మే 21, 1991 లో రాజీవ్ గాంధీ హత్యగావింపబడినప్పుడు యావద్భారత దేశం నిర్ఘాంత పోయింది. దాదాపు స్తంభించి పోయింది. ప్రపంచానికి అది దాదాపు తొలి మానవబాంబు. ఇప్పుడంటే ప్రపంచంలో ఎన్నోచోట్ల మానవబాంబులూ, ఆత్మాహుతిదాడులూ, సాధారణం అయ్యాయి. ఇప్పుడు ఐ.ఎస్.ఐ., ముస్లిం తీవ్రవాద సంస్థలు ఏవిధంగా పసి బిడ్డల బ్రెయిన్ వాష్ చేసి ఆయుధ ప్రయోగాలూ, ఆత్మాహుతులూ, మతోన్మాదం, హింసోన్మాదం తలకెక్కిస్తున్నయో అందరికీ తెలిసిందే. ఒక్కసారి క్రింది ఫోటోని గమనిస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధమౌతుంది.



పాలు గారే పసిబుగ్గల చిన్నారులు అమ్మఒడిలో కూర్చోని చందమామని చూస్తూ, గోరుముద్దలు తింటూ, కథలు వినాల్సిన వయస్సులో, పలకా బలపం పట్టి అమ్మా ఆవు అంటూ వాళ్ళ భాషలో చదువుకోవలసిన వయస్సులో ఎవరికి ఏం దోచిపెట్టడానికి, ఎవరి ప్రాణాలు తీయటానికి, ఎవరి చేతిలో పావులవ్వడానికి తుపాకులు చేతబట్టి కఠోర కౄర శిక్షణ పొందుతున్నట్లు? LTTE కూడా ఈ పద్దతిలోనే ‘ధనూ’లాంటి వారిని తయారు చేసింది. పసిబిడ్డల్ని మానవమృగాలుగా మార్చేందుకు కుట్రదారులు పేదదేశాలని, పేద కుటుంబాలని ఎన్నుకుంటున్నాయి. పాక్, ఆఫ్గాన్ లో కేంద్రాలుగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల్లో ఉన్నవారిలో అత్యధికులు పిన్న వయస్కులే నన్న విషయం ఇప్పుడు ప్రపంచమంతటికీ తెలుసు. అయితే ఆరోజుల్లో మానవబాంబులూ కొత్తే. ఆర్.డి.ఎక్స్. కొత్తే. ఆర్.డి.ఎక్స్. కేవలం సి.ఐ.ఏ. దగ్గర మాత్రమే ఉందనే వారు. ఇప్పుడు ప్రపంచమంత టన్నుల కొద్దీనో, కుప్పులుగానో దొరుకుతోంది.

1991, మే 21 తర్వాత రాజీవ్ గాంధీ హత్య గురించీ, ఎల్.టి.టి.ఇ. గురించీ, ఎల్.టి.టి.ఇ. బృంద సభ్యులైన ధనూ, శివరాసన్, శుభ, మురగన్, నళినిల గురించీ, సి.బి.ఐ. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్[SIT] గురించి, దాని ఛీప్ కార్తికేయన్ గురించి మీడియాలో ప్రతీరోజూ ఎన్నో ఆసక్తికరమైన కథనాలు వచ్చేవి. అందులో ఈనాడు ఎప్పుడూ ఒకడుగు ముందే ఉండేది. [ఈనాడు ఈమధ్యే సమాచారం, కథనాలు ప్రచురించటంలో వెనకబడి ఉంది. ఎందుకో? ఆంధ్రజ్యోతి ముందుకు దూసుకుపోతుంది.]

అలాంటి ఆసక్తికర కధనాల్లో కొన్ని: శివరాసన్, ధనూ శ్రీపెరంబుదూర్ చేరేందుకు కొంతదూరం లారీలో ప్రయాణించారనీ, ధనూ రాజీవ్ ని హత్యచేసేందుకు, తనను తాను పేల్చుకునే ముందు, కొద్దిసమయం గణేష్ మందిర్ లో ప్రార్ధనలు చేసిందనీ [దుష్టుడికి దైవం సాయం చేస్తుందా?], రాజీవ్ సమీపంలోకి చేరేందుకు ధనూ ఒక మహిళా కానిస్టేబుల్ కి 500/-రూ. లంచం ఇచ్చిందనీ, ధనూ శివరాసన్ లు రాజీవ్ హత్యకు ముందు వీ.పి.సింగ్ బహిరంగ సభలో మాక్ డ్రిల్ నిర్వహించారనీ, జయంతీ నటరాజన్ వంటి కొందరు తమిళనాడు రాజకీయనాయకులు హంతక బృందానికి సహకరించారని – ఇలా వివిధ కథనాలు మీడియాలో వచ్చాయి. ఇప్పుడు జయంతీ నటరాజన్ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారిక [స్పోక్స్ పర్సన్] ప్రకటనకర్తగా ఉంది.

శ్రీపెరంబుదూర్ కు చేరేముందు రాత్రి రాజీవ్ గాంధీ విశాఖపట్నంలో బహిరంగ సభల్లోనూ, ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నాడు. అప్పుడు అతడు ప్రయాణించాల్సిన విమానంలో ఏదో సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో మరునాటి కార్యక్రమాన్ని రద్దు చేసుకొని అతడు అతిధి గృహానికి విశ్రాంతి నిమిత్తం వెళ్తూండగా విమానం మరమ్మత్తు అయ్యిందనీ, ప్రయాణం కొనసాగించవచ్చుననీ అతడికి వర్తమానం వెళ్ళింది. దాంతో అతడు వెనుదిరిగి వచ్చి, తన మృత్యువును కలుసుకునేందుకు శ్రీపెరంబుదూర్ కు ప్రయాణించాడు. అతడి తమిళనాడు పర్యటన మే17 వ తేదిన ఖరారు అయ్యింది. ఆనాటి తమిళ కాంగ్రెస్ నేతలు వాళ్ళప్పాడి రామమూర్తి, ఇతరులూ అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రి కరుణానిధి నేతృత్వంలోని ఆనాటి డి.ఎం.కె. ప్రభుత్వం హెచ్చరిక చేసినా కూడా అంత హఠాత్తుగా రాజీవ్ గాంధీ ప్రచార కార్యక్రమం ఎందుకు ఖరారయ్యింది? ఈ సందేహాలు 2008, ఏప్రిల్ నెలలో రాజీవ్ గాంధీ సోనియాల కుమార్తె ప్రియాంకా వాద్రా వెల్లూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న, రాజీవ్ గాంధీ హంతక ముఠాలో ఒక సభ్యురాలైన నళినిని సందర్శించిన వార్తల నేపధ్యంలో మరోసారి పత్రికల్లో వార్తలుగా వచ్చాయి. నళిని 16 ఏళ్ళుగా వెల్లూరు జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈమెకు క్షమభిక్ష పెట్టాడానికి, ఈమె కుమార్తె చదువుకీ సోనియా గాంధీ విశాల హృదయంతో సహాయం చేసింది. రాజీవ్ గాంధీ ని హత్య చేసిన వారి వెనుక ఉన్న అసలు సూత్రధారుల గురించి, వాళ్ళు నన్ను వేధిస్తున్న నేపధ్యం గురించి అన్ని సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన నా పట్ల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, వేధింపు కొనసాగిస్తోంది. సోనియా గాంధీ, నా ఫిర్యాదు తనకు far ward చేసిందంటూ దిగ్విజయ సింగ్ వ్రాసిన లేఖ, తర్వాత పర్యవసానాలకి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు Coups On World లో పొందుపరిచాను.

ఇక 1991 నాటికి వస్తే – రాజీవ్ గాంధీ తమిళనాడు ప్రచార కార్యక్రమాన్ని అంత అర్జంటుగా ఖరారు చేసిందెవరు? దీన్ని గురించి హంతక ముఠాకి సమాచారం ఇచ్చిందెవరు? మే20 రాత్రి విశాఖలో విమానాన్ని ఆఘమేఘాల మీద మరమ్మత్తు చేయించిదేవరు? – ఈ ప్రశ్నలన్నీ నళిని తరుపు డిఫెన్స్ న్యాయవాది దొరైస్వామి సంధించగా 16/04/08 నాటి మీడియాలో, వార్తాపత్రికల్లో అందరూ చదివిందే. ఇక రాజ్ నాధ్ సింగ్ భాజపా అధికారంలో ఉండగా 50 దేశాలకి ఈ విచారణ నిమిత్తమై లేఖలు వ్రాసామని, యు.పి.ఏ. ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ తొక్కిపెట్టిందనీ ప్రకటించాడు. దీని భావమేమి తిరుమలేశా?[వాటికానేశా?] అయిదేళ్ళుగా భర్త హత్యవెనుక నిజాన్ని వెలికి తియ్యాలని అన్పించలేదా? పైగా ఎల్.టి.టి.ఇ. ప్రభాకరన్ పట్టుబడే స్థితి వచ్చేసరికి కరుణానిధి ఎంత అల్లల్లాడిపోయాడో, యు.పి.ఏ. ప్రభుత్వాన్ని ఎంత ఒత్తిడి చేశాడో, అందరికీ తెలిసిందే. తదనుగుణంగా యు.పి.ఏ. ప్రభుత్వం ఎంత అగ్గగ్గిలాడిందో, ప్రణబ్ ముఖర్జీ, శివశంకర్ మీనన్ లు కొలంబో చుట్టూ ఎన్ని పరుగులు పెట్టారో కూడా అందరికీ తెలిసిందే.

ఇక 1991 లో రాజీవ్ హత్యానంతరం ఈనాడు ప్రచురించిన కథనాలు మిగిలిన అన్ని పత్రికల కథనాల కంటే ఆసక్తికరమైనవీ, ఉత్కంఠభరితమైనవి.

అలాంటి వాటిలో ఒకటి – రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఎడతెగని బిజీ షెడ్యూల్ తో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. హత్యకు ఒక రోజు ముందు వరుసగా వెళ్తున్న కార్ల కాన్యాయ్ హఠాత్తుగా ఆగింది; రాత్రి భోజనం నిమిత్తం. షీలా దీక్షిత్ వడ్డించగా రాజీవ్ గాంధీ అప్పటికి చల్లగా అయిపోయిన అరటి బజ్జీలతో భోజనం అయ్యిందనిపించారు.

మరొకటి: హత్యకు కొన్నిగంటలు ముందు రాజీవ్ గాంధీ ఢిల్లీలో ఉన్న తన భార్య సోనియా గాంధీతో ఫోనులో మాట్లాడాడు. ’ఈనాడు’ ప్రజెంటేషన్ ప్రకారం “ఫోనులో భర్త ఉత్సాహపూరితమైన కంఠాన్ని విన్న కొద్దిగంటల లోపే ఆమె అతడి మరణాన్ని గురించిన దారుణ వార్త విన్నారు”. ఇందులో ఎవరు ఎవరికి ఫోన్ చేశారో తెలియదు. రాజీవ్ గాంధీయే భార్యతో క్షేమసమాచారమో, ఇష్టాగోష్టో మాట్లాడేందుకు ఫోన్ చేశాడో లేక సోనియా గాంధీయే, రాజీవ్ గాంధీ తర్వాతి షెడ్యూల్ గురించి [శ్రీపెరంబుదూర్ వెళ్ళవలసిన] వివరాలు కనుక్కొనేందుకు ఫోన్ చేసిందో తెలియదు.

ఇంకా ఆసక్తి కరమైన మరొక కథనం: అది మద్రాసు నగరం [అప్పటికి మద్రాసు అనే పిలిచేవారు. ఇప్పుడు చెన్నై అయ్యింది.] శివార్లలోని భాగ్యవంతుల కాలనీ. సిట్[SIT] కి రాజీవ్ గాంధీ హత్యను నిర్వహించిన శివరాసన్ బృందం ఆ కాలనీలోని ఓ ఇంటిలో తలదాచుకుందని సమాచారం అందింది.[ఆరోజు వార్తాపత్రికలో ఆ కాలనీ పేరు కూడా వ్రాసారు. అప్పట్లో యధాలాపంగా చదవటంతో ఆకాలనీ పేరు మరిచిపోయాను. 1991 జూన్ చివరి వారంలో లేదా జులై మొదటి వారంలో ప్రచురింప బడిన కథనం ఇది.] సమాచారం అందిన వెంటనే సిట్ బృందం ఆ కాలనీ చేరుకొని శివరాసన్ ముఠా తలదాచుకుంటున్న రెండంతస్థుల భవనాన్ని చుట్టుముట్టింది. పోలీసులు ఆ ప్రాంతంలోని అంగుళం అంగుళం వెదికారు. మూడు గంటల పాటు తనిఖీ సాగింది. చుట్టుప్రక్కల అంతటా ఉత్కంఠ నిండింది. కాలనీ వాసుల్ని సిట్ బృందం ప్రశ్నించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసింది. ఇంత చేసినా చీఫ్ కార్తికేయన్, సిట్ సభ్యులు, పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. శివరాసన్ జాడ తెలుసుకోలేక పోయారు. దొరికినట్టే దొరికి తృటిలో చేజారినట్లుయ్యింది. శివరాసన్ ని బంధించే అవకాశం చేజారటంతో నిరాశతో పోలీసులు వెనుదిరిగారు. మూడు నాలుగు గంటలపాటు కాలనీ వాసులంతా ఊపిరి బిగబట్టారు. అయితే మిగిలిన వారు తప్పించుకోగలిగారు గానీ శివరాసన్ అప్పటికీ ఆ భవనంలోనే ఉన్నాడు. సిట్ బృందం, పోలీసుల తనిఖీ జరుగుతున్నంత సేపు మూడు నాలుగు గంటలపాటు శివరాసన్ ఓవర్ హెడ్ ట్యాంకు క్రింద నక్కి ఉన్నాడు.

ఈ కథనం అంతా ఎంత ఆసక్తికరంగా వ్రాయబడిందంటే ఏదో స్పై నవలలోనో, సినిమాలోనో చూసే సస్పెన్స్ సీన్ లాగా ఉత్కంఠభరితంగా వ్రాయబడింది. ఎంతో చదివించే విధంగా[readabilityతో] శివరాసన్ అద్భుతసాహసాన్ని, సిట్, కార్తికేయన్ ల వైఫల్యాన్ని ఈనాడు వివరించింది. ఇది చదివిన ఎవరికైనా శివరాసన్ సాహసం, నైపుణ్యం గొప్పగా ఉన్నాయనీ, సిట్ బృందం అసమర్ధతతో ఉందని అన్పిస్తుంది. అలా పాఠకులని ప్రభావపరచడమే ఆ వ్రాతల ఉద్దేశం, ఆ పత్రికాధిపతి రామోజీరావు సంకల్పం.

ఈనాడు సృష్టించిన ఆ ట్రెండుని ఇతర పత్రికలు అనివార్యమయ్యో, అవసరమయ్యో, ఇచ్ఛాపూర్వకంగానో అనుసరించేవి.

ఇంకొన్ని కథనాలు ఎల్.టి.టి.ఇ. సభ్యుల గురించి, వారి రిక్రూట్ మెంట్స్, శిక్షణల గురించి ఉండేవి. అప్పట్లో పొటాషియం సైనేడ్ గుళికలు ప్రజలకి చాలా కొత్త. పట్టుబడే స్థితిలో అ గుళికలు మింగి ప్రశ్నల్ని ఎదుర్కొనే బదులు మరణానికి ఎదురువెళ్ళటం అన్న ప్రక్రియ మరింత కొత్త. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా ఈ ప్రక్రియల గురించి కథనాలు వ్రాయబడేవి. ఈ కథనాలన్నింటి వెనుకా ఉన్న రామోజీరావు ఇంట్యుషన్[సంకల్పం] ఒకటే – ఎల్.టి.టి.ఇ., సి.ఐ.ఏ.లు అత్యంత శక్తివంతమైనవనీ, భారత్ కంటే అవి చాలా సమర్ధవంతమైనవనీ ప్రజలకి బ్రెయిన్ వాష్ చేయటమే. ఏవిధంగా చూసినా భారత్ వాటిని నిలువరించలేదనీ, ఎల్.టి.టి.ఇ., సి.ఐ.ఏ.లు భారత్ ని ఏమైన చేయదలిస్తే భారత్ తనని తాను రక్షించుకోలేదనీ, ఎల్.టి.టి.ఇ., సి.ఐ.ఏ. గట్రాలు తలచుకుంటే ఏమైనా చేయగలవని గట్రా. తరువాత ఎల్.టి.టి.ఇ. స్థానంలోకి ముస్లిం ఉగ్రవాద సంస్థలు చేరాయి.అంతే తేడా!] ఇది సాధించేందుకు, Public attitude ని ట్యూన్ చేసేందుకు రామోజీరావు వ్రాతలు శక్తివంచన లేకుండా పనిచేసేవి.

ఆనాటి మీడియాలో ప్రచురితమైన, జరిగిన మరికొన్ని అంశాలు ఏమిటంటే – రాజీవ్ గాంధీ హత్య జరిగిన కొన్ని గంటల వరకూ అసలే విషయమూ ఎవరికీ తెలియదు. బాంబు ఎలా పేలింది, ఎవరు పేల్చారూ, ఎలా హత్య జరిగింది అన్న విషయలేవీ బయటికి రాలేదు. కొన్ని గంటలు తర్వాత ఒక వీడియో గ్రాఫర్ దగ్గరినుండి క్యాసెట్ కనుగొన బడింది. యాదృచ్చికంగా సన్నివేశాన్ని చిత్రీకరించిన వీడియో గ్రాఫర్ భయంతో ఇంటికి పారిపోయాడనీ, పోలీసుల ఎంక్వయిరీలో క్యాసెట్ సేకరించారనీ వార్తలొచ్చాయి. ఆ వీడియో టేపునుండే దండచేతిలో ధరించి నిలబడి ఉన్న ధనూ ఫోటో, శుభ ఫోటోలు ప్రపంచానికి తెలిసాయి. ఆ తర్వాతే ధనూ, శుభ, శివరాసన్ ల గురించీ, వారు హత్యని ఎలా నిర్వహించారో, ఏంజరిగిందో ప్రజలకి తెలిసింది. అయితే రాజీవ్ హత్య ఎలా జరిగిందో తెలిసింది గానీ ఎందుకు జరిగిందో, ఎవరు జరిపించారో మాత్రం ఇప్పటికీ ప్రజలకి తెలియదు. 1992 నుండి 16 సంవత్సరాలుగా, 2005 నుండి అంటే 3 ఏళ్ళ నుండి, తీవ్రంగా ఇదే విషయమై కేంద్రంలోని యు.పి.ఏ. ప్రభుత్వానికి ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నాను. 1992 జూన్ లో అప్పటి దేశప్రధాని పి.వి.నరసింహారావుకి, భారత వ్యతిరేకంగా రామోజీరావు నిర్వహిస్తున్న గూఢచార కార్యకలాపాల గురించి[అప్పటికి నాకు వాటిని ఆపేరుతో పిలుస్తారు అని తెలియదు], రాజీవ్ హత్య పధక రచన గురించి, తార్కిక ఆధారాలతో ఫిర్యాదు చేసాను. ప్రతిస్పందనగా ప్రధాని కార్యాలయం నుండి ఇద్దరు IB అధికారులు నా ఇంటికి వచ్చి, నేనిచ్చిన రహస్య నివేదిక [ఫిర్యాదు] ప్రధాని అందుకున్నారని confirm చేసారు. తదుపరి రామోజీరావు నన్ను వ్యవస్థీకృతంగా వేధిస్తున్నతీరు గురించి, విద్యారంగంపై అతడి కుట్రగురించి తార్కిక ఆధారాలే గాక, దృష్టాంతపూరిత[circumstantial proofs], సాక్ష్యాధార పత్రాలతో సహా[Documentary evidence], యు.పి.ఏ. ప్రధాని మన్మోహన్ సింగ్, కుర్చీవ్యక్తి సోనియా గాంధీ, రాష్ట్రపతి APJ కలాం గారికి 2005 నుండి 2007 వరకూ వరుసగా ఫిర్యాదు చేస్తూనే ఉన్నాను. రాష్ట్రపతి నుండి తప్ప ప్రధాని నుండి, కుర్చీవ్యక్తి సోనియా గాంధీనుండి నాకు స్పందన రాలేదు. సరికదా నాపై వేధింపు మరింత పెరిగింది. ఈ 16 ఏళ్ళుగా ఇల్లువాకిలి, ఉపాధి పోగొట్టుకోవటం అన్నది మాకు అలవాటైపోయింది. పిచ్చుక గూడుకట్టినట్లు ఉపాధి, నీడా ఏర్పరచుకోవటం, మూడు నాలుగేళ్ళ కొకసారి లేదా రెండు మూడేళ్ళకోసారి కూలగొట్టబడటం. నా పని కుట్రల తీరుని స్వానుభవంతో తెలుసుకున్నట్లయ్యింది. మొదట్లో ఎందుకు వేధింపబడుతున్నానో, ఎవరు వేధిస్తున్నారో తెలిసేది కాదు. అసలు అది వేధింపు అని కూడా అనుకోలేదు. నా తలవ్రాత ప్రకారం అలా జరుగుతున్నాయనుకున్నాను. జీవితం నాదైన కారణంగా ‘అనివార్యమైన పరిశీలన’ ఈ వేధింపులో ఉన్న అసాధారణాన్ని గుర్తించింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు, పత్రాలతో సహా [Scanned copies] Coups on World లోని Documentary evidence లో పొందుపరిచాను.

1991 లో రాజీవ్ హత్యనేపధ్యంలో – ఆ రోజుల్లో ఎల్.టి.టి.ఇ.కి, DMK పార్టీకి, దాని అధినేత కరుణానిధికి సంబంధాలుండేవని బహిరంగంగానే చెప్పుకునే వారు. ఎల్.టి.టి.ఇ.కి DMK కరుణానిధి తెరవెనుక మద్దతు ఇస్తున్నాడని అనేవారు. చేపల వేట నెపంతో మత్స్యకారుల ద్వారా ఆయుధాల దగ్గరనుండి అన్ని వనరలూ తమిళనాడు నుండి LTTE కి సమకూర్చబడేవి. తీరప్రాంతాల నుండి స్మగ్లింగ్ యధేచ్ఛగా జరిగేది. అలాంటి DMK కరుణానిధి మద్దతుతో కేంద్రంలో 2004 నుండి యు.పి.ఏ.ప్రభుత్వాన్ని సోనియా గాంధీ నడుపుతుంది. అందునా 2004 కు ముందు తాను ప్రతిపక్షంలోనూ, DMK పార్టీ, BJP అధ్యర్వంలోని NDAకు మద్దతుదారుగానూ భాగస్వామిగానూ ఉండగా, పార్లమెంట్ లో తన అత్తగారినీ, మరిదినీ, భర్తనీ హత్యచేసారని ఆవేశంతో రగిలిపోతూ, ఆవేదనతో ఊగిపోయిన సోనియా గాంధీ!

ఇక్కడో చిత్రం చూడండి. 1999 ఎన్.డి.ఏ. కూటమికి మొదట అన్నాడి.యం.కె. జయలలిత మద్దతిచ్చి తర్వాత ఉపసంహరించుకుంది. ఆ తర్వాత డి.యం.కె. మద్దతుని ఎన్.డి.ఏ. స్వీకరించింది. ఎన్.డి.ఏ. ప్రభుత్వంలో పదవులు నిర్వహించిన మురసోలిమారన్ రాష్టంలో ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు తమిళ నాడులో జయలలిత అధికారంలో ఉంది. ఆమె హయంలో పోలీసులు ఏదో కేసు పైకారణంగా[over leaf reason] పెట్టుకొని కరుణానిధిని, మురసోలి మారన్ లని రాత్రిపూట లాక్కొని పోయారు. ’కొడుతున్నారు రో’ అంటూ భయవిహ్వలతతో వారు అరుస్తున్న న్యూస్ క్లిపింగ్ 2001,జూన్ లో టివీల్లో ప్రసారమయ్యింది. జయలలితని డి.యం.కె వారు అసెంబ్లీలో వస్త్రాపహరణం స్థాయిలో కొట్టి, అవమానించారు. ఇప్పటికీ ఎవరు అధికారంలో ఉంటే వారు రెండోవారి మీద పగా ప్రతీకారాలు తీర్చుకొనేందుకే వారి తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఇక ప్రజల గురించి ఏమాలోచిస్తారు? ఇలాంటి ఈ ప్రాంతీయ పార్టీల సహకారం, మద్దతులు Musical chairs ఆటలతో కేంద్రంలో ఎన్.డి.ఏ.లూ, యు.పి.ఏ.లూ! ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఏముంటుంది? కేంద్రంలో మిత్రులు, రాష్ట్రాల్లో శతృవులూ, లేదా రాష్ట్రాల్లో మిత్రులూ, కేంద్రంలో శతృవులూ, మిత్రపక్షాల్లో స్నేహపూర్వక పోటీలు – ఎన్ని వింత నిర్వచనాలో? ఎప్పటికెయ్యది అవసరమో అన్నట్లు! ఓ నీతి లేదు, నియమం లేదు. ఇక సిద్దాంతాలెక్కడ? ఉన్నదొకటే దోచుకు తినడం. ఇలాంటి రాజకీయ పార్టీలతో, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటున్నామనుకోవటం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవటం లాంటిదే.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు! .

1 comments:

"ఇలాంటి ఈ ప్రాంతీయ పార్టీల సహకారం, మద్దతులు Musical chairs ఆటలతో కేంద్రంలో ఎన్.డి.ఏ.లూ, యు.పి.ఏ.లూ! ఇంతకంటే రాజకీయ వ్యభిచారం ఏముంటుంది? కేంద్రంలో మిత్రులు, రాష్ట్రాల్లో శతృవులూ, లేదా రాష్ట్రాల్లో మిత్రులూ, కేంద్రంలో శతృవులూ, మిత్రపక్షాల్లో స్నేహపూర్వక పోటీలు – ఎన్ని వింత నిర్వచనాలో? ఎప్పటికెయ్యది అవసరమో అన్నట్లు! ఓ నీతి లేదు, నియమం లేదు. ఇక సిద్దాంతాలెక్కడ? ఉన్నదొకటే దోచుకు తినడం. ఇలాంటి రాజకీయ పార్టీలతో, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటున్నామనుకోవటం కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదాలనుకోవటం లాంటిదే."

:)

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu