నాబ్లాగు చుట్టాలందరికీ సంక్రాంతి పండుగ నాడు చిన్నకానుక!

ఓ చిన్న కథ…….

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం.

ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.

ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.

నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.

దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు.

ఇలా ఉండగా ఓ రోజు.....

తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు. అందరూ గోబీ ఎడారి చేరారు.

ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.

గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు.

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు.
కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు.

"అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్.

తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది.

"ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్.

"హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్.

"ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్.

"ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్.

అయోమయంగా చూశాడు తైమూర్.

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్.

తైమూర్ కి మతిపోయింది.

అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.

నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్.

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.
మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు.

తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్.

ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది. ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి.......

తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని.

అంతే!

కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

ఇదీ కథ.

తైమూర్ కి డబ్బుంది, అధికారం ఉంది.

అయితే నసీరుద్దీన్ కి ’బుర్ర’ ఉంది.

ఎంత అధికారం ఉంటేనేం, ఆలోచించే బుర్ర ముందు అన్నీ దిగదుడుపే కదా!

అలాగే ఈనాటి తైమూర్ లకి ఎంత అధికారం ఉంటేనేం, సామాన్యప్రజల్లాంటి నసీరుద్దీన్ లకి ఉన్న అలోచించే బుర్రల ముందు అన్నీ దిగదుడుపే కదా!

********************

నా బ్లాగు అతిధులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు



అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.


సర్వేజనా సుఖినోభవంతు!

**************

12 comments:

Baagundi

ha ha ha .. good one :)సంక్రాంతి శుభాకాంక్షలు.

కథ చాలా బావుంది.
మీకూ.. మీ కుటుంబ సభ్యులకీ సంక్రాంతి శుభాకాంక్షలు..!

బాగుందండీ. మీకు నా సంక్రాంతి శుభాకాంక్షలు.
కొంచెం నిరుత్సాహపడ్డాను.ఏమంటే - ఈ రోజు ఈనాడు చూసారా?- అది చూసి దానిని విమర్శిస్తూ నసీరుద్దీన్ కథ మొదలెట్టారేమో ననుకున్నా.
వ్యాపారానికి- పేపరు పాలసీకి- ఎలా సంబంధముండదో, ఉండగూడదో రామోజీరావుగారి పేపరులో రాజశేఖరుని ఫుల్పేజీ ఎడ్వర్టైజుమెంటులు చూస్తే తెలుస్తోంది.వాటి ప్రకారం రైతులంతా సుఖశాంతులతో అలరారుతుంటుంటే--ప్రతిరోజూ రైతుల ఆత్మహత్యలు అనిన్నీ,సెజ్ ల వల్ల రైతులెందరో బజార్న పడుతున్నారనిన్నీ, భూములన్నీ పెద్దపెద్ద వాళ్ళకి కారుచౌకగా సంతర్పణ అయిపోతున్నాయోయ్ అనిన్నీ అదే పేపరు నిండా రోజూ వచ్చే వార్తలు--వార్తలు--సంపాదకీయాల హోరు-- దుమ్ము దులుపుతూనే వున్నాయి గదా.దేన్ని నమ్మిచావాలో తెలిచ్చావటం లేదు. ఇదంతా చూస్తుంటే రాజశేఖరునికి రామోజీరావు గారు తన పత్రికా ఎడ్వర్టైజుమెంటుల ద్వారా ఇచ్చే ప్రచారం చూస్తుంటుంటే మీరన్న వారిద్దరూ తోడుదొంగలే(ప్రజల్ని వారి వారి మార్గాల్లో దోచుకోవడంలో)అని అని పిస్తుంది.కాని మీరు చెప్తున్నట్లుగా ప్రజలు నసీరుద్దీన్ లాంటి తెలివైనవారు.తైముర్ లాంటి అమాయకులు కారు.బాగా వ్రాస్తున్నారు.కంటిన్యూ చెయ్యండి. ఎదురు చూస్తూ ఉంటాము.

సంక్రాంతి శుభాకాంక్షలు.

subhasamkraamti

మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

బాగు బాగు బ్లాగు!!!

సంక్రంతి శుభాకాంక్షలు :)

రాజశేఖర and రామోజీరావు వారిద్దరూ తోడుదొంగలా?

అవునా!, కాదా?

1) అవునా!,
Lets argue that they are తోడుదొంగలు.
One thing is clear, that Ramoji is against Congress. One can find this fact by reading Eenadu News Paper. In 2004 Congress captured power at Center with the help of Andhra Pradesh (aprt from Maharastra, TN, Karnataka and Kerala). But Andhra win was important. Without winning Andhra, it was impossible for them capture power at Center in 2004.

And the situation is same in 2009. With out Andhra Pradesh, Congress will loose power at center.

But Ramojirao wants to defeat Congress. Who ever capture power in AP may not support Congress to form government at Center.

So, if they are తోడుదొంగలు, then you think that go in their seperate ways at the risk of loosing power at center.

My point is: We should analyse the impact of Andhra Pradesh on Congress prospects of re-captureing power at center in 2009.

2) కాదా?
To Be Analysed (TBA).

Disclaimer: I am not a fan (or supporter) of either Samul Reddy or Ramoji Rao.

pseudosecular గారూ,

రామోజీ రావు, రాజశేఖర రెడ్డి తోడు దొంగలే. అయితే 2009 ఎలక్షన్ల ముందు వాళ్ళ నాటకీయ వైరాల్ని విశ్లేషించేముందు, జరగబోయే దానికంటే జరిగిపోయిన, జరుగుతున్న పరిణామాలని పరిశీలించాలి కదా!
అవికొన్ని ఇక్కడ పరిశీలిద్దాం.

1]. రామోజీరావు కాంగ్రెసు వ్యతిరేకి కాదండి. అలా చెప్పుకుంటున్నాడంతే. ఖచ్చితంగా చెప్పాలంటే అతడు దేశభక్తులకీ, దేశంపట్ల నిజాయితీగా ఉండే రాజకీయ నాయకులకీ వ్యతిరేకి అంతే. కావాలంటే గమనించండి.- రామోజీరావు, ఇందిరా గాంధీ నియంతృత్వపోకడలకీ, కాంగ్రెస్ లోని వ్యక్తిపూజకీ, అప్రజాస్వామిక పద్దతులకీ, సంజయ్ గాంధీ వంటి రాజ్యాంగేతర శక్తి జోక్యానికి తాను ఎదురు నిలిచి పోరాడిప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యతని తలకెత్తుకొన్నానని సంపాదకీయాలు స్వయంగా వ్రాసాడు, కోర్టుకి అఫిడవిట్ కూడా సమర్పించాడు. మరి ఇప్పుడు మాత్రం వ్యక్తిపూజకీ, అప్రజాస్వామిక పద్దతులకీ [నోటుకు ఓట్లు కొనడం, పదవులు, టికేట్లు అమ్ముకోవడం, సెజ్ ల పేర భూములు కట్టబెట్టడం ఇలాంటివి చాలా చేస్తున్న] రాజ్యాంగేతర శక్తి నాయకురాలు నాగమ్మని ఒక్కమాట అనడు చూడండి. వై.ఎస్. ఈవిడ చేతిలో బొమ్మ కాదా? నియంతృత్వపోకడలకీ కొదవా కాంగ్రెస్ లో? ఆరోజు సంజయ్ గాంధీని కాంగ్రెస్ లోని ఇందిరా గాంధీ భజనపరులందరూ యువరాజంటున్నారనీ, ఇదేం రాచరికవారసత్వమా అని ఘర్జనలు చేసిన రామోజీరావు ఈనాడు రాహుల్ గాంధీ విషయంలో అదే జరుగుతున్నా కిమ్మనటం లేదేం? అంతేకాదు అన్నిపార్టీలు, కుటుంబపార్టీలుగా చలామణి అవుతున్నా వాటిని కనీసం వ్యతిరేకించడం లేదు. అంచేత గమనించి చూస్తే తేలేదేమిటంటే రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి కాదు. భారతదేశంపట్ల ఎవరు నిబద్దతతో ఉంటారో వారికి వ్వతిరేకి.

2]. అతడు నిజంగా కాంగ్రెస్ వ్యతిరేకి అయితే 1989 కి ముందు – ఆనాటికి ఎన్.టి.రామారావు ఇమేజ్ బాగానే డామోజ్ అయ్యింది. అప్పట్లో మర్రి చెన్నారెడ్డి కోటి సంతకాలు, జైల్ భరో అంటు కాంగ్రెస్ లో కొత్త శక్తినీ, ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపాడంటూ ప్రచారం ఇచ్చిందీ, భుజాన మోసింది రామోజీరావే. మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ లో భాగం కాదా?

3]. అంతేకాదు 1992 లో, నేదురుమల్లి జనార్ధన రెడ్డికి కూడా ఇతడు ఇంతే ఇమేజ్ ఇచ్చాడు. ముఖ్యంగా తిరుపతి కాంగ్రెసు ప్లీనరీ [1992 మార్చి] సమావేశాలప్పుడు నేదురుమల్లి జనార్ధన రెడ్డి నెం.2 అనీ, ఫలానా కాంగ్రెసు ఆఫీసు బేరర్ల జాబితాలో పి.వి.నరసింహారావు, నేదురుమల్లి జనార్ధన రెడ్డిలకు ఇష్టమైన వారి పేర్లున్నాయనీ, అసలు పి.వి.నరసింహారావు తర్వాత స్థానం నేదురుమల్లిదేనని ఈనాడులో, ఆరోజుల్లో ఎంత ఊదరగొట్టాడో పాతపేపర్లు వెతికితే తెలుస్తుంది. మరి నేదురుమల్లి జనార్ధన రెడ్డిది కాంగ్రెసు కాదా?

4]. అంతెందుకూ? 2004 లో ఎలక్షన్లు రావాటానికి సంవత్సరం ముందే, అప్పటికే చంద్రబాబుని భుజం మీంచి దింపేసిన రామోజీరావు 2003 వేసవిలోనే వై.ఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్రలకి ఎంత కవరేజ్, అతడికి ఎంత ఇమేజ్ ఇచ్చాడో చూడండి. రోజుకి నడిఎండలో ఎర్రని అగ్గిలో 20 కి.మి. నడిచాడనీ, అతడి డిజైనర్ బూట్లు ధర 5000 రూ. అనీ, అదనీ, ఇదనీ …… ఎన్నో వైవిధ్యమైన వార్తలు. ఆనాడు అంటే 1982 ల్లో ఎన్.టి.ఆర్. రోడ్డుప్రక్కన స్నానం చేసినా, గడ్డం గీచినా వార్త అయినట్లు, ఈనాడు సత్యం రామలింగరాజు జైల్లో తుమ్మినా, దగ్గినా, అతణ్ణి అతడి భార్యబిడ్డలు, మావ, బంధువులు పరామర్శించినా వార్త అయినట్లు, ఆ రోజుల్లో వై.ఎస్. పాదయాత్రకూ అదే ర్యాంకింగ్. అంతగా – సంవత్సరం ముందే రెడీగా ఉన్నాడు. ఆరోజే మీరన్నట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ని రానివ్వకపోతే కేంద్రంలోనూ కాంగ్రెస్ వచ్చేదికాదు కదా? వై.ఎస్. కాంగ్రెస్ అధిష్టానాన్ని దాటి ఏమి చేయలేడు కదా?

5]. అంతేకాదు. 1996 లో మూడో ఫ్రంటు [ఏదో పేరులెండి] ప్రధాని దేవెగౌడ, IK గుజ్రాల్ ల ప్రభుత్వాలు ఏర్పడేందుకు చంద్రబాబు చక్రం తిప్పాడు. 1999 లోనూ ప్రధాని వాజ్ పేయిగా ఎన్.డి.ఏ. ప్రభుత్వం ఏర్పడేందుకూ చంద్రబాబే చక్రం తిప్పాడు. చంద్రబాబు రామోజీరావు చేతిలో బొమ్మ అని అందరికీ తెలుసు. ఆ విధంగా నాన్ సెక్యులర్ పార్టీలకి, సెక్యులర్ పార్టీలకి కూడా కేంద్రప్రభుత్వాలు ఏర్పడేందుకు రామోజీరావే చక్రం తిప్పించాడు.రామోజీ రావుకి అద్వానీ ఎంత దగ్గరో అందరికి తెలుసు. వై.ఎస్.కి ఇమేజ్ ఇచ్చి 2004 ఎన్నికలలో గెలిపించడం ద్వారా కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలో రావడానికి పరోక్షంగా సాయం చేసినట్లే కదా! అలా వరుసగా 13 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడడానికి ఆంధ్ర ఎం.పి. సీట్లే కీలకం అయ్యాయి.

6]. కాబట్టి నేను అనేదేమిటంటే – రామోజీరావుకి కావలసింది ఫలానా పార్టీఅని కాదు. ఎవరు తనకు అనుకూలురో, ఎవరు తన కుట్రకు మద్దతుదారులో, ఎవరు తెరవెనుక సాయం చేయగలరో అలాంటి వారూ. [ఏ పార్టీ అయినా సరే.] ఒక్క మాటలో చెప్పాలంటే రామోజీరావుకి కావలసింది ఎవరు దేశద్రోహానికైనా వెనుదీయరో, ఎవరు దేశద్రోహులో అలాంటి వాళ్ళు. లేదా ఆ సమయానికి తాను ఎవరిని ఉపయోగించుకోదలచుకొన్నాడో వాళ్ళకి ఇమేజ్ ఇస్తాడు, కావాలనుకున్నప్పుడు వాళ్ళకే తన మీడియా బలంతో, గూఢచార నెట్ వర్క్ బలంతో డామేజ్ చేస్తాడు. దీన్నే ‘నందిని పంది చేయటం మళ్ళీ పందిని నంది అనటంగా’ మనం గుర్తిసున్నాం.

7]. కాబట్టి రామోజీరావు చర్యల్ని కుదించి పరిశీలించకూడదు. ఈ రోజు ఎందుకు ఈనాడు – సాక్షి కొట్టుకుంటున్నాయో, ’రాజ”రామోజీ’ల యుద్దం వెనుక మర్మం ఏమిటో మరింత పాకాన బడే వరకూ వేచి చూద్దాం. [పెద్ద ప్రయోజనాన్ని అశించి ఈ చిన్ని నష్టాన్ని భరిస్తూ ఉండవచ్చు.] లేదా రామోజీ రావో, వై.ఎస్. ఎవరో ఒకరు నోరు విప్పి చెప్పినప్పుడు విందాం. ఏమంటారు?

Adi Lakshmi గారు,
Thank you for the information. I will monitor AP politics closely. AP is crucial for Congress to capture the power at center in 2009.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu