సత్యం కంప్యూటర్స్!

నిన్న మొన్నటి దాకా వెలిగిపోతున్న సంస్థ.

రామలింగ రాజు!

నిన్న మొన్నటి దాకా సూపర్ విజేత, సమర్ధ అధినేత.

ఈ రోజు?

కుప్పకూలాక అందరూ అతణ్ణి నిందిస్తున్నారు. బాధ్యుడు గనుక అతడు నేరాన్ని అంగీకరించాడు.

ఇది ఒక సంస్థకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. అందులో ఉద్యోగులైన వారి జీవితాలకీ, అందులో పెట్టుబడి పెట్టిన మదుపుదార్లకీ కూడా సంబంధించినది. ఈ అంశాన్ని మరింత విశ్లేషించే ముందు, అంతకంటే ప్రమాదకరమైన మరో అంశాన్ని మనం పరిశీలించాల్సి ఉంది.

అదేమిటంటే ......

కుప్పకూలేవరకూ సత్యం కంప్యూటర్స్ మిలమిలలాడుతున్న మేడిపండు. ఇప్పుడు ఎన్నో అవకతవకలు బయటికొచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి.

ఇదే స్థితి రేపు భారతదేశానికి పడితే? పట్టదన్న భరోసా ఎంతమాత్రం లేదు.

’సత్యం కంప్యూటర్స్ కీ, భారతదేశానికీ ఏమిటి పోలిక? మరీ మోకాలికీ బోడిగుండుకీ లంకె పెట్టటం లాగుంది’ అనుకోకండి.

నేను చేస్తోన్న పోలిక సరియైనదో కాదో, మీరే పరిశీలించండి.

ఎలాగంటే........

భారతదేశం బలమైన అర్ధికవ్యవస్థగా ఇప్పుడు గుర్తింపుతోఉంది. ఇంతక్రితం సత్యం కంప్యూటర్స్ లాగా అన్నమాట.
రామలింగరాజు ల్లాంటి వారు సత్యం కంప్యూటర్స్ లోనే కాదు, కేంద్రప్రభుత్వంలోనూ, రాష్ట్రప్రభుత్వాల్లోనూ గుంపులు గుంపులుగా ఉన్నారు.

కనీసం ఈ రామలింగరాజు తానే బాధ్యుణ్ణనీ, మోసగించాననీ ఒప్పుకుంటున్నాడు. ఎలా మోసగించింది చెప్పుకుంటున్నాడు.

ఈ రాజకీయ నాయకులూ, నాగమ్మలూ, అద్వానీలు అదికూడా చెయ్యరు. చాలా మామూలుగా నింద ముందటి ప్రభుత్వల మీద వేసి తప్పుకుంటారు.

ఉదాహరణ కావాలంటే బోఫోర్సు కుంభకోణం వెలుగుచూసిన దరిమిలా రాజీవ్ గాంధీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. [ఆనాటి ఆ గూఢచార వ్యూహాన్ని వివరంగా పరిశీలించాలంటే నా ఆంగ్ల బ్లాగ్ FIRE POT లో THE EPISODE OF BOFFORS IN THE COUP చూడగలరు]

ఆనాటి ఎలక్షన్లలో గెలుపొందేందుకు వి.పి.సింగ్, వారి National Front కూటమి ఎన్నికల వాగ్ధానాల్లో 10,000 రూపాయల లోపు రైతు రుణాలన్నీంటినీ మాఫీ చేస్తామన్నది. గెల్చిన దరిమిలా మాఫీ చేసింది. ఆ సంక్షేమ పధకం దేశానికి తలకి మించిన భారంగా పరిణమించింది. NF ప్రభుత్వం కూలిపోయిన తర్వాత రాజకీయవిన్యాసాల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన భోండ్సీ బాబా చంద్రశేఖర్ ప్రధానిగా ముందటి ప్రభుత్వాన్ని నిందిస్తూ చాలా మామూలుగా దేశపు బంగారాన్ని తీసికెళ్ళి అంతర్జాతీయ విపణిలో తనఖా పెట్టాడు. ‘బంగారం తనఖా’ సెంటిమెంటు తో ముడిపడిన భారతీయులు ఆరోజు చాలా అవమాన పడ్డారు. 20 ఏళ్ళ క్రితపు ఆ వ్యధనీ, మ్లానతనీ చాలా మంది గుర్తుతెచ్చుకోగలరను కొంటాను.

1]. ఎలాగైతే రామలింగరాజు సత్యం కంప్యూటర్స్ లో లేని లాభాలని ఉన్నట్లుగా బ్యాలెన్స్ షీట్ లో చూపెట్టారో – సరిగ్గా అలానే మన రాజకీయ నాయకులు [మంత్రులూ, ముఖ్యమంత్రులూ, కేంద్రమంత్రులూ, ప్రధాన మంత్రి ఇంకా అద్వానీలూ, నాగమ్మలాంటి నాయకులూ] లేని అభివృద్దిని ఉందంటూ దొంగలెక్కలు చెప్పారు, చెపుతున్నారు.

2]. లక్షల కోట్ల డాలర్ల విదేశీ అప్పులు కనబడుతున్నాయి. ప్రాజెక్టులు, రహదార్లు అంటూ అభివృద్ది కాకి లెక్కలు చూపెడుతున్నారు. అప్పులకీ అభివృద్దికీ ఏమాత్రం పొంతన ఉందో ఎవరికీ తెలీదు. చివరకి రేపెప్పుడో [ద్రవ్యోల్పణం తగ్గుతున్నా వస్తువుల, సరుకుల రేట్లు పెరుగుతున్నట్లే] ఏ పొంతనా లేదని బయటపడినా మనం నోరెళ్ళ బెట్టాల్సిందే. అప్పుడు ఈ రాజకీయ నాయకులు నిస్సంకోచంగా ’మా చేతిలో ఏమంత్రదండం లేదు’ అని అంటారు.

ఈ రోజు ఓ వ్యాపార సంస్థ కుప్పకూలితే …..

"అయ్యో పాపం!” అంటున్నారు కొందరు.

"ఓర్నాయనో మోసం” అంటున్నారు ఇంకొందరు.

అదే దేశమే కుప్పకూలితే ......?

అప్పులిచ్చిన అంతర్జాతీయ సంస్థలు [బ్యాంకులు గానీండి, ఇతర ప్రైవేట్ సంస్థలు కానీండి, ద్రవ్యనిధులు కానీండి] వూరికే ఏమీ ఇవ్వరు. ఏవో తనఖాలు పెట్టుకొంటారు. కట్టేసిన ప్రాజెక్టులో, కట్టాల్సిన ప్రాజెక్టులో, వేయాల్సిన రహదారులో, వేసిన రహదారులో [భూములతో సహా] లేదా సెజ్ లు పేరిట భూములో చేతిలో పెట్టుకొంటాయి.

అలాంటి విలువైన భూముల్నీ ప్రాజెక్టులనీ తనఖాపెట్టి తెచ్చిన సొమ్ముతో ఈ రాజకీయ నటీనటులు ఎవరికెంత మప్పబెడుతున్నారో, తామెంత బొక్కుతున్నారో ఎవరికీ లెక్కలు చెప్పరు గానీ మనకి మాత్రం అభివృద్ది లెక్కలు చెబుతున్నారు. అభివృద్ది పేరుతో కడుతున్న ప్రాజెక్ట్ ల్లోనూ, రహదారుల్లోనూ నాణ్యత ఎంతో అవి కుప్పకూలి మరీ గొంతెత్తి చెబుతున్నాయి.

కాలపరిమితి తీరాక అప్పుతీర్చలేదంటూ – ఇప్పుడు అప్పులిచ్చిన అంతర్జాతీయ సంస్థలు తనఖా పెట్టు కున్న ప్రాజెక్టుల్నీ, భూముల్నీ తమవే అంటే? [వాటి సాధికారత చట్టబద్దమే కదా!] అప్పుడు మనం శ్రీశైలం, నాగార్జున సాగర్ వగైరా ప్రాజెక్ట్ ల నుండి నీరు పొందాలంటే ఈ విదేశీ సంస్థలకి డబ్బిచ్చి కొనుక్కోవలసిందే. మన దేశపు మన రోడ్ల మీద అత్త గారి వూరికో, అమ్మమ్మ గారి దగ్గరికో వెళ్ళాలంటే పన్నుకట్టి పోవలసిందే.[కారో, స్కూటరో, బైకో, బస్సో ఇక్కడ అప్రస్తుతం. టోల్ టాక్స్ మాత్రం అనివార్యం]

ఊహించండి ఒక్కసారి ఆ దారుణ స్థితిని!

ఊహించలేకపోతే ఒక్కసారి తెలంగాణ చరిత్ర తిరగెయ్యండి. ఈస్టిండియా కంపెనీ వాళ్ళు నవాబుకు టాక్స్ వసూలు చేసి పెడతామని కాంట్రాక్ట్ తీసుకొని, టాక్స్ వసూలు చేయకపోగా, చివరకి నవాబే ఈస్టిండియా కంపెనీకి బాకీ పడేటట్లు చేసుకొన్నారు. అదీ కుట్రస్వరూపం.

ఇది అసంభవం అన్న భరోసా ఉందా మనదగ్గర?

ఇలాగే…… ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియానీ మింగేసి, ఆనక నింపాదిగా బకింగ్ హోమ్ పాలెస్ కి అప్పగించింది. అదే ఇప్పుడు సెజ్ ల పేరుతో పునరావృతం అవుతోంది.

3]. సత్యం కంప్యూటర్స్ లేని లాభాల్ని ఉన్నట్లుగా బ్యాలెన్స్ షీట్లలో చూపించారు. దాంతో షేర్ వ్యాల్యూ పెంచారు. ఇదంతా చేస్తోంటే కంపెనీ డైరక్టర్లు, ఆడిటర్లు, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అధికారులూ, సెబీ వంటి నియంత్రణ సంస్థలు, BSE,NSEలు , ప్రతి ౩నెలలకూ ఒకసారి సంస్థ మేనేజ్ మెంట్ తో సమావేశమయ్యే ఎనలిస్టులు, వీరి నివేదిక అధారంగా వేలకోట్ల రూపాయల ఇన్వెస్టమెంట్ నిర్ణయాలు తీసుకొనే బడా అర్ధికసంస్థలు ఏంచేశాయి? ఎందుకు ఊరుకొన్నాయి? ఎవరు ఊరుకోబెట్టారు? వీరందరు గమనించలేనంత అమాయకత్వం వీళ్ళందరికి ఎవరు నేర్పారు? ఆర్థికవేత్తలే ప్రధానమంత్రులు, విత్తమంత్రులూ, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు అయిన చోట, వారికి సైతం ఏ అనుమానం ఎలా రాలేదు? బోఫర్స్ కుంభకోణాన్ని బట్టబయలు చేసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు ఏమయ్యారు?

ఓ టీచర్ కి తమ విద్యార్ధి ఒక సబ్జెక్టులో ఈ రోజు ఇలా ఉన్నాడంటే నిన్న ఎలా ఉన్నాడో గుర్తుంటుంది. రేపు ఎలా ఉండవచ్చో ఓ అంచనా ఉంటుంది. ఎక్కడైనా తేడావస్తే పసిగట్టే నేర్పు ఉంటుంది.

ఓ ఫారెస్ట్ ఉన్నత అధికారికి అడవిలో ఈ రకం క్యాక్ట్ స్ చెట్టుపెరిగింది అంటే అక్కడి [ఇకో బ్యాలెన్స్] పర్యావరణ పరిస్థితి ఏమిటో అర్ధమౌతుంది. అడవిలో పులి ఉందంటే అక్కడి ఇకో బ్యాలెన్స్ ఉందని అర్ధం అనే [పారా మీటర్స్] ప్రామాణికాలు ఉన్నాయి.

అలాగే మన పిల్లవాడు మనం పాకెట్ మనీ ఇవ్వకుండానే చాక్ లెట్లు, ఐస్ క్రీములూ విపరీతంగా కొనుక్కుతింటున్నాడంటే వాడెక్కడైనా చిలక్కొట్టుడు కొడుతున్నాడా అని తల్లితండ్రులు [చెక్] వెనక్కి పరిశీలించుకోవడమూ మనం చాలా ఇళ్ళల్లో చూస్తున్న విషయమే.

ఎందుకంటే అక్కడ అసాధారణ వాపు కన్పిస్తుంది గనుక. అలాంటప్పుడు ఈ వ్యాపార సంస్థల్లో ఇన్ని కోట్ల రూపాయలు [ ప్రస్తుతానికి లెక్క 7000 కోట్లరూపాయలు] కుంభకోణం మీద ఎవ్వరికీ ఏ అనుమానం ఎలా రాలేదు?

అదే ఓ చిన్న పరిశ్రమ లేదా ఓ చిన్న వ్యాపారం నడిపే వ్యక్తి లెక్కల్ని అయితే ఆడిటర్లూ, ఆఫీసర్లు డొక్క చీల్చి డోలుకట్టి, లేని లొసుగుల్ని కనిపెట్టి, ఎంతో కొంత డబ్బు ఊడగొట్టి కానీ Clearance Certificate ఇవ్వరే. మరి ఏ అండా[ రాజకీయ రంగం నుండి మీడియా దాకా] లేకుండానే సత్యం కంప్యూటర్స్ లాంటి ఓ వ్యాపార సంస్థకీ ఇవ్వన్నీ ఎలా సాధ్యం అయ్యాయి?

మీరో, నేనో ఏవో దొంగ లెక్కలు చెప్పెస్తే ఎవరైనా ఎందుకు నమ్ముతారు? మరి రామ లింగరాజు కొన్నేళ్ళుగా కాగితాలతో సహా దొంగలెక్కలు చెబితే ’సంబంధిత’ అధికారులూ, ఆడిటర్లూ ఎలా నమ్మారు? ఏ అసాధారాణాన్ని ప్రభుత్వం గానీ, మీడియా గానీ ఎందుకు గుర్తించలేదు.

ఇక్కడ ఏ మతలబూ లేదా?

అంతా ’ఛూమంత్రకాళి!’ అంటూ ఆ సంస్థ అధినేతలు మాత్రమే చేయగలిగారా? కుప్పకూలాకా సదరు ఐటి సంస్థ అధినేత అన్నా కనీసబాధ్యత చూపెట్టి నింద తన మీద వేసుకుంటున్నాడు. నిజానికి పాపం రామలింగరాజు ముఖంలో కసాయి వాణ్ణి నమ్మి మోసపోయిన గొర్రె కళ్ళల్లో కనబడే భయోత్పాతం కనిపిస్తోంది.[సత్యం మోసాన్ని ఇక్కడ నేను సమర్దించడం లేదు. కానీ రామలింగరాజు ఒక్కడే ఇదంతా చేయలేడు అంటున్నాను]. ఎవర్ని నమ్మి ఇంత మోసమూ చేసాడో, ఎవరి భరోసా మీద ఈ మోసం బయటపడదులే అనుకొన్నాడో, ఎవ్వరు ఇంత కాలం ఈ మోసాన్ని కాచి కాపాడారో తెలియదు గానీ ఈ రోజు మాత్రం హఠాత్తుగా మీడియా పేజీలకు పేజీలూ కేటాయించి మరీ ఈ ఉదంతం మీద దుమ్మెత్తిపోస్తోంది.[అదే మీడియా నిన్న మొన్నటి దాకా రామలింగరాజు అసహాయ సామర్ధ్యాన్ని ఎన్నోరీతుల ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ప్రశంసించింది. ముఖ్యంగా ఈనాడు].

నిజానికి ఇంతకంటే ముందు వరుసలో నాగార్జున ఫైనాన్స్ ఉంది. కుప్పకూలాక, జైల్లో ఉన్న నాగార్జున డైరక్టర్లు, తమ మదుపుదారుల సొమ్ముని మార్గదర్శికి తరలించారన్న వార్త ఎంత వేగంగా బయటికొచ్చిందో అంతకంటే వేగంగా తెరమరుగైపోయింది.

ఇప్పుడు సత్యం కంప్యూటర్స్ నుండి ఎంత సొమ్ము ఎవరి ఖాతాలోకి దారి మళ్ళింపబడిందో బయటికొస్తే గానీ తెలీదు.
ఇదొక్కటే కాదు, ఇలాంటి ఉదంతాలు ఇంకా చాలా ఉన్నాయి.

1992 కి ముందర మీడియాలో [ముఖ్యంగా ఈనాడులో] వైశ్యాబ్యాంకు ఛైర్మన్ రమేష్ గెల్లికి ఇలాగే సెలబ్రిటీ షోలు ఉండేవి. ఆయన పేరు ప్రఖ్యాతులు ఎల్లెడలా, ఎల్లప్పడూ మార్మోగుతూ ఉండేవి. తర్వాతేం జరిగిందో మనందరికీ తెలుసు.

మరోకేసు, యూరో లాటరీ కోలా కృష్ణమోహన్ ది. అతడు ‘తనకి కోట్లడాలర్ల లాటరీ వచ్చిందంటే ఓ పత్రిక ఆధారాలేం అడగకుండా పతాక శీర్షికలో వేసిందనీ, అంచేత బ్యాంకులు తనని నమ్మాయనీ, అంచేత తానుసులభంగా మోసగించగలిగాననీ’ కోర్టుకి చెప్పాడు. అలా పతాక శీర్షిక వేసింది ఈనాడే నన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఇలా తనకున్న మీడియా శక్తితో నందిని పంది అనీ, అదే పందిని మళ్ళీ నంది అనీ అనగలడు ఈ మీడియా మాంత్రికుడు. అన్నిటికీ అతడే కారణమా అనే ప్రశ్నకి అవునన్న సమాధానం సాక్ష్యాధారాలతో సహా ప్రచురించాను. వివరాలు Coups On World [Ref.No. 24]అన్న బ్లాగ్ లో చూడగలరు.

చంద్రశేఖర్ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన పి.వి.నరసింహరావు అనివార్యమై సరళీకృత ఆర్ధిక విధానాలనూ తేగా, ఇప్పటి ప్రధాని ఆరోజు ఆర్ధికమంత్రిగా ఉండీ హర్షద్ మోహతా కుంభకోణంలోని అసాధారణాన్ని ముందుగా పసికట్టలేకపోయాడు. అలాగే ఈ రోజు ఐటి కంపెనీ వాపులోని అసాధారణతనీ, అసహజాన్నీ కనిపెట్టలేకపోయాడు. హార్వార్డు యూనివర్శిటిలో ఆర్ధిక శాస్త్రం అభ్యసించి వచ్చిన అహ్లూవాలియాలు కూడా కనిపెట్టలేక పోయారు. [వీరంతా వ్యూహాత్మక మూగ,చెముడు, గుడ్డి వాళ్ళూ అయినప్పుడు ఎలా కనిపెడతారు చెప్పండి].

ఈ సందర్బంలోనే 1992 ద్వితీయార్ధంలో ఆనాటి ప్రధాన మంత్రి పి.వి.నరిసింహరావు వివేక్ దూబే [నాకు గుర్తుండి అతని పేరు అదే] కిచ్చిన టివీ ఇంటర్యూలో స్పష్టంగా చెప్పిన “I’m not particular about the speed of the economic reforms. But I’m particular about the phase of the reforms” అన్న మాట గుర్తు చేసుకోవాలి.

అలాగే ’ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముకోవడం అంటే ఇంటి సరుకులు కోసం ఇంటిని అమ్ముకోవడం లాంటిదే’ అని మరోసారి కూడా పి.వి.నరసింహారావు అన్న మాట గుర్తు చేసుకోవాలి.

ఆయన తర్వాత ప్రభుత్వాలు ఎంచక్కా నష్టాల్లో ఉన్నవి, లాభాల్లో ఉన్నవి అన్నీ అమ్మేసారు. ఆ ఆస్థులు అమ్మి వాటిని రోడ్లు, మౌలికసదుపాయాలు కల్పిస్తున్నాం అంటూ ఖర్చు చేశారు. ఆ విధంగా ప్రభుత్వ ఆస్థులు లేకుండా చేసారు.

అలాగే....

ఈ పేరు ప్రఖ్యాతులు గల ఆర్ధికవేత్తలందరూ ఇందిరాగాంధికి ఆర్ధిక సరళీకరణల గురించి ఎంత చెవికి ఇల్లు కట్టుకొని గోల పెట్టినా ఆవిడ వినలేదు. ఆవిడ సన్నిహిత మంత్రివర్గ సహచరుడు,సలహాదారుడు అయిన పి.వి.నరసింహరావులాంటి వారూ వినలేదు. ఎందుకంటే – వారికి భారత దేశం పట్ల నిబద్దత ఉంది గనుక.

ఎందుకంటే – ఆనాటికే Free Economy అమలు చేయబడుతున్న పాశ్చత్య దేశాల్లోని ఊదరగొట్టబడుతున్న అభివృద్ది ఎంత మేడిపండో వాళ్ళకి బాగా తెలుసుగనుక.

ఎందుకంటే – సరళీకృత ఆర్ధిక విధానాలు వేగంతో వెళితే, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కనుమరుగై పోతే, ఎంతగా సామాన్యుల్ని దోచుకూ తినే బడా కార్పోరేట్ సంస్థలు పుట్టుకొస్తాయో వాళ్ళకి తెలుసుగనుక.

అమిత వేగపు ఆర్ధిక సరళీకరణలు ఇప్పుడు మనదేశంలో చేస్తోన్న దోపిడి మనకీ అనుభవంలోకి వస్తోంది కదా! మరిన్ని వివరాలకు Coup on Business & Commercial field లో చదవండి.

చివరగా ఒక విషయం…………

“ఇదీ మరీ విపరీత అలోచన. అలాంటి గతి మనదేశానికి ఎందుకు పడుతుంది?” అనుకోవడానికి లేదు.

ఎందుకంటే .... ఇక్కడ భారతంలోని ఓ చిన్న అంశం పరిశీలించండి.

ధర్మరాజు తమ్ములందరూ నీటికోసం వెళ్ళి యక్షుడి ఆగ్రహానికి గురై మరణిస్తారు. తమ్ముల కోసం వెళ్ళిన ధర్మరాజుని యక్షుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. జవాబులిచ్చి, తన వ్యక్తిత్వంతో, ధర్మనిష్ఠతో యక్షుని మెప్పించి తమ్ముళ్ళని పునర్జీవుల్ని చేసుకొంటాడు ధర్మరాజు.

ఆ సందర్భంలో యక్షుడు ధర్మరాజుని “నీకు అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి?” అని అడుగుతాడు.

దాని కాయన “మనుష్యులంతా తమ చుట్టు ఎందరో మరణించడం చూస్తూనే ఉంటారు. కానీ తమకి మాత్రం చావు రాదని అనుకొంటారు. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది” అంటాడు.

అలాంటిదే ఇది.

పెరిస్త్రోయకా పేరుతో సరళీకృత ఆర్ధిక విధానాలు అమలు జరిపిన గోర్బొచేవ్, రష్యా కుప్పకూలిపోయాక ఎంచక్కా యూరోపులో స్థిరపడి సుఖంగా జీవిస్తున్నాడు. ఎటోచ్చి మట్టి గొట్టుకుపోయింది సగటు రష్యన్లే.

సబ్ ప్రైమ్ పేరుతో అమెరికా లోని ఓటు ఆకర్షక పధకాల తర్వాత అమెరికా ఆర్ధికంగా కుప్పకూలినా, జార్జి వాకర్ బుష్ కి నష్టమేం లేదు. గోర్బొచేవ్ లాగే ఆయన కూడా యూరప్ లో కాకపోతే ఆస్ట్రేలియాలో స్థిరపడిపోతాడు. మట్టిగొట్టికు పోయేది మాత్రం సగటు అమెరికన్లే.

అలాగే రేపు భారత్ కుప్పకూలితే ఇప్పుడు సీట్లలో ఉన్న నాయకులూ, నాగమ్మలూ సింపుల్ గా సారీ చెప్పి ప్రక్క దేశాలకు పోయి సుఖంగా స్థిరపడతారు. లేదా అప్పుడు సీట్లలో ఉండే నాయకులూ, ముందు ’టర్న్’ అధికారంలో ఉన్న నాయకులనీ, నాగమ్మలనీ, అద్వానీలనూ నిందించి చక్కా చేతులు దులుపుకొని, ఆపైన పరాయి దేశాలు పోయి స్థిరపడతారు. ఎటోచ్చి మట్టికొట్టుకు పోయేది సగటు భారతీయులే.

ఈ రోజు ఎంత మామూలుగా కుప్పకూలిన వాణిజ్య సంస్థల్ని విదేశీ సంస్థలు ’టేకోవర్’ చేస్తున్నాయో అంతే మామూలుగా దేశం చేతులు మారినా చేయగలిగిందేముంది?

కాబట్టే ..... ఈ రోజు సత్యం కంప్యూటర్స్ ని కుప్పకూల్చిన దొంగ లెక్కల పర్యవసానం ఏమిటో, ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వాలు చూపుతున్న దొంగ అభివృద్ది లెక్కల పర్యవసానమైనా అదే అవుతుంది.

ఈ రోజు నిన్నటి దాకా ఎంతో గౌరవించబడిన ఓ వ్యాపార సంస్థ కుప్పకూలితే మనందరికీ ఎంతో బాధగా అన్పిస్తోంది. దానితో మానసికంగా ఉన్న ఓ అనుబంధం, కుప్పకూలిన సంస్థని చూచి చేదుగా అన్పిస్తోంది.

అలాంటిది ......

’అమ్మఒడి’ లాంటి మన భారత దేశం ....

మన స్వంత ఇంటిలాంటి మన భారతదేశం ......

ఏమయినా అయితే?

ఆ తర్వాత తీరిగ్గా సిద్దాంతాలు చెప్పుకుందామా?

ఏ సిద్దాంతాల ప్రాతిపదికన కుప్పకూలిందో చర్చలు చేద్దామా?

లేకపోతే – ‘ఏ సిద్దాంతాలు ఫెయిలవ్వడం మూలంగా ఇలా జరిగింది’ అని ఉపన్యాసాలు ఇద్దామా?

ఇవన్నీ చేసేందుకు ఎవరికైనా, స్థిరమైన జీవితం మిగిలి ఉంటుందా?

పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ప్రధాన మంత్రులకీ, ఉపప్రధానులకీ, కాబోయే ప్రధాన మంత్రులకీ, ఇటలీ నుండి ఇక్కడికొచ్చిన నాగమ్మలకీ ఇండియా పట్ల నిబద్దత ఉందనీ, మనదేశానికి ఏ అవినీతి చీడా, ఏ గూఢచర్యపు కుట్రా పట్టలేదని భరోసా ఉందా?

ఈ రోజు వాణిజ్య సంస్థలున్న పరిస్థితిలో రేపు అందరి భవిష్యత్తు ఉండదని గ్యారెంటీ ఉందా?


లేని భయాన్ని నేను సృష్టించ ప్రయత్నంచడం లేదు.

ఉన్న ప్రమాదాన్ని గుర్తించడం మంచిదంటున్నాను.

తదుపరి టపాల్లో మరికొన్ని వివరాలు

అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

25 comments:

మీరు ప్రతిదానికీ, ప్రతిసారి 1992 1992 అని అంటుంటారు. ఈ 1992 కి ప్రత్యెక కారణం ఏదైనా ఉందా?? విడమర్చి చెప్పగలరు. (ఇంతకీ ఈ సత్యం కుంబకోణం లో కూడా రామోజీ రావు పాత్ర ఉందంటారు. అవునా).

miru raasinadi aksharalu satyale, deeniki ventane mandu veyyakapote...charitra punaravrutam avutundi...east india co laga..already company lo ekkadanicho ranakkaraledu, alrady india lone vunnai collecitons cheyyataniki

One of the best articles I ever read

excellent foreseen....

>> "కనీసం ఈ రామలింగరాజు తానే బాధ్యుణ్ణనీ, మోసగించాననీ ఒప్పుకుంటున్నాడు. ఎలా మోసగించింది చెప్పుకుంటున్నాడు"

ఇది నమ్మారంటే మీరు అమాయకులే అనుకోవాలి. అసలు దొంగల్ని కాపాట్టానికి ఆయనీ నాటకమాడుతున్నట్లు అర్ధమైపోతుంది కదా. వాళ్లనెందుకు కాపాడుతున్నాడనేది మరో కధ. ఒత్తిడులు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, మరేమైనా కావచ్చు.

మీరు ప్రతిదానికీ, ప్రతిసారి 1992 1992 అని అంటుంటారు. ఈ 1992 కి ప్రత్యెక కారణం ఏదైనా ఉందా?? విడమర్చి చెప్పగలరు. (ఇంతకీ ఈ సత్యం కుంబకోణం లో కూడా రామోజీ రావు పాత్ర ఉందంటారు. అవునా?).

eXCELLENT ANALYSIS...!
దీనికి SOLUTION కూడా మీరే చెప్పాలి మరి..!

"ఇదే స్థితి రేపు భారతదేశానికి పడితే? పట్టదన్న భరోసా ఎంతమాత్రం లేదు. "

ఆ స్థితి భారతదేశానికీ రావచ్చు. ఇదంతా బలుపు కాదు వాపు అని పాలగుమ్మి సాయినాథ్ చాలా సార్లు చెప్పారు... శాత్రీయమైన ఆధారాలతో, కానీ ఎప్పటిలానే సెన్సు మాట్లాడే వాళ్లను మన దేశంలో ప్రజ వినిపించుకోదు. వీలైతే ఎక్కిరిస్తుంది. ఇక్కడ అరుంధతీ కుశ్వంత్ సింగు మార్కు మేధావులకే ఫాలోయింగ్, కవరేజి ....

ఇక అలా జరిగితే ఎలా అంటే... ఎలా ఏముందండి.. మనం అలవాటూ పడిపోయాం. అన్ని రకాల దాస్యాలకు! :(

Krishna rao garu - మీరు పదే పదే ఎత్తిపొడవటం ఎందుకు చేస్తున్నారు?

What you did NOT know so far.... our country HAS BEEN in that state since time immemorial. You stated that yourself in this post. It will be in that very state for the forseeable future.

niMDA muligina vADiki calEmiTi? gOviMdA, gOviMda.

కృష్ణా రావు గారు,...సూపర్బ్!

పదే పదే 1992 ఎందుకు refer చేస్తారు? ......
"When I lodged complaint on Mr. Ramoji Rao about his anti India activities to Mr. P.V. Narasimha Rao in 1992, our country India was burning with multiple problems such as Kashmir, Khalisthan, Harshad Mehta’s Stock Exchange disputes, Bodos, Mandal Reservation movement, Terrorism and Babri- Mandir issue, Lorries strike etc. At that juncture, nobody can imagine that our country can get survival. But miraculary, every problem was solved with difference reasons. Is it impossible, when the Govt. got an important spying secrete or information? I`m not saying that I’m responsible for all such or its all was my credit. But I’m asking you – is it impossible for the P.M. of India to solve all such problems if he gets an important spying agents’ existence information?"
మరిన్ని వివరాలకు టపాలో పేర్కొన్న లింక్ Coups On World[Ref.No.24] చూడగలరు.

ఈ రాష్ట్రం లొ ధర్మాన్ని నాలుగు పాదాల నడిపిస్తున్న కలియుగ శ్రీరామచంద్రుడు రామోజీ రావు గురించి మాట్లాడదాం. తెలుగు పదకోశంలొని నీతి న్యాయం ధర్మం లాంటి పదాలను సంవత్సరాల తరబడి రుబ్బితె అది ఈనాడు అయింది. రేపు పొద్దున కోర్టుల్లొ న్యాయదేవతకు బదులు రామోజి ని నిలబెట్టవచ్చు. అంత నీతి మంతుడు మరి. చంద్రబాబును , రాజును చెరొ భుజాన మోసాడు. రామోజి ఎవరినొ ఒకరిని మోస్తూనె ఉండాలి. నిన్నటి పేపర్ మొత్తాన్ని రాజుకు అంకితం చెయడం సహించలెక రాస్తున్నాను.రామలింగ రాజు తప్పును క్షమించరాదు.అతడిని సమర్థించడం లెదు. నా బాధల్లా ఈనాడు గురించే....
రామోజీ రావు పందిని చూపించి నంది అంటే కొట్లాది మంది నమ్మవలసిందే! ఉన్నట్టుండి ఆయనకు పంది పంది లా కనిపిస్తుంది అప్పుడు అందరూ మల్లీ దాన్ని పందిగా గుర్తించాలి. రాజు ఐటి రంగాన్ని కుళ్ళబొడుస్తున్నాడు అని రాసినపుడు నీ ఇంగితం ఎమయింది? మీ పేపర్ ను దశాబ్దాలుగా ఆదరిస్తున్న పాఠకులు అంటే ఎపుడూ లొకువే. పాఠకుడి మీద ఏనాడూ ఆయనకు గౌరవం లేదు. గొంగట్లో తింటూ ఆయన ఏరి పారవేసే వెంట్రుకల గురించి అందరికీ తెలుసు. మళ్ళీ చెప్పనక్కర్లేదు.రామోజీ గారు ఒక పని చేస్తే తెలుగు ప్రజలు ఇంకా సంతోషిస్తారు. ఈనాడు పేపర్ ధర పది రూపాయలు చేయాలి. పొద్దున్నె పేపర్ తొ పాటు ఒక కాలిఫ్లవర్ ఇవ్వాలి. చదివినంత సెపు చెవిలొ పెట్టుకుని ఆ తర్వాత కూర వండుకుని తినవచ్చు. పొద్దున లేస్తూనే చాడీలు పితూరీలు మొదలు. దీని కన్నా రెండు చెట్లు ఎక్కువ మేసింది జ్యోతి. మా స్కూల్లో పిల్లలు మేలు వీటి కన్నా. అవి భరించలేక సాక్షి వేయించుకుంటే అన్నీ అజీర్ణం వార్తలు. వారికి అదోరకం పచ్చ కామెర్లు. లొకమంతా పచ్చగా కళకళలాడుతూనే ఉంటుంది. నిజాన్ని నిజంగా రాసే పేపర్ కానీ చానెల్ కానీ తెలుగులొ లేకపోవడం మన దురద్రుష్టం. చెప్పేదేమంటే ఎవర్నీ మోయవద్దండి నిష్పాక్షికంగా రాయండి. అప్పుడు రాజు లాంటి వాళ్ళ మీద 100 పేజీల స్పెషల్ ఎడిషన్ వేసినా చదవగలము. ఈరొజు మోసగాడిగా చెబుతున్న రాజు కొన్ని సంవత్సరాల కిందట రామోజి భుజం మీద ఎక్కిన వాడు అని తల్చుకున్నపుడు ఈనాడు పేపర్ చూస్తే కంపరం పుడుతుంది.కాదంటారా?????

ఇవాళ మార్కెట్లో అధికార పక్ష పత్రికలు, ప్రతిపక్ష పత్రికలు తప్ప నిష్పక్ష పాత పత్రికలు లేవండీ! రెండూ చదివి, మన విచక్షణ కొద్దో గొప్పో ఉపయోగించి నిజా నిజాలు బేరీజు వేసుకోవాలంతే! మన ఖర్మ!

ఇవాళ రాజుని తెగ తిట్టిపోస్తున్న ఈనాడు ఒకప్పుడు ఆయన కార్య దీక్షని, సఫలతని, సమర్థతని మెచ్చుకుంటూ తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగువాడిగా పేర్కొంటూ కవర్ స్టోరీలు రాసింది. సిగ్గు లేని తనమా మజాకా?

మీరు పదే పదే ఎత్తిపొడవటం ఎందుకు చేస్తున్నారు?...యోగి గారు... నేనేమి ఎత్తి పొడవడం లేదు. అంత అవసరం కూడా నాకు లేదు. ఏ ఏ సందర్బాలలో నేను ఎత్తి పొడిచానో కొంచం మీరు విడమర్చి చెప్పి ఉంటే బాగుండేది. అదీగాక... ఆది లక్ష్మి గారి అన్ని టపాలు తెలుగులోనూ ఇంగ్లిష్ లోను షుమారుగా 500 పేజీలుంటాయి. అవన్నీఒకే రోజులో చదివాను. అందుకని పోగాడటానికి గాను.. ఎత్తి పొడవడానికిగాను నాకామాత్రం హక్కు లేదా??

ఇప్పుడే క్యూబన్ విప్లవంపై చలనచిత్రం 'చే' చూసాను, మనం కూడా అలా విప్లవం తేవాలా, నేను ఇదేదో తమాశాగా అంటున్నది కాదు నా మనస్సులోంచి వచ్చింది.

మొన్న టీవీ ఇంటర్వ్యూలో మన మెంటల్ క్రిష్ణ అన్నాడు మంచి చేసినంతకాలం మంచోళ్ళంటాము,చెడు చేసినప్పుడు చెడ్డోళ్ళంటాము అన్నడు.అతను ఎంత తింగరోడు అయినా కరక్టే చెప్పాడు అనిపించింది.ఇన్నాళ్ళూ తెగ మోసాడు అంటున్నారు రామోజీని.ఇన్నాళ్ళూ మనమెవరన్నా ఊహించామా రాజుగారు అలాంటివాడని,అలా చేస్తాడని?మనం కూడా ఆయన్ని ఐడల్ గా చూసినవాళ్ళమే కదా.

యోగి గారూ,

’నిద్రపోయే వాళ్ళను లేపగలం గానీ, నిద్రనటించే వాళ్ళని లేపలేం’ అని పెద్దలంటారు. కృష్ణారావు జల్లిపల్లి గారు, తాను నన్ను ఎత్తిపొడవటం లేదంటూనే ‘500 పేజీలున్న నా టపాలు ఒకే రోజులో చదివాడట. కాబట్టి ఎత్తిపొడిచే హక్కు తనకి లేదా’ అని అడుగుతున్నారు. అందులోని సంస్కారం ఆయన వ్యక్తిగత విషయం. ఆయన అంటున్నది అసంబద్దం అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే
1]. నా టపాలు ఒక్క ఆంగ్లంలోనే నిశ్చయంగా 500 పేజీల కంటే ఎక్కువ. ఆయన ఒక్క రోజులో చదివేసాడట. ఎంత వేగపు చదువరికైనా, అది ఎలాంటి రచన అయినా 500 పేజీలు [అయితే గియితే] ఒకే రోజులో చదవటం అసాధ్యం, అవాస్తవం.
2]. 500 పేజీలు ఒకే రోజులో చదివేసిన ఈయనకు అసలేం అర్ధం కాలేదో ఏమో మరి ‘పదే పదే 1992 అని ఎందుకంటారూ?’ అని అడిగాడు. రామాయణం అంతా విని రాముడికి సీతేమౌతుంది అనడం అంటే ఇదేనేమో మరి.
3]. అంతేగాక రచయిత లేదా రచయిత్రి వ్రాసినది చదివినంత మాత్రన ఎవరికైనా వ్యక్తిగతంగా ఆ రచయిత లేదా రచయిత్రిని ఎత్తి పొడిచే హక్కు వస్తుందా? [ఓ ప్రక్క ఎత్తి పొడవట్లే దంటూనే, ఎత్తి పొడిచే హక్కు లేదా అన్న ఆయన వితండవాదం హాస్యాస్పదం.] అలాంటి హక్కులు సంభవించేట్లయితే మరి ఈయన వ్రాసిన వ్యాఖ్య చదివిన వాళ్ళందరికీ ఈయన్ని ఎత్తిపొడవటానికో, వ్యక్తిగతంగా తిట్టడానికో హక్కులొచ్చేస్తాయా? అంచేతే నిద్ర నటించే వారి జోలికి వెళ్ళడం అనవసరం అంటారు కాబోలు పెద్దలు.
*********

నీలాంచల గారూ,

Thank you for commenting on my blog.

***************

అలాంటి హక్కులు సంభవించేట్లయితే మరి ఈయన వ్రాసిన వ్యాఖ్య చదివిన వాళ్ళందరికీ ఈయన్ని ఎత్తిపొడవటానికో, వ్యక్తిగతంగా తిట్టడానికో హక్కులొచ్చేస్తాయా?..... కచ్చితంగా వచ్చేస్తాయి. నిరబ్యంతరంగా విమర్శించ వొచ్చు, అవసరం అయితే బూతులు కూడా తిట్ట వచ్చు. అసలు బ్లాగుల ఉద్దేశ్యం అదే. అంతా స్వేచ్చే.

ఇక నా సంస్కారం అంటారా .. బాషా సంస్కారం ఉంటే సరిపోదు. అయినా మీరు నన్ను 'అడిగాడు' 'ఈయన' అని సంబోదించారు. మరి మీ సంస్కారం ఏపాటిదో.

"అవసరం అయితే బూతులు కూడా తిట్ట వచ్చు. అసలు బ్లాగుల ఉద్దేశ్యం అదే. అంతా స్వేచ్చే."

క్రిష్ణారావు గారూ, అందరూ మానసికంగా మీ అంత ఎదిగి ఉండకపోవచ్చు... కాబట్టి కాస్త సంయమనం పాటించండి. ఇంతకన్నా ఏమీ చెప్పలేను

యోగి గారూ... 2009 లో అందరూ అలా ఎదగాలని కోరుకుంటున్నాను. అప్పుడే బ్లాగులకి సార్ధకత. ఇక సంయమనం అంటారా.. పిండి కొద్ది రొట్టె. టపాని బట్టే వ్యాఖ్యలు ఉంటాయని మీకు తెలియనిది కాదు. ఏదో నాతొ చెప్పిస్తున్నారు కాని.

What you said is absolutely right.

మీకున్నంత ఓపిక నాక్కూడా లేదేమోననిపిస్తోంది. చాలా బాగా రాశారు. అమెరికాకే ఆర్థిక పతనం తప్పనప్పుడు ఇండియా ఓ పేద్ధ మినహాయింపని నమ్మకూడదు. మన దగ్గర ఆ పతనం ఆర్థికంగానూ, రాజకీయంగాను ఏకకాలంలో జరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అంటే నేననేది - అమెరికా పరిస్థ్తితే గనుక మనకేర్పడితే బహుశా ఇక్కడ ఇఱవై ఎనిమిదో, అంతకంటే ఎక్కువో పార్లమెంట్లు కూడా ఏర్పడతాయి.

Hai,

Please check these links also

http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2009/dec/6edit1

http://in.rediff.com/news/2004/dec/28raman.htm

-Sriram
asrcmurthy at gmail dot com

మూర్తి గారు,

ఆంధ్రజ్యోతి చూశాను గానీ, rediff.com ఇంతకు ముందు చూడలేదండి. మంచి లింకులు ఇచ్చారు. కృతజ్ఞతలు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu