ముందుగా ఓ పోలిక వ్రాసి, దాని విశ్లేషణ, నడుస్తోన్న చరిత్ర,పై దాని అనువర్తనతో నా బ్లాగ్ అతిధులని అలరించాలని ఇది వ్రాస్తున్నాను.

ఓ కాలనీలో మనమూ, మన పొరుగింటి వాళ్ళూ ఉన్నామను కొండి. [ అంటే ప్రపంచంలో భారతదేశమూ, పాకిస్తాన్ లు ఉన్నట్లన్న మాట] మన ఇంట్లో కొన్ని వాటాలూ ఉన్నాయి. అలాగే మన పొరుగు వారింటిలోనూ కొన్ని వాటాలు [రాష్ట్రాలు అన్నమాట] ఉన్నాయి.

మన పొరుగింట్లోకి, వాళ్ళ వాదన ప్రకారం కొంతమంది లావుపాటి రౌడీల్లాంటి కుర్రాళ్ళు కొన్ని వాటాలని బలవంతంగా ఆక్రమించారు[అట]. ఆ లావుపాటి రౌడీలు తమ తరుపు బంధువులు కాదని తమకు తెలియదని మన పొరుగింటి వారి వాదన. అయితే ఈ లావుపాటి రౌడీలు చీటీకీ మాటికీ మన ఇంట్లోకి చొరబడి ఏదో ఒక వాటాలో భీభత్సం సృష్టించి పారిపోతున్నారు. [అంటే అల్ ఖయిదా లేదా లష్కరే తోయిబా లేదా దక్కన్ ముజాహిదీన్ లేదా తొక్కా తోలూ సంస్ధల ఉగ్రవాదులు మనదేశపు రాష్ట్రాల్లోనూ, నగరాల్లోనూ చేస్తున్న బాంబుదాడుల్లాగా అన్నమాట]

“ఇదేమి అన్యాయం?" అని మనం, ప్రక్కింటి వాణ్ణి నిలదీస్తే వాళ్ళు “మేమూ తీవ్రవాద బాధితులమే. మా వాటాల్ని లావుపాటి రౌడీలు బలవంతంగా ఆక్రమించారు. మీకు జరిగిన నష్టానికి మేం విచారిస్తున్నాం. ఎక్కడ అన్యాయం జరిగినా వ్యతిరేకించాల్సిందే. మీకు మా సానుభూతి. కానీ మమ్మల్ని నిందిస్తే మేం ఊరుకోం. దొమ్మీకి మేం సిద్ధం. జాగ్రత్త! ఖబడ్ధార్!” అంటూ హుంకరించారు. [పాకిస్తాన్ మనమీద యుద్దానికి సిద్దం అన్నట్లన్న మాట]

వెనువెంటనే ఈ లావుపాటి రౌడీలంతా “మీరు ప్రక్కింటి మీదికి దొమ్మీకి వెళ్ళితే, మీతో భుజం కలపడానికి మేం సిద్ధం” అంటూ మన పొరుగింటి వారికి భరోసా ఇచ్చేశారు.

ఏ లావుపాటి రౌడీల మీద తమకు కంట్రోలు లేదనీ, తాము వారి బాధితుల మనీ, మన పొరుగింటి వారు ఇప్పటివరకూ మనకి నమ్మబలకారో, నమ్మబలక ప్రయత్నిస్తున్నారో ఆ లావుపాటి రౌడీలు, మన పొరుగింటి వాడు మన మీదికి దొమ్మీకి వస్తానంటే మరుక్షణం వత్తాసు వచ్చారంటే ఏమిటి అర్ధం? ఆ లావుపాటి రౌడీలకీ, మన పొరిగింటి వారికీ మధ్య ఉన్నదేమిటి? ఈ లెక్కన అసలు పొరిగింటి నాటకం ఏమిటి? తమ వాటాల్ని లావుపాటి రౌడీలు బలవంతంగా ఆక్రమించారనీ, తాము వారి బాధితులు మని అనటం ఎంత వరకూ నిజం?

ఈ నాటకానికి అసలు మెరుపు ఏమిటంటే - మనం గానీ, మన కాలనీ లోని ఇతరులు గానీ, మన పొరుగు వాణ్ణి “ సరే నాయనా! నువ్వూ ఈ లావుపాటి రౌడీల బాధితుడవే కదా! నీ ఇంటిలోని వాటాల్ని వాళ్ళు బలవంతంగా ఆక్రమించి అకృత్యాలు చేస్తుంటే, నీవు నిరోధించలేక నిస్సహాయంగా ఉన్నావు కదా! సరే మేం సహాయం వస్తాం. మేం వాళ్ళని చావదంతాం. ఇంట్లోకి రానివ్వు” అంటే - వెంటనే మన పొరుగు వాడు “ఠాఠ్! వీల్లేదు. ఇది నా ఆత్మ గౌరవానికీ, సార్వభౌమాధికారానికీ సంబంధించిన వ్యవహారం. అసలయినా వాళ్ళు రౌడీలు కాదు. ఆధ్యాత్మక వేత్తలు, అసలు మీ కొంప తగలెట్టింది మా వాళ్ళేనని గ్యారంటీ ఏమిటి? సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఉంటే చూపించండి?" అంటున్నాడు.

ఇలాంటి ఈ పొరుగింటివాణ్ణి మన కాలనీ లోని ఏ ఒక్కరూ కట్టడి చేయలేకపోతున్నారు; మనతో సహా. ఎటూ మన ఢీల్లీలోని యు.పి.ఏ. ప్రభుత్వ నాయక శిఖామణులకి అంత సీన్ లేదనుకొండి. ఎందుకంటే - ఇదే లావుపాటి రౌడీలు సెప్టెంబర్ 11, 2001న మన కాలనీలో పోలీస్ పెద్దన్న గారి ఇంటి మీద [అమెరికా లోని డబ్యూ.టీ.సీ] దాడి చేస్తే ఆ పోలీస్ పెద్దన్న ఆఫ్గాన్ న్ని ఈడ్చితన్నాడు. అప్పటికి లావుపాటి రౌడీలు అక్కడున్నారు లెండి. తర్వాత మన పొరిగింట్లోకి చొరబడ్డారు[అట]. ఆ పైన ఆ పోలీస్ పెద్దన్న ఇరాక్ మీదకీ వెళ్ళి యుద్దం చేశాడనుకొండి. అందులోని వ్వాపార కోణం ఇక్కడ అప్రస్తుతం. ఆ పోలీస్ పెద్దన్న అలా లావుపాటి రౌడీల్నీ తన్ని తగలేయ ప్రయత్నంచాడు గానీ, ఇప్పుడు మన పొరిగింట్లో ఆశ్రయం పొందేసరికి ఈ లావుపాటి రౌడీలు మరింత లావుఅయిపోయునట్లున్నారు.

ఇదేమీ గమనించకుండానే ఆ పోలీస్ పెద్దన్న [అమెరికా లోని బుష్ ప్రభుత్వం] మన పొరిగింటి వాడికి ఆఫ్గాన్ మీద యుద్దం చేస్తున్నప్పుడూ భూమిని ఉపయోగించుకోనిచ్చినందుకు ప్రత్యుపకారంగా ఆర్ధిక సాయం, యుద్ద విమానాల్లాంటి సామాగ్రి కూడా ఇచ్చాడు. మూడు, నాలుగు నెలల క్రితం కూడా కొన్ని విమానాలు [వాడేసినవేనట] ఇచ్చాడు. అప్పటికీ తెలియ లేదా లావుపాటి రౌడీలు ప్రక్కింట్లో తిష్ఠ వేసారని? ఇది పోలీస్ పెద్దన్న అమాయకత్వమా, మన పొరిగింటి వాడి బలమా?

ఇంతకు ముందు నా టపా ’ఇస్లామా బాద్ కు ఇంత బలమా?’ లో చర్చించినట్లు ఇది ఇస్లామాబాద్ బలం గాక మరేమిటి? ఈ బలానికి ఏదో నిమిత్తముండి యుండవలయును. అదేమిటి?

వారినీ, వారికి ఆశ్రయం ఇచ్చిన మన పొరిగింటి వారినీ ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. అసలే వాళ్ళదగ్గర అణ్వస్త్రాలున్నాయి మరి. అందుకే అందరూ ఎంతో సౌమ్యంగా, సామరస్యంగా మన పొరిగింటి వాణ్ణి బుజ్జగించి మరీ అడుగుతున్నారు.

ఇందులో మరో గమ్మత్తు కూడా ఉందండోయ్!

ఇప్పడు గనుక మన పొరిగింటి వాడు మన మీదికీ దొమ్మీకి వస్తే, వాడి దగ్గరున్న అణ్వస్త్రాలని యధేచ్ఛగా మన కొంపమీద ప్రయోగించి కూల్చి పారేయగలరు. మనం మాత్రం అణు ఒప్పందం పుణ్యమా అని “అయ్యా! బాబూ! మమ్మల్ని కాపాడండి. మేం దొమ్మీకి ఆహ్వానించటం లేదు” అని మొత్తుకోవాలన్నది మన యు.పి.ఏ. ప్రభుత్వ నాయకుడు మనోమోహనుడూ, నాయకురాలు నాగమ్మల ఉద్దేశం కాబోలు.

అందుకేనేమో, ఆఘమేఘాల మీద, నానా హైరానా పడి, హడావుడిగా ‘బుష్ కి నేను ఎలా ముఖం చూపించాలంటూ’ మధనపడి[దాంట్లో 10% ఫీలింగ్ బాంబులు పేలినప్పుడు, దేశ ప్రజలకి ఎలా ముఖం చూపించాలి అనిపించలేదు కాబోలు] మద్దతీస్తోన్న ఎర్రపార్టీ వాళ్ళని వెళ్ళగొట్టి, విశ్వాస పరీక్షలో టి.టి.డి. ఛెర్మన్ పదవులూ, నోట్ల కట్టలిచ్చి మరీ ఓట్లు కొనుక్కొని నెగ్గి, ఒక్క ఉదుటున పరుగు పెట్టి అణుఒప్పందం మీద సంతకాలు చేశారు! దీన్ని వ్వవస్ధీకృత సర్ధుబాటు అనాలో, కేంద్రప్రభుత్వ దూరదృష్టి లేమి అనాలో దేవుడి కెఱుక.

ఇలాగే కొనసాగితే ఎంచక్కా మన ఇంటిని పొరుగువాడికి ధారాధత్తం చేసేస్తారో ఏం ఖర్మో! ఏదైతే అదే అవుతుందని ఎదురుచూడటం ఎటూ మనకి అలవాటెగా!

[గమనిక: ఇది నేను ఆక్రోశంతో వ్రాయలేదు. నిరాశతోనూ వ్రాయలేదు. నాకూ కుతుహలంగానే ఉంది, ఏం జరుగుతుందో, జరగబోతోందో చూద్దామని]

మరో టపాలో మరికొన్ని విశేషాలు.

అందాక అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినోభవంతు!

**************

5 comments:

నేను ఇలాంటి టపా ఒకటి రాశాను.

http://sahithikabrlu.blogspot.com/

కిరణ్ గారూ,
ఇప్పుడే మీ బ్లాగులోని డిసెంబర్ 12, నాటి ’ఇదీ సంగతి’ టపా చదివాను. చాలా చక్కగా వ్రాసారు. భవన సొంతదారులు వంటి భారతీయులుపైన ఒక ప్రణాళిక ప్రకారం మానసిక తంత్రం, కుట్ర ప్రయోగింపబడుతున్న కారణాన ఇదంతా జరుగుతుందండి. పొరుగు వాడి లేదా దొంగల నాటకాలు నడుస్తున్నాయి. మీ పరిశీలన, పోలిక చాలా బాగున్నాయి. నా బ్లాగులో వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు

Chaala baaga Vheppaaru

good we make war agenist pak & musalmans

mari... anti-british fight chesamane perutoa ... delhi pairaveelatoa... pakka raastraanni(Anti-Nizam fight chesina vaari raashtram) aakraminchi... daani lo projects katti... neellani, vanarulanu dochukunna, dochukuntunna vaari gurinchi koodaa raaste baavuntundi...

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu