవసరం అనుకుని మా ప్రయత్నాలు మేమే చేసుకోవాలనుకున్నాం. నంద్యాలలోని మిత్రుడు ఖాసిం భయ్యా “ఎక్కడైనా స్నేహితులే గదా! ఇక్కడే ఉండకూడదా?" అన్నాడు. మాకూ ఏ అభ్యంతరం కనబడలేదు. ఎక్కడైనా మళ్ళీ ఉపాధి వెదుక్కోవలసిందే. ముందు ఇల్లు వెదుక్కోవాలి. గుంటూరుతోనో, మరో ఊరుతోనో పోలిస్తే నంద్యాలలో ఖర్చులు తక్కువ. ఎంతైనా అది కార్పోరేషన్ , ఇది మున్సిపాలిటి. వెతగ్గా నంద్యాలలో మంచి ఇల్లు దొరికింది. ఇక శ్రీశైలం బయలుదేరాము. ‘వెళ్ళాక గానీ అక్కడేముందో గానీ తెలియదు. కానీ!’ అనుకుంటూ వెళ్ళాము. లారీ చూసుకుని సామాన్లు షిప్టు చేసే పనిలో పడ్డాము. ఈ.వో. ఇవాళ్ళో రేపో ట్రాన్స్ ఫర్ అంటున్నారు. డి.ఈ.వో.కృష్ణయ్య రిటైర్ అయ్యాడు. ఎవరికి వారు ఈ.వో.కి భయపడి పంచనామా నోటీసులకి స్పందించారు, పంచనామాకి అటెండ్ అయ్యేందుకు సిద్దపడ్డవాళ్ళు ఉన్నారు. పిల్లల తల్లిదండ్రులలో కొందరు కన్నీళ్ళుపెట్టుకున్నారు. కొందరు నిర్లిప్తంగా ఊరుకున్నారు, కొందరు మోహం చాటేసారు. చాలామంది మాత్రం ‘చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురయిపోయాం’ అన్న భావాన్ని వ్యక్తీకరించారు. నేను “మాకు సాధ్యమైనంతగా మేం పోరాడము. మీరేం చేశారు చెప్పండి. అంతా కలిసికట్టుగా పోరాడితే సాధించుకునేవాళ్ళం కదా! స్కూలంటే మా ఒక్కరిదేనా? మీకేం సామాజిక బాధ్యత లేదా?" అన్నాను. కానీ వీడ్కొలు అందరినీ చాలా బాధించింది. ఆరోజు చాలామంది తల్లిదండ్రులు నాకు చీర,బొట్టు పెట్టి, కంటనీటితో వీడ్కొలు ఇచ్చారు. పిల్లలు, వాళ్ళ ప్రియమైన బొమ్మల్ని, అప్పుగాణ్ణి [ఏనుగు బొమ్మ] లారీ ఎక్కిస్తూ, కళ్ళల్లో ’సుళ్ళు’ తిరిగిన నీటితో చూస్తూ చాలా దుఃఖపడ్డారు. నిజంగా ఈ పిల్లల ఉసురు వాళ్ళకి తగిలితీరుతుంది అన్పించింది. సామానులకోసం వెళ్ళి మేం దాదాపు మూడురోజులపాటు ఉన్నాం.

ఈనేపధ్యంలో కానిస్టేబుల్ సుధాకర్, "వద్దు మేడం! ఇక్కడ ఎక్కడైనా ఇల్లు చూద్దాం” అన్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేశామో అందరికీ తెలుసు. అదీగాక ఢిల్లీ డ్రామా చూశాక రామోజీరావు ఎంతగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలని ఆడిస్తున్నాడో బాగా అర్ధం అయ్యింది. ‘ఆ గూఢచర్యపు రాజకీయ మర్మాలు వీళ్ళకి చెప్పినా అర్ధం కావు!’ అనుకున్నాం. అంతలో సుధాకర్ “మొన్న పంచనామా చేయాలంటూ దేవస్థానపు ఉద్యోగి వచ్చాడు. ఆరోజు ఎస్.ఐ.గారు కూడా లేరు. పంచనామా లేదు, ఏంలేదు పొమ్మని నేను గదమాయించాను. వెళ్ళిపోయాడు” అంటూ చెప్పాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఆ ఈ.వో., సి.ఎం. చెబితేనే వినడు, AICC జనరల్ సెక్రటరీ చెప్పినా వినడు. అటువంటిది ఈ కానిస్టేబుల్ చెబితే ఈ.వో. వెనక్కి తగ్గాడట. ఇది మేం నమ్మాలి. ఏం చెప్పను? అప్పటికే నాకు పోలీసుల మీద నమ్మకం పోయి చాలా కాలం అయ్యింది. సూర్యాపేట తర్వాత ఇది మరో అనుభవం. అదే చెప్పాను అతడితో. అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుని బయలుదేరాము.

శ్రీశైలంలో ఒక విద్యార్ధి తండ్రి, రాజశేఖర రెడ్డి, మాకు శ్రీశైలంలో ఇల్లు వెదికేందుకు చాలా తిరిగాడు. చాలా కష్టపడ్డాడు. అతడి తాపత్రాయం కొద్దీ, ఒత్తిడి కొద్దీ మేం ఎం.ఎల్.ఏ. ఏరాసు ప్రతాపరెడ్డిని కూడా కలిసాము. ఫలితం రాకపోవడం వేరేవిషయం. అతడి ఓపిక, స్కూలు నిలబెట్టుకోవాలన్నా తాపత్రయం మాత్రం నిజం. చివరికి కృష్ణదేవరాయ సత్రపు సెక్రటరీ తో “ఒక్కరూమ్ ఇవ్వండి సార్! మీ పేరు చెప్పుకుని మాపిల్లల్ని చదివించుకుంటాము. మీ కాళ్ళు పట్టుకుంటాను సార్!” అని బతిమాలాడు. మాకోసం మేం కూడా అలాగా ఎవరినీ ప్రాధేయపడం అన్పించింది. అతడు “ఒక్క సంవత్సరం అగితే నేనే శ్రీగిరికాలనీలో ఇల్లు కొంటాను సార్! అప్పుడు ఎవరు వెళ్ళగొట్టలేరు” అన్నాడు మాతో. మేము నవ్వేసి ఊరుకున్నాం, ఎందుకంటే నా శతృవు శక్తి ఎలాంటిదో నాకు తెలుసుకాబట్టి.

’శ్రీశైలంలో మిగిలిన పేరెంట్స్ ఎవరూ స్కూలుకోసం, ప్రయత్నించలేదని వాళ్ళకి సామాజిక బాధ్యత లేదన్నాం. మరి సామాజిక బాధ్యత చూపించిన రాజశేఖర్ రెడ్డి కి మనమేం తిరిగి ఇచ్చాం?’ అన్న నైతికతతో అతడి పిల్లవాణ్ణి మా ఇంట్లో పెట్టుకుని చదివిస్తానని మాట ఇచ్చాము. ఆ మాటప్రకారం ఒక సంవత్సరం పాటు 7 ఏళ్ళవాళ్ళ పిల్లవాణ్ణి మా ఇంట్లో పెట్టుకుని చదివించాను. కానీ ఇక్కడ మాకు Disadvantage తయారైంది. అతడు చూపించిన సామాజిక బాధ్యతకి ప్రతిగా నేను వాళ్ళ అబ్బాయిని ఇంట్లో అట్టిపెట్టుకుని, వాడి బట్టలుతికీ, కంచం కడిగీ, చదువు చెబితే, అతడు అదేదో నాకు కొడుకులు లేక వాళ్ళ అబ్బాయి నచ్చి, దాదాపు దత్తత తీసుకున్నాం అన్న లెవెల్లో శ్రీశైలం అంతా ప్రచారించాడు. సెలవులకి తీసికెళ్ళమంటే, పిల్లవాడు తల్లిమీద బెంగపెట్టుకున్నాడు, అంటే తీసికెళ్ళడు. ఇక్కడ వాడేమో ఆ కుళ్ళుతో మమ్మల్ని సతాయిస్తున్నాడు. చివరికి పరిస్థితి ఎలా పరిణమించిందంటే మా ముగ్గురం మాపనులు వదిలేసి వాడిమీద పూర్తిగా దృష్టిపెట్టవలసివచ్చింది. 2008, ఏప్రియల్ మొదట్లో తీసికెళ్ళమంటే, అతడు రేపు మాపంటూ ఏప్రియల్ చివరివరకూ గడిపాడు. చివరికి మా పాప చేత పిల్లవాణ్ణి తిప్పి పంపించాల్సి వచ్చింది. ఆ విధంగా ఏది చేసినా అందులోంచి disadvantage పుట్టడం మాకు అలవాటే. కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి నాన్సెన్సుగా, సిల్లీగా ఉంటాయి. అనుభవించేవాళ్ళకి నొప్పి తెలుస్తుంది. అలా అక్కడ కూడా రామోజీరావు తాలూకు వాసనే! ముందు మామూలుగా ఉన్న సంబంధాలలో కూడా క్రమంగా అవతలి వ్యక్తిని ఏదోవిధంగా లోబరుచుకుని మమ్మల్ని వేధించగలగటం! ఇది మాకు అలవాటయి పోయింది. వీటన్నింటితో నాకు చాలా చికాకని పించింది. అంచేత తదుపరి సంవత్సరం పిల్లవాణ్ణి ఇంట్లో ఉంచుకొమ్మని ఎంత ఒత్తిడి చేసినా సున్నితంగా తిరస్కరించాము.

ఇక నంద్యాలలో ఇల్లు తీసుకున్న పదిరోజుల్లోగా కంప్యూటర్ కొనే నిర్ణయం తీసుకున్నాము. అప్పటికి మేము మౌస్ ముట్టుకుని ఎరగం. అయినా ముందు సిస్టం కొనేసాము. వెబ్ కెమెరాతో సహా! ఆన్ లైన్ టీచింగ్ చెయ్యాలన్నది ప్రణాళిక. నెట్ కీ, ల్యాండ్ లైన్ కీ అప్లై చేశాం. యం.యస్. ఆఫీసు గట్రా కంప్యూటర్ కోర్సుల్లో చేరాము. ఇద్దరం నేర్చుకోవటం ప్రారంభించాము. మరోవైపు అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాము. లోకాయుక్తాకు వ్రాసిన లేఖకు వాళ్ళనుండి ‘రామోజీరావు ప్రైవేటు వ్యక్తిగనుక తామేమీ చేయలేమని’ జవాబు వచ్చింది. దానికి జవాబుగా ‘రామోజీరావు ప్రైవేటు వ్యక్తి అయినా, అతడి తరుపున మమ్మల్ని వేధించిన ఈ.వో., డి.ఈ.వో., శ్రీశైలంలోని ఇతర ఉద్యోగులు, సూర్యాపేటలోని వారిలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులేనని, వారి మీద చర్య తీసుకోమని’ అర్ధించాము. ‘లోకాయుక్తా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించిన కేసులు మాత్రమే చూస్తుందని మాకు తెలియదనీ, అందుచేత రామోజీరావు వ్యవహారంలో ఎవర్ని అర్ధించాలో సూచించమనీ’ వ్రాసాము. దానికి ప్రతిస్పందిస్తూ లోకాయుక్తా నుండి ఇతర ప్రభుత్వ ఉద్యోగులపై చర్య విషయంలో మౌనం పాటిస్తూ, ‘రామోజీరావు విషయంలో మానవహక్కుల సంఘాన్ని సంప్రదించమని’ సలహా ఇస్తూ జవాబు వచ్చింది. అంతకు ముందే మానవహక్కుల సంఘానికి లేఖలూ, remainder కూడా అయిపోయినందున, ఇక చేసేది లేక ఊరుకున్నాము.

ఈలోపున ఎంతో కొంత కంప్యూటర్ మీద పనిచేయటం నేర్చుకున్నాము. [మా కోచింగ్ సెంటర్ వాళ్ళు నేర్పిన దానికంటే, కూడలిలో మిత్రుల నుండి నేర్చుకున్నదే ఎక్కువ] ఆన్ లైన్ టీచింగ్ గురించి వివరాలు సేకరిస్తున్నాము. పొదుపు చేసిన సొమ్ముని జాగ్రత్తగా వాడుతూ కాలం గడుపుతున్నాము. మరో ఉపాధి వెదుక్కున్నా ఈ వేధింపు ఏదో రకంగా కొనసాగుతునే ఉంటుందన్నది అనుభవంలో నేర్చుకున్న పాఠం. ఏదో నానా అగచాట్లు పడి నిలదొక్కుకున్నాం అనుకున్నా, మరో మూడునాలుగేళ్ళు లేదా రెండుమూడేళ్ళ తర్వాత మళ్ళీ పిచ్చుక గూటిని పడగొట్టినట్లు పడగొట్టటం ఖాయం. ఇదంతా ఆలోచించి ‘అసలీ రామోజీరావుకి మానుండి ఏం కావాలి?’ అని ఆలోచించాము. ఏం అర్ధం కాలేదు. ఎందుకు మమ్మల్ని వేటాడి, వెంటాడి, వేధిస్తున్నాడు?

ఇవన్నీ ఆలోచించాక అప్పటివరకూ మాకు తెలిసిన విషయాలన్నీ, కుట్ర కోణాలన్నిటినీ అందరికీ తెలియచేయటం ఒక్కటే మార్గం అనుకున్నాము. వివిధ రంగాల్లో అతడి కుట్రనీ, సి.ఐ.ఏ., ఐ.ఎస్.ఐ. లని అతడు వాడుకునే తీరునీ, ప్రచారంలో వాళ్ళు అమలు చేసే స్ట్రాటజీలని – అన్నిటినీ అక్షరబద్దం చేసి నెట్ కెక్కించాలన్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాము. ఎవరికీ తెలియనిదీ, అప్పటి వరకూ మేం ఎవరికీ చెప్పనిదీ ఇదే! బహుశః ఇదే రహస్యం కాబోలు. ఒకసారి అందరికీ వెల్లడి చేసేస్తే రామోజీరావు ఉబలాటం కూడా తీరిపోతుంది అనుకున్నాము.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఎప్పుడైనా, ఏ గూఢచార వ్యవస్థ అయినా, తమ ఏజంట్ ఒకడు పట్టుబడినా, బ్యాలెన్స్ కోల్పోయినా, ఆ తర్వాత ఆ ఏజంట్ ను nullify చేసేస్తాయి. దెబ్బతో ఎంతగా పాప్యులర్ వ్యక్తి అయినా, గ్రిప్ కలిగిన వ్యక్తి అయినా, వెలిగిపోతున్న వ్యక్తి అయినా, fade out అయిపోతాడు. అది పత్రికా రంగంలో గోయంకాల నుండి రాజకీయ రంగంలో మురళీమనోహర్ జోషి దాకా, సినిమారంగంలోనూ, రాజకీయరంగంలోనూ కూడా ఇలాంటి ఉదాహరణలు కోకోల్లలు. అయితే, ఇక్కడ, ఈ రామోజీరావు కోసం మాత్రం, అతడి ఏజన్సీలు [సి.ఐ.ఏ.గానీ, ఐ.ఎస్.ఐ.గానీ] ఇప్పటికీ పాకులాడుతూనే ఉన్నాయి గానీ, అతడు మాత్రం తెరమరుగు కాలేదు. ఎందుకంటే – అతడే ప్రధాన వ్యక్తిగనుక! ఏజన్సీలు కూడా అతడి చేతిలో బొమ్మలేగనుక! కాబట్టే మొన్నటి బ్రిటన్ లాగా, నిన్నటి కె.జి.బి.లాగా, నేటి సి.ఐ.ఏ. కూడా ఆర్ధికమాంద్యం పైకారణంతో బలహీనపడిపోతుంది. ఈ రోజు సి.ఐ.ఏ. మాట శ్రీలంక కూడా వినని స్థితి, దాపుల్లోకి వచ్చేసింది. నకిలీ కణికుడి వ్యవస్థకి రామోజీరావు ఏమవుతాడో, అతడే దానికి అంతిమాధిపతో, లేక అతడూ అందులో ఒక ప్రధాన వ్యక్తో నాకు తెలియదు. అయితే నకిలీ కణిక వ్యవస్థకి రామోజీరావు ప్రధానవ్యక్తి అని మాత్రం ఘంటాపధంగా చెప్పగలను. ఇంకా ఈ విషయమై సహేతుక నిరూపణ తర్వాతి టపాల్లో చెప్తాను.

ఈ నేపధ్యంలో రామోజీరావు స్ట్రాటజీ గురించి, ప్రపంచవ్యాప్తంగా మానవజాతి మీద, నకిలీ కణిక వ్యవస్థ పన్నుతున్న కుట్రల గురించి, మొదట ఆంగ్లంలో వ్రాసి ‘Coups on World’ అన్న బ్లాగులో ఉంచాను. వ్రాయటానికి నాకు కొన్నినెలలు పట్టింది. ప్రతీరోజు నేను వ్రాయటం, మాపాప ఫెయిర్ చేయటం, మా వారు టైపు చేయటం. కొన్ని నెలలు రాత్రిపగలూ పాటు పనిచేసాము. ఇందులో నేను సంతోషించే విషయం ఏమిటంటే మాపాప దీన్నంతటినీ అర్ధం చేసుకుని మరీ ఫెయిర్ చేసి ఇవ్వటం. ఒక్క గీత మీద వ్రాసిన వ్యాసం, రాజకీయ రంగం మీద కుట్రలో కొంత భాగం తప్ప, మిగిలినదంతా మరీ తనకి అర్ధమయ్యాకే ఫెయిర్ చేసింది.

ఓప్రక్క ఈ పని కొనసాగిస్తూ, మధ్యలో నవంబరు, 2007 లో మేము ఢిల్లీ వెళ్ళి, రాష్ట్రపతి, Ministry of Home Affairs కి పంపిన మా కేసు గురించి విచారించాము. అప్పటికి శివరాజ్ పాటిల్ హోం మంత్రిగా ఉన్నాడు. బాబ్రీమసీదు కూలినప్పుడు ఆ జిల్లా ఎస్పీగా ఉన్న మధుకర్ గుప్తా హోంశాఖ ఛీఫ్ సెక్రటరీగా ఉన్నాడు. మేం హోంశాఖ రిసెప్షన్ లో విచారించినప్పుడు స్కందన్ అనే జాయింట్ సెక్రటరీ “ఇక్కడ జాయింట్ సెక్రటరీ లు చాలామంది ఉంటారమ్మా. రాష్ట్రపతి భవన్ నుండి ఎవరికి మార్కు చేయబడిందో తెలియదు, అంచేత రాష్ట్రపతి భవన్ లో కనుక్కో”మని చెప్పారు. మేం రాష్ట్రపతి భవన్ లోకి పాస్ వ్రాయించుకుని వెళ్ళి, మాకు లేఖ పంపిన ఆశిష్ కాలియా ని కలిసే ప్రయత్నం చేసాము. రాష్ట్రపతి సెక్రటరీ అయిన ఆయన లైన్ లోకి వచ్చారు. నేను శ్రీశైలం నుండి వచ్చానని, రామోజీరావు కేసు గురించి కొంచెం చెప్పగానే, "మీరు టీచర్ గదా!” అని గుర్తుపట్టి, "నేను అప్పుడే హోంశాఖకు పంపానే” అని అన్నారు. నేను “ఎవరికీమార్కు చేసారో కనుక్కోమని స్కందన్ అనే జాయింట్ సెక్రటరీ” అడిగారని చెప్పగా, "నేరుగా ఛీఫ్ సెక్రటరీనే కలవండి” అని చెప్పాడు. మేం వెనుదిరిగి నార్త్ బ్లాక్ కు వచ్చి ఛీఫ్ సెక్రటరీ ని కలిసేప్రయత్నం చేసాము. అతడు జాయింట్ సెక్రటరిని కలవమన్నాడు. అక్కడ చాలామంది జాయింట్ సెక్రటరీలు ఉంటారు. ప్రత్యేకంగా ఎవరిని కలవాలో చెప్పవలసిందని, మళ్ళీ రిసెప్షనిస్ట్ దగ్గర నుండి అడిగితే, ఫోన్ పెట్టేశాడు. మమ్మల్ని రీసీవ్ చేసుకునేందుకు ఎవరు సుముఖంకాకపోవటం, నువ్వంటే నువ్వు కలువు అనుకుంటూ అధికారులు మమ్మల్ని avoid చేసే ప్రయత్నం చెయ్యటం ఇంతకు ముందు మేం చూశాం. 2001 లో నల్గొండలోని ఎస్పీ, ఎ ఎస్పీ దగ్గరనుండి 2007 లో CBCID, IG, అతడి క్రింది అధికారుల దగ్గర దాకా!

దాంతో ఇక మా ఫైల్ ని హోంశాఖ లో ఇచ్చి రసీదు పుచ్చుకుని వచ్చేసాము. ఆ ఫిర్యాదులో రాష్ట్రపతి వ్రాసిన లెటర్ జోడించి, మా కేసులో అప్పటివరకూ జరిగిన అన్ని వివరాలు పొందుపరిచాము. దాదాపుగా 97 ఫిర్యాదులు ఎప్పుడు ఎవరికి ఇచ్చిందీ, వాటి పూర్యాపర సంఘటనలు, వాటి పోస్టేజ్ రసీదులు, తేదీల వివరాలు కూడా సమర్పించాము. కేసుని అర్ధం చేసుకునేందుకు కాలగతాను సారం Events List వ్రాసాము. ఏ సంవత్సరం, ఏతేదిన ఏం జరిగిందీ, ఆ వివరాలు ఏ Ref.No. తో ఉన్నాయి, ఇలాగన్నమాట. తిరిగి నంద్యాల వచ్చాక నెల ఎదురు చూశాము. మళ్ళీ పి.ఎం.కి మరో ఫిర్యాదు, 2007, డిసెంబరు 17 న వ్రాసాము. మరోసారి అన్నిటినీ క్రోడీకరించి వ్రాసాము. దీనికి ప్రతిస్పందనగా, జనవరి 17, 2008 వతేదిన హైదరాబాదు సి.ఐ.డి. డిపార్ట్ మెంటు నుండి వచ్చానంటూ జోసెఫ్ అనే అధికారి మమ్మల్ని కలిసాడు. “ఎవరు వీళ్ళు? పి.ఎం.ని అపాయింట్ మెంట్ అడుగుతున్నారు” అని ఎంక్వయిరీ చేయమన్నారట. అందుకు వచ్చాడట. ‘మరి అంతకు ముందు CBCID, IG ఏం ఎంక్వయిరీ చేశాడో, కర్నూలు ఎస్పీ, శ్రీశైలం సి.ఐ. కలిసి స్టేట్ మెంట్లల్లా తీసుకుని ఏం ఎంక్వయిరీ చేశారో’ నాకు తెలియదు. అదే అతడితో అన్నాను. “ఒక అధికారి ఎంక్వయిరీ అంటు వస్తాడు. క్రిందివాళ్ళు వేధిస్తూనే ఉంటారు. మళ్ళీ మరొకరు వస్తారు. ఇదీ మాకు అలవాటే” అని చెప్పాను. అతడు ఎంతో సహృదయంతో మమ్మల్ని విచారించాడు. “ఇంతకీ ఎందుకు పి.ఎం. అప్పాయింట్ మెంట్ కోరుతున్నారు?" అని అడిగాడు. “నేను కోన్ కిస్కా గొట్టం, సామాన్యమైన సిటిజన్ నే కావచ్చు, కానీ నేను తీసికెళ్ళిన విషయం కోన్ కిస్కా కాదు. అది దేశం మీద కుట్రలయినా, ఎంసెట్ కుంభకోణాలయినా. అలాగే రామోజీరావు కూడా కోన్ కిస్కా గొట్టం కాదు. నేను నధింగ్ కావచ్చు. రామోజీరావు, అతడి గూఢచర్యం, కుట్రలూ కూడా నధింగా? ఇది అడుగుదామనే అప్పాయింట్ మెంట్ అడిగాను. శ్రీశైలంలో ఎంక్వయిరీ లంటూ స్టేట్ మెంట్లు తీసుకుని నాకు ‘పిచ్చి’ అని వ్రాసాడట అక్కడ సి.ఐ., స్టేట్ మెంట్ల వంక చూపెట్టి దేవస్థానం మాత్రం మా Accommodation ని, occupation ని నాశనం చేసేసింది” అన్నాను.

అతడు “అమ్మా! నేను పాజిటివ్ రిపోర్టు వ్రాస్తాను. ఆ పైన పైఅధికారుల ఇష్టం” అని సెలవు పుచ్చుకుని వెళ్ళాడు. ఇక్కడ ఒక కొసమెరుపు ఏమిటంటే – వై.ఎస్.మీద, CBCID IG మీద కూడా కలిపి కంప్లైంటు పి.ఎం.కి పెడితే, దాని ఎంక్వయిరీ వై.ఎస్.ప్రభుత్వానికే పంపటం. అంటే ‘నీ మీద కంప్లైంటు పెట్టారు. వాళ్ళని ఒక చూపు చూడు’ అని చెప్పడమా?’ ఇది జరిగి సంవత్సరం నాలుగునెలలు దాటింది. ఈవివరాలన్నీ Coups on World లోని Documentary Evidence లో వరుసగా పొందుపరిచాను. చేతివ్రాతతో వ్రాసిన ఫిర్యాదులని, తెలుగులో వ్రాసిన వాటిని ఇంగ్లీషులోకీ అనువదించి, టైపు చేసి ఉంచాను. అవసరమైన వాటిని స్కాన్ చేసి ఉంచాను.

జీవితంలో 2007 మజిలీ దగ్గరికి వచ్చేసరికి, మిగిలింది ఇద్దరే ఇద్దరు స్నేహితులు. ఒకరు గుంటూరులోని మావారి స్నేహితుడు. ఇతడు చిన్న ఉద్యోగి. 2001 లో సూర్యాపేట నుండి మేం రోడ్డుకి తరమబడినప్పుడు మమ్మల్ని తన ఇంటిలో నెలరోజులు అట్టిపెట్టుకుని ఆదుకున్నాడు. ఊరి చివర వాళ్ళ స్వంతదైన చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు.

అద్దెకు ఇచ్చుకుంటే నెలకు 600/-Rs. వచ్చే రేకుల గది ఒకటి మాకు కేటాయించి, నెలరోజుల పాటు మమ్మల్ని పోషించిన అతడి పట్ల మాకు చాలా కృతఙ్ఞత ఉండేది. శ్రీశైలంలో స్థిరపడ్డాక ఇలా మాకు సాయం చేసిన కొందరికి మా కృతఙ్ఞతలు తెలుపుకుంటూ, వారిచ్చిన డబ్బుని బ్యాంకు డిడిల రూపేణా తిరిగి పంపించాము. కొందరు మిత్రులు శ్రీశైలం వచ్చినప్పుడు, వారికి బట్టలుపెట్టి, అతిధిమర్యాదలు జరిపి మా కృతఙ్ఞత చెప్పుకున్నాము. అప్పట్లో ఈ గుంటూరు మిత్రుడు కూడా కుటుంబ సమేతంగా శ్రీశైలం వచ్చి వెళ్ళాడు.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

1 comments:

వచనం బాల కదాపి, అంటారు.

కానీ దీన్ని మరిపించడానికే చిన్నా,పెద్దా తేడాలు సృష్టించబడ్డాయి.

అంటే చిన్నవాడు పెద్దవాళ్ళని ఏమీ అనకూడదు. ముఖ్యంగా డబ్బున్న వాడిని అసలు అనకూడదు.
మనకన్నా పెద్దవాళ్ళైతే మనమే పిల్లల చేత పొర్లు దండాలు పెట్టిస్తాం, అదే మనకన్న్నా తక్కువ వాళ్ళు వస్తే పిల్లలున్నా మనమే అవమానకరంగా మాట్లాడుతాం. ఇంక వాళ్ళేం నేర్చుకుంటారు? అదే నేర్చుకుంటారు. తనకన్నా పెద్దవాడికి వంగి వంగి సలాములు కొట్టడం, తనకన్నా చిన్నవాడైతే అవమానిస్తూ ఎంజాయ్ చెయ్యడం.


మనకిప్పుడు చెప్తున్న ధైర్యం అనే మాటకి అసలు అర్ధం పిరికితనం. చెట్టు వేరు , కాయలు వేరు .

తన తండ్రి చంపుతానన్నా , తప్పు చేస్తున్నాడని ధైర్యంగా చెప్పాడు ప్రహ్లాదుడు. అలాంటి ధైర్యం కావాలి యువతకి, జనరేషన్ X కి
కానీ ఇప్పుడు ఎన్ని తప్పులు చేసినా నా తండ్రి గొప్పవాడు, నా తల్లి ఉత్తమురాలు అని చెప్పుకునే వాళ్ళు బయలుదేరారు. కానీ ఏం చెస్తాం వీళ్ళే రేపటి ప్రధాన మంత్రులు, ముఖ్య మంత్రులు అంట.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu