మళ్ళీ మన ఇతిహాసాలు దగ్గరికి వస్తాను. ముందే చెప్పినట్లు, భారత రామాయణాలు భారతీయులకి రెండు కళ్ళవంటివి. ఈ రెండు కళ్ళతో ప్రజలు తమ చుట్టు ప్రపంచాన్ని, తమ జీవితాన్ని విలక్షణంగా పరికించవచ్చు, పరిశీలించవచ్చు.

ఇక భాగవతం భారతీయులకు హృదయం వంటిది. భారతీయులు తమ జీవితాల్లోని ప్రతి అనుభూతిని శ్రీకృష్ణలీలలన్నంతగా భావిస్తూ అనుభవిస్తారు [ప్రతీ తల్లీ, తన బిడ్డల్ని కన్నయ్య, కిట్టయ్య అనుకుంటుంది]. ఇక వేద విఙ్ఞానమయితే భారతీయుల మెదడు వంటిది. భారతీయులు ప్రపంచాన్ని, విశ్వాన్ని, తమ జీవితాన్ని ఈ ఙ్ఞానంతోనే పరిశీలిస్తారు, గుర్తిస్తారు.

ఇక భగవద్గీత భారతీయులకి ఏకంగా ఆత్మ వంటిది. ప్రాణం వంటిది. ఆత్మలాగే అది శాశ్వతమైనది. మనిషి జీవితానికి పునాది వంటిది. మనకి అర్థం కానివ్వండి, కాకపోనివ్వండి భగవద్గీత, అందులోని ఙ్ఞానం భారతీయుల జీవన నిర్మాణం వంటిది. మనకు అవగాహన ఉన్నా, లేకపోయినా, గీత ఙ్ఞానం భారతీయుల జీవన విధానం, జీవిత తత్త్వం.

కాబట్టి నకిలీ కణికుడూ అతడి వ్యవస్థా తమ కుట్రలో సింహ భాగం ఇతిహాసాలకే ఇచ్చారు[తరువాత భాగం రాజకీయానికి]. నేను ఈ చర్చని రామాయణంపై కుట్రతో ప్రారంభిస్తాను.

రామాయణంలోని శ్రీరాముడు సూర్యవంశీయుడు. ఇక్ష్వాకు, మనువు, సత్యహరిశ్చంద్రుడూ ఈయన వంశ పూర్వీకులు. వారు గొప్పరాజులు. అంతేగాక ధర్మాన్ని, నీతినీ, సత్యాన్ని ఆచరించిన వారు. ఇందులో సత్యహరిశ్చంద్రుడి గురించి, ఆ అంశంలో కుట్ర గురించి ఇంతకు ముందే వివరించాను. ఆవిధంగా ఒక గొప్పకధ, ఒక గొప్ప స్ఫూర్తి ప్రజల మనో ఫలకం నుండి మాసి పోయింది. దానితో పాటు జనాల్ని నిజం వైపు నడిపే శక్తి, ధర్మాచరణకి పురికొల్పే స్ఫూర్తి కూడా రూపు మాసిపోయింది. ఏ కథ సామాన్యుణ్ణి, మహత్ముణ్ణి చేసిందో, మళ్ళీ అలాంటి ప్రమాదం జరక్కుండా నకిలీ కణికుడూ, అతని వ్యవస్థా ఆ కథని సమాజం నుండి పారద్రోలేసారు. అలాంటి స్ఫూర్తి ప్రదాయక నాటకాలు, కళలో ప్రదర్శించే సురభి, సాంప్రదాయ కళాకారుల కుటుంబాలూ వ్యూహాత్మకంగా కుప్పకూలిపోయారు. ఓ వ్యక్తి మీద, ఓ కుటుంబం మీద ఒక వ్యవస్థ [గూఢచారి వ్యవస్థ] పని చేసినప్పడు ఇలా జరగటం సహజమే.

హరిశ్చంద్రుడి కథలో ఆయన భార్య చంద్రమతి, కుమారుడు లోహితుడూ ఆతని సత్యదీక్షకి అండదండలదిస్తారే గానీ అడ్డంకులు కలిగించరు. కుటుంబంలో విభజించి పాలించే కణిక నీతి ప్రవేశిస్తే ఆయనైనా ఓడిపోతారేమో. ఈ నాటకాన్ని సురభిలాంటి కళాకారులూ పద్యరూప నాటకంగా ప్రదర్శిస్తే గ్రామీణులు సైతం ఆ గ్రాంధిక పద్యాల్ని భావ సహితంగా గ్రహించగలిగే వాళ్ళు. అర్థం చేసుకోగలిగే వాళ్ళు. ఈ రోజు తెలుగు ఏపాటి అర్ధమౌతుందో మనకి టీవి యాంకర్లని చూస్తే తెలుస్తోంది కదా!

ఇంకా హరిశ్చంద్రుడి కథలో, ఆయన కుటుంబం మొత్తం ‘సత్యం పలకడం’లాంటి నైతిక విలువలకి కట్టుబడి ఉంటుంది. ఇలాంటి కథలు ప్రజల్ని, కుటుంబం మొత్తం కష్టసుఖాల్లో కలిసికట్టుగా ఉండేలా ప్రోత్సాహిస్తాయి. భర్తలు కష్టాల్లో ఉన్నప్పడు వెన్నంటి ఉండాలని భార్యలకి ఇలాంటి కథలు గుర్తుచేస్తాయి. అలాంటి కథలు మీద ఎన్ని వ్యంగ్యాలు, ఎన్ని జోకులు వేసారో చూశారుగా! రంగనాయకమ్మలకి మీడియా ఇచ్చిన ప్రోత్సాహం, ఉషశ్రీల కిచ్చిన మౌనం మన కళ్ళముందు రికార్డెడ్ సత్యం కదా!

ఇక శ్రీరామ చరిత్ర గురించి చెబితే ...

దశరధ మహారాజు తన కోసల రాజ్యాన్ని, ధర్మబద్దంగా పాలించడమే కాదు, తన నలుగురు కొడుకుల్ని చక్కగా పెంచాడు కూడాను. తల్లితండ్రుల్ని, గురువుల్ని, పెద్దల్ని గౌరవించేలా, ధర్మాన్ని ఆచరించేలా, కష్టాల్లో ధైర్యంగా ఉండేలా, వినయవిధేయతలూ, ధైర్యసాహసాలూ ఉండేలా కొడుకుల్ని తీర్చిదిద్దాడు. బాల్యం నుండీ రామలక్ష్మణ భరత శతృఘ్నలు సత్ర్పవర్తనకు పేరుగాంచారు. వారిలో శ్రీరామ చంద్రుడు మరింత అందమైన వాడు, సౌశీల్యుడు, ఙ్ఞాని, మృదుభాషి. అందర్నీ మన్నిస్తూ ఎవరినీ నొప్పించని మృదుస్వభావి. సహజంగానే ప్రజలు రాముణ్ణి ప్రేమించేవాళ్ళు. రామాయణంలోని ఇతర పాత్రలు శ్రీరాముణ్ణి పొగడుతూ ఉంటాయి. ఆదికవి వాల్మీకి ఇదంతా ఎంతో రమ్యమైన శ్లోకాలతో వర్ణించాడు.

దీన్ని ఉటంకిస్తూ రామాయణ విషవృక్ష రచయిత్రి రంగనాయకమ్మ, ఇంకా అలాంటి వ్యక్తులు ఎన్నో విమర్శలు చేశారు. ఈ రకంగా ఇతర పాత్రల చేత పొగిడించి, ప్రజలంతా మాస్ హిస్టీరిక్ గా రాముణ్ణి ఆరాధించేట్లు వాల్మీకి, రామ భక్తులూ చేశారట. అందరూ కలిసి శ్రీరాముడికి ’హీరో ఇమేజ్’ ఇచ్చారట కాని, నిజంగా శ్రీరాముడు అంత గొప్పవాడేం కాదట.

నిజానికి వాల్మీకి మహర్షి శ్రీరాముణ్ణి గాని, రామాయణాన్ని గాని హిట్ చేసుకోనేందుకు పబ్లిసిటిగానీ, ప్రచారంగానీ, వాణిజ్య ప్రకటనలుగానీ ఇవ్వలేదు. రామాయణాన్ని ప్రసిద్ది చేసుకొనేందుకు ఆయన మార్కెటింగ్ కాంపయన్లు నిర్వహించలేదు. శ్రీరాముడు కూడా అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. తనిని తాను పొగుడు కోలేదు.[స్వంత గోకుడు] అవార్డులూ, రివార్డులూ, ఙ్ఞాన పీఠాలూ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులూ, ఆస్కార్ లూ కొనుక్కోలేదు. పద్మశ్రీలు, జీవన సాఫల్య బహుమతులూ తెచ్చుకోలేదు. కనీసం కళాతోరణాల్లో సన్మానాలన్నా చేయించుకోలేదు. శ్రీరాముడు, వాల్మీకి తననూ పొగిడిన వాళ్ళకే కెరీర్ ఉండేలా గాడ్ ఫాదర్ గిరీ చేయలేదు. ఈ రోజు వ్యూహత్మకంగా కొందరు హీరోల్ని, హీరోయిన్లనీ హిట్ చేస్తున్న ఏ తంత్రల్నీ [స్ట్రాటజీ] లనీ వారు ప్రయోగించలేదు.

వాల్మీకి గాని శ్రీరాముడు గాని ’నువ్వు నావీపు గోకు. నేను నీవీపు గోకుతా.’ అనే మ్యాచ్ ఫిక్సింగ్ లు చేసుకోలేదు. ఈ రోజుల్లో ఇదే కదా మీడియా, సినిమా ప్రపంచం ఆచరిస్తోన్న తంత్రం? ఈ రోజు XYZ పత్రికిచ్చిన ప్రపంచపు అత్యంత ప్రభావశీల మహిళ ర్యాంకులు, ఆసియా సెక్సీయస్ట్ మహిళల ర్యాంకులు ఎంత మాయాజాలమో అందరికీ తెలిసిందే.

చిరంజీవుల్ని, రజనీ కాంతుల్ని ఆయా భాషల్లో సూపర్ స్టార్ లని చేసిన మీడియా లాంటివి అప్పట్లో లేవు. శ్రీరాముడు గానీ, వాల్మీకి కవి గాని తమ దగ్గర లైట్ అంటే సామర్ధ్యం ఉందని దండోరా వేసికొనేందుకు మీడియాని ఉపయోగించుకో లేదు. మీడియా లాంటి వేవీ లేకుండానే ప్రజలు వారిలో ఆ సుగుణాల్ని, సామర్ధ్యాల్నీ చూశారు, అంగీకరించారు.

నిజానికి ప్రస్తుత కాలాన్ని రామాయణ కాలంతో పోల్చకూడదు. రామాయణ కాలాన్ని ప్రస్తుత కాలంతో పోల్చకూడదు. [మౌలిక సదుపాయల విషయంలో పోల్చకూడదు. మానవతా విలువలు విషయంలో కాదు. ఎందుకంటే మానవతా విలువలు దేశకాల మానపరిస్థితుల్ని బట్టి మారవు] అయినా ఎందుకు పోల్చానంటే ...

ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, రామసేతు వివాదం విషయంలో విమర్శిస్తూ, "రామ సేతు ప్రకృతి సహజంగా ఏర్పడింది. అంతేగాని అది రాముడు లంకకి కట్టిన వారధి కాదు. నిజానికి రాముడంటూ ఏవ్యక్తీ పుట్టలేదు. రామాయణం కవుల కల్పన. ఎక్కడ పుట్టాడు రాముడు? ఎప్పడు పుట్టాడు? ఎక్కడ చదువుకున్నాడు? ఎప్పడు చదివాడు? ఇంజనీరింగ్ చేశాడా? భారతదేశం నుండి లంకకి బ్రిడ్జి కట్టేందుకు ఏ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ చేశాడు?" అన్నాడు.

ఈ రోజు భారత్ లో [ఇక్కడే కాదు, ప్రపంచమంతటా కూడా] ఓ మామూలు స్త్రీకి MLA భార్య పేరిట నకిలీ పాస్ పోర్టులు దొరుకుతున్నాయి. ఈ రోజు భారత్ లో ఒక్క ఉగ్రవాదికి 10 పేర్లతో 10 నకిలీ పాస్ పోర్టులూ, ఫోటో గుర్తింపుకార్డులు దొరుకుతున్నాయి. ఈ రోజు భారత్ లో అసలు బేసిక్ నిర్వచనాలైనా రాని విద్యార్దులకి ఏకంగా ఎంసెట్ స్టేట్ ర్యాంకులూ, డిస్టింక్షన్లూ వస్తున్నాయి. కేవలం డబ్బుంటే చాలు, ఆయా డిపార్టమెంట్లనీ, అధికారుల్నీ, రాజకీయ నాయకుల్నీ కొనడానికి. ఏదైనా సాధ్యమే. అటువంటప్పడు శ్రీరాముడూ,లక్ష్మణుడూ, సుగ్రీవుడూ, ఆంజనేయుడూ, నీలుడు లకి అసాధ్యమా తమిళనాడు నుండో, ఆంధ్రప్రదేశ్ నుండో లేక భారత్ నుండో, ఓ యూనివర్సిటీ నుండి, తొక్కలోది ఓ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పుట్టించడం? అవో పెద్ద ప్రామాణికాలా?

ఈ అంశం ప్రక్కన బెట్టండి.

అసలు రాముడు నిజంగా ఈ భూమ్మీద పుట్టాడో లేదో,

రాముడు కవికల్పితపాత్రో నిజమో

రాముడు లంకకి వారధి కట్టాడో లేదో,

ఏ రామ సేతుమీదైతే బి.జె.పీ., అయోధ్యలోని రామ మందిరంలాగా డ్రామలాడి లబ్ది పొందాలని ప్రయత్నిస్తోందో, ఆ రామసేతు ప్రకృతి సహజంగా ఏర్పడిందో, మానవ నిర్మితమో –

ఏదైనా కానివ్వండి. దాన్ని కోట్లాది భారతీయులు నమ్ముతున్నారన్నది పచ్చినిజం. కనీసం ఆ నమ్మకాన్నయినా గౌరవించాల్సిన అవసరం కరుణానిధికి గాని, కేంద్రంలో అధికారంలో ఉన్న యు.పి.ఏ. కి గానీ లేదా? భారతీయులు లేదా హిందువుల నమ్మకాలూ, మనోభావాలూ అంత చులకనా? ఏం, హిందువులకి మనోభావాలుండవా?

1984లో ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన ఢిల్లీ అల్లర్లలో సిక్కుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ 24 ఏళ్ళ తర్వాత కూడా మరిచిపోకుండా వ్యాసాలు వ్రాసే కులదీప్ నయ్యర్ [ఈయన పాకిస్తాన్ నుండి ఇక్కడికి వలస వచ్చాడు దేశవిభజన సమయంలో. నేటి సీ.ఇ.ఓ. ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రతిపక్ష నేత ఎల్.కే.అద్వానీ, రాజ్ కపూర్ లూ, బి.అర్.చోప్రాలు, సునిల్ దత్ లూ, దేవానంద్ లూ, రాన్ బాక్స్ అధినేతలూ - ఇలా ఎందరో ప్రముఖలు, ఎన్నో రంగాల్లో - అందరూ ఇదే వర్గీయులు[పాక్ నుండి వలస వచ్చిన వారు] కావడం ఇక్కడ విశేషం] వంటి వారికి, అదే సానుభూతిని హిందువుల పట్ల చూపించాలని ఎందుకనిపించదో? కేవలం ఇతర మతస్తులకో, దళితులకో మాత్రమే మనోభావాలు దెబ్బ తింటాయా? హిందువులు బండరాళ్ళా? వారికి మనోభావాలుండవా, లేక దెబ్బతినవా?

ఇది చూపడం లేదా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్న కుట్రని? లేకపోతే కరుణానిధో మరొకరో, ఇలాంటి వ్యాఖ్యలూ, విమర్శలూ ఇతర మత విషయాల మీదగానీ, మతప్రవక్తల మీద గాని, మత నమ్మకాల మీదగాని చేయగలరా? అంతగా ఎందుకు హిందువులు చులకనా?[ఇతర మతాలని అంటే పత్రికలు కోపేసుకొస్తాయి. అదే హిందూ మతాన్ని అంటే మరింత మద్దతిస్తాయి] ఎవరు ఇంతగా హిందూ నమ్మకాల్ని, మతాన్ని హీనపరచే వారికి సహాయసహకారం ఇస్తున్నారు? సందేహం లేకుండా అది నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థే. ఆ వ్యవస్థ పేరు, ఏదైనా కానివ్వండి [సి.ఐ.ఏ. లేదా ఐ.ఎస్.ఐ. లేదా లష్కర్ లేదా తొక్క లేదా తోలు].

మళ్ళీ మనం రామాయణం, దశరధుడి దగ్గరికి తిరిగివద్దాం. రాజుగా ఆయన సఫలీకృతుడు. తండ్రిగానూ సఫలీకృతుడు. తన పుత్రుల్ని వ్యక్తిత్వం ఉన్న వారిగా పెంచాడు. వారిని ప్రజలకి బాధ్యులుగా ప్రవర్తించేలా పెంచాడు. తానూ అదే కోవకి చెందుతాడు గనుకే ఆయన రాజుగా సఫలీకృతుడని చెప్పాలి. రాజుగా తానెంత బిజీ అయినా తన తర్వాతి తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఆయన మరచిపోలేదు. కాబట్టి ఆయన పుత్రుల్లో తమ్ముళ్ళు, అన్నల్ని గౌరవించారు. అందరూ తల్లితండ్రుల్ని[సవతి తల్లితో సహా] గౌరవించారు. జౌరంగజేబు సింహాసనం కోసం తండ్రి షాజహన్ ని నిర్భంధంలో ఉంచినట్లు, సోదరుల్ని హత్య చేసినట్లు, దశరధ పుత్రులు సింహాసనం కోసం ఒకరిపై ఒకరు కుట్రలు పన్నుకోలేదు.

మూడు నాలుగు దశాబ్ధాలు ముందు వరకూ కుటుంబంలోని పెద్దలూ తల్లితండ్రులూ రామాయణాన్ని ఉటంకించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, ఆకథల్ని పిల్లలకి చెప్పెవాళ్ళు. తాము మంచిగా ఉండటానికి, నీతినియామాల్ని పాటించటానికి ఆ కథల నుండి స్ఫూర్తి పొందే వాళ్ళు. కాబట్టే అప్పటి తరం వాళ్ళు తమ పెద్దల్ని గౌరవించే వాళ్ళు. అదే ఇప్పడు మన సమాజాన్ని గమనించినట్లయితే - పిల్లలు తమ కంటే పెద్దవాళ్ళయిన తోబుట్టువుని, అన్న లేదా అక్కా అని పిలవటం లేదు. పేరు పెట్టి పిలుస్తున్నారు. పెద్దలు, తల్లితండ్రులు పెద్దపిల్లల్ని పేరుతోనో, ముద్దుపేరుతోనూ పిలిస్తే, చిన్నపిల్లలు కూడా అదేఅనుకరిస్తారు. అప్పుడు నిజానికి పెద్దలూ, తల్లితండ్రులూ పిల్లల్ని సరిదిద్దాలి. చిన్న పిల్లలు తమకంటే పెద్దపిల్లల్ని గౌరవించేలాగా, పెద్దపిల్లలు తమకంటే చిన్నపిల్లల పట్ల వాత్సల్యం, ప్రేమ, బాధ్యతా కలిగి ఉండేలా చేయాలి.

కాని భారత రామాయణాలు సమాజంలో కనుమరుగైనరీత్యా, ప్రజల్లో చాలామంది ఈ క్రమశిక్షణ మరిచిపోయారు. చిన్నపిల్లలు తమ అన్నల్ని, అక్కల్ని పేరుతో పిలిస్తూ తల్లితండ్రుల్ని అనుకరించినప్పుడు తల్లితండ్రులు అది పిల్లల చిలిపితనంగా భావించి నవ్యుతున్నారు, ఆనందిస్తున్నారు. పిల్లల చిలిపితనాన్ని, బాల్యాన్ని ఆనందించవలసిందే. కాని క్రమశిక్షణారాహిత్యాన్ని కాదు. తాము పిల్లల అల్లరి అనుకొంటున్నదే క్రమశిక్షణా రాహిత్యానికి తొలిమెట్లనీ, విలువల బంధాల తరుగుదలకి దారులని గమనించాలి. లేకుంటే ఫలితం మన కళ్ళెదుటే ఉంది. ఒకే తల్లికడుపున పుట్టిన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు[తోబుట్టువులు] ఆస్తుల కోసం భయంకరంగా తగవులు పడటం చూస్తూనే ఉన్నాం. ఒక్కోసారి అవి హత్యల దాకా దారితీయటమూ చూస్తూన్నాం. మొన్నామధ్య MLA మరియు మాజీమంత్రి కళా వెంకట్రావు ఒక తమ్ముడు మరో తమ్ముణ్ణి హత్య చేసారని వార్తపత్రికలో చదివాను. ఇలాంటి సమాజంలో ప్రేమ, అనుబంధాల చిరునామా ఎక్కడ? ఇప్పడు చాలామంది జౌరంగ జేబులు తయారయ్యారు.

రామాయణంలో లక్ష్మణుడు తన అన్న రాముడికి, అరణ్యంలో సేవ చేసేందుకు, తోడుగా ఉండేందుకు రాచ నగరులో తన సౌఖ్యవంతమైన జీవితాన్ని, యవ్వనంలో ఉన్న అందమైన భార్య ఊర్మిళనీ 14 ఏళ్ళు పాటు వదలి, అన్నకోసం తన స్వసుఖం త్వజించాడు. భరతుడు తల్లి తన వరాలతో, తన కోసం సంపాదించి పెట్టిన రాజ్యాన్ని త్వజించాడు. అతడు అన్నతో తన కంత శక్తి సామర్ధ్యాలు లేవనీ, అర్హతా లేదని చెబుతూ అన్నపై గౌరవాన్ని ప్రకటించాడు. [ఈ కధా గమనాన్నంతా రంగ నాయకమ్మ విషవృక్షం హిపోక్రసీ అన్న కళ్ళద్దాల్లోంచి చూపిస్తుంది] రాజు, రాణిలై ఉండి కూడా దశరధుడూ ఆయన భార్యలు తమ బిడ్డల్ని అంత నైతిక విలువలుండేటట్లుగా పెంచారు.

ఇప్పడు మన ఆధునిక సమాజంలో తల్లితండ్రులు దశరధుడూ, ఆయన రాణుల కన్నా బిజీగా ఉన్నారా? ఒకదేశానికి పాలకులుగా ఉండీ తమ భావితరాల్ని తీర్చిదిద్దుకున్న వారి కంటే నేటి తల్లితండ్రులు ఎక్కువ బిజీగా ఉన్నారు.

ఇంకా ఈ మధ్య సినిమాల్లోనూ, కొన్ని కుటుంబాలల్లోనూ సినిమా గారాబాలు చూశాను. తల్లితండ్రుల్ని పిల్లలు పేరుతో పిలిచేంత సినిమా గారాబం అన్నమాట. “ఒరేయ్! డాడీ!” అని కొడుకు పిలుస్తుండగా మురిసిపోయే ఓ తండ్రిని కూడా చూశాను. ఐదారేళ్ళ కొడుకు తండ్రినిలా పిలిస్తే ఇప్పడు బాగుంటుందేమో ఆతండ్రికి. పాతికేళ్ళొచ్చాక కూడా అలాగే పిలిస్తే బాగుంటుందా ఆతండ్రికయినా?[మనకు అస్సలు నచ్చదు లెండి] తండ్రిని లెక్క చేయకుండా, అగౌరవిస్తూ ఉంటే అప్పడూ బాగుంటుందా? ఇంకొంచెం పెద్దయ్యాక వృద్దాశ్రమాలకి పంపిస్తే అప్పడు బాగుంటుందా?

భారతీయ ఇతిహాసాలు, వేదాలు -

మాతృదేవో భవ
పితృదేవో భవ
ఆచార్య దేవోభవ అని చెబుతాయి.

అలాగని నిద్రలేవగానే తల్లితండ్రుల కాళ్ళకు దణ్ణాలు పెట్టాలని, నేను అనడం లేదు. గౌరవం, భక్తీ మనస్సులోనూ, ప్రవర్తనలోనూ ఉంటే చాలు. నడుములు పడిపోయేలా ప్రతీరోజు పాద నమస్కారాలు పెట్టక్కర్లేదు.

కాని ఇతిహాసలుకి, సంస్కృతికి దూరమైన నేటి మన సమాజంలో చాలామంది పిల్లల దృష్టిలో

తల్లి తమ కో సేవకురాలు [ఎందుకంటే తండ్రి, ప్రవర్తన తీరు తల్లి పట్ల అలాగే ఉంటుంది కాబట్టి]

తండ్రి తమకు క్యాషియర్ [ఎందుకంటే తల్లి, ప్రవర్తన తీరు తండ్రి పట్ల అలాగే ఉంటుంది కాబట్టి]

టీచర్ ఓ పలికిమాలిన వాడు[ అలాంటి ఇంటినుండి వచ్చిన పిల్లల్ని, స్కూల్ లో టీచర్ విమర్శిస్తుంది కాబట్టి, తల్లితండ్రుల దృష్టి టీచర్ పట్లా అదే కాబట్టి]

చాలా కుటుంబాల్లో, చాలామంది పిల్లల్లో ఈ రకపు క్రమశిక్షణా రాహిత్యం, పెద్దలపట్ల అవిధేయతా ఉన్నాయి. ఒక్కసారి మన బిజీ షెడ్యూల్స్ తాలుకూ హడావుడి కాస్త తగ్గించు కొని, పరిశీలిస్తే మనచుట్టూ చాలాచోట్ల ఇది కనిపిస్తుంది.

మరిన్ని విషయాలతో తదుపరి టపా.

అందాకా అమ్మ కడుపు చల్లగా అందరికీ మంచి జరగాలి.

సర్వేజనా సుఖినో భవంతు!

17 comments:

చాలాబాగా రాస్తున్నారండీ. ఇంత పెద్ద పెద్ద టపాలు ఇంత సరళంగా వ్రాస్తున్నారు, మీ ఓపికకు జోహార్లు.

మీ వివరణ చాలా బావుంది. హిందువులని , మన మనో భావాలను అసలు పట్టించుకోరు. అదే పక్క మతాలకైతే చీమ కుట్టినా నానా రభస చేస్తారు. కరుణానిధి కి అసలు తను చదివేది నిజమైన జీసస్ ప్రవచనాలో కాదో తెలుసా? డావిన్సీ కోడ్ రచయిత తను పేర్కొన్నవన్నీ పచ్చి నిజాలని ఉటంకించినా, ఇక్కడ అది కల్పితం అని అంటే తప్ప విడుదల చెయ్యనివ్వలేదు.ఈ పద్ధతి లో చూస్తే చాలా తెలుగు సినిమాలు ఆపెయ్యాలి. కానీ నిరభ్యంతరంగా తీస్తునే ఉన్నారు. దయనీయమైన విషయం ఏంటంటే మనం దాన్ని గుర్తించలేకపోవడం.

అయితే ఇప్పుడేం చేద్దామంటారు?

Adi Lakshmi Yadla గారు,

Very well written post. Comparison of our Indic Traditions and present situation, highlights what we will loose, if we disregard our traditions.

మీ విశ్లేషణ చాలా బాగుందండి. నేను మీ వాదనతో ఏకీభవిస్తాను.

చాలా బాగా రాస్తున్నారండీ. మీలాంటి గొంతులు మీడియా లో వినిపించవు మనదేశంలో. మతి తప్పిన మేధావులకీ సహజంగానే ఇలాంటీ మాటలు రుచించవు.

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలండీ!
నిజానికి నకిలీ కణికుడూ, అతడి వ్యవస్థ చేసిన, చేస్తున్న కుట్రని సోదాహరణంగా, దృష్టాంతపూరితంగా, సాక్ష్యధారాలతో సహా నేను ముందుగా ఆంగ్లంలో వ్రాసాను. మీరు తెలుగులో చదువుతున్నంత సరళంగా వ్రాసాను. ఇప్పుడు తెలుగులో దాన్ని కొంచెం కొంచెంగా అనువదిస్తున్నాను.
మీకు మరిన్ని వివరాలు కావాలంటే నాఆంగ్ల బ్లాగ్ ‘COUPS ON WORLD’ చూడగలరు.
మీరంతా అందిస్తున్న ప్రోత్సాహానికి చాలా సంతోషంగా ఉంది. మరోసారి కృతఙ్ఞతలు.

ఈ విషయాల గురించి నాలాగే మరొకరు ఆలోచిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ వంటి వారి బ్లాగులు చూసాక నాకు కూడా తెలుగులో బ్లాగు మొదలు పెట్టాలని ఉంది.

తల్లీ !
తరగిపోతున్న భారతీయ విలువలను కాపాడేందుకు ,జరుగుతున్న కుట్రలను బయట పెట్టేందుకు మీరుసాగిస్తున్న పోరాటము నిజముగా మేల్కొలుపవ్వలని,నిదురిస్తున్న జాతి ని నిద్దురలేపే శంఖారావమవ్వాలని ఆశపడుతున్నాను.

చాలా బాగా రాస్తున్నారండి.

ఆదిలక్ష్మిగారు, చాలా బాగా రాస్తున్నారు.
"హిందువుల సహనాన్ని చేతకానితనంగా లెక్కేస్తున్నారు"
అబద్దాల ముసుగు కప్పవచ్చు చరిత్ర మీద, కానీ నిజం నెమ్మదిగా తన అనంత యాత్ర సాగిస్తూనే ఉంటుంది.
ఎప్పటికైనా నిజానిదే అంతిమ విజయం.
నాకొక్కటే అర్ధం కాని విషయం,
క్రైస్తవుడు రాసిన పుస్తకం మీద, మరో క్రైస్తవుడు సినిమా తీస్తే ఒక్క క్రైస్తవ దేశమూ గోల పెట్టలేదు. అదేమిటో భారతదేశాఅనికి వచ్చేసరికి ఆ సినిమాని భారతీయులే(హిందువులే అని నా అభిప్రాయం) తీసినట్టు గోలగోల పెట్టారు. దీన్ని బట్టే అర్ధమవుతోంది కణికుడు (కలియుగ రాక్షసునికి మీరిచ్చిన పేరు) ఎంతగా విజృబిస్తున్నాడో.
విద్యార్ధులు తెలుగు పుస్తకాలు చద్వటం ఎప్పుడో మానేసారు. ఈ ఖర్మ ఎలా తయారయ్యిందంటే చివరకు పురాణాలు కూడా ఇంగ్లీషులోనే చదవటం
ఎప్పుడైతే మాతృభాషంటే చులకన ఏర్పడుతుందో అప్పుడే సంస్కృతిమీద నమ్మకం పోతుంది.

@కత్తి, ఎందుకయ్యా పుల్లవిరుపు మాటలు. ఇక్కడ ఏదో చెయ్యమని చెప్పడం లేదు. ఏమి చెయ్యాలో చెప్తున్నారు. ఎలా మోసపోయామో చెప్తున్నారు. మళ్ళీ నేను వ్యక్తిగత దూషణలకు దిగానని భావించవద్దు. నీ ప్రశ్నకు నా వ్యాఖ్య మాత్రమే ఇది.

@ మహేష్,
మీరైతే ఏం చేసేవారో చెప్పండి, మీలాంటి విజ్ఞ్ణులు సలహా ఇస్తే తరిగిపోతున్న భారతీయ విలువలను కాపాడవచ్చు,

@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్: ఇన్ని conspiracy theorys తెలుసుకుని ఏంచేస్తారు అని మాత్రం అడిగాను.అది పుల్లవిరుపో నాకొచ్చిన డౌటో మీకు అర్థమైన అర్థాన్నిబట్టి వుంటుంది.ప్రశ్నించడాన్ని వ్యక్తిగతధూషణ అనే దౌర్బల్యం నాకు లేదు లెండి.మీ అభిప్రాయం మీది నా అభిప్రాయం నాది.

@మనోహర్: భారతీయ విలువలకు భారతీయులనుంచీ ప్రమాదమొస్తే దానర్థం ఆ విలువలు మారే సమయం ఆసన్నమయ్యిందని అర్థం. దాంట్లో ఎవరో చేసిన కుట్రలూ మోసాలకన్నా, మనస్వయంకృతమో లేక ప్రగతి మంత్రమో ఉంటాయి.విలువలు పోయాయని ఏడవడంకన్నా మార్పుని సానుకూలంగా జీవితాన్ని గడపడానికి ఎలా వాడుకోవాలో తెలుసుకోవడం ముఖ్యమని నా అభిప్రాయం.కోల్పోయిన అర్థాల్ని తలుచుకుని చింతించడంకన్నా వర్తమానంలొ మన జివితాల్ని అర్థవంతం చెసుకోవడం ఆదర్శవంతం.

వ్యాఖ్య వ్రాసినందుకు కృతఙ్ఞతలు.

చాలా విపులంగా వ్రాస్తున్నారండి. వ్యక్తి దూషణ అనే దౌర్బల్యం లేదనే పెద్దమనుషులు తొక్కలో సలహాలు ఇవ్వటం మానుకోకపోవటం మన దౌర్భాగ్యం.

మీరన్నది నిజం గా నిజం , అయితే ఇది ప్రపంచ వ్యాప్తంగా వ్యాపీస్తున్న భావ దారిద్ర్యం, ఇక్కడ మనం పోరాడితే మెజారిటీ వర్గం అంటారు , కొంచెం ఎక్కువయితే హిందూ తీవ్రవాదం అంటారు, ఇక్కడ మెడలో క్రాస్ వేసుకోవటం నాగరికం అవుతుంది, అమేరిక లో వేసుకోకపోవటం , తిట్టటం వీలయితే ఏమీ తెలుసుకోకుండా నే 'ఓం' లేదా వేరే ఏదయినా మతం చిహ్నం వేసుకోవటం నాగరికం , ఇదంతా నకిలీ కణికుడు( కాపీరైట్ బై మీరు) వర్గం , వ్యాపార వర్గం మనుషుల మానసిక పతనానికి చేస్తున్న కుట్రే . మార్పు మంచిదే, మార్పు రావాలి అంటూ రోజు రోజుకి మంచి వైపు నుంచి తిరిగి రాలేనంత గా చెడు వైపు ప్రయాణిస్తున్నాం. అదృష్టం కొద్ది మనం భారత్ లో జన్మించాము. మన పురాణాల వలన, మన నమ్మకాలవలన, మన సిధాంతలవలన మన పూర్వీకులు మానసికంగా అప్రచుల కన్నా బలవంతులు కాబట్టి మనం ఈ మాత్రం ఉన్నాం అనిపిస్తుంది.

నా తెలుగు లో టైపింగ్, భాస తప్పులు మన్నించాలి, నేను క్విల్‌ప్యాడ్ వాడుతను, ప్రొఫెషనల్ తెలుగు టైపిస్ట్ ని కాను
అభినందనాలతో
పి. శ్రీకాంత్

శ్రీకాంత్ రెడ్డి గారు,
అవునండి. మన ఇతిహాసాల వల్ల మనం మానసికంగా బలవంతులం. సత్యం తెలిస్తే అప్రాచ్యుల మాయను ఛేదించగలం. ఆ నమ్మకం నాకుందండి. సత్యం తెలిసీ, ఆత్మవంచన చేసుకున్నా, పరిస్థితి తమదాకా వచ్చినప్పుడయినా వెనుతిరగక తప్పదు.

Post a Comment

నా చిన్నారి బ్లాగు:

నా ఇతర బ్లాగులు:

Followers

Labels

Blog Archive

Political Coups, History, stories, Philosophy, life story and many things.
మాలిక: Telugu Blogs
కూడలి

Add-Telugu