ఓ ప్రక్క చంద్రబాబు నాయుడు ఎంతో హుందాగా ఆలోచించి ఓటు వెయ్యమన్నాడు. ‘ప్రజల మేలు కోరే వారొకరు, పీడించేవారు మరొకరు’ అంటూ చంద్రబాబు నాయుడి ఫోటోతో పెద్దవార్త, నిన్నటి [23 ఏప్రియల్,2009 ] ఈనాడు 10 వ పేజీలో ఉంది. దానికి పైన, ‘వై.ఎస్. మహాజోస్యం: రెండోదశలో 140 స్థానాలు మావే’ అంటూ వై.ఎస్. కార్టూన్ తో మరోవార్త ఉంది. ఆ కార్టూన్ లో వై.ఎస్.ముఖంలో మహా విలన్ ఫోజు ఉంది. ఇదీ మీడియా దేన్నైనా Project చేసే తీరు! తాము హీరోలని చెయ్యదలుచుకున్న వారిని హుందాగా ఉన్నట్లు, అప్పటికి జీరోలని చెయ్యదలుచుకున్న వారిని కమేడియన్ల లాగానో లేక విలన్ల లాగానో పత్రికలు Project చేస్తాయి. అందులో వింతేమీ లేదు. మీడియా నందిని పందిగా ప్రచారించగలదు, అవసరమైతే అదే పందిని నందిగా మళ్ళీ ప్రచారం ఇచ్చి ఒప్పించగలదు. ఇది మనకి మామూలైపోయింది కాబట్టి అందులో వింతేమీ లేదు.

మరయితే వింతేమిటి? చంద్రబాబు నాయుడు హుందాగా మాట్లాడటం వింతకాదు, వై.ఎస్. అడ్డగోలుగా మాట్లాడటం, ప్రవర్తించటం వింత. ఇదేపరిస్థితి 2004 లోనూ ఉండింది. అయితే అప్పుడు వై.ఎస్. హుందాగా మాట్లాడాడు, చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడాడు. ఇది రెట్టింపు వింత.

అయితే 2004 లోనూ, 2009 లోనూ వ్యక్తులు కుర్చీలు మారారు గానీ, స్ట్రాటజీ మాత్రం అదే. పాశ్చాత్యులలో ఓ సామెత ఉందని అంటారు. అదేమిటంటే ‘When the rape is unavoidable, enjoy it’. అలాంటిదే ఈ స్ట్రాటజీ కూడా! ‘ఓడిపోవటం తప్పని సరైనప్పుడు మరింత ఘోరంగా ఓడిపో’ అన్నది రాజకీయనాయకుల స్ట్రాటజీ, లేదా వారికి వచ్చే Assignment. కాబట్టే 2004 లో చంద్రబాబు నాయుడు ఘోరంగా[50 సీట్లు వచ్చాయి అంతే] ఓడిపోయాడు. అందుకోసం ఎన్ని అడ్డగోలు ప్రకటనలు చేశాడో, ఎన్ని వ్యూహాత్మక తప్పిదాలు చేశాడో, ఎంతగా ఎదుటిపక్షానికి గెలుపు అవకాశాలు చేజేతులా ఇచ్చాడో, ఎంతగా suicidal assignments నిర్వహించుకున్నాడో అతడికి మాత్రమే తెలుసు. అతడికే గుర్తుంటాయి. ఇప్పుడా పాత్ర వై.ఎస్. ది అయ్యింది. అందుకే అంత అడ్డగోలు ప్రకటన, ప్రవర్తన చేశాడు.

లేకపోతే – అసలు పోలింగే జరిగేదే 140 సీట్లకి. అందులో కుప్పం నుండి చంద్రబాబు, తిరుపతి, పాలకొల్లు నుండి చిరంజీవి పోటీ చేస్తున్నారు. వాళ్ళతోసహా, అన్నిస్థానాల్లో, ప్రతిపక్ష అభ్యర్ధులందరూ 100% ఓడిపోతారా? అన్నిచోట్లా 100% కాంగ్రెస్సే గెలుస్తుందా? 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు ఎంత impractical గా మాట్లాడటం ఇది? ఎంత అతిశయోక్తి అలంకారం అని సరిపెట్టుకుందామన్నా కూడా వీలుపడని అవాస్తవిక ప్రకటన అది. ఏదైనా జరిగితే 120 సీట్లు ఖాయమట.

ఇక రెండో విషయం: ‘చిరుపై టార్గెట్’ అన్న హెడ్డింగ్. తిరుపతిలో చిరంజీవి రూమ్ తనిఖీ చేస్తామని మొదట డి.ఎస్పీ., సి.ఐ.లు వచ్చారట. చిరంజీవి ఒప్పుకోలేదట. మీడియా సమక్షంలో అయితే తనిఖీ చేయటానికి తాను ఒప్పుకుంటానని అనగా, పోలీసులు వెళ్ళిపోయారట. తరువాత ఎ.ఎస్.పి. అమ్మిరెడ్డి వచ్చి చిరంజీవి కూతురు, కొడుకు గదులు తనిఖీ చేసాడట. చిరంజీవి గదిని కూడా తనిఖీ చేస్తానని, అది నిబంధల ప్రకారం ఎన్నికల ముందు తనిఖీ మాత్రమేనని అనగా చిరంజీవి ‘మీడియా సమక్షంలో అయితే తను మొదటే ఒప్పుకున్నానని, ఇప్పుడయినా మీడియా సమక్షంలో అయితే తనకి అభ్యంతరం లేదని’ చెప్పగా, ఎ.ఎస్పీ.అమ్మిరెడ్డి వెంటనే తను తనిఖీకి రాలేదని ప్లేటు ఫిరాయించాడట. మరి నిబంధనల ప్రకారం తనిఖీ అయినప్పుడు మీడియా ఉంటే పోలీసులకు ఉన్న అడ్డంకి మాత్రం ఏమిటి? పోలీసులకి చిరంజీవి గదిని తనిఖీ చెయ్యటమే లక్ష్యం అయి ఉంటే ఖచ్చితంగా తనిఖీ చేసిఉండేవాళ్ళు. అక్కడ వివాదం[Rupture] అయ్యేటట్లు ప్రవర్తించటమే పోలీసుల లక్ష్యంలా ఉంది. అలాగే అనవసరంగా కాంగ్రెసు పార్టీ వాళ్ళు చిరంజీవి ఉన్న హోటల్ ముందు గలాబా చేయటం అవసరం లేని చర్య. ఇవన్నీ ఊహాత్మక తప్పిదాలు. ఈ చర్యల వల్ల ప్రజల్లో కొద్దిగొప్పో ఉన్న గౌరవం కూడా వై.యస్. పోగొట్టుకున్నాడు. అంటే ‘ఓడిపోవడం తప్పని సరి అయినప్పుడు మరింత ఘోరంగా ఓడిపోవడం’ అన్న స్ట్రాటజీ అన్నమాట. ఇవే కాదు ఇలాంటి సంఘటనలు జిల్లా స్థాయిలో చాలా జరిగాయి. ఆవి జిల్లా ఎడిషన్లలో వచ్చాయి.

ఇలా అడ్డగోలు ప్రకటనలూ, వ్యూహాత్మక తప్పిదాలతో మరింత ఘోరంగా ఓడిపోయే పని స్వయంగా చేసుకుంటున్నాడు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తోంది. కేంద్రమంత్రులెవ్వరూ ప్రచారానికి రాలేదు. పి.సి.సి. అధ్యక్షుడై ఉండి కూడా డి.ఎస్. ప్రచారం చేసిందీ, గెలుపుకీ కృషి చేసిందీ అంతగా కనపడదు. సీనియర్లు గైర్హాజరు! తప్పిందమంతా ఒంటెత్తుపోకడ పోయిన వై.ఎస్.దే. మరి అతణ్ణి అంతగా ఒంటెత్తు పోకడ PCC పార్టీ అధ్యక్షుడు, AICC అధ్యక్షురాలు ఎందుకు పోనిచ్చినట్లు? అంతగా వై.ఎస్., ‘సీతయ్య’నా? ఎవ్వరిమాట వినడా? సోనియా మాట కూడా వినడా?

ఇదంతా ఏమిటి? వీరందరినీ, ఈ రాజకీయ నటీనటులందరినీ తెరవెనుక నుండి నడిపిస్తున్న రాజకీయ దర్శకుడు ఇచ్చిన స్ర్కిప్టా? ఎవరి డైలాగ్ వాళ్ళకి ఇచ్చినట్లున్నాడు! కొందరికి అవి హుందాప్రకటనలు. మరికొందరికి అడ్డగోలు ప్రకటనలు. కొందరికి Prosperous Assignments , మరికొందరికి suicidal assignments!

బహుశః హంగ్ అసెంబ్లీ వస్తే, MLA తలలు కొనలేక, సర్ధుబాట్లు చేయలేక, నియంత్రించలేకా… ఈ కింగ్ మేకర్ కి, రాజకీయ దర్శకుడికీ తలప్రాణం తోకకి వస్తుందని కాబోలు. అందుకే ‘ఓడిపోవటం తప్పనిసరై నప్పుడు మరింత ఘోరంగా ఓడిపో’ అన్న సూచనలు వస్తుంటాయి.

పోలింగ్ ముగిసింది. ఇక సస్పెన్స్ తీరాలంటే మే 16 వరకూ ఆగాల్సిందే మరి.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

12 comments:

Are you mentally sick?

good one,
Please try to enable feed bitz subscription for your blog sothat we can know the new posts as you post it.

‘ఓడిపోవటం తప్పనిసరై నప్పుడు మరింత ఘోరంగా ఓడిపో’

Well said. Good observation. Power corrupts, absolute power corrupts absolutely. Samuel Reddy in about 5 years pave the way for Christianizing Andhra Pradesh. If the conversion go unchecked, in next 50 years you will Christian Andhra.

వైస్ నిజం గా చిత్తు చిత్తు గా వొడిపొతాడంటారా ? నాకు డౌటె.
నిజమె, లాస్ట్ రెండు వారాల్లొ వైస్ ప్రవర్తన, మట్లాడె తీరు చాలా అశ్చర్యం కలిగించాయి.

మనోహర్ గారు,
అంత సాంకేతిక పరిఙ్ఞానం నాకు లేదండి. ఎలా చేయాలో చెబితే ప్రయత్నిస్తాను. కృతఙ్ఞతలు.

మంచుపల్లకీ గారు,

ఎవరికెన్ని సీట్లు వస్తాయో గాని, హంగ్ దిశలో పయనం కనిపిస్తోంది. ఏంజరుగుతుందో చూద్దాం!

మంచుపల్లకీ గారు,

మీరు చెప్పిన వాటి గురించి వివరాలు నాకు తెలియవండి! ఇంతకీ మీది ఏఊరు? ఆ విషయం ఏఊరులో జరిగింది?

రామోజి - గూఢచర్యం గురించి ఇక్కడ ప్రస్తావించారు చూడంది.
http://telugu.greatandhra.com/cinema/20-04-2009/nin_24.php

మీరు వుండవల్లి గారిని నమ్మితె ఒక్కసారి మీ సాక్షాలు అతనికి షెర్ చెస్తె బాగుంటుంది.

మంచుపల్లకీ గారు,

వేచి చూస్తే మీకే చాలా విషయాలు తెలుస్తాయి.

మనోహర్ గారు - Feed is already enabled on this blog. You may use this link: http://ammaodi.blogspot.com/feeds/posts/default

thanks yogi garu

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu